ముంబై: సంవత్ 2073 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సంవత్ 2073 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(ఆదివారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో నిరాశపరిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 11 పాయింట్లు నష్టపోయి 27,930 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,626 పాయింట్ల వద్ద ముగిశాయి.
సాయంత్రం 6:30 గంటల నుంచి గంటపాటు నిర్వహించిన ముహురత్ ట్రేడింగ్ మొదట పాజిటీవ్‌గా ప్రారంభమైనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో చివర్లో స్వల్ప నష్టాలతో ముగిసింది.
నిరాశపరచిన ముహురత్ ట్రేడింగ్
Published Sun, Oct 30 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM
Advertisement