Sensex shares
-
నిరాశపరచిన ముహురత్ ట్రేడింగ్
ముంబై: సంవత్ 2073 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సంవత్ 2073 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(ఆదివారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో నిరాశపరిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11 పాయింట్లు నష్టపోయి 27,930 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,626 పాయింట్ల వద్ద ముగిశాయి. సాయంత్రం 6:30 గంటల నుంచి గంటపాటు నిర్వహించిన ముహురత్ ట్రేడింగ్ మొదట పాజిటీవ్‌గా ప్రారంభమైనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో చివర్లో స్వల్ప నష్టాలతో ముగిసింది. -
మార్కెట్లో దీపావళి మెరుపులు
ముంబై: సంవత్ 2072 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ లాభాలతో శుభారంభం చేసింది. సంవత్ 2072 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(బుథవారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు గత ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాల నుంచి కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 25,867 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7.825 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళీకరించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, విద్యుత్తు, లోహ, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. లాభాల్లో 23 సెన్సెక్స్ షేర్లు 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 2.5 శాతం, సన్ ఫార్మా 1.9 శాతం, ఎల్ అండ్ టీ 1.4 శాతం, టాటా స్టీల్ 1.3 శాతం, భెల్ 1.2 శాతం, కోల్ ఇండియా 1.1 శాతం, హిందాల్కో 1 శాతం, వేదాంత 1 శాతం, టాటా మోటార్స్ 0.8 శాతం, ఎస్బీఐ 0.8 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.7 శాతం, మారుతీ సుజుకీ 0.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 0.4%, ఐటీసీ 0.4 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.2 శాతం, ఓఎన్జీసీ 0.1 శాతం, బజాజ్ ఆటో 0.09 శాతం చొప్పున క్షీణించాయి. 1,957 షేర్లు లాభాల్లో, 413 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బలిపాడ్యమి సందర్భంగా గురువారం సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ పనిచేయలేదు. -
12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్ఐసీ వాటా
రూ.16,400 కోట్లు షేర్ల కొనుగోలు - జనవరి-మార్చి క్వార్టర్‌కు న్యూఢిల్లీ: ఎల్ఐసీ జనవరి-మార్చి క్వార్టర్లో 12 సెన్సెక్స్ షేర్లలో తన వాటాను పెంచుకుంది. ఈ వాటా పెంపు కోసం రూ.16,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు ఇదే క్వార్టర్లో మరో 12 సెన్సెక్స్ షేర్లలో వాటాను తగ్గించుకుంది. రూ.6,730 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. గత కొన్ని క్వార్టర్లుగా యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీల్లో ఎల్ఐసీకి ఎలాంటి వాటా లేదు. ఇక టాటా స్టీల్, భెల్, వేదాంత, టాటా మోటార్స్ కంపెనీల్లో ఎల్ఐసీ వాటాల్లో ఎలాంటి మార్పు లేదు. కోల్ ఇండియాలో అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. కోల్ ఇండియా ఆఫర ఫర్ సేల్‌లో రూ.10,754 కోట్ల విలువైన షేర్లను (4.51 శాతం వాటాను) కొనుగోలు చేసింది. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో దాదాపు సగం ఎల్ఐసీనే కొనుగోలు చేసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎల్ఐసీకి అత్యధిక వాటా ఉన్న కంపెనీగా ఎల్ అండ్ టీ నిలిచింది. ఎల్ అండ్ టీలో సెన్సెక్స్‌కు 16.7 శాతం వాటా ఉంది