దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 7 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42% లాభపడి 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి.
సాయంత్రం 6 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి. కంపెనీలు తమ నెలవారీ విక్రయాల సంఖ్యను విడుదల చేయడంతో ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం (సంవత్ 2081) ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొసాగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment