దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్‌గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్‌లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.
ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.
ఇలా ప్రారంభమైంది..
ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్‌ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్‌ఎస్‌ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్‌ఎల్‌బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment