Trading session
-
స్టాక్‌మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్‌గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.ఇలా ప్రారంభమైంది..ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. -
మార్కెట్లు ప్లస్- ఈ చిన్న షేర్లు అదుర్స్
ఒక రోజు బ్రేక్ తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 131 పాయింట్లు పెరిగి 40,690కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు బలపడి 11,937 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్, మ్యూజిక్ బ్రాడ్‌క్యాస్ట్, మెనన్ బేరింగ్స్, ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్, సంఘి ఇండస్ట్రీస్, ఎంటీఎన్ఎల్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 88,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 31,000 షేర్లు చేతులు మారాయి. మ్యూజిక్ బ్రాడ్‌క్యాస్ట్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 21.35 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8.57 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎంటీఎన్ఎల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 11 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.3 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 10.24 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. మెనన్ బేరింగ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 53 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 39,500 షేర్లు చేతులు మారాయి. ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 71 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,500 షేర్లు చేతులు మారాయి. సంఘి ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.3 శాతం ర్యాలీతో రూ. 29 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 92,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.49 లక్షల షేర్లు చేతులు మారాయి. -
వారమంతా పైపైకే...
విస్తార వర్షాలతో తొలగిన కరువు భయాలు 27,318 పాయింట్లకు సెన్సెక్స్ 8,225 పాయింట్లకు నిఫ్టీ వర్షాలు జోరుగా కురుస్తుండటంతో స్టాక్ మార్కెట్ పై లాభాల జడివాన కురిసింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తుండటంతో కరువు భయాలు తొలగి వాహన, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 18 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టడం... వీటన్నింటి కారణాల వల్ల బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 27,316 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 8,225పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 891 పాయింట్లు(3.4 శాతం). నిఫ్టీ 242 పాయింట్ల(3 శాతం) చొప్పున పెరిగాయి. గత మూడు వారాల్లో నష్టాల పాలవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం లాభాల్లో ముగిశాయి. దేశీయ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు... ఈ వారమంతా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు పెరిగాయి. లాభ నష్టాలు... 1,411 షేర్లు లాభాల్లో, 1,235 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,543 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,554 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,68,439 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.106 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.448 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా మార్కెట్ ఆరు% పతనమవ్వగా, మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మళ్లీ వంద లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్... బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం వంద లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఈ నెల 3న రూ.100 లక్షల కోట్ల దిగువకు పడిపోయిన ఈ మొత్తం శుక్రవారం రూ.100.04 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారిగా వంద లక్షల కోట్ల మార్క్‌ను గత ఏడాది నవంబర్‌లో అధిగమించింది. -
మార్కెట్లు అక్కడక్కడే
ముంబై: సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోసం శనివారం గంటన్నర పాటు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ సుమారు 1.7 పాయింట్ల లాభంతో 6,495 వద్ద, బీఎస్ఈ ఒకటిన్నర పాయింట్ల లాభంతో 21,755 వద్ద క్లోజయ్యాయి. ఉదయం 11.15 గం. నుంచి 12.45 గం. దాకా ట్రేడింగ్ జరగ్గా.. బీఎస్ఈ30 సూచీలో 15 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతించవచ్చన్న వార్తలతో ఫెడరల్ బ్యాంక్ షేర్లు 6.5 శాతం ఎగిశాయి. రూ. 91.15 వద్ద ముగిశాయి