మార్కెట్లు అక్కడక్కడే
ముంబై: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కోసం శనివారం గంటన్నర పాటు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ సుమారు 1.7 పాయింట్ల లాభంతో 6,495 వద్ద, బీఎస్‌ఈ ఒకటిన్నర పాయింట్ల లాభంతో 21,755 వద్ద క్లోజయ్యాయి.
ఉదయం 11.15 గం. నుంచి 12.45 గం. దాకా ట్రేడింగ్ జరగ్గా.. బీఎస్‌ఈ30 సూచీలో 15 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించవచ్చన్న వార్తలతో ఫెడరల్ బ్యాంక్ షేర్లు 6.5 శాతం ఎగిశాయి. రూ. 91.15 వద్ద ముగిశాయి