special
-
స్టాక్‌మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్‌గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.ఇలా ప్రారంభమైంది..ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. -
రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్సీఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
గౌరీ ఖాన్ ఇష్టపడే కేఫ్ ఇదే..! ప్రత్యేకత ఏంటంటే..
ఢిల్లీ అంటేనే ప్రత్యేకమైన ఆహారానికి, కేఫ్‌లుగా ప్రసిద్దిగాంచింది. దొరకని విభిన్న రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉండవు. అలాంటి ఢిల్లీలో గౌరీ ఖాన్ తరుచుగా సందర్శించే కేప్ ఒకటి ఉంది. ఆ కేఫ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అక్కడకు ఎప్పుడు వచ్చినా..కాఫీ, పిజ్జా ఆస్వాదించే వెళ్తారు గౌరీ ఖాన్. ఆ కేఫ్ ఎక్కడుందంటే..ఆ కేఫ్ పేరు ది బ్రౌన్ బాక్స్. ఇది పంచశీల్ పార్క్‌లో ఉంది. పర్ఫెక్ట్ లంచ్ డేట్ కోసం లేదా భాగస్వామితో సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం. సాయంత్రాల్లో సరదాగా కాసేపు గడపడానికి హాయినిచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం ఆ కేఫ్. అంతేగాదు ఏదైన కంపెనీ సమావేశాల గురించి చర్చించడానికి కూడా అత్యంత అనువైన ప్రదేశం. మంచి వుడ్‌తో కూడిన ఫర్నేచర్ ఆ కేఫ్‌కి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మంచి సలాడ్లు, పాస్తా, సైడ్లు, బర్గర్లు, కాఫీ, శాండ్విచ్లు, రిసోట్టో, కేక్‌లు వంటి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించొచ్చు. అంతేగాదు బడ్జెట్‌కి అనుగుణంగా ఖర్చుపెట్టాలనుకున్నా ఈ కేఫ్ బెస్ట్ అని చెప్పొచ్చట. గౌరీఖాన్, ఆమె కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇక్కడ ఎక్కువగా పిజ్జా, కాఫీని ఆస్వాదిస్తారట. ఈ బేకరీ కేఫ్‌ని పేస్ట్రీ చెఫ్ ప్రియాంక తివారీ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్‌లో సాధారణ మెనులకు విభిన్నంగా ఆహారప్రియులు ఇష్టపడేలా సరికొత్త ఐటెమ్స్‌తో కూడిన మెనూని రూపొందించడం విశేషం. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
నవరాత్రుల్లో ఇండో వెస్ట్రన్ మెరుపుల్లో మగువలు కళ (ఫోటోలు)
-
వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!
మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ రుచి చూశారా?తినే ఉంటారు! మరి.. రసం పూరి?దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో రిషభ్ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్ అట్రాక్షన్. దీని రుచి, పరిమళం వేరే లెవల్ అని అంటారు అభిమానులు. ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్ హోమ్ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్ ఆర్. మయ్యా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఛాట్ వీడియో ఒకటి పోస్ట్ చేశారుಉಡುಪಿ ಸಾರನ್ನು ಚ್ಯಾಟ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಸವಿದಿದ್ದೀರಾ| ವಿಪ್ರ ಚಾಟ್ ಹೋಮ್ ರಸಂ ಪುರಿ | ಕೃಷ್ಣ ಮಠದ ಪಾರ್ಕಿಂಗ್ ಏರಿಯಾದ ಶ್ರೀರಾಮ ಧಾಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ | ಉಡುಪಿಯ ಕಂಡೀರಾ pic.twitter.com/h2DPhS5H1p— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) September 2, 2024 -
జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్‌బాస్ ఆర్ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్‌కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్పీఎఫ్లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు. -
స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకం.. తెలుగులో చూడాల్సిన దేశభక్తి చిత్రాలివే!
యావత్ భారతదేశం గర్వంగా, దేశభక్తిని చాటి చెప్పేలాఅందరం ఆనందంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అవుతోంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రత్యేకంగా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూడాల్సిన టాలీవుడ్ దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.స్వాతంత్ర దినోత్సవం రోజు చూడాల్సిన తెలుగు సినిమాలివేఅల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.ఖడ్గంకృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి.సుభాష్ చంద్రబోస్విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.భారతీయుడుశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా.. అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.సైరా నరసింహారెడ్డిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.మహాత్మ2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.పరమ వీర చక్ర2011లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఘాజీ1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సర్దార్ పాపారాయుడు1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.బొబ్బిలి పులి1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.గౌతమిపుత్ర శాతకర్ణిబాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించగా.. రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.రాజన్న(2011)నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాజన్న. 2011లో వచ్చిన ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు.మేజర్అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్. ఈ సినిమాను ముంబై ఉగ్రవాద దాడి సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.వీటితో పాటు పల్నాటి యుద్ధం, నేటిభారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్రకేసరి-(1983), మరో ప్రపంచం, మనదేశం(1949) లాంటి దేశ స్వాతంత్ర్య పోరాటాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను తెలుసుకునేందుకు ఈ సినిమాలు చూసేయండి. -
Mahesh Babu Birthday Special Pics: హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. స్పెషల్ ఫోటోలు
-
Friendship Day: ఓ.. మై ఫ్రెండ్ (ఫొటోలు)
-
Happy Friendship Day 2024: పోవే..పోరా..అనుకునే టాలీవుడ్ బెస్ట్‌ఫ్రెండ్స్(ఫోటోలు)
-
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
లేడీ కోహ్లి.. ఆర్సీబీకి టైటిల్ అందించిన క్వీన్ (ఫొటోలు)
-
Rajnath Singh Birthday: ఫిజిక్స్ లెక్చరర్ నుంచి రక్షణ మంత్రి వరకూ..
ఆయన చదువుకునే రోజుల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నేడు దేశ రక్షణమంత్రిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే రాజ్‌నాథ్ సింగ్.దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టినరోజు నేడు. ఆయన 1951 జూలై 10న యూపీలోని చందౌలీలోని చకియాలో జన్మించారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలలో ఒకనిగా గుర్తింపు పొందారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ అధ్యాపకునిగా తన కెరీర్ ప్రారంభించారనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజ్‌నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంబదన్ సింగ్. తల్లి పేరు గుజరాతీ దేవి. రాజ్‌నాథ్ తన ప్రారంభ విద్యను గ్రామంలోనే అభ్యసించారు. అనంతరం గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు.రాజ్‌నాథ్ సింగ్ తొలుత యూపీలోని మీర్జాపూర్‌లోని కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. మొదటి నుండి చాలా తెలివైన విద్యార్థిగా పేరొందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యనిర్వాహకునిగానూ పనిచేశారు. 1974లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1977లో యూపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికై 1991లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీలో విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని, వేద గణితాన్ని ప్రవేశపెట్టారు.రాజ్‌నాథ్ సింగ్ 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999, నవంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2000, అక్టోబర్ 28న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2003, మే 24న కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.2005 డిసెంబర్ 31న రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2009 డిసెంబర్ 19 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2009లో ఘజియాబాద్ నార్త్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, మే 26న ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. అనంతరం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆయన మరోమారు రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
శరవేగంగా పరుగులు తీస్తున్న ఫ్యాషన్ : ఈ రోజు స్పెషల్ ఏంటంటే..!
ఫ్యాషన్ ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. క్రియేటివ్ డిజైన్లు, ఆర్టిస్టిక్ ఫ్యాషన్ సరికొత్త స్టైల్స్ నిరంతరం మారిపోతూనే ఉంటాయి. జూలై 9న ఫ్యాషన్డే గా జరుపుకుంటారని మీకు తెలుసా? పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఫ్యాషన్ ప్రభావాన్ని , ప్రాభవాన్నిఫ్యాషన్ పోకడలను అర్థం చేసుకోవడమే ఫ్యాషన్ డే ఉద్దేశం. ఫ్యాషన్ ఔత్సాహికులు, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశాల్సి కల్పిస్తుంది. ఫ్యాషన్ సాంస్కృతిక ఔచిత్యంతో పాటు సృజనాత్మకత, సృజనాత్మకత, వాస్తవికతను గుర్తించి, డిజైనర్లు, ఫ్యాషన్ స్టయిల్స్‌ను అభినందించేందుకు ఫ్యాషన్ డే 2024ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పూర్వంనుంచీ మన ధరించే వస్త్రాలు ఒక స్టేటస్ సింబల్. ప్రస్తుతం ఫ్యాషన్ కళాత్మక వ్యక్తీకరణ మారింది. సామాజిక మార్పులతో పాటు ఫ్యాషన్లోకూడా విప్లవాత్మక మార్పు లొచ్చాయి. ఫ్యాషన్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదు. అలంకరణలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రతీది ఫ్యాషనే.ఫ్యాషన్ డే 2024: ధీమ్ఈ ఏడాది పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తూ, నైతిక, ఆలోచనాత్మక వినియోగాన్ని హైలైట్ చేసేలా 'సస్టెయినబుల్ ఎలిగాన్స్' అనే థీమ్‌తో ఫ్యాషన్ డే నిర్వహిస్తున్నారు. సుస్థిరత, ఫ్యాషన్ కలిసి జీవించే దిశగా ఫ్యాషన్ డే 2024ని జరుపుకుంటూ భూమా తరక్షణలో భాగం కావడం. -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
#International Yoga day 2024 స్పెషల్ కాస్ట్యూమ్స్ (ఫొటోలు)
-
డాడీతో సెల్ఫీ.. నడిపించే దైవం నాన్న (ఫొటోలు)
-
నాన్నతో సెల్ఫీ: లవ్యూ డాడీ.. నువ్వే స్ఫూర్తి.. (ఫొటోలు)
-
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
-
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామాపొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి. అమ్మకిష్టమైన వంటఅమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి. అమ్మకోరిక తెలుసుకోండినిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.అమ్మతో బయటికికుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.స్పాకి తీసుకెళ్లండిసంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. దూరంగా ఉన్నారా..అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!! -
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్ చీర మళ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రెండ్ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. చేపముల్లుతో పత్తిని శుద్ది చేసి..?పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకంఅక్కినేని, సినారే బ్రాండ్ అంబాసిడర్లుగా..తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. నూరు కౌంట్ అనడానికి రీజన్..ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.మోదీకి సైతం బహుకరించేందుకు.. 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు. (చదవండి: ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!) -
‘పోటీ చేస్తాను.. పోటీ చేస్తూనే ఉంటాను’
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఒక అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవాలని కాకుండా, తన అభిరుచిని నెరవేర్చుకునేందుకే ఇలా అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వస్తున్నారు. అతనే వారిస్ హసన్ లాహిరి. రాష్ట్రీయ నారాయణ్ వికాస్వాది పార్టీ అభ్యర్థి. ఆయన యూపీలోని అమేథీ జిల్లాలోని గౌరీగంజ్‌కు చెందిన వ్యక్తి. హసన్ లాహిరి గతంలో అంటే 2004, 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అమేథీ నుంచి పోటీకి దిగారు. అలాగే 2007, 2012, 2017, 2022లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. వారిస్ హసన్ లాహిరి 10వ తరగతి వరకు చదువుకున్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మా మాతృభూమి గౌరీగంజ్ అని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బడా నేతలు సైతం పోటీ పడుతుంటారని తెలిపారు. తనకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రజల గొంతు వినిపించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా నిరంతరం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని లాహిరి తెలిపారు. నిరంతరం ప్రజల గౌరవాన్ని కాపాడుతూనే ఉంటానని, విజయం సాధించే వరకూ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు. -
Ajith Unseen Photos: హీరోలందు తలా అజిత్ వేరయా.. రేర్ ఫొటోలు
-
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్‌టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్‌లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్‌గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్‌ను వాడుకోవచ్చు.