న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్‌బాస్ ఆర్‌ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్‌కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment