senior IPS officer
-
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్‌బాస్ ఆర్ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్‌కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్పీఎఫ్లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు. -
ఎన్ఎస్జీ చీఫ్‌గా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2028 ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎన్ఎస్జీ చీఫ్‌గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
నిందితుడి సమాచారం లీక్.. కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్
కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ విజయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది .కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడి అరెస్ట్, తరలింపు సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై విజయన్‌పై కేరళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా విజయన్ గతంలో కేరళ ఏటీఎస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. నిందితుడి తరలింపుకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని పేర్కొంటూ లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీపీ అజిత్ కుమార్ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ రిపోర్టులో నిందితుడు షారుక్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కేరళలోని కోజీకోడ్‌కు తరలిస్తున్న సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు తేలింది. అదే విధంగా ఈ కేసును దర్యాప్తుచేసిన బృందంలో లేని ఐజీ విజయన్, గ్రేడ్ ఎస్సై మనోజ్ కుమార్ కే.. నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకెళ్తున్న అధికారులను సంప్రదించినట్లు పేర్కొంది. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు విజయం.. ‘రాణాను అప్పగించండి’ పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ..ఏడీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై సమగ్ర విచారణ అవసరమని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది.ఏడీజీపీ నివేదిక ఆధారంగా దాని అధికారులపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది.ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్ను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) కె పద్మకుమార్ విచారణ జరుపుతారని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ జిల్లాలోని ఎలత్తూర్ సమీపంలోని కోరాపుళ వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఏడాది చిన్నారి సహా మహిళ వ్యక్తి ఉన్నారు. ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ పోలీసులు సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని సిట్ విచారణలో గుర్తించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు సైఫ్‌ను రత్నగిరిలో ఏప్రిల్ 5న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా కేరళకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. మీడియా, ప్రజల దృష్టి పడకుండా రోడ్డు మార్గాన ప్రైవేటు ఎస్‌యూవీలో తరలించారు. అయితే కన్నూరు జిల్లా గుండా వెళ్లుండగా ఉన్నట్టుండి నిందితుడిని తీసుకెళ్తున్న కారు టైర్ పేలడంతో వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయింది. ఆ సమయంలో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా నిందితుడిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు. చదవండి:రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి.. -
ఎస్ఎస్బీ డీజీగా రశ్మీ శుక్లా
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రశ్మీ శుక్లా(57) నియమితులయ్యారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు. శుక్లా నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె 2024 జూన్ 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారని తెలిపింది. నేపాల్, భూటాన్ సరిహద్దుల భద్రతను ఎస్ఎస్బీయే చూసుకుంటుంది. -
ఎన్ఐఏ చీఫ్‌గా దినకర్ గుప్తా
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుప్తా నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఐఏ చీఫ్‌గా ఆయన 2024 మార్చి 31 దాకా కొనసాగుతారు. సంస్థకు ఏడాది తర్వాత రెగ్యులర్ చీఫ్ నియామకం జరిగింది. గతేడాది మేలో వై.సీ.మోదీ రిటైరయ్యాక సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్‌కు అదనపు బాధ్యతలిచ్చారు. -
తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తోన్న ప్రభాకర్‌రావు గడువు ముగియడంతో అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ అదనపు సీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఏడీజీగా అనిల్‌కుమార్ పనిచేయనున్నారు. అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అనిల్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. -
అయోధ్య వివాదంలో సీనియర్ ఐపీఎస్..
సాక్షి, లక్నో : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆవేశంలో నోరుజారి ఆ తర్వాత నాలికకరుచుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని ప్రతిన బూనిన యూపీ హోంగార్డ్ డైరెక్టర్ జనరల్ సూర్యకుమార్ శుక్లా వివాదానికి కేంద్రబిందువయ్యారు. లక్నోయూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు ముస్లిం నేతలతో కలిసి ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ముస్లిం కార్య సేవా మంచ్ అధ్యక్షుడు ఆజం ఖాన్ సహా పలువురు ముస్లిం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శుక్లా దిద్దుబాటు వ్యాఖ్యలు చేశారు. ఏకాభిప్రాయంతోనే రామాలయ నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని మతాల వారి సమ్మతితో ప్రశాంత వాతావరణంలో మందిర నిర్మాణం జరగాలన్న సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుక్లా యూపీ డీజీపీ రేసులో ఉండటం గమనార్హం. మరోవైపు రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు తుది విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'సీనియర్ ఐపీఎస్ లైంగికంగా వేధిస్తున్నారు..'
ముంబై: సీనియర్ ఐపీఎస్ అధికారి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి (32) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారి కార్యాలయంలో ఆమె క్లర్క్‌గా పనిచేస్తున్నారు. కొలాబా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐపీఎస్ అధికారి ఆయన కార్యాలయంలో సోమవారం తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, తనను తాకారని మహిళా ఉద్యోగి ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం తన వివాహం, కుటుంబ సభ్యుల గురించి అడిగారని వెల్లడించారు. తన మొబైల్‌కు తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, బాధితురాలి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులు లేరని, అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పారు. -
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనూరాధ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి, అదనపు డీజీ ఏఆర్ అనూరాధ గురువారం బాధ్యతలు చేపట్టారు. అదనపు డీజీపీలు ఆర్పీ ఠాకూర్, వరుణ్ సింథ్కుల్ కౌముది, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎన్.వి.సురేంద్రబాబు శాంతిభద్రతలు, పోలీసు సంక్షేమం, ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్, సీఐడీ, ఆపరేషన్స్ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) విభాగాల్లో బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం వీరు సీఎం చంద్రబాబు, తాత్కాలిక డీపీజీ జేవీ రాముడుతో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకు వెళ్లిన అశోక్ ప్రసాద్
తర్వాత ఐబీ చీఫ్ ఆయనే అంటున్న ఐపీఎస్ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ ప్రసాద్ కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోలో రిపోర్టు చేశారు. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను నిర్వహించిన అశోక్ ప్రసాద్, తన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ ఆ రాష్ట్ర డీజీపీగా నియమితులు కావడంతో ఆయన ఏపీకి తిరిగి వస్తారా? అనే చర్చ సాగింది. అయితే 1979 బ్యాచ్‌కు చెందిన ఈయన రాష్ట్రంలో కొంత కాలం ఎస్పీ, డీఐజీ స్థాయిలలో పనిచేశాక నేరుగా కేంద్ర ఇంటెలిజెన్స బ్యూరోకి వెళ్లి పోయారు. అప్పటి నుంచి ఆయన ఐబీలోనే కొనసాగుతూ, తర్వాత డెప్యుటేషన్‌పై జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎవరు డీజీపీ అవుతారనే విషయమై చర్చ సాగుతుండగా జేకేలో రిలీవ్ అయిన అశోక్‌ప్రసాద్ తిరిగి రాష్ట్రానికి రావచ్చనే ఊహాగానాలు సాగాయి. కాగా ఆయన ఐబీలోనే కొనసాగడానికి ఆసక్తిని చూపించారు. అంతేగాక ప్రస్తుత ఐబీ డెరైక్టర్ జనరల్ ఇబ్రహీం పదవీ కాలం ముగిశాక అశోక్ ప్రసాద్‌ను ఈ విభాగం చీఫ్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.