
ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తోన్న ప్రభాకర్‌రావు గడువు ముగియడంతో అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ అదనపు సీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఏడీజీగా అనిల్‌కుమార్ పనిచేయనున్నారు. అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అనిల్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.