
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుప్తా నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎన్‌ఐఏ చీఫ్‌గా ఆయన 2024 మార్చి 31 దాకా కొనసాగుతారు. సంస్థకు ఏడాది తర్వాత రెగ్యులర్ చీఫ్ నియామకం జరిగింది. గతేడాది మేలో వై.సీ.మోదీ రిటైరయ్యాక సీఆర్‌పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్‌కు అదనపు బాధ్యతలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment