
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రశ్మీ శుక్లా(57) నియమితులయ్యారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు.
శుక్లా నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె 2024 జూన్ 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారని తెలిపింది. నేపాల్, భూటాన్ సరిహద్దుల భద్రతను ఎస్‌ఎస్‌బీయే చూసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment