director general
-
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లపై కేంద్రం వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్లకు తిరిగి పంపిస్తున్నట్టు వెల్లడించింది.కాగా నితిన్ అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ కేడర్ అధికారి కాగా.. ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా కేర్‌కు చెందినవారు. గతేడాది జూన్‌లో బీఎస్ఎఫ్ చీఫ్‌గా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళానికి నేతృత్వం వహిస్తున్నారు.కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా బీఎస్ఎఫ్లో దాదాపు 2.65 లక్షల మంది జవాన్లు ఉన్నారు. వీరు పశ్చిమ దిక్కున పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దులను కాపాడుతున్నారు. -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
ఎస్ఎస్బీ డీజీగా రశ్మీ శుక్లా
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రశ్మీ శుక్లా(57) నియమితులయ్యారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు. శుక్లా నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె 2024 జూన్ 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారని తెలిపింది. నేపాల్, భూటాన్ సరిహద్దుల భద్రతను ఎస్ఎస్బీయే చూసుకుంటుంది. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
జైళ్ల ఉన్నతాధికారి హత్య.. ఇంట్లో పనిచేసే వ్యక్తి పరార్
జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితుడు ఆయనను ఊపిరాడకుండా చేసి, ఆ తర్వాత పగిలిన గ్లాస్ సీసా ముక్కతో గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు శవానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అయితే హేమంత్ లోహియా హత్య జరిగిన వెంటనే ఆయన ఇంట్లో పనిచేసే యాసిర్ పరార్ అయ్యాడు. హత్య జరిగిన కాసేపటికే ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు సీసీటీవీలో రికార్డులో అయింది. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోహియా ఇంట్లో యాసిర్ ఆరు నెలలుగా పని చేస్తున్నాడని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. అతనికి ఆవేశం ఎక్కువని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. యాసిర్‌ను విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన లోహియా(57) జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు. జమ్ము పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన హత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. చదవండి: మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం! -
Russia-Ukraine War: అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్
కీవ్: ఉక్రెయిన్‌లోని జపొరిఝియా అణు విద్యుత్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురసోవ్ కిడ్నాప్‌నకు గురయ్యారు. శుక్రవారం కారులో వెళ్తున్న ఆయన్ను రష్యా సైనికులు అడ్డగించి, కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ అణు విద్యుత్ సంస్థ ఎర్గోఆటం ఆరోపించింది. ఉక్రెయిన్‌లో ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను కలిపేసుకుంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన కొద్ది సేపటికే యూరప్‌లోనే అతిపెద్ద అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, లేమాన్ నగరం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. -
సీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్ అయాన్ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తున్నారు. -
గ్లాస్ సీలింగ్ బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు..మరోసారి ఘనతను చాటుకున్న సైంటిస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి మహిళా సైంటిస్టుగా రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం కీలక బాధత్యలను చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CECRI)కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా అవతరించిన ఘనత కూడా కలైసెల్వికే దక్కింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి శనివారం నియమితు లయ్యారు. ఆమె నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల కాలం, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన వారు కలైసెల్వి. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసిన ఆమె ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా కరియర్‌ను ప్రారంభించడం విశేషం. 125కిపైగా ఎక్కువ పరిశోధనా పత్రాలు, ఆరు పేటెంట్లు ఆమె ఖాతాలోఉన్నాయి. పురుషాధిపత్య సవాళ్లను అధిగమించి అనేక ఉన్నత పదవులను చేపట్టిన కలైసెల్వి తాజాగా మరో అత్యున్నత సంస్థకు హెడ్‌గా ఎంపిక కావడంపై నారీశక్తి అంటూ పలువురు అభినందనలు ప్రకటిస్తున్నారు. Dr N Kalaiselvi has been appointed as the DG, CSIR & Secretary, DSIR. Hearty congratulations to Dr Kalaiselvi from the CSIR Family.@PMOIndia @DrJitendraSingh @PIB_India @DDNewslive pic.twitter.com/oHIZr9uoMG — CSIR (@CSIR_IND) August 6, 2022 -
ఆర్–వాల్యూ 1.22.. కరోనా ఉధృతానికి ఇదే సంకేతం
న్యూఢిల్లీ : కేసులు పెరుగుతుండటం తో దేశంలో సగటు ఆర్– వాల్యూ 1.22గా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కరోనా వైరస్ ఒకరి నుంచి సరాసరిన ఎందరికి వ్యాపిస్తుందో సూచించేదే ఆర్– వాల్యూ. ఆర్–వాల్యూ అనేది ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. ఒకటిని దాటి ఏమాత్రం పెరిగినా కరోనా ఉధృతం కాబోతుందనే దానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశసగటు 1.22గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో నమోదైన 3,30,379 ఒమిక్రాన్ కేసుల్లో 59 మరణాలు మాత్రమే సంభవించాయని భార్గవ తెలిపారు. ఢిల్లీ, ముంబైల్లో డేంజర్ బెల్స్ కేసులు పెరుగుతున్న ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఆర్–వాల్యూ 2పైగానే నమోదైనట్లు పరిశోధకులు గురువారం తెలిపారు. చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కతాల్లో కూడా ఆర్ వాల్యూ ఒకటికి పైగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు అన్నారు. డిసెంబర్ 23–29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్–వాల్యూ 2.54 వద్ద ఉండగా, ముంబైలో ఈనెల 23–28 తేదీల మధ్య ఆర్–వాల్యూ 2.01గా ఉందన్నారు. -
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్
-
డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
బీఎస్ఎఫ్ డీజీగా పంకజ్ కుమార్
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్ఎస్ దేశ్వాల్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్ కుమార్ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్ఎఫ్లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ కూడా ఐపీఎస్ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ సంజయ్ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)గా నియమించింది. -
వాణిజ్య వారధి.. బైడెన్ మెచ్చిన లీడర్
ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎవరు డైరెక్టర్ జనరల్ కాబోతున్నారు? పోటీలో ఉన్న ఇద్దరూ మహిళలే. పోటీ ఉన్నదీ ఆ ఇద్దరి మధ్యనే. నైజీరియా మాజీ ఆర్థిక మంత్రి ఒకాంజో అవేలా ఒకరు. దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూ మింగ్హ్యీ ఇంకొకరు. ఒకాంజో బైడెన్ చెప్పిన పేరు. మింగ్హ్యీ ట్రంప్ చెప్పిన పేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి డబ్లు్య.టి.ఓ. డైరెక్టర్ జనరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో! వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాలను ఎవరు రూపొందించబోతున్నారో?! బైడెన్‌తో పాటు డబ్లు్య.టి.వో.లో సభ్యత్వం ఉన్న మొత్తం 164 దేశాలు మొగ్గు చూపుతున్నది ఒకాంజో వైపే. ట్రంప్ దాదాపుగా ప్రతి ప్రపంచ సంస్థతో, ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక పంచాయితీ పెట్టుకుని వెళ్లినవారే. ట్రంప్ ఎంపిక చేసిన వ్యక్తుల సామర్థ్యాలు ఎంత శిఖరాగ్ర స్థాయిలో ఉన్నా, ట్రంప్ ఎంపిక చేశారు కాబట్టి బైడెన్ పాలనలో ఆ వ్యక్తులకు ప్రాముఖ్యం లేకపోవడమో, లేక ప్రాధాన్యం తగ్గిపోవడమో సహజమే. ఏమైనా ఒకాంజో డబ్లు్య.డి.వో. కొత్త డైరెక్టర్ జనరల్ కానున్నారన్నది స్పష్టం అయింది. మార్చి 1–2 తేదీల్లో సర్వసభ్య సమాజం ఉంది కనుక ఆ లోపే ఒకాంజో కొత్త సీట్లో కూర్చోవాలి. 66 ఏళ్ల ఒకాంజో ప్రస్తుతం ట్విట్టర్, స్టాండర్డ్–చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, ఆఫ్రికన్ రిస్కీ కెపాసిటీ సంస్థల డైరెక్టర్ల బోర్డులలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎంపిక ఖరారు అయితే కనుక ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అవుతారు. ఆ సంస్థకు ఇప్పుడు అమెరికా అవసరం ఉంది కనుక, అమెరికా ఆమెను నామినేట్ చేసింది కనుక మరొకరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగని ఒకాంజో అవేనా ఎవరో వేసిన సోపానం పైకి ఎక్కడం లేదు. ఆమె ప్రతిభ ఆమెకు ఉంది. ఆమె అనుభవం ఆమెకు ఉంది. అవన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థకు పూర్తి స్థాయి లో అవసరమైనవీ, అక్కరకు వచ్చేవే. ∙∙ ఇటీవలే 2019లో అమెరికన్ పౌరసత్వం తీసుకున్న ఒకాంజో వరల్డ్ బ్యాంకులో 25 ఏళ్లు పని చేశారు. అందులోనే మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగారు. ఇక తన స్వదేశం నైజీరియాకు రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఆమె డైరెక్టర్ జనరల్ కాబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు రావడంతోనే.. ‘‘ఆర్థికవేత్తగా అమె నాలెడ్జ్ సాటి లేనిది’’ అని యు.ఎస్.టి.ఆర్. (యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్) సంస్థ కొనియాడింది. ‘‘అమెరికా ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు’’ అని ఒకాంజో కూడా స్పందించారు. ఆమె చదివిందంతా ఎకనమిక్సే. అందులోనే డిగ్రీలు, అందులోనే డాక్టరేట్ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఒకాంజో భర్త న్యూరో సర్జన్. నలుగురు పిల్లలు. వారిలో ఒకరు కూతురు. వాళ్లవీ పెద్ద చదువులే. కుటుంబ అనుబంధాలకు, మానవ సంబంధాలకు, దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలకు క్రమశిక్షణ గల ‘ఎకానమీ’ ఇరుసు వంటిది అని అంటారామె. ఒకాంజో. -
కరోనా మళ్లీ సోకడం అరుదే..
న్యూఢిల్లీ: కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. ఆగని కరోనా ఉధృతి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 83,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. మంగళవారం 83 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,054 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80,776 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 38,59,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,90,061 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
బీఎస్ఎఫ్ డీజీగా రాకేష్ ఆస్థాన నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్ధానా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆస్ధానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆస్ధానా 2021 జులై 31 వరకూ బీఎస్ఎఫ్ డీజీగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆయన విచారించారు. ఇక 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి.ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదిర్శిగా కౌముది కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఏపీ క్యాడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కౌముది నియమితులయ్యారు. కౌముది ప్రస్తుతం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక యూపీ క్యాడర్‌కు చెందిన ఆయన బ్యాచ్‌మేట్ మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట -
హరితాభివృద్ధి వైపు అడుగులు
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హరితాభివృద్ధి దిశగా గట్టి అడుగులు పడాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ, పీఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణం, వన్య ప్రాణులకు హాని చేయడం మూలంగా ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. డా.డబ్ల్యూఆర్ రెడ్డిగా సుపరిచితులైన ఉదారం రాంపుల్లారెడ్డి, అఖిల భారత సర్వీస్‌లో 34 ఏళ్ల పాటు పనిచేసి శుక్రవారం ఎన్ఐఆర్డీ డీజీగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఐఎఫ్ఎస్ వచ్చినా చేరలేదు...: ‘34 ఏళ్ల సర్వీసు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. ఎక్కడా కూడా గతంలో ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అన్న పునరాలోచనే కలుగలేదు. ‘వర్క్ ఈజ్ వర్షిప్’అనే దాన్ని నేను నమ్ముతాను. ఇకపై వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ వ్యవస్థల బలోపేతానికి మరో 15ఏళ్ల పాటు కృషి చేస్తా. తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 6 నెలలు శిక్షణ పొందాను. రెండో ప్రయత్నంతో ఐఏఎస్‌కు సెలక్టయ్యా. 1984లో ఐఎఫ్ఎస్కు ఎంపికైనా చేరలేదు. 1986లో ఐఏఎస్‌గా కేరళ కేడర్‌కు ఎంపికయ్యాను. అధికార విధుల్లో భాగంగా 1990–95 ప్రాంతాల్లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆయన డబ్ల్యూఆర్ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. కడప జిల్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు వైఎస్‌తో కలసి వివిధ పనుల్లో పనిచేశా. కరువు ప్రభావిత ప్రాంతం కడపలో వాటర్షెడ్లు ఇతర అభివృద్ధి పనులు సంతృప్తినిచ్చాయి. 2009లో రెండోసారి వైఎస్సార్.. సీఎం అయ్యాక ఆగస్టులో నేను కలసి అడగగానే చేవెళ్ల సమీపంలో ఆగ్రో బిజినెస్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో శిక్షణ, బోధన కోసం ఏర్పాటు చేసిన సాగర్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు’అని ఆయన వివరించారు. ‘ఎన్ఐఆర్డీ డీజీగా అవకాశం రావడం దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తా. 2016లో బాధ్యతలు చేపట్టాక అనేక మార్పులు తీసుకొచ్చాం. శిక్షణ, పరిశోధన రంగాలను పటిష్టం చేశాం. ఫ్యాకల్టీ పెంచడం, గ్రామీణాభివృద్ధికి సంబంధించి వినూత్న కోర్సులు ప్రవేశపెట్టడం, సర్పంచ్‌లకు ఆన్లైన్ పాఠాలు, వైవిధ్య కోర్సులు, ‘రిస్క్’పేరిట స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రోత్సాహం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. నా సర్వీస్‌లో చివరి నాలుగేళ్లు ఎంతో సంతృప్తిని ఇచ్చింది’అని డబ్ల్యూఆర్ రెడ్డి వెల్లడించారు. -
లక్షకి చేరువలో..
బీజింగ్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇంచుమించుగా లక్షకి చేరుకుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘ఇదేమీ డ్రిల్ కాదు. వెనకడుగు వేసే విషయం కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అంశం అసలే కాదు. ఈ తరహా ముప్పు ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాటి అమలుకు సమయం వచ్చింది’’అని అన్నారు. అమెరికా, యూరప్‌లలో కూడా కరోనా మృతులు పెరగడం, కేసులు పెరిగిపోవడం చూస్తే ఆ దేశాలేవీ సన్నద్ధంగా లేవన్న విషయం అవగతమవుతోందని అన్నారు. ధనిక, పేద అన్న దేశాల తేడా లేకుండా కరోనా వైరస్ ఎదుర్కోవడం అన్ని దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ దేశాలు చికిత్స కంటే నివారణే మార్గం అన్నది తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయొద్దని గట్టిగా చెప్పారు. చదువుకు సోకిన వైరస్ కరోనా వైరస్ ప్రభావంతో మొత్తంగా 13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. పిల్లలకి వైరస్ సోకకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కోట్లాదిమంది చదువులపై ప్రభావం చూపించిందని తెలిపింది. ఆరోగ్యపరంగా ఇలా బడికి సెలవులు ఇవ్వడం సాధారణమే అయినా ఎక్కువ కాలం కొనసాగితే విద్యాహక్కుకి భంగం వాటిల్లుతుందని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అన్నారు. భారత్‌లో 31కి చేరుకున్న కేసులు ఢిల్లీలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో 16 మంది ఇటలీ టూరిస్టుల సహా కరోనా కేసుల సంఖ్య 31కి చేరుకుంది. థాయ్‌లాండ్, మలేసియాల నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ రోగిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సోనియా లేఖ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. వాఘా సరిహద్దులో రిట్రీట్ సందర్శనకు నో భారత్, పాకిస్తాన్ వాఘా సరిహద్దుల్లో ప్రతీరోజూ సాయంత్రం సరిహద్దు రక్షణ బలగాలు (బీఎస్ఎఫ్) నిర్వహించే రిట్రీట్‌కు శనివారం నుంచి సందర్శకులకు అనుమతి లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సందర్శకులకు అనుమతినివ్వకూడదని బీఎస్ఎఫ్ నిర్ణయించింది. ► ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో 3,404 మంది మరణించారు. 99,464మందికి వైరస్ సోకింది. ► చైనాలో శుక్రవారం 143 కేసులు నమోదైతే, 30 మంది మరణించారు. మృతుల సంఖ్య 3,042కి చేరుకుంది. ► చైనా తర్వాత దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో కరోనా ప్రభావం ఉంది. ► భూటాన్, సెర్బియా, కామరూన్, వాటికన్ సిటీలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు కేవలం జలుబు మాత్రమే ఉంది. నెదర్లాండ్స్‌లో ఓ వృద్ఢుడు చనిపోయారు. ► భూటాన్‌లో అమెరికా టూరిస్ట్‌కి కరోనా వైరస్ ఉన్నట్టు తేలిందని భూటాన్ ప్రధాని వెల్లడించారు. ► అమెరికాలో 14 మంది ఇప్పటివరకు మరణించారు. కేసుల సంఖ్య 230కు పెరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు 8.3 బిలియన్ డాలర్లను కేటాయిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఈ నిధులను వాక్సిన్ల తయారీ, పంపకం, పరీక్షల కోసం వినియోగించనున్నారు. ► ఇరాన్లో 3,500 కేసులు నమోదై, 107 మంది మృతి చెందారు. పేపర్ కరెన్సీ వాడొద్దని ప్రజలను కోరింది. ► ఆస్ట్రేలియాలో కరోనా కేసుల సంఖ్య 61కి చేరుకుంది. వ్యాధి నివారణకు 100 కోట్ల డాలర్లు కేటాయించింది. ► చికిత్స సమయంలో కరోనా రోగుల హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిషెల్ బాచెలెట్ అన్నారు. మనుషుల మర్యాద, వారి హక్కుల్ని అన్ని దేశాలు కాపాడాలన్నారు. ► ఆస్ట్రేలియాలో కరోనా నేపథ్యంలో టాయిలెట్ పేపర్లు ఎక్కడ దొరకవేమోనని భారీగా కొనుగోలు చేసి పెట్టడంతో బహిరంగ మార్కెట్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో ఎన్టీ న్యూస్ గురువారం అదనంగా ఎనిమిది పేజీలతో పేపర్ని వాటర్ మార్క్‌తో ముద్రించి, దానిని టాయిలెట్ పేపర్‌గా వాడుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ పత్రిక ఆలోచన తమకు యమాగా నచ్చేసిందని కామెంట్లు పెడుతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్ ఎస్.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్‌కు పాల్పడిందని అఖిల భారత ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ) 2018 నవంబర్‌లో సీసీఐను ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వాదనలో నిజం లేదని తేల్చింది. అయితే, ఈ విషయమై కేసు ఎన్సీఎల్ఏటీ వరకు వెళ్లగా.. డీజీ చేత పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా చిన్న వర్తకులు నేరుగా వినియోగదారులకు వస్తువులను విక్రయించాల్సి ఉండగా.. ఇందుకు భిన్నంగా క్లౌడ్‌టైల్, డబ్ల్యూఎస్ రిటైల్ వంటి పెద్ద వర్తకులు, సప్లయర్లతో కుమ్మౖMð్క విక్రయాలు నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించిందని ఏఐఓవీఏ ఆరోపిస్తోంది. ‘కరోనా’పై సెబీ అప్రమత్తం ముంబై: క్యాపిటల్ మార్కెట్లపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయమై సెబీ అంతర్గతంగా మదింపు చేస్తోంది. కరోనా వైరస్ గురించి, అది మార్కెట్‌పై చూపగల ప్రభావం గురించి సెబీకి తగిన అవగాహన ఉందని సెబీ హోల్–టైమ్ మెంబర్ ఎస్.కె. మోహంతి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఆసోచామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్)లకు సంబంధించి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. -
కేంద్ర సమాచార శాఖ డీజీగా వెంకటేశ్వర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సమాచార శాఖ (తెలంగాణ) డైరెక్టర్ జనరల్‌గా ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆయన డెప్యుటేషన్ అనంతరం బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా కూడా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా కూడా ఉంటారు. గతంలో ఆయన ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 ఏళ్ల పదవీకాలంలో పత్రికా సమాచార కార్యాలయం బెంగుళూరు అదనపు డైరెక్టర్ జనరల్‌గా, ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో డైరెక్టర్‌గా, భవనేశ్వర్ పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
ఎమ్ఎస్ఎస్ డీజీగా ఎమ్మెస్సార్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ (ఎమ్ఎస్ఎస్)కు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ (57) నియమితులయ్యారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1984లో డీఆర్డీవోలో చేరి మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా ఎదిగారు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆయన ఆవిష్కరణలకు గుర్తింపుగా 2003, 2007, 2011లో డీఆర్డీవో పలు అవార్డులతో సత్కరించింది. మిసైల్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన విశేష కృషికి 2014లో బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
కెమెరాకు చిక్కిన పోలీస్ బాస్
సాక్షి, లక్నో : వివాదాస్పదమైన అయోధ్యలోని రామమందిరం నిర్మిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి కెమెరా కంటికి చిక్కారు. లక్నో యూనివర్సిటీలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఈ విషయం పెను ధుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లో సూర్యా కుమార్ అనే వ్యక్తి హోమ్ గార్డ్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోనే సెకండ్ మోస్ట్ ఐపీఎస్ అధికారి. 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అయిన ఆయన పోలీసు బాస్‌గా అయ్యేందుకు రేసులో కూడా ఉన్నారు. అయితే, ఇటీవల లక్నోలోని యూనివర్సిటీలో కొంతమందితో కలిసి 'రామ్ మందరిర్ నిర్మాణ్ సమస్య ఎవం సమధాన్' అనే కార్యక్రమంలో పాల్గొని రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సమగ్ర విచార్ మంచ్ నిర్వహించింది. 'మనందరం రాముని భక్తులం.. వీలయినంత త్వరలో భారీ రామమందిరం నిర్మాణం పూర్తి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.. జైశ్రీరాం' అని ప్రతిజ్ఞ చేశారు. కాగా, దీనిపై ఆయన స్పందిస్తూ తాను కేవలం ఒక అతిథిగానే అక్కడికి వెళ్లానని, సమస్యకు పరిష్కారం ఆలోచించే దిశగా మాత్రమే అక్కడ చర్చలు జరిగాయని అన్నారు. దానికి సంబంధించిన కొద్ది వీడియో మాత్రమే బయటకు వచ్చిందని తెలిపారు. -
అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు
ఏలూరు(సెంట్రల్) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారి వివరాలను అత్యంత గోప్యంగా అవినీతి నిరోధక శాఖ సేకరిస్తోందని, శాఖ కార్యాలయాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో ఉన్నామని ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) ఆర్పీ ఠాకూర్ తెలిపారు. బుధవారం జిల్లా ఏసీబీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తొలుత నిర్మాణంలో ఉన్న ఏసీబీ కొత్త భవనాన్ని ఆయన పరిశీలించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. నిర్మాణంలో జాప్యంపై ప్రశ్నించారు. వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ 2015–16 సంవత్సరాలలో జిల్లాలో నమోదు చేసిన కేసులను సమీక్షించేందుకు వచ్చానని తెలిపారు. అవినీతికి పాల్పడేవారెవరైనా ఉపేక్షించేది లేదని, డిజిటలైజేషన్లో భాగంగా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక వాట్సప్ నంబరును అందుబాటులో ఉంచామన్నారు. అవినీతికి పాల్పడే వారి వివరాలను తమకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే చాలని, తదుపరి తాము ఆయా అంశాలపై విచారణ జరిపి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ నంబరును (8333995858) ప్రజలకు అందుబాటులో తెచ్చానని, ఇప్పటికే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఠాకూర్ తెలిపారు. ఏసీబీ అదనపు డీజీ అబ్రహాం లింకన్, జాయింట్ డైరెక్టర్ మోహనరావు, డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యుజె.విల్సన్, ట్రాఫిక్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆయనతోపాటు ఉన్నారు. -
‘భద్రత’ నిర్ణయం ప్రధాన కార్యదర్శులదే..
సాక్షి, ముంబై: రాజకీయ ప్రముఖులకు ఏ స్థాయి భద్రత కల్పించాలో ప్రధాన కార్యదర్శులే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తనకు శత్రువులెవరూ లేరని, జెడ్ ప్లస్ స్థాయి భద్రత అవసరం లేదని ఇదివరకే ఫడ్నవిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారాలు తమవద్ద ఉంచుకోకుండా ప్రధాన కార్యదర్శులకే బాధ్యత అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు, ఇతర రంగాల వీవీఐపీ, వీఐపీలకు జెడ్ ప్లస్, జెడ్ లేదా వై, ఎక్స్ స్థాయి.. ఇలా వివిధ స్థాయిల్లో భద్రత కల్పించే అధికారం ఇదివరకు ముఖ్యమంత్రికి లేదా హోం శాఖ వద్ద ఉండేవి. భద్రత కంటే ‘స్టేటస్ సింబల్’కు ప్రాధాన్యత ఇచ్చే మంత్రులు జెడ్ ప్లస్, జెడ్ భద్రత కావాలని ప్రయత్నాలు చేస్తుండేవారు. అందుకు ముఖ్యమంత్రి లేదా హోం శాఖతో ఉన్న సంబంధాలను సద్వినియో గం చేసుకునేవారు. కాని ఇప్పడా అధికారాలు ప్రధాన కార్యదర్శుల చేతుల్లోకి వెళ్లాయి. సంబంధిత వీఐపీలు, కీలక నాయకులకు భద్రత కల్పించే ముందు వారి ప్రాణాలకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉంది...? ఏ స్థాయి భద్రత కల్పించాలి తదితర అంశాలను పరిగణంలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఆ ప్రకారం అవసరాన్ని బట్టి ఆ స్థాయి భద్రత వారికి సమకూర్చి ఇవ్వాలి. కాగా, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీలో ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని ఫడ్నవీస్ తెలిపారు. అడ్వకేట్ జనరల్‌గా సునీల్ నియామకం.. రాష్ట్రంలో కీలకమైన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది సునీల్ మనోహర్ నియమితులయ్యారు. ఇక్కడ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న అడ్వకేట్ దరాయస్ ఖంబాటా రాజీనామాను స్వీకరించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. సీనియర్ లాయరైన సునీల్ మనోహర్ నాగపూర్ యూనివర్సిటీలో లా పట్టా పొందారు. ముంబై హైకోర్టులోని నాగపూర్ బెంచిలో కీలక న్యాయవాదిగా ఉన్నారు. 27 సంవత్సరాలకు పైగా ఆయన న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. మంచి అనుభవమున్న వ్యక్తిగా ఇదివరకు హైకోర్టులో అనేక కీలక కేసులను వాధించారు. కాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉత్తమ సేవలందించినందుకుగాను దరాయస్ ఖంబాటాను కేబినెట్ సమావేశంలో అభినందించారు. కరువుపై సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనేలా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు అవసరమైతే వెంటనే కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై ఓ కమిటీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు.