![Russia-Ukraine War: Russia accused of kidnapping head of Ukraine nuclear plant - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/2/ukrain-nuclear-plant-kidnap.jpg.webp?itok=YOHauvgb)
కీవ్: ఉక్రెయిన్‌లోని జపొరిఝియా అణు విద్యుత్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురసోవ్ కిడ్నాప్‌నకు గురయ్యారు. శుక్రవారం కారులో వెళ్తున్న ఆయన్ను రష్యా సైనికులు అడ్డగించి, కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ అణు విద్యుత్ సంస్థ ఎర్గోఆటం ఆరోపించింది.
ఉక్రెయిన్‌లో ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను కలిపేసుకుంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన కొద్ది సేపటికే యూరప్‌లోనే అతిపెద్ద అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, లేమాన్ నగరం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment