
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్‌ఐఆర్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.
ఇథియమ్ అయాన్ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తున్నారు.