issued orders
-
సీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్ అయాన్ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తున్నారు. -
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిగా డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మంది నియమించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. చదవండి: థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’ -
రోజుకు 50 వేల మందికే దర్శనం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. అలాగే బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఆలయానికి చేరుకునే మార్గంలో 19 చోట్ల అగ్ని మాపక పరికరాలను ఏర్పాటుచేశారు. -
బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి 3.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు పరిపాలన అనుమతులిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ నిధులతో నాలుగంతస్తులతో కూడిన విశాల భవనాన్ని నిర్మించనున్నారు. -
అక్కడ కొన్ని.. ఇక్కడ కొన్ని..
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలు వెలువడ్డాయి. రాష్ట్రస్థాయిలో కొన్ని, జిల్లాస్థాయిలో కొన్ని పోస్టులను విభజించనున్నారు. అటెండర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల వరకు కలెక్టర్ అధీనంలో, సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్లు, పైస్థాయి అధికారులు, ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కేటాయింపులు జరగనున్నాయి. కానీ ఏ ప్రాతిపదికన ఏ జిల్లాకు కేటాయిస్తారన్నది మాత్రం స్పష్టం కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని జిల్లాస్థాయి కార్యాలయాల్లో 3,370 పోస్టులున్నాయి. ఇందులో 1,100 ఖాళీలు ఉండగా 2,270 మంది పనిచేస్తున్నారు. అటెండర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు 1,800 మంది ఉండగా.. మిగతా వారు సూపరింటెండెంట్, ఏడీ ఆపైస్థాయి పోస్టులవారున్నారు. దసరాలోపు వీరిని జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. జిల్లా ప్రారంభం రోజున మొదట రెవెన్యూ, పోలీసు శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఆ తర్వాత ఒక్కో శాఖలో పోస్టులు, అధికారులు సర్దుబాటు చేసి కామారెడ్డికి తరలించనున్నారు. అయితే ఎవరిని ఎక్కడికి పంపిస్తారో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు వర్క్ టు ఆర్డర్ పేరిట ఉద్యోగులను కామారెడ్డికి కేటాయిస్తారని, ఆ తర్వాత అవసరమైన వారిని రెగ్యులర్ ఆర్డర్ పేరిట పూర్తిస్థాయిలో పంపే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. దసరా సమీపిస్తున్నా.. స్పష్టత రాకపోవడం ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఆయా శాఖలకు సంబంధించి ఫైళ్లను పాత జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించారు. ఇలాగైతేనే భద్రత ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో టీఎన్జీవోస్ నాయకులు ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని టీఎన్జీవోస్ నాయకులు కోరుతున్నారు. ఈ విషయమై సోమవారం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రాష్ట్రస్థాయి అధికారులను కలిసి, ఉద్యోగుల విభజనలో ఇబ్బందులను వివరించనున్నట్లు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల టీఎన్జీవోస్ నాయకులతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.