సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు పరిపాలన అనుమతులిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ నిధులతో నాలుగంతస్తులతో కూడిన విశాల భవనాన్ని నిర్మించనున్నారు.