
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ
న్యూఢిల్లీ : కేసులు పెరుగుతుండటం తో దేశంలో సగటు ఆర్– వాల్యూ 1.22గా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కరోనా వైరస్ ఒకరి నుంచి సరాసరిన ఎందరికి వ్యాపిస్తుందో సూచించేదే ఆర్– వాల్యూ. ఆర్–వాల్యూ అనేది ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. ఒకటిని దాటి ఏమాత్రం పెరిగినా కరోనా ఉధృతం కాబోతుందనే దానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశసగటు 1.22గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో నమోదైన 3,30,379 ఒమిక్రాన్ కేసుల్లో 59 మరణాలు మాత్రమే సంభవించాయని భార్గవ తెలిపారు.
ఢిల్లీ, ముంబైల్లో డేంజర్ బెల్స్
కేసులు పెరుగుతున్న ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఆర్–వాల్యూ 2పైగానే నమోదైనట్లు పరిశోధకులు గురువారం తెలిపారు. చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కతాల్లో కూడా ఆర్ వాల్యూ ఒకటికి పైగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు అన్నారు. డిసెంబర్ 23–29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్–వాల్యూ 2.54 వద్ద ఉండగా, ముంబైలో ఈనెల 23–28 తేదీల మధ్య ఆర్–వాల్యూ 2.01గా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment