Border Security Force (BSF)
-
భారత్-బంగ్లా బోర్డర్: BSF హై అలర్ట్
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో త్వరలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్- బంగ్లా సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది.కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య 4, 096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ ఛౌదరి కోల్‌కత్తాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. VIDEO | Border Security Force (BSF) issues high alert along the Indo-Bangladesh border in Karimganj, Assam in wake of the violent protests and political turmoil in Bangladesh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/BIVV9t1bsS— Press Trust of India (@PTI_News) August 5, 2024 DG BSF is already present in the eastern Command. The situation on the Indo- Bangladesh border is normal as of now. Troops are aware and alert about the recent development and situation across the IB: Statement#Bangladesh #coup#SheikhHasina #Pakistan pic.twitter.com/PpfOVh9dNB— world of politics (@world_dailyy) August 5, 2024 ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను తొలగించి ప్రతిభకు పట్టం కట్టాలని చేస్తున్న ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. ఈ క్రమంలో భారత్ చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా సైన్యం రంగంలోకి దిగింది. బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుండగా.. కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ప్యూను దాటుకొని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. Happy #Bangladesh!#HasinaDown #BangladeshWon pic.twitter.com/cdWKALiMVh— Basherkella - বাঁশেরকেল্লা (@basherkella) August 5, 2024 మరోవైపు.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Fall of Bangladesh government attributed to record high unemployment & inflation!Nearly 8 lakh graduates are unemployed in #BangladeshStudents were protesting the 30% job quota for families of freedom fighters. The supreme court then intervened & reduced the Quota to 5%...… pic.twitter.com/rwdAHTe6Z3— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024 शेख़ हसीना की 15 साल की सत्ता 15 मिनट में चली गई!ढाका में प्रधानमंत्री आवास के शयनकक्ष में प्रदर्शनकारी#SheikhHasina #Bangladesh pic.twitter.com/Vc5DJDik3o— Dheeraj Pal (@dheerajpal09) August 5, 2024 ناجائز دھاندلی زدہ وزیراعظم کے فرار کے بعد بنگلہ کے عوام نے وزیراعظم ہاؤس میں کھانا کھایا یہ کھانا حسینہ واجد کیلیے پکایا گیا تھا pic.twitter.com/Od2Qh3ldWO— Sabir Shakir (@ARYSabirShakir) August 5, 2024 Bangladesh Parliament. From Democracy to Mobocracy. pic.twitter.com/LnXQ7NPJXw— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024 -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత
హజారీబాగ్: భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 59వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ప్రపంచ స్థాయి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్ఎస్), యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. రాఫెల్‌లు.. హెలికాప్టర్లు.. యాంటీ డ్రోన్లు దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్ఎస్జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న విమానం, క్వాడ్కాప్టర్లు నిర్వహణను నిషేధించారు. -
మాజీ అగ్నివీర్లకు బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్‌ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. -
ఎస్ఎస్బీ డీజీగా రశ్మీ శుక్లా
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రశ్మీ శుక్లా(57) నియమితులయ్యారు. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు. శుక్లా నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమె 2024 జూన్ 30వ తేదీ వరకు విధుల్లో ఉంటారని తెలిపింది. నేపాల్, భూటాన్ సరిహద్దుల భద్రతను ఎస్ఎస్బీయే చూసుకుంటుంది. -
కూతురుపై అసభ్యకర వీడియో.. వ్యతిరేకించినందుకు సైనికుడుని కొట్టి చంపారు
గుజరాత్లో బీఎస్ఎఫ్ జవానుని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెపై అసభ్యకర వీడియోని ప్రసారం చేయడాన్ని నిరసించినందుకు ఆ జవాన్ తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన గుజరాత్‌లోని నదియాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ కూతురుపై ఒక అసభ్యకర వీడియోను 15 ఏళ్ల యువకుడు ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఈ విషయమై ఫైర్ అయిన సదరు జవాన్ సదరు యువకుడి కుటుంబంతో మాట్లాడేందుకువెళ్లాడు. అక్కడ యువకుడి కుటుంబ సభ్యలు అతడిపై దాడి చేసి కొట్టి చంపేశారు. సదరు జవాన్ ఆ యువకుడి ఇంటికి భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడితో కలిసి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. విచారణలో జవాన్ కూతురు సదరు యువకుడితో రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఆ అభ్యంతరకర వీడియోను వ్యతిరేకించడంతోనే జవాన్ కుటుంబంపై సదరు యువకుడు కుటుంబం దుర్భాషలాడి దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు) -
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్‌లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్‌పైకి గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని పంజ్‌గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్‌కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్‌లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..
కశ్మీర్: బీఎస్ఎఫ్ జవాన్ల బృందం బిహు పండుగను పురష్కరించుకుని ఓ జానపద పాటకు నృత్యం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో జవాన్లు డ్యాన్స్ చేస్తున్న తీరు వారి అచంచలమైన స్ఫూర్తిని, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చెక్కుచెదరని విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరిలో.. అస్సాం, ఈశాన్య భారతదేశంలో జరుపుకునే పంట పండుగ అయిన బిహును పురష్కరించుకుని సైనికదళాలు నృత్యం చేయడం మన గమనించవచ్చు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్లో చిత్రీకరించిన ఈ వీడియోలో.. ఆర్మీ జవాన్లు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉత్సాహంగా నృత్యం చేయడం చూడవచ్చు. చదవండి: (తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా) 'పర్వతాలు, మంచు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, 24 గంటలపాటు తీవ్ర ఒత్తిడి, ఎల్ఓసీ, ఇళ్లకు దూరంగా ఉండటం ఇవి ఏవీ కూడా వారిని నిరుత్సాహానికి గురిచేయలేదు.. పండుగ జరుపుకోవడాన్ని అడ్డుకోలేదు' అంటూ క్యాప్షన్ ఇస్తూ 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కశ్మీర్' వీడియో పోస్ట్ చేసింది. Mountains and mountains of snow, blinding blizzards, freezing temperatures, stress of 24 hours vigil #LoC , away from homes; this all didn’t deter BSF troops to dance few steps & celebrate #Bihu at FDL in #Keran Sector #ForwardArea .@PMOIndia @HMOIndia @BSF_India pic.twitter.com/65c1viqskU — BSF Kashmir (@BSF_Kashmir) January 16, 2022 -
ప్రధానితో మమత భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎస్) అధికార పరిధి పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కి.మీ.లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్కు మరిన్ని అధికారాలు కట్టబెడితే రాష్ట్ర పరిధిలో ఉన్న శాంతిభద్రతల విషయంలో ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అకారణంగా దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆమె వెల్లడించారు. త్రిపురలో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నట్లు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. సోనియాను కలవాలని నిబంధనేం లేదు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారా అని మీడియా ప్రశ్నించగా ఆమె సుదీర్ఘ సమాధానమిచ్చారు. ‘ఈసారి ఢిల్లీ టూర్లో కేవలం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నా. పంజాబ్ ఎన్నికలపై పార్టీల నేతలంగా బిజీగా ఉన్నారు. పనికే మొదటి ప్రాధాన్యం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు. -
‘పరిధి’ మార్చి మా అధికారాల్లోకి తలదూర్చొద్దు
కోల్‌కతా: దేశ సరిహద్దు వెంట రాష్ట్ర భూభాగాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అజమాయిషీ పరిధిని కేంద్రం పెంచిన అంశాన్ని ఢిల్లీలో తేల్చుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టంచేశారు. హస్తిన పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దు వెంట 15 కి.మీ.లకు బదులుగా 50 కి.మీ.ల పరిధి వరకూ సోదాలు, అరెస్ట్‌లకు బీఎస్ఎఫ్కు అధికారాలు కట్టబెడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీతో భేటీలో లేవనెత్తుతానని మమత చెప్పారు. ‘ బీఎస్ఎఫ్ పరిధిని పెంచి మోదీ సర్కార్ సరిహద్దు రాష్ట్రాలపై తమ అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది’ అని మమత ఆరోపించారు. త్రిపురలో హింసాకాండ, బెంగాల్లో తృణమూల్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ వర్గాల దాడుల అంశాలనూ ప్రధానితో చర్చిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘ త్రిపురలో హింసపై మానవహక్కుల సంస్థలు, వామపక్ష సంఘాలు ఇంతవరకూ నోరు మెదపకపోవడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది’ అని మమత వ్యాఖ్యానించారు. -
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి
చండీగఢ్: పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దాకా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్లుగా ఉంది. దీన్ని కేంద్రం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా ఈ పరిధిలో నివసించే ఎవరినైనా విచారించే, అరెస్టు చేసే, సోదాలు చేపట్టే అధికారం బీఎస్ఎఫ్కు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా పంజాబ్ సీఎంæ చన్నీ అభివర్ణించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. -
బీఎస్ఎఫ్ డీజీగా పంకజ్ కుమార్
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్ఎస్ దేశ్వాల్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్ కుమార్ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్ఎఫ్లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ కూడా ఐపీఎస్ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ సంజయ్ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)గా నియమించింది. -
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
తాలిబన్ల రాజ్యం: ‘పరిణామాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’
శ్రీనగర్: అఫ్గనిస్తాన్ తాలిబన్ల హస్తగతమైన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత సరిహద్దు భద్రతా బలగాల డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ స్పందించారు. అఫ్గన్‌లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ నుంచి గుజరాత్ వరకు చేపట్టిన సైక్లిస్టుల ‘‘ఫ్రీడం ర్యాలీ’’ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకొన్న వైనం ఇండో- పాక్ సరిహద్దు భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలకు బదులుగా... ‘‘పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా అక్కడి అంతర్గత వ్యవహారం. అయితే, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అదే విధంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని దేశ్వాల్ వ్యాఖ్యానించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ ఉల్లంఘించలేదని, అయితే దాయాది దేశం కుయుక్తులను తిప్పికొట్టడంలో మాత్రంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గన్‌లో పూర్వవైభవం పొందిన తాలిబన్లు ఆదివారం పూర్తిగా ఆధిపత్యం సాధించారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. ఈ క్రమంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు తాలిబన్ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మరోవైపు.. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా.. తాలిబన్లకు స్నేహ హస్తం అందించడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశం చర్చనీయాంశమైంది. -
మిషన్ ఫ్రంట్‌లైన్.. ఆర్మీలో రానా
విభిన్న కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దగ్గుబాటి రానా. గతేడాది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రానా. ప్రస్తుతం తను నటించిన రెండు చిత్రాలు విరాట పర్వం, అరణ్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో వైపు రానా సినిమాలే కాకుండా ఓ డాక్యుమెంటరీని కూడా తెరకెక్కించాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద డిస్కవరీ ప్లస్ ఒరిజినల్‌తో కలిసి మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: ‘రానా – మిహికా.. ఆగస్ట్ 8, 2020’ భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకురానున్నఆలోచనతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు, మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో రూపొందిన ఈ డాక్యూమెంటరీలో రానా ఆర్మీ గెటప్‌లో ఆకట్టుకోనున్నాడు. దీనిని తెరకెక్కించేందుకు స్వయంగా బీఎస్ఎఫ్ సాయాన్ని తీసుకొని పలు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ నేడు(జనవరి21) డిస్నీ ప్లస్ ఒరిజినల్లో విడుదలైంది. ఈ సందర్భంగా మిషన్ ఫ్రంట్లైన్లో భాగం అవ్వడం తనకు అమూల్యమైన అనుభవాన్ని ఇచ్చిందంటున్నాడు రానా. పౌరులు ఉండని హై-సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించడం నుంచి అక్కడ శిక్షణ తీసుకోవం మర్చిపోలేని అనూభూతినిచ్చిందన్నాడు. మిషన్ ఫ్రంట్‌లైన్‌ను డిస్నీ ప్లస్ ఒరిజినల్లో చూడాలని కోరాడు. ఈ మేరకు ట్విటర్లో చిన్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: ‘అరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో సినిమాతో పోటీ! ఇంతకముందు కూడా రానా దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ జవాన్‌గా ఉండటం అంత సులభం కాదు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లతో కలిసి ఉన్న అనుభవాలను పంచుకుంటూ.. ఆర్మీ జవాన్లతో డ్యూటీ అత్యంత కష్టంగా ఉంటుంది. వారికి సెలవులు ఉండవు. బ్రేక్స్ ఉండవు. సరిగ్గా ఊపిరి పీల్చుకునేందకు కూడా వీలు ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిసారు. లేకుంటే దేశమే ప్రమాదంలోపడిపోతుంది. విధుల్లో భాగంగా ప్రతిరోజూ కసరత్తులు, కాల్పులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ హీరోల సాయంతో కఠిన శిక్షణ పొందాను. వాళ్లతో ప్రయాణం ఎంతో అమూల్యమైన అనూభూతినిచ్చింది. ఆ సమయంలో భారతదేశ గొప్పతనాన్ని అస్వాదించాను. వీళ్లను నేను కలవడం ను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీని గౌరవించాలంటూ తెలిపాడు. Catch me as I rub shoulders with India's First Line of Defense on 'Mission Frontline', a Discovery+ Original, now streaming exclusively on @discoveryplusIN https://t.co/dLVtfVlP3X@BSF_India #DiscoveryPlusOriginals #MissionFrontline pic.twitter.com/xTz1bL9l9h — Rana Daggubati (@RanaDaggubati) January 21, 2021 -
200 మీటర్ల సొరంగం; పాక్ కుట్రలు బట్టబయలు!
న్యూఢిల్లీ: ఇటీవల నగ్రోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. గురువారం నాటి ఎన్కౌంటర్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, వారు దేశంలో ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. పక్కా పథకం ప్రకారం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు ఆదివారం వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికాలు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. ‘‘సొరంగం తవ్వడానికి ఇంజనీరింగ్ నిపుణుల సహాయం తీసుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. తైవాన్‌లో తయారైన ఈట్రెక్స్ 20ఎక్స్ జర్మిన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) డివైస్‌ను ఉగ్రవాదులు ఉపయోగించారు. సరిహద్దు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వాహనాన్ని నిలిపారు. భద్రతా బలగాల చేతికి చిక్కే ముందే భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం రచించారు. జీపీఎస్ డివైస్ ఆధారంగా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఉగ్ర కార్యకలాపాల నిరోధక విభాగం ఉన్నతాధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(చదవండి: కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం) పాక్ కుట్రలు బట్టబయలు! కాగా పాకిస్తాన్‌లోని రేంజర్ ఔట్‌పోస్టులు చక్ బురా, రాజబ్ షాహిద్, ఆసిఫ్ షాహిద్‌ల గుండా మొదలైన ఈ సొరంగం కశ్మీర్ దాకా తవ్వబడిందని, 32. 45648 అక్షాంశం(ఉత్తరం), 75.121815(తూర్పు) రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక దీపక్ రాణా నేతృత్వంలోని 48 బెటాలియన్ భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌లో తయారైన యూరియా ఫర్టిలైజర్, ఇసుక బస్తాలతో దీనిని నింపారు. జీపీఎస్ డేటా ఆధారంగా భారత్ సరిహద్దులో గల, బీఎస్ఎఫ్ బార్డర్ ఔట్‌పోస్టు రీగల్ సమీపంలోని 189 పిల్లర్ వద్దకు ఉగ్రవాదులు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం నడిచి, ఆర్మీ క్యాంపు సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటి జాతీయ రహదారి 44 మీదకు చేరుకుని నవంబరు 19 అర్ధరాత్రి ట్రక్కు ఎక్కారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలోనూ భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని పాకిస్తాన్ భారత్‌పై విషం చిమ్ముతూ ఉగ్రకుట్రలకు పథకం రచిస్తోందన్న ఆరోపణలకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. -
భారత్- పాక్ సరిహద్దులో సొరంగం
శ్రీనగర్: దాయాది దేశం పాకిస్తాన్ కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల కంచె కింద ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పలు చోట్ల భూమి కుంగినట్లుగా కనిపించిందని, ఈ నేపథ్యంలో కంచె కింద భాగంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే యంత్రాలను రప్పించి దానిని పూడ్చినట్లు తెలిపారు. (చదవండి: నలుగురు ఉగ్రవాదులు హతం) అదే విధంగా తాజా ఉదంతంతో పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు భద్రతా బలగాలు తెలిపారు. ఇటీవల పంజాబ్ సరిహద్దులో ఐదుగురు సాయుధులైన చొరబాటుదార్లను హతం చేసిన తర్వాత ఈ మేరకు యాంటీ- టన్నెల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం గురించి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా మాట్లాడుతూ.. చొరబాటు నిరోధక గ్రిడ్ వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని ఫ్రాంటియర్ కమాండర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీఎస్ఎఫ్ ఇన్సెప్టర్ జనరల్(జమ్ము) ఎన్ఎస్ జమాల్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. పాకిస్తానీ బార్డర్‌లోని ‘గుల్జార్’ పోస్టుకు 700 మీటర్ల దూరంలో ఈ టన్నెల్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. (చదవండి:‘పాక్‌తో యుద్ధమా.. అని మోదీని అడిగా’) -
పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో బాంబు పేలుడు..
కోల్కత్తా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా, ఒకరు గాయపడినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పేలుడు సంభవించిదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అవుట్‌పోస్టు(బీఓపీ) ఫర్జిపారా సమీపంలో పశువుల స్మగ్లర్లు బకెట్లో దాచిన బాంబ్ పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారని, ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. -
పాక్‌కు సరిహద్దు రహస్యాలు
ఫిరోజ్‌పూర్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని కంచెలు, రహదారులకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంటుకు అందజేశాడన్న ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా షేక్ రియాజుద్దీన్ అనే జవానుపై నిఘా పెట్టిన బీఎస్ఎఫ్ వర్గాలు ఆయనను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. రియాజుద్దీన్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రెన్పురా గ్రామానికి చెందిన వాడని, పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌లోని 29వ సరిహద్దు భద్రతాదళానికి చెందిన బెటాలియన్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతని నుంచి రెండు సెల్ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందిన మీర్జా ఫైజల్ అనే వ్యక్తికి సరిహద్దు ఫెన్సింగ్, రోడ్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, ఇతర రహస్య వివరాలు రియాజుద్దీన్ అందజేసినట్టుగా బీఎస్ఎఫ్ వెల్లడించింది. 29వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రియాజుద్దీన్ పోలీసు రిమాండ్‌కోసం కోర్టును ఆశ్రయిస్తామని విచారణ అధికారి రంజిత్‌సింగ్ తెలిపారు. -
పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మాహుతికి యత్నం!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహుతికి ప్రయత్నించిన సంఘటన సంచలనం రేపింది. సరిహద్దు రక్షణ దళాల( బీఎస్ఎఫ్) అధికారుల తీరును నిరసిస్తూ ఓ మాజీ బీఎస్ఎఫ్ జవాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆత్మహుతికి పాల్పడిన వ్యక్తిని అశోక్ కుమార్ గా గుర్తించారు. మతి స్థిమితం లేని కారణంగా 2000 సంవత్సరంలో విధుల నుంచి అశోక్ కుమార్ ను తొలగించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు కథనం ప్రకారం శుక్రవారం ఉదయం ముగ్గురు పిల్లు, భార్యతో కలసి విజయ్ చౌక్ చేరుకుని, కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా రక్షణ దళ అధికారులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ ను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తనకు సహాయం అందించాలని హోంమంత్రి కార్యాలయ అధికారులను, ఇతర సీనియర్ అధికారులను కలసినా ప్రయోజనం లేకపోండంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మాహుతికి పాల్పడ్డారని పోలీస్ అధికారి తెలిపారు.