కూతురుపై అసభ్యకర వీడియో.. వ్యతిరేకించినందుకు సైనికుడుని కొట్టి చంపారు | BSF Jawan Death In Gujarat Protested Against Daughters Obscene Video | Sakshi
Sakshi News home page

కూతురుపై అసభ్యకర వీడియో.. వ్యతిరేకించినందుకు సైనికుడుని కొట్టి చంపారు

Published Mon, Dec 26 2022 7:25 PM | Last Updated on Mon, Dec 26 2022 7:57 PM

BSF Jawan Death In Gujarat Protested Against Daughters Obscene Video - Sakshi

గుజరాత్‌లో బీఎస్‌ఎఫ్‌ జవానుని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెపై అసభ్యకర వీడియోని ప్రసారం చేయడాన్ని నిరసించినందుకు ఆ జవాన్‌ తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన గుజరాత్‌లోని నదియాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ కూతురుపై ఒక అసభ్యకర వీడియోను 15 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశాడు.

ఈ విషయమై ఫైర్‌ అయిన సదరు జవాన్‌ సదరు యువకుడి కుటుంబం​తో మాట్లాడేందుకువెళ్లాడు.  అక్కడ యువకుడి కుటుంబ సభ్యలు అతడిపై దాడి చేసి కొట్టి చంపేశారు. సదరు జవాన్‌ ఆ యువకుడి ఇంటికి భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడితో కలిసి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. విచారణలో జవాన్‌ కూతురు సదరు యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ అభ్యంతరకర వీడియోను వ్యతిరేకించడంతోనే జవాన్‌ కుటుంబంపై సదరు యువకుడు కుటుంబం దుర్భాషలాడి దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

(చదవండి: ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement