స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను చూపిస్తున్న పంజాబ్ పోలీసు అధికారులు
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్‌సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు.
ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్‌లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment