heroin
-
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు ‘తల్లి’..మాజీ విశ్వ సుందరి (ఫోటోలు)
-
పక్కా స్కెచ్.. మాయలేడి కాదంబరి కేసులో హైడ్రామా
సాక్షి, విజయవాడ: మాయలేడీ కాదంబరి కేసులో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలే టార్గెట్‌గా ముంబాయి నటి కాదంబరిపై హనీట్రాప్ దందా ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పలువురి ఆస్తులు కొల్లగొట్టినట్లు కాదంబరిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, కాదంబరి హనీట్రాప్ వ్యవహారాన్ని తమకనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బందోబస్తుతో విజయవాడకి ముంబాయి నటి కాదంబరిని రప్పించారు. విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో ఆమెకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఆ స్టార్ హోటల్ వద్దకే ప్రత్యేక లీగల్ టీం వచ్చినట్లు సమాచారం.పోలీసు దర్యాప్తులో ఏ విధంగా మాట్లాడాలో.. ఏ అంశాలు చెప్పాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఎవరిపై ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు ఎలా ఉండాలనే దానిపైనా గంటల తరబడి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో స్టార్ హోటల్ నుంచి ఇప్పటివరకు మాయలేడి కాదంబరి బయటకు రాలేదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్‌కి వెళ్లి కూడా కాదంబరి ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వ పెద్దల డైరక్షన్ లోనే ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. -
మన్మధుడు హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు తనొక..
మహిమా మక్వానా.. తెలుగు సినీ అభిమానులకు కొత్తేం కాదు. ‘వెంకటాపురం’, ‘మోసగాళ్లు’ చిత్రాలతో ఆమె తెలుగు తెరకు ఎప్పుడో పరిచయమైంది! ఇప్పుడు వెబ్ సిరీస్‌లతో మరింత చేరువైంది.మహిమా పుట్టిపెరిగిందంతా ముంబైలోనే! మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తండ్రి చనిపోవడంతో.. మహిమా చిన్నప్పుడే ఆర్థిక బాధ్యతలను మోయాల్సి వచ్చింది.పదేళ్ల వయసులోనే నటిగా మారింది.. టీవీ సీరియల్స్, కమర్షియల్స్‌లో నటిస్తూ! ‘బాలికా వధు’, ‘మిలే జబ్ హమ్ తుమ్’ వంటి సీరియల్స్ బాలనటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.మహిమా .. టీవీ సీరియల్స్ సెట్స్ మీదే చదువుకుంది. ఆమె తల్లి మాటల్లో చెప్పాలంటే మహిమాకు ఇల్లు, బడి, గుడి అన్నీ అవే! ఇంకా చెప్పాలంటే ఆమె సీరియల్స్ సెట్స్ మీదే పెరిగింది.కథానాయికగా మహిమా కనిపించిన తొలి సీరియల్ ‘సప్నే సుహానే లడక్పన్ కే’. దీంతో ఆమె దేశమంతా పాపులర్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత ‘సీఐడీ’, ‘ఆహత్’, ‘కోడ్ రెడ్’, ‘ప్యార్ తూనే క్యా కియా’, అధూరీ కహానీ హమారీ’, ‘శుభారంభ్’ వంటి సీరియల్స్‌లోనూ నటించింది. తన పాపులారిటీని వెండితెర కూడా గమనించేలా చేసుకుంది.మొదటి అవకాశంలోనే సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే ‘అంతిమ్’ మూవీ. ఆమె ‘ధడ్కనే మేరీ’, ‘తేరా బాత్ ఔర్ హై’ వంటి మ్యూజిక్ వీడియోస్‌లోనూ అభినయించింది.‘ఫ్లెష్’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘షో టైమ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్‌లో మహిమా కూడా ప్రధాన భూమిక పోషించింది. ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.'టీవీ, సినిమా.. ఇప్పుడు ఓటీటీ.. ఇవే నా లోకం! గ్లామర్.. పర్ఫార్మెన్స్.. రెండూ ఇష్టమే. రెండిటికీ స్కోప్ ఉన్న రోల్స్ చేయాలి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. ఇదే నా గోల్!’ – మహిమా మక్వానా -
హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
కామన్ ఫీచర్స్.. ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్‌తో ఆన్‌స్క్రీన్ గ్రామర్ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.అక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్‌కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్‌గా ఎంపికైంది.మోడలింగ్‌తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్‌లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘శాన్వికా’గా మార్చుకుంది.‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్‌తో స్పెషల్ ఫ్యాన్ బేస్‌నే ఏర్పరచుకుంది.‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్‌లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్‌లో తన మార్క్ చూపిస్తుంటుంది."పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్‌కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్‌లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికాఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!? -
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. బాలాపూర్‌లో 24 గ్రాముల హెరాయిన్, మీర్పేట్లో 1.5 కేజీల ఓపీఎం, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.35 కోట్ల హెరాయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్ మిషన్‌లో లగేజ్ బ్యాగ్ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్ సీజ్ చేశారు. -
ఉడ్తా షెహర్! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హష్ ఆయిల్ మొదలుకుని, కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు.. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు సైతం వీటి బారిన పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో దాని యజమాని కుమారుడు సహా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా కావాల్సిన డ్రగ్‌ను ఎంచుకోవడం.. సోషల్ మీడియా యాప్ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం.. బిట్ కాయిన్స్ రూపంలో నగదు చెల్లించడం.. డెడ్ డ్రాప్ లేదా కొరియర్ ద్వారా సరుకు తెప్పించుకోవడం..ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదకద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్‌లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్ పార్టీలు జరిగిపోతున్నాయి. దుమ్ము రేపుతున్న రేవ్ పార్టీలు ఒక్క రాడిసన్ హోటలే కాదు.. రాత్రి అయిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. పచ్చబొట్లలో డ్రగ్ గుట్టు కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాన్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలన్నది సప్లై చేసే వారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్‌ల నిర్వాహకులు ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నట్లు సమాచారం. రేవ్ తీరే వేరు అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదకద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డూ అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్‌లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్‌తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత.. ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ పై ‘పైట్రాన్స్’ఇమేజెస్‌గా పిలిచే ఓ రకమైన ఫొటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తుంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తుంటాయి. ఈ రేవ్ పార్టీ తీరుతెన్నులు, అక్కడకు వచ్చే వారి వస్త్రధారణ ఫలితంగా టీనేజ్లోనే పెళ్లి కాకుండా ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’లు పెరిగిపోతుండటం ఆందోళనకర అంశమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్దిమంది స్నేహితులు కలిసి చేసుకునే రేవ్ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్ రూమ్స్ వినియోగిస్తున్నారు. కొత్త ట్రెండ్.. డ్రగ్ టూర్స్ రాజధానిలో ఇటీవల కాలంలో డ్రగ్ టూర్స్ పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. టాస్‌్కఫోర్స్, ఎస్ఓటీ, హెచ్–న్యూ, టీఎస్–నాబ్ వంటి ప్రత్యేక వింగ్స్ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై నిఘా పెంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలకు, మాదకద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ఖరీదు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ వినియోగదారులు ప్రత్యేక టూర్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో సిటీకి చెందిన అనేక మంది హైక్లాస్ యూత్ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల పైనా గంజాయి పంజా నగరంలో లభిస్తున్న మాదకద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసే వాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి, ప్యాక్ చేసి, వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హష్ ఆయిల్ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చరస్‌ను సరఫరా చేస్తున్నారు. లీటర్ ఖరీదు అత్యంత లాభదాయకంగా రూ.లక్షల్లో ఉండటంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్ ఆయిల్‌తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ కేరాఫ్ విదేశాలు సింథటిక్ డ్రగ్స్ సౌతాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డి్రస్టిబ్యూటర్లు వీటిని దేశ వ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు. రేటు ఖరారైన తర్వాత బైనాన్స్ లేదా వజీరెక్స్ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో సరుకు పంపిస్తున్నారు. కొరియర్లో అయితే తమ అసలు చిరునామా రాయకుండా వస్తువులు, వ్రస్తాల మాదిరిగా ప్యాక్ చేసి లేదా కాగితాల మధ్యలో ఉంచి పంపిస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో ఎంపిక చేసిన ఓ ప్రాంతంలో డ్రగ్ పార్సిల్ ఉంచి ఆ వివరాలను మెసెంజర్ ద్వారా అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. -
ఈ హీరోయిన్ల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు
సినిమా తర్వాత సినిమా... ఒకేసారి రెండు లేక మూడు సినిమాలు చేసే హీరోయిన్లు హఠాత్తుగా కొత్త సినిమా సైన్ చేయకపోతే? ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ నాయికలు ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ డైరీలో తెలుగు సినిమా లేకపోవడం ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచే విషయం. ప్రస్తుతం తెలుగులో సినిమా సైన్ చేయని నాయికల గురించి తెలుసుకుందాం. గ్యాప్ లేకుండా... అటు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకున్న అనుష్క జోరు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. ఏడాదికి ఐదారు తెలుగు సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నారు. 2021, 2022లో అయితే అనుష్క కనీసం ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఈ ఏడాది నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తానని, తెలుగులో గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతానని అన్నారు అనుష్క. ప్రస్తుతం ‘కథనార్– ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయలేదు. సంవత్సరం విరామం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న సమంత సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడిన ఆమె కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని సినిమాలు చేశారు. ఇక సమంత ఫుల్ స్పీడ్‌తో సినిమాలు చేస్తారని ఆశించిన ఆమె అభిమానుల ఆనందం ఆవిరి అయ్యేట్లు ఏడాది పాటు తాను సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు ప్రకటించారు సమంత. మయోసైటిస్ పూర్తి స్థాయి చికిత్స కోసమే సమంత ఈ బ్రేక్ తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబరు 1న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘ఖుషి’ వంటి హిట్ మూవీ తర్వాత సమంత నటించనున్న తెలుగు సినిమా ఏంటి? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇకపోతే హిందీలో సమంత లీడ్ రోల్లో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్, ‘చెన్నయ్ స్టోరీస్’ (ఇంగ్లీష్–తమిళ్) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండేళ్లు గ్యాప్ సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగులో వరుస చిత్రాలతో తన సత్తా చాటిన ఈ బ్యూటీ రెండేళ్లుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడం విశేషం. క్రిష్ దర్శకత్వం వహించిన ‘కొండపొలం’ చిత్రంలో నటించారు రకుల్. 2021 అక్టోబర్ 8న ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు రకుల్. బాలీవుడ్‌కి పరిమితమై వరుసగా హిందీ సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ‘ఐ లవ్ యు’, ‘మేరీ పత్నీ కా రీమేక్’ చిత్రాలతో పాటు తమిళంలో ‘ఆయ లాన్, ఇండియన్ 2’ చిత్రాలు చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా కనీసం ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది అయినా ఈ బ్యూటీ తెలుగులో తన జోరు చూపిస్తారేమో చూడాలి. కొత్త సినిమా ఎప్పుడు? తెలుగు పరిశ్రమలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు కృతీ శెట్టి. తొలి సినిమా ‘ఉప్పెన ’(2021) తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారీ బ్యూటీ. గత ఏడాది (2022) కృతీ శెట్టి నటించిన ‘బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు రిలీజయ్యాయి. ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రం ‘కస్టడీ’ ఒక్కటే రిలీజ్ అయింది. ఆ చిత్రం విడుదలై ఆర్నెల్లు దాటినా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు కృతి. తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంలో ‘అజయంతే రందం మోషణం’, తమిళంలో ‘జెనీ’ సినిమాలు చేస్తున్నారు. మరి.. కృతీ డైరీలో కొత్త తెలుగు సినిమా చేరేది ఎప్పుడు? ఈ ఏడాది ‘దసరా, భోళా శంకర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కీర్తీ సురేశ్. ఆ చిత్రాల తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించని కీర్తి తమిళంలో నాలుగు సినిమాలు చేçస్తున్నారు. ఆమె నటించనున్న తదుపరి తెలుగు సినిమా ఏంటి? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు పూజా హెగ్డే. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా ఎంపికైనా ఎందుకనో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారీ బ్యూటీ. అలాగే ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నభా నటేశ్ ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాలు చేశారు. అయితే ‘మాస్ట్రో’ (2021) తర్వాత ఇప్పటివరకూ ఆమె మరో తెలుగు సినిమాపై ఎలాంటి సమాచారం లేదు. అదే విధంగా మెహరీన్, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్ల జోరు కూడా తెలుగులో తగ్గింది. మెహరీన్ ఈ ఏడాది ‘స్పార్క్’ (తెలుగు–తమిళ్) లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నటించే తెలుగు సినిమాపై క్లారిటీ లేదు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ‘రావణాసుర’ చిత్రం తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్ ఏ తెలుగు సినిమాలోనూ నటించడం లేదు. అలాగే నిధీ అగర్వాల్ చేతిలోనూ ‘హరిహర వీరమల్లు’ మినహా మరో తెలుగు సినిమా లేదు. ఈ సినిమా ఎప్పుడో ఒప్పుకున్నారామె. అయితే షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత వేరే ఏ తెలుగు సినిమా కూడా ఆమె కమిట్ కాలేదు. -
ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే
మలయాళ ప్రుమఖ నటి అపర్ణ నాయర్ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆమె ఆగష్టు 31 రాత్రి 7 గంటలకు కేరళ, తిరువనంతపురంలోని కరమణ తలియాల్లో ఉండే తన ఇంట్లో అచేతన స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అపర్ణ మృతి పట్ల విచారించిన పోలీసులు.. భర్తతో గొడవల కారణంగానే ఆమ ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు. భర్త అతిగా తాగడం, ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్లే అపర్ణ ఆత్మహత్య చేసుకుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవని నివేదిక పేర్కొంది. ఇంట్లో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని అపర్ణ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు అపర్ణ తన తల్లికి వీడియో కాల్ చేసి ఇంట్లోని సమస్యల గురించి విలపించినట్లు సమాచారం. నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అపర్ణ.. తన అమ్మగారితో కొంత సమయం మాట్లాడి ఫోన్ కట్ చేసింది. ఈ వీడియో కాల్ ఆగష్టు 31 సాయంత్రం 6 గంటలకు జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. (ఇదీ చదవండి: మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్!) ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సంజిత్ గుర్తించి వెంటనే అపర్ణ తల్లి బీనా, సోదరి ఐశ్వర్యలకు సమాచారం అందించాడు. దీని ఆధారంగా ఐశ్వర్య వెంటనే అక్కడికి చేరుకునే సరికి అపర్ణ మంచంపై పడి ఉంది. వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అపర్ణకు రెండో పెళ్లి అపర్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం సంజిత్ను పోలీసులు విచారిస్తున్నారు. అపర్ణ, సంజిత్లకు ఇది రెండో వివాహం. అపర్ణకు మొదటి వివాహం నుంచి ఒక కుమార్తె ఉండగా.. ఆమెకు సంజిత్‌కు జన్మించిన మూడేళ్లు కుమార్తె ఉంది. మొదట్లో వీరి జీవితం బాగానే సాగినా భర్త అతిగా తాగడం వల్ల తరచూ గొడవలు జరిగేవి. అపర్ణ తన బంధువులకు చాలాసార్లు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని బంధువులు తెలిపారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా సుమారు 50 పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. -
Aparna Nair: 50 పైగా సినిమాలతో మెప్పించిన ప్రముఖ నటి మృతి.. పలు అనుమానాలు
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణవార్త అక్కడ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ పరిశ్రమలో సినీ నటి మరణవార్త కలిచి వేసింది. మలయాళంలో సుమారు 50 సినిమాలతో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్‌తో చురుగ్గా ఉండే నటి అపర్ణా నాయర్ (33).. తెలుగులో కూడా 'చిన్ని చిన్ని ఆశ' అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆమె నిన్న (ఆగస్టు 31) రాత్రి 7 గంటలకు రాజధాని తిరువనంతపురంలోని కరమణ తలియాల్లోని తన ఇంట్లో మృతి చెందారు. కానీ ఆమె మరణానికి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే) అపర్ణ మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా నాయర్ మలయాళం సినిమాలు, సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఆమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనేది నిజం.. దీంతో ఆమె అభిమానులు తీవ్ర శోకంలో ఉన్నారు. అపర్ణ మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నటుడు సంజిత్ను ఆమె వివాహం చేసుకుంది. వారికి త్రయ, కృతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) ఇప్పటికే ఆమె మృతిపై కరమన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో నటి మృతికి గల కారణాలు తెలుపాతమని చెప్పారు. అపర్ణా నాయర్ తిరువనంతపురంలో ఉండేవారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆమె తల్లి, సోదరి ఉన్నట్లు సమాచారం. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న అపర్ణను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కూతురిని పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపర్ణ మృతికి అభిమానులు సంతాపం నటి అపర్ణ మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను, సన్నిహితులను తీవ్ర వేదనకు గురిచేసింది. నటి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో అరంగేట్రం చేసి, ఆ తర్వాత రన్ బేబీ రన్, సెకండ్స్, అచ్చయాన్స్, మేఘతీర్థం, ముద్దుగౌ, కార్ట్ సమక్షమ బాలన్ వాకిల్, కల్కి వంటి అనేక చిత్రాలతో పాటు చందనమజ, ఆత్మసఖి సీరియల్స్‌లో నటించారు. -
ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు. ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు? -
20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది. అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 20 ఏళ్లలో తొలిసారి ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్ స్టైలిష్ యెన్ మే వుయెన్‌కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. అత్యంత కఠిన చట్టాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. -
'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం'
టాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో జర్నీ మొదలుపెట్టిన జేడీ చక్రవర్తి తాజాగా మర్డర్ మిస్టరీగా రూపొందిన 'దయ' వెబ్‌సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిస్నీ + హాట్‌స్టార్‌లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా,విష్ణు ప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా పాల్గొని పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్) జేడీ గురించి చెబుతూ.. 'చాలా ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర అర్థరాత్రి సమయంలో హీరోయిన్ రంభ తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం. అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ కటౌట్ చాలా పెద్దది పెట్టారు. అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి చూసొచ్చిన బ్యాచ్ మాది. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్ వీడు' అంటూ ఉత్తేజ్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. జేడీకి సినిమాలంటే పిచ్చి. దర్శకత్వం అని ఎదో కొంచెం రూట్ మార్చాడు కానీ లేదంటే టాప్ హీరోలలో జేడీ కూడా ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్ తెలిపాడు. ఒకరకంగా చెప్పాలంటే జేడీ టాలీవుడ్ అమిర్‌ఖాన్ అంటూ ప్రశంసించాడు. అతనికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు. ఏ సినిమా గురించి అయినా కానివండి అర్దరాత్రి అడిగినా.. ఆ సినిమాకు సబంధించిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇలా పేర్లన్నీ చెప్పేస్తాడని పేర్కొన్నాడు. అంతలా అతనిలో సినిమా గురించి నాలెడ్జి ఉందని తెలిపాడు. బొంబాయి వెళ్లి 'సత్య' చేసినా... హైద్రాబాదులో 'బొంబాయి ప్రియుడు' చేసినా... అతనికి సినిమా తప్ప ఇంకేమి తెలియదని జేడీ గురించి ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. -
'సామజవరగమన' మూవీ హీరోయిన్ ‘రెబా మోనికా జాన్’(ఫోటోలు)
-
షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్ చేసిన హీరోయిన్
కోలీవుడ్‌లో మంచి స్థానం కోసం పోరాడుతున్న నటీమణులలో స్మృతి వెంకట్ ఒకరు. మొదట్లో హీరోలకు సిస్టర్ పాత్రలో నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు కథానాయికగా నటించే స్థాయికి ఎదిగింది. దీంతో సాదాసీదాగా నటిస్తే ప్రయోజనం ఉండదని గ్రహించిందేమో, అందాలారబోతతోనే కాకుండా ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాలకు సిద్ధమైపోయింది. అదీ చిత్ర షూటింగ్‌కు ముందే ఆ చిత్ర హీరోతో ఘాటు చుంబనానికి రెడీ అయిపోయారు. దీంతో మూవీ లోకేషన్‌లోని వారు ఆశ్చర్యానికి గురయ్యారట. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) ఇంతకుముందు 'దేజావు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం తరుణం. ఈ చిత్రంలో కిషన్‌దాస్ కథానాయకుడుగాను, స్మృతి వెంకట్ నాయకిగానూ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే అంతకుముందే ఒక టీజర్‌ను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో స్మృతి వెంకట్, కిషన్దాస్తో లిప్‌లాక్ సన్నివేశంతో కూడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో నెటిజనుల స్మృతి వెంకట్‌పై రకరకాల సైటెర్లు వేస్తున్నారు. టీజర్లోనే ఇంత ఘాటు చుంబనాల సన్నివేశం ఉంటే ఇంకా మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద దర్శకుడు టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేశారు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
సినిమాలతోనే కాదు సైడ్ బిజినెస్‌తోనూ కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్లు
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ప్రకారం ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో కూడా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. మరో వైపు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి సినిమాల్లో నటిస్తూనే వ్యాపారాలు చేస్తున్న ముద్దుగుమ్మలెవరు, వారి బిజినెస్‌లు ఏమిటనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. కీర్తి సురేష్: నేను శైలజ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న మహానటి కీర్తి సురేష్ సినిమాల్లో మాత్రమే కాకుండా.. 'భూమిత్ర' అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతోంది. ఇది పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్దమైన ఔషధాలతో స్కిన్ కేర్ ఉత్పత్తులను చేసే బ్రాండ్. కాజల్ అగర్వాల్: లక్ష్మీ కల్యాణంతో కుర్రకారు మనసు దోచిన కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో పాపులర్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదిస్తున్న ఈ అమ్మడు తన చెల్లెలితో కలిసి మర్సాలా అనే జ్యువెలరీ ప్రారంభించి రెండు చేతుల్లోనూ సంపాదిస్తోంది. శ్రియా శరణ్: నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం చెరగని అందంతో సినీ ప్రపంచంలో తిరుగులేని గుర్తింపు పొందిన శ్రియా శరణ్ ‘శ్రీ స్పందన’ స్పా స్థాపించి అటు సినిమాల్లో ఇటు బిజినెస్ పరంగా కూడా బాగా సంపాదిస్తోంది. ఇది భారతదేశంలో ఉన్న ప్రముఖ స్పా కంపెనీలలో ఒకటి కావడం విశేషం. ఇలియానా: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తన కంటూ ఒక ప్రత్యేక క్రేజుని సంపాదించిన గోవా భామ ఇలియానా ప్రస్తుతం బిజినెస్ మీదనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. అంతే కాకుండా ఈమె సొంతంగా డిజైన్ లేబుల్ నడుపుతున్నట్లు సమాచారం. శృతి హాసన్: రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన శృతి హాసన్ సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ రంగంలో కూడా తనదైన రీతిలో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఈమె ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్ సంస్థతో బాగా ఆర్జిస్తోంది. ప్రణీత సుభాష్: అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ పొందిన హీరోయిన్స్‌లో ఒకరు ప్రణీత సుభాష్. బావా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఈమె బెంగళూరులో ఒక రెస్టారెంట్ ప్రారంభించి, ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా రెస్టారెంట్ బ్రాంచిలను బాగా సంపాదిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్: కెరటం సినిమాతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన రకుల్.. కరెంటు తీగ మొదలైన సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు పొందింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు F45 ఫిట్నెస్ హెల్త్ హబ్ జిమ్ సెంటర్ ప్రారభించింది. ఫిట్ నెట్ విషయంలో ముందుండే రకుల్ ఈ జిమ్ సెంటర్లను ఇతర నగరాల్లో కూడా ప్రారంభించింది. తమన్నా భాటియా: 100% లవ్ సినిమాతో అందరిని ఆకట్టుకుని బాహుబలి సినిమాతో మరింత ప్రత్యేక గుర్తింపు పొందిన మిల్క్ బ్యూటీ తమన్నా ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు 'వైట్ అండ్ గోల్డ్' పేరుతో జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించింది. 2015లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఇప్పటికి కూడా సజావుగా ముందుకు సాగుతోంది. తాప్సీ పన్ను: ఝుమ్మందినాదం సినిమాతో ముద్దు ముద్దుగా అలరించిన ఈ అందాల భామ చిన్న వయసునుంచే మోడలింగ్ రంగంలో గుర్తింపు పొందింది. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి అవకాశాలను పొందుతోంది. అంతే కాకుండా ఈమె చెల్లి షాగన్, స్నేహితుడు ఫరాహ్హ్ తో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించి ఎంతోమంది సెలబ్రిటీలకు పెళ్లి చేసింది. -
సరిహద్దులో డ్రగ్స్ డ్రోన్ కూల్చివేత
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మాదకద్రవ్యాల డ్రోన్‌ను కూల్చివేశారు. బీఎస్ఎఫ్ సిబ్బంది, పంజాబ్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. కక్కార్ గ్రామంలో 6 రెక్కలున్న డ్రోన్ ఎగురుతున్నట్లుగా గుర్తించామని, వెంటనే ఏకే–47 నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపి కూల్చివేశామని, ఇందులో 5 కిలోల హెరాయిన్ లభ్యమైందని అధికారులు ఆదివారం వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందన్నారు. డ్రోన్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్‌లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్‌ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
ముంబై విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఏకంగా 47 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు.. ఈ కేసులోని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ జోనల్ యూనిట్ అధికారులు శుక్రవారం విమనాశ్రయంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 31.29 కోట్ల విలువగల 4.47 కిలోల హెరాయిన్.. అలాగే 15.96 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మొత్తం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కెన్యాలోని నైరోబీ మీదుగా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ వ్యక్తిని చెక్ చేయగా.. 4.47 కిలోగ్రాముల హెరాయిన్‌తో పట్టుబడినట్లు తెలిపారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన హెరాయిన్‌ను 12 డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచనా వేస్తున్నారు మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ స్కాన్ చేయడంతో అనుమానాస్పద బటన్లు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కుర్తా బటన్లు పక్కపక్కనే ఉండి ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. బట్లను తీసి పరిశీలించగా 1.59 కిలోగ్రాముల కొకైన్ లభించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలో ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే! #Mumbai customs department has arrested an Indian passenger at #Mumbaiairport while smuggling #Cocaine worth ₹16crore from Addis Ababa to Mumbai. The drugs were ingeniously concealed in the buttons of ladies kurtas, bags by creating false cavities@mumbaicus3 @htTweets @HTMumbai pic.twitter.com/bCTYqOL2Lm — Vijay Kumar Yadav (@vijaykumar1927) January 6, 2023 -
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
సమంత వెనుక కుట్ర జరుగుతుందా ..?
-
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత..రూ.100 కోట్లకు పైగా
ముంబై: ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి నిషేధిత మత్తుపదార్థం హెరాయిన్‌ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్రికా దేశమైన మలాయ్ నుంచి వయా ఖత్తర్ దేశం మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు భారీ ఎత్తున హెరాయిన్‌ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 16 కేజీల హెరాయిన్ బయటపడింది. అధికారులు దానిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ నిమిత్తం అతడిని డీఆర్ఐ కస్టడీకి అనుమతినిచ్చింది. కాగా, తనిఖీల్లో పట్టుబడ్డ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మాదకద్రవ్యాన్ని డెలివరీ తీసుకునేందుకు ఢిల్లీలోని హోటల్ నుంచి వచ్చిన ఓ మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈమెను ఘనాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
మెస్మరైజ్ చేస్తోన్న కోమలీ ప్రసాద్ (ఫొటోలు)
-
‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరోయిన్ రజిషా విజయన్ (ఫొటోలు)
-
రూ. 54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్‌తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్‌గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మామూలుగా తెస్తే లక్షన్నర.. కడుపులో దాస్తే 3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో చూపించినట్టు ఒకడు విగ్గులో పట్టుకొస్తాడు, మరొకడు కడుపులో దాచుకొని తెస్తాడు, ఇంకొకడు వాటర్ బాటిల్ లేబుల్‌లో తరలిస్తాడు. ఇలా ఎక్కడో దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి డ్రగ్స్‌ను విదేశాలకు తరలించేందుకు డ్రగ్స్ మాఫియా రకరకాల ఐడియాలేస్తోంది. కొన్నిసార్లు స్మగ్లింగ్ చేసేందుకు శిక్షణ ఇచ్చి మరీ పంపిస్తోంది. ఒక్కో ట్రిప్‌కు రూ.లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ముట్టజెబుతోంది. ఇలా అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ విభాగాలు ఎక్కడికక్కడ పట్టుకుంటున్నాయి. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.200 కోట్ల విలువగల కొకైన్, హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాలను సీజ్ చేశాయి. ట్రిప్‌కు లక్షన్నర నుంచి 3 లక్షలు దక్షిణాఫ్రికా, నైరోబి తదితర ఆఫ్రికా దేశాల్లో పేద కుటుంబాల్లోని మహిళలు, మధ్య వయసు వారిని డ్రగ్స్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సూట్‌కేసు, ఇతర పద్ధతుల్లో తెచ్చే వారికి ప్రతి ట్రిప్‌కు రూ. లక్షన్నర, కడుపులోకి పెట్టుకొని తీసుకొచ్చే వారికి రూ. 3 లక్షల వరకు ఇస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెట్టుకొని డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తంలో దొరక్కుండా స్మగ్లింగ్ చేయొచ్చని, పైగా దీని వల్ల ప్రాణాలకు ప్రమాదమూ ఎక్కువ కాబట్టి ఎక్కువగా డబ్బులిస్తున్నారని వెల్లడైంది. పైగా కడుపులోకి పెట్టుకొని తీసుకువచ్చే వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్టు కూడా డీఆర్ఐ గుర్తించింది. స్మగ్లింగ్ చేసే వాళ్లకు విమాన చార్జీలు, వసతి సౌకర్యాలు కాకుండానే ఈ సొమ్ము ఇస్తారని వెల్లడైంది. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి? దక్షిణాఫ్రికా, నైరోబి తదితర చుట్టుపక్కల ఆఫ్రియా దేశాల నుంచి వయా దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు టాంజానియా, మలావియన్ దేశస్థులు డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు. దక్షిణఫ్రికాలోని ప్రిటోరియా, జోహెన్నస్‌బర్గ్ తదితర ప్రాంతాలకు వ్యక్తులను తీసుకెళ్లి కొకైన్, హెరాయిన్‌ను టాబ్లెట్ల రూపంలో లేదా మరో రూపంలో ఇచ్చి స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ప్రాణం పోయే ప్రమాదముందని తెలిసినా కొందరు డ్రగ్స్‌ను కడుపులో దాచుకొని 3, 4 రోజులు ప్రయాణించి డెలివరీ స్థానానికి చేరవేస్తున్నారు. పట్టుబడ్డ వ్యక్తులకు డ్రగ్స్ ఎక్కడికి చేరుతుందో పూర్తి వివరాలు తెలియట్లేదని డీఆర్ఐ వర్గాలు చెప్తున్నాయి. డ్రగ్స్‌ను తరలిస్తూ పట్టుబడ్డారని తెలిసినా పేదరికం, మరోదారి లేక డ్రగ్స్‌ను చేరవేస్తున్నారని అంటున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుతున్న డ్రగ్స్‌ను తమిళనాడు, విశాఖపట్నం తదతర సముద్రతీర ప్రాంతాల ద్వారా ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ తదితర దేశాలకు తరలిస్తున్నట్టు డీఆర్ఐ అనుమానిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచే ఎక్కువగా.. డ్రగ్స్ కేసుల్లోని నిందితులు దక్షిణాఫ్రికా నుం చి హైదరాబాద్ వచ్చినవారే కావడం ఆందో ళన కలిగిస్తోంది. ఈ నెల 1న దక్షిణాఫ్రికా దేశస్థుల నుంచి రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏప్రిల్‌లో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ టాబ్లెట్లు, రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. గతేడాది జూన్‌లో రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ పట్టుబడగా, ఆ నెలలోనే మరో కేసులో రూ.19.5 కోట్ల విలువైన 3 కేజీల హెరాయిన్ పట్టుబడిం ది. భారీగా పట్టుబడిన కేసుల్లోని డ్రగ్స్ విలు వ దాదాపు 200 కోట్లుంటే, చిన్నిచితకా కేసులన కలిపితే మరో రూ. 50 కోట్ల మేర ఉం టుందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. -
రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్‌లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు. వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్ పాకిస్తాన్‌కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి హెరాయిన్‌తో వచ్చిన మలావీ దేశ జాతీయురాలిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 21.9 కోట్ల విలువైన 3.129 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె క్యారియర్ అని, ఈ డ్రగ్‌ను తీసుకొనే రిసీవర్లు ఎవరనేది గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తు న్నామని డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా రెక్కీ అనంతరం... మలావీకి చెందిన మహిళను బిజినెస్ వీసాపై కొన్ని రోజుల క్రితం నైరోబీకి పిలిపించిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా... రెక్కీ కోసం అక్కడ నుంచి రెండుసార్లు ఆమెను హైదరాబాద్‌కు పంపి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగి వెనక్కు రప్పించింది. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న మాఫియా సూత్రధారులు శుక్రవారం 3.129 కేజీల హెరాయిన్‌ను ఆమెకు అప్పగించారు. దీన్ని రెండు పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి ట్రాలీ బ్యాగ్ కింది వైపు ఏర్పాటు చేసిన రహస్య అరలో ఉంచారు. స్కానింగ్‌లోనూ హెరాయిన్ ఉనికి బయటపడకుండా నల్లరంగు పాలిథిన్ సంచులను వాడారు. ఈ బ్యాగ్‌తో నైరోబీ నుంచి బయలుదేరిన మలావీ జాతీయురాలు తొలుత దోహాకు.. అక్కడి నుంచి సోమవారం శంషాబాద్‌కు చేరుకుంది. అయితే ఆమె బిజినెస్ వీసాపై నైరోబీ నుంచి రావడం, గతంలోనూ రెండుసార్లు వచ్చివెళ్లడంతో డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్ లభ్యమైంది. ఆ మహిళను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో హెరాయిన్ తయారీ?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తయారు చేస్తున్నారా? మూతపడిన ఫార్మా పరిశ్రమలను ఇందుకు కేంద్రంగా మార్చుకుంటున్నారా? నగరంలో పెరుగుతున్న డ్రగ్స్ డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని అక్రమార్జనపై దృష్టి పెట్టారా? అనే కోణంలో రాచకొండ పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఇప్పటివరకు గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాల నుంచి నిందితులు అక్రమ మార్గాల ద్వారా హెరాయిన్‌ను దిగుమతి చేసి నగరంలో విక్రయించేవాళ్లు. కానీ తాజాగా హెరాయిన్‌ను తయారు చేసేందుకు అవసరమైన ముడిపదార్థం ‘పాపి స్ట్రా కాన్సన్ట్రేట్’ను తరలిస్తున్న ఇద్దరు పంజాబీలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో స్థానిక కస్టమర్లకు పాపి స్ట్రానే విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపినా.. ఇది ఎవరి నుంచి కొనుగోలు చేశారు? ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మహేశ్వరంలో పాపి స్ట్రాకాన్సన్ట్రేట్ మొక్కలను పెంచుతున్న పలువురు నిందితులను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు పంజాబ్ నుంచి నగరానికి పాపిస్ట్రాను తరలిస్తూ ఇద్దరు పట్టుబడటంతో పోలీసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో పాపి స్ట్రా డ్రగ్ పట్టుబడటం ఇదే తొలిసారి కాగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రంజిత్‌సింగ్‌ను పట్టుకుంటే విలువైన సమాచారం బయట పడుతుందని భావిస్తున్నారు. సెల్‌ఫోన్ కాంటాక్టుల పరిశీలన మేడ్చల్‌లోని కండ్లకోయ టోల్ ప్లాజా వద్ద దాబా నిర్వహిస్తున్న ఇద్దరు పంజాబీలు జగ్తార్ సింగ్, జైమాల్ సింగ్‌ల నుంచి రూ.15 లక్షల విలువ చేసే పాపి స్ట్రా కాన్సన్ట్రేట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇప్పటివరకు ఎంత మందికి విక్రయించారు? కొనుగోలుదారులు ఎవరనేది విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నిందితుల సెల్ఫోన్లలోని కాంటాక్ట్‌లు, వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మందుల తయారీకి ‘పాపి స్ట్రా’ పెంపకం పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో పాపి స్ట్రా మొక్కల పెంపకానికి కేంద్రం లైసెన్స్ ఇచ్చిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. అయితే దీన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పర్యవేక్షణలోనే పెంచాల్సి ఉంటుంది. కాపుకొచ్చాక మొక్కలోని ఓపియం, ఇతరత్రా భాగాలను మందుల తయారీలో వినియోగిస్తుంటారు. అయితే ముడి పాపి స్ట్రా కాన్సన్ట్రేట్కు కొన్ని రకాల రసాయనాలను కలిపితే ముందుగా మార్ఫిన్, ఆ తర్వాత మరికొంత కెమికల్ కలిపితే ఖరీదైన హెరాయిన్ తయారవుతుందని పోలీసు అధికారి వివరించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో గ్రాముకు రూ.9–10 వేలుగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూతపడిన ఫార్మా పరిశ్రమల్లో హెరాయిన్ తయారీ ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మాదక ద్రవ్యాలతో పోలిస్తే పాపి స్ట్రాలో మత్తు గాఢత తక్కువగా ఉంటుంది. -
రు.600 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ మాదక ద్రవ్యాలను గుజరాత్ ఉగ్ర వ్యతిరేక బృందం స్వాధీనం చేసుకుంది. కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని దేశానికి తరలించేందుకు పాకిస్తాన్‌కు చెందిన జహీద్ బషీర్ బలూచ్ అనే వ్యక్తి నుంచి 120 కేజీల హెరాయిన్‌ను ఈ ముగ్గురు తెప్పించారని పోలీసులు వెల్లడించారు. మోర్బీ జిల్లాలోని జింజువా గ్రామంలో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆశిశ్ భాటియా చెప్పారు. -
తెలిసే డ్రగ్స్ తెస్తున్నాడు..ఉరితీస్తామంటూ అతని తల్లికి కబురు!
సింగపూర్: మాదకద్రవ్యాలను తమ దేశంలోకి తెస్తున్నాడనే ఆరోపణలపై భారతీయ మూలాలున్న మలేసియన్ నాగేంద్రన్ కె.ధర్మలింగంకు ఉరిశిక్ష ఖరారుచేయడాన్ని సింగపూర్ ప్రభుత్వం మరోసారి సమర్థించుకుంది.హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న సమయంలో అతని మానసిక స్థితి సరిగానే ఉందని సింగపూర్ హోం శాఖ స్పష్టంచేసింది. నేరం చేస్తున్నాననే విషయం ఆనాడు అతనికి తెలుసని, అప్పుడు అతనికి మానసిక ఆరోగ్యం బాగానే ఉందనే సాక్ష్యాలను హైకోర్టు పరిశీలించిందని హోం శాఖ పేర్కొంది. వచ్చే బుధవారం అక్కడి చాంగి జైలులో నాగేంద్రన్ను ఉరితీయనున్నారు. మానసిక దివ్యాంగుడైన నాగేంద్రన్‌పై నేరాభియోగాలు మోపి అక్రమంగా ఉరితీస్తున్నారని ఆన్లైన్ వేదికగా వేలాదిమంది ఉద్యమిస్తున్నారు. శిక్షకు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ ఆన్లైన్లో సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది. శనివారం నాటికి ఏకంగా 56,134 సంతకాలను సేకరించారు. పదో తేదీన మీ కుమారుడిని ఉరితీస్తామంటూ అతని తల్లికి జైళ్ల శాఖ కబురుపెట్టడంతో ఉరిశిక్ష అమలు చేయబోతున్న విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కసారిగా సింగపూర్‌లో నిరసన పెల్లుబికింది. మానవహక్కుల సంఘాలు సింగపూర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మలేసియా నుంచి సింగపూర్‌కు 2009 ఏడాదిలో 42.72 గ్రాముల హెరాయిన్‌ను తరలిస్తున్నాడనే ఆరోపణలపై నాగేంద్రన్ను అరెస్ట్‌చేసి 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించడం తెల్సిందే. 15 గ్రాములకు మించి హెరాయిన్‌ను సింగపూర్‌లోకి తీసుకొస్తే దానిని నేరంగా అక్కడ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. -
పుష్పక విమానం’ హీరోయిన్ శాన్వీ మేఘన బ్యూటిఫుల్ ఇమేజస్
-
బాబుకు లీగల్ నోటీసు
సాక్షి, అమరావతి: డ్రగ్స్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు, పోలీస్ శాఖ ఎన్నిసార్లు తేల్చి చెప్పినా విపక్ష నేతలు పట్టించుకోకుండా పదేపదే అవే అబద్ధాలను వల్లించడం, అనుకూల మీడియాలో అవాస్తవాలను ప్రచురించడం, తిరిగి వాటిని ప్రచారంలోకి తెస్తున్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో డీజీపీ న్యాయాస్త్రాన్ని సంధించారు. రాష్ట్రం, పోలీస్‌శాఖ ప్రతిష్టను మసకబార్చవద్దని సామరస్య పూర్వకంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయకపోవడంతో న్యాయబద్ధంగానే దీన్ని ఎదుర్కోవాలని, కుట్రలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించి లీగల్ నోటీసులు జారీ చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై ‘న్యాయ అస్త్రాన్ని’ ప్రయోగించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర పార్టీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు డీజీపీ సవాంగ్ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే లీగల్ నోటీసులిచ్చినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతతోపాటు మీడియా సంస్థలపై డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఇలా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఇదే తొలిసారి... సాధారణంగా సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రతిపక్ష నేతకు లీగల్ నోటీసులు జారీ చేయాల్సిన అనివార్యత తలెత్తదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అనివార్యంగా న్యాయాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. విపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారి అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు తిరిగి వాటినే వల్లె వేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన దాఖలాలు లేవు. గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఏపీకి ముడిపెడుతూ విపక్షాలు దుష్ప్రచారానికి తెగించాయి. ఆ హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాతో బురద చల్లుతూనే ఉన్నారు. డీజీపీ సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబులోగానీ ఆ రెండు పత్రికల యాజమాన్యాల్లో గానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేనందున న్యాయ పోరాటం ద్వారానే ఈ కుట్రలను బహిర్గతం చేయాలని డీజీపీ నిర్ణయించుకుని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు, ఎడిటర్లు, పాత్రికేయులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బురద రాజకీయ లబ్ధి కోసం యావత్ పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు విపక్ష టీడీపీ కుతంత్రాలకు తెగిస్తోంది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖపై దుష్ప్రచారానికి పాల్పడుతోంది. టీడీపీ అనుకూల మీడియా దీనికి కొమ్ము కాస్తోంది. నిరాధార ఆరోపణలను ప్రముఖంగా ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా – గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలోని సంస్థలదే’.. ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’ .. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’... ఇలా పలు రకాలుగా చంద్రబాబు, లోకేశ్ నిరాధారణ ఆరోపణలు చేశారు. వాటిని అవే శీర్షికలతో ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి’.. ‘డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు: చంద్రబాబు ధ్వజం’ అంటూ విపక్ష నేత చేసిన అసత్య ఆరోపణలను ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగా ప్రముఖంగా ప్రచురించింది. కుట్రలపై జాతీయస్థాయిలో చర్చ పోలీస్ శాఖ ప్రతిష్టను పరిరక్షించేందుకు డీజీపీ సవాంగ్ న్యాయపరమైన చర్యలకు సమాయత్తమవడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అనివార్యంగా అంతటి నిర్ణయం తీసుకునేందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా అంతా దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన మీడియా సంస్థలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు సహకరిస్తుండటం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి పక్కన సంస్థే హెరాయిన్ దిగుమతి చేయించిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, టీడీపీ అనుకూల మీడియా దానికి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేస్తుండటాన్ని దేశమంతా గుర్తించింది. ఈ కుట్రలను ఎండగట్టేందుకు డీజీపీ సరైన నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
బెజవాడ అడ్రస్‌తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..
సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్‌కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. విజయవాడకు సంబంధమే లేదు... ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్‌వాసులు, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ మహిళను డీఆర్ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమీషన్ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ రాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్‌ను డీఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్‌లో కూడా అఫ్గానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్‌ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్‌ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు గుజరాత్లో హెరాయిన్ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది. స్మగ్లింగ్ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్‌లోని ముఠా సభ్యులతో ఫోన్లో మాట్లాడి హెరాయిన్‌ను గుజరాత్ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్ కేసులు విచారించే డీఆర్ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. -
ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
అపోహల సృష్టికే ఏపీలో వదంతులు
సాక్షి, అమరావతి: గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఇటీవల జప్తుచేసిన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినా.. ప్రతిపక్ష పార్టీలు, ఓ సీనియర్ నాయకుడు (చంద్రబాబును ఉద్దేశించి) పదేపదే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా అపోహలు సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజనిజాలు బేరీజు వేసుకోవాలన్న విచక్షణను ప్రతిపక్ష పార్టీలు మరచిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముంద్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో విజయవాడకు, రాష్ట్రానికిగానీ అస్సలు సంబంధం లేదని విజయవాడ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ముంద్రా, చెన్నై, ఢిల్లీ, నోయిడాలలోనే హెరాయిన్ స్వాధీనాలు, అరెస్టులు చేశారని జాతీయ పత్రికలు, చానళ్లు కూడా ప్రముఖంగా ప్రసారం చేసిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. ఆ నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవని డీఆర్ఐతోపాటు కేంద్ర సంస్థలు ధ్రువీకరిస్తున్నా సరే సీనియర్ నాయకుడినని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది తప్ప రాష్ట్రంలో ఇసుమంతైనా కార్యకలాపాలు జరపలేదని పునరుద్ఘాటించారు. అసత్య ప్రకటనలు మానుకోవాలి హెరాయిన్‌ను విజయవాడకుగానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకుగానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఆర్ఐ అధికారులు స్పష్టంచేసిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకుంటుండగా తనిఖీలు చేసి జప్తు చేశామని మాత్రమే డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, ఇతర కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని కూడా సవాంగ్ చెప్పారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలని ఆయన కోరారు. హెరాయిన్ స్మగ్లింగ్ వంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు రాష్ట్రంలో బహిరంగ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మహిళల భద్రత, ఘర్షణల నివారణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి డీజీపీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగ నియామవళిలో బహిరంగ మద్యసేవనం నిరోధాన్ని కూడా చేర్చాలని కోరారు. దీనిపై సవాంగ్ స్పందిస్తూ.. బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను పటిష్టపరిచామన్నారు. -
విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సాక్షి, విజయవాడ: హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని అన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో తప్పు ఎవరిదో నిర్ధారిస్తామని అన్నారు. ఎంతటివారున్నా సీఎం జగన్ విడిచి పెట్టారని పేర్కొన్నారు. -
చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్
సాక్షి, అమరావతి: హెరాయిన్ సిండికేట్ సూత్రధారుల కేంద్ర స్థానం ఢిల్లీ. చెన్నైలో ఉండే పాత్రధారులు కథ నడిపిస్తుంటారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ సరఫరా అవుతుండగా.. ఇరాన్ మీదుగా గుజరాత్‌కు దిగుమతి అవుతోంది. ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో దానిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద హెరాయిన్ రాకెట్ ఈ దందా నడిపిస్తోంది. కానీ.. ఈ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని విజయవాడ పేరును వాడుకుంటోంది. వెలుగులోకి విభ్రాంతికర వాస్తవాలు గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీస్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ, కేంద్ర, రాష్ట్రాల పోలీసు వ్య వస్థల కళ్లుగప్పి దర్జాగా హెరాయిన్ దందా సాగిం చేందుకు ఈ సిండికేట్ వ్యూహాత్మకంగా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసిందని గుర్తించారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ దిగుమతి చేసిన ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని ఓ ఇంటి చిరునామాతో రిజిస్టర్ కావడంతో ఈ కేసు రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది. కాగా, హెరాయిన్ దందాతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం డీఆర్ఐ అధికారులను, పోలీసులను తప్పుదా రి పట్టించేందుకే విజయవాడ చిరునామాను ము ఠా వాడుకుందని వెల్లడైంది. గుజరాత్‌కు చేరిన భా రీ హెరాయిన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన అఫ్గాన్ జా తీయులు కొందర్ని డీఆర్ఐ అధికారులు అహ్మదా బాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన స మాచారం ఆధారంగా చెన్నైలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు దేశంలో వేళ్లూనుకున్న హెరాయిన్ దందా తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అఫ్గాన్ నుంచి.. ఇరాన్ మీదుగా.. దేశంలో హెరాయిన్ సిండికేట్ పక్కా ప్రణాళికతో అఫ్గానిస్తాన్ నుంచి దేశంలోకి భారీగా హెరాయిన్ ను దిగుమతి చేసుకుంటోందని డీఆర్ఐ తనిఖీల్లో వెల్లడైంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కొన్ని రోజులుగా డీఆర్ఐ అధికారులు జరుపుతున్న విస్తృ త తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4,500 కోట్లు ఉంటుం దని మొదట భావించగా.. ఆదివారానికి రూ.9 వేల కోట్లుగా తేలింది. సోమవారం తనిఖీలు పూర్తయ్యేసరికి ఆ హెరాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.21 వేల కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చెందిన ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ నెల 13, 14 తేదీల్లో ఈ హెరాయిన్ కన్సైన్మెంట్లను ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్ చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి గుజరాత్‌కు తరలించింది. టాల్కం పౌడర్ పేరిట భారీగా హెరాయిన్ ప్యాకెట్లను నౌకల్లో గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేర్చింది. ఢిల్లీలో సూత్రధారులు.. చెన్నైలోపాత్రధారులు సిండికేట్ సూత్రధారులు ఢిల్లీలోనూ, పాత్రధారులు చెన్నైలోనూ ఉంటూ ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో తేలింది. గుజరాత్‌కు చేరిన హెరాయిన్‌ను ఢిల్లీ తరలించాలన్నది ఆ సిండికేట్ లక్ష్యం. ఢిల్లీలో తమ గిడ్డంగిలో భద్రపరచి.. ఢిల్లీతోపాటు చండీగఢ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లోని విక్రయదారులకు వివిధ మార్గాల్లో తరలించాలన్నది సిండికేట్ వ్యూహమని గుర్తించారు. విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు వైశాలి డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లుగప్పేందుకు విజయవాడలోని ఇంటి చిరునామాను వాడుకున్నారు. ఆ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించారు. కానీ ఇక్కడ నుంచి ఆ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆ దంపతులు ఎన్నో ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్నారు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను విజయవాడ తరలించడం స్మగ్లర్ల లక్ష్యం కాదని, ఢిల్లీకి తరలించాలన్నదే వారి లక్ష్యమని విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డీఆర్ఐ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. – బి.శ్రీనివాసులు, సీపీ, విజయవాడ బురిడీ కొట్టించేందుకే విజయవాడ చిరునామా హెరాయిన్ సిండికేట్ డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వాడుకుంది. ఈ సిండికేట్‌లో పాత్రధారులైన చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలి వ్యూహాత్మకంగా విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని 23–14–16 డోర్ నంబర్‌తో ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎగుమతులు, గూడ్స్ సర్వీసులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తామని పేర్కొంటూ దుర్గాపూర్ణ వైశాలి పేరిట గతేడాది ఆగస్టు 10న జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఇల్లు దుర్గా పూర్ణ వైశాలి తల్లి తారక పేరున ఉంది. కానీ.. ఈ చిరునామా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. కేవలం రికార్డుల్లో చూపించేందుకే ఈ చిరునామాను వాడుకున్నారు. ఎప్పుడైనా డీఆర్ఐ అధికారులు తమ కన్సైన్మెంట్ను గుర్తిస్తే.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అషీ ట్రేడింగ్ సంస్థ తన వ్యాపార లావాదేవీల ఇన్వాయిస్ వివరాలను తెలిపే జీఎస్టీ ఆర్–1ను ఫైల్ చేయకపోవడం గమనార్హం. కేవలం చెల్లింపు వివరాలకు సంబంధించిన జీఎస్టీ ఆర్–3బీని మాత్రమే త్రైమాసికంగా ఫైల్ చేస్తోంది. ఇదిలావుంటే.. ఆ సంస్థకు దిగుమతులు చేసుకునేందుకు సంబంధించి విజయవాడ చిరునామాతో ఎలాంటి లైసెన్స్ తీసుకోలేదు. కాబట్టి గుజరాత్ ముంద్రా పోర్టులో దిగుమతి అయిన హెరాయిన్‌తో విజయవాడకు వాస్తవంగా ఎలాంటి సంబంధం లేదని డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ సిండికేట్ చెన్నై, ఢిల్లీ తదితర ప్రదేశాల్లో మరో చిరునామాతో దిగుమతుల లైసెన్స్‌ను తీసుకుని దందా సాగిస్తోందా అన్న దిశగా డీఆర్ఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, దుర్గాపూర్ణ వైశాలి తల్లి పేరిట విజయవాడలో గల ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న స్కూటర్ (ఏపీ 16 బీఎన్2268) గోవిందరాజు విద్యానాథ్, తండ్రి కోటేశ్వరశర్మ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఉంది. విజయవాడలోని ఆ చిరునామాలో కొంతకాలంగా ఎవరూ ఉండడం లేదు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న అఫ్గాన్ జాతీయులు ఇచ్చిన సమాచారంతో చెన్నైలో ఉంటున్న అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై కేంద్రాలుగా దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ రాకెట్ దందాపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వర్చువల్‌గా కళాభారతి జమున 85వ జన్మదిన వేడుకలు
ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ (85)వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్‌గా సమావేశంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ గారు ఆశీర్వదిస్తూ నేను జమున గారి అభిమానిని ఆ రోజుల్లో జమున గారి సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్ళిపోయేదాన్ని. జమున గారి కట్టు బొట్టు ఎంత సంప్రదాయికంగా ఉండేవో అభినయం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు నూరు సంవత్సరాల వయసులో జమున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉంది. అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జమున గారు ప్రతిగా అంత పెద్దావిడ వచ్చి తనను ఆశీర్వదిస్తుంటే స్వయంగా పింగళి వెంకయ్య గారే వచ్చి ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి(USA) జమున గారికి డాక్టర్ సీ నారాయణరెడ్డి స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. దర్శకులు కె. విశ్వనాధ్ గారు ఆశీర్వదిస్తూ జమునా, నీకు 85వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే, నిన్నగాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నీకు ఇంత తొందరగా వయస్సు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, సెలవు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ(85)వ జన్మ దినోత్సవం అంతర్జాలంలో ఐదు(5) ఖండాలలోని ముప్పై(30) కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా మరియు తెలుగు కళా సమితి ఖతార్ కలిసి పదహారు(16) గంటలుఅత్యంత అద్భుతంగా జరిగింది. వంశీ రామరాజు మాట్లాడుతూ జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు. పదహారు (16) గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాల నించి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు. -
చీరకట్టులో అదరగొట్టిన మీనాక్షి చౌదరి
-
తెలుగు ముద్దుగుమ్మ హీరోయిన్ ‘ఆనంది’ అందమైన ఫోటోలు
-
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇం టెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన మహిళ మాదకద్రవ్యాలు తీసుకొ స్తున్నట్లు నిఘావర్గాల ద్వారా డీఆర్ఐకి సమా చారం అందింది. ఖతార్ ఎయిర్వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకుంది. లగేజీని తనిఖీ చేయగా, అధికారులకు అనుమానాస్పద పొడి లభించింది. దాన్ని పరీక్షించి హెరాయిన్ అని నిర్ధారించారు. 3.2 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గతనెలలో జూన్ 6న ఇద్దరు ఆఫ్రికా మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన, జూన్ 21న జాంబియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 2500 కోట్ల హెరాయిన్ పట్టివేత
-
రూ. 2500 కోట్ల హెరాయిన్ పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు 2500 కోట్ల రూపాయల విలువైన 354 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. స్పెషల్ సెల్‌కు పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్లో ఇదే అత్యంత పెద్దదని అధికారులు పేర్కొంటున్నారు. నార్కో టెర్రరిజం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఈ మేరకు విచారిస్తున్నారు. దీనిపై స్పెషల్ సెల్ అధికారి నీరజ్ ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత కొన్ని నెలలుగా మా ఆపరేషన్ నడుస్తోంది. ఈ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్నుంచి వచ్చాయి. కంటైనర్లలో దాచి ముంబైనుంచి ఢిల్లీకి సముద్రం ద్వారా తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ప్రాసెస్ చేశారు. వాటిని అక్కడే ఓ అద్దె ఇంట్లో దాచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడు. ఈ డ్రగ్స్‌ను పంజాబ్‌లో సప్లై చేయటానికి ఉంచారు. ఈ డ్రగ్స్ ఆపరేషన్ కోసం పాకిస్తాన్‌నుంచి నిధులు సమకూరుతున్నట్లు తెలుస్తోంది’’ అని అన్నారు. -
రూ. 2,000 కోట్ల హెరాయిన్ పట్టివేత
ముంబై: ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోలు, అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకును నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్‌కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్‌ను టాల్కమ్ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గత వారం జూన్ 28న ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల నుంచి రూ.126 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అంతే కాకుండా గత ఆరు నెలల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి అధికారులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ముంబై కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లోని కార్గో కంటైనర్ నుంచి రూ.1,000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. -
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆదివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి కస్టమ్స్ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం
తిరువొత్తియూరు (చెన్నై): దక్షిణాఫ్రికా నుంచి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన రూ.70 కోట్ల విలువైన 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దోహా నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి నేతృత్వంలో అధికారులు నిఘా ఉంచారు. ప్రయాణికుల్లో ఓ మహిళ వీల్‌చైర్‌లో, ఆమెకు తోడుగా మరొక మహిళ వచ్చారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు వారు తెలిపారు. సూట్‌కేస్‌లను తనిఖీ చేయగా నాలుగు పార్శిళ్లలో 9.8 కిలోల హెరాయిన్ బయటపడింది. -
ఉగ్ర కుట్ర: రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
కశ్మీర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు సోమవారం పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. ఓ ఉగ్రవాదిని అరెస్టు చేయడమే కాక, కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 8 కిలోల హెరాయిన్ తీసుకెళ్తున్న ఈ గ్రూప్ గురించి జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కాపుగాసి మాటేసిన పోలీసులు ఈ గ్రూప్‌కు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇతడిని మదాసిర్ అహ్మద్‌గా గుర్తించారు. "ఈ గ్రూప్, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ గ్రూపు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ లోయలో యాక్టీవ్‌గా ఉన్న ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రికవరీలు మాదకద్రవ్యాల డీలర్లకు, ఉగ్రవాదులకు మధ్య పరస్పరం ఉన్న సంబంధాన్ని కూడా బహిర్గతం చేశాయి" అని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ గ్రూపు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపు బలోపేతం చేయడానికి పని చేస్తోంది. అంతేకాక స్థానిక యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోంది అన్నారు ఐజీ విజయ్ కుమార్. ఇక పట్టుబడిన ఈ 8 కిలోగ్రామలు హెరాయిన్ మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల రవాణాలో తో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నాడని.. కాని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: 8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్ -
8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జఖావు తీరంలో ఒక ఫిషింగ్ బోట్లో 8 మంది పాకిస్తానీలను, 30 కేజీల హెరాయిన్‌ను భారత తీర రక్షణ దళం పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన బోటు నిషేధిత డ్రగ్స్‌తో భారత సముద్ర జలాల్లోకి వచ్చిందన్న సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ బోటు నుంచి రూ. 150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ ప్రకటించింది. గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళానికి వారిని అప్పగించినట్లు తెలిపింది. హెరాయిన్‌ను గుజరాత్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో తరలించాలన్నది వారి పన్నాగమని పేర్కొంది. ఏడాదిలో స్మగ్లర్ల నుంచి రూ. 5,200 కోట్ల విలువైన 1.6 టన్నుల డ్రగ్స్‌ను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. -
పండుగవేళ తమన్నాతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
మలయాళ నటి మానస రాధాకృష్ణన్ క్యూట్ ఫోటోలు
-
డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు : ఎక్కడ దాచారంటే..
సాక్షి, ముంబై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని, దొంగ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వర్గం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి పై ఎత్తులు వేస్తూ మాఫియా ముఠా చెలరేగిపోతోంది. రకరకాల మార్గాల్లో మత్తు పదార్థాలను సునాయాసంగా దేశంలోకి పారిస్తూ, కోట్లరూపాయల దండుకుంటోంది. తాజాగా హెరాయిన్‌ను తరలించేందుకు ముఠా పన్నిన పన్నాగం చూసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులే షాకయ్యారు. మత్తు పదార్థాలను మహిళల గౌన్లకు కుట్టిన బటన్లలో దాచి పెట్టి మరీ ఇంటిలిజెన్స్ అధికారుల కన్ను గప్పాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరకు అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు ఛేదించారు. మహిళల గౌన్లకు అమర్చిన బటన్స్‌లో హెరాయిన్ దాచి కొరియర్ ద్వారా దేశంలోకి తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు 396 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణాఫ్రికా నుండి ముంబైకి కొరియర్ ద్వారా దీన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వెల్లడించారు. Directorate of Revenue Intelligence (DRI) busted an inter-continental racket of drug smuggling and seized 396 grams of Heroin ingeniously concealed in buttons sewn into women’s gowns sent in a courier consignment from South Africa to Mumbai: DRI pic.twitter.com/JgMuGIphi8 — ANI (@ANI) November 28, 2020 -
అస్సాంలో రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
గౌహతి : అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మణిపూర్ నుంచి వస్తున్న ఓ వాహనంలో సోదాలు జరపగా 75 ప్యాకెట్లలో యబా ట్యాబ్లెట్లు, 68 ప్యాకెట్లలో హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే బార్పేట జిల్లాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద పెద్ద సంఖ్యలో బ్రౌన్ షుగరు పొట్లాలు లభించాయి. -
హీరోయిన్ సాయి మంజ్రేకర్ స్టన్నింగ్ ఫోటోలు
-
‘2020లో ఇంత భారీగా.. ఇదే మొదటిసారి’
జైపూర్: రాజస్తాన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సుమారు 234 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే ప్రథమం. ఈ నెల 19న రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని షాది గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటి డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘జోధ్‌పూర్ జోనల్ యూనిట్‌కు చెందిన ఓ బృందం ఆర్ లాల్ అనే వ్యక్తి నివాసప్రాగంణంపై దాడి చేసి 233.97 కిలోగ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించి భిల్వారా జిల్లాకు చెందిన ఎంకే ధాకాడ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుంచి ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు. (ఇది న్యాయమేనా?!) అంతేకాక ఈ ఏడాది ఇంత భారీ మొత్తంలో నల్లమందు పట్టుబడటం ఇదే ప్రథమం అన్నారు మల్హోత్రా. నిందితులు దీన్ని చిత్తోర్‌గఢ్‌లోని చట్టబద్దమైన సాగు ప్రాంతం నుంచి కొన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి జోధ్‌పూర్‌కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నాం అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారులు ఇందులో పాలు పంచుకున్నరని తెలిపారు. నల్లమందును గసగసాల నుంచి పొందిన ఎండిన రబ్బరు పాలతో తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గసగసాల సాగుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో మధ్యవర్తులు, రైతుల దగ్గర నుంచి దీన్ని కొనుగోలు చేసి అక్రమమార్గల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తూ పట్టబడ్డారు. ఈ నల్లమందు నుంచి హెరాయిన్‌ను తయారు చేస్తారు. -
హీరోయిన్ వాణీ కపూర్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ మంజిమా మోహన్ గ్లామర్ ఫోటోలు
-
బుల్లితెర యాంకర్ మేఘన కుమార్ గ్లామర్ ఫోటోలు
-
హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు యువ పేస్ బౌలర్ షెహాన్ మధుశంక హెరాయిన్‌తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. లంకలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి ప్రయాణిస్తోన్న 25 ఏళ్ల మధుశంకను పన్నాల పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది. పోలీసులు మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టగా... రెండు వారాలపాటు రిమాండ్‌కు తరలించింది. బంగ్లాదేశ్‌తో 2018లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన మధుశంక, ఆ తర్వాత రెండు టి20ల్లోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. -
హీరోయిన్ అంజలి ఫోటోలు
-
హీరోయిన్ రష్మికా మందన్నా ఫోటోలు
-
మానవ వనిత
బాలీవుడ్లో దీపికా పడుకోన్ ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్. భారీ పారితోషికం, సర్దుబాటు చేసుకోలేనన్ని కాల్షీట్లు ఎవర్నైనా నంబర్ వన్ని చేస్తాయి. మరి దీపిక ప్రత్యేకత ఏమిటి? ఆమె ఎప్పుడూ ధగధగలాడే విషయాలు మాట్లాడరు. పైగా సాదా సీదాగా ఒక సామాన్య మహిళగా కనిపించడానికి ఇష్టపడతారు. సినీ సెలబ్రిటీ కాబట్టి రిచ్ గా కనిపించడం, గంభీరంగా వ్యవహరించడం అప్పుడప్పుడూ ఆమెకు తప్పక పోయినా.. వీలైనంత వరకు లైఫ్‌ని ‘మానవ వనిత’గా లీడ్ చెయ్యడానికే ఇష్టపడతారు. కష్టాలు చెప్పుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ‘తిన్నావా?’ అని పలకరిస్తారు. ‘భోజనానికి ఉండి వెళ్లండి’ అని.. వెళ్లేవాళ్లను ఆపుతారు. తీరిక చిక్కితే కాలేజ్‌లో కలిసి చదువుకున్న స్నేహితురాళ్ల ఇంటికి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి అక్కడ హస్క్ వేసుకుంటూ కూర్చుంటారు. దీపిక ఉంటున్నది ముంబై అయినా.. బేసిగ్గా.. బెంగళూరు అమ్మాయి. అక్కడి బాల్యం ఆమెను ఇంకా వీడిపోలేదు. ఫ్రెండ్ పెళ్లికని మొన్న సండే బెంగళూరు వెళ్లొచ్చి మండే సిక్ అయి, సెట్స్‌కి లీవ్ పెట్టారు. పెళ్లికి వెళ్లి సిక్ అవడం ఏంటి?! అక్కడంతా ఆటలు, పాటలు, వినోదాలు, ఉల్లాసాలు, ఐస్ క్రీమ్‌లు, ‘హహహ్హ నాకే ముందు’ టైప్ వంటకాలే కదా! అవే దీపికను జ్వరాన పడేశాయి. ఆడినంత ఆడి అలసి, తిన్నవన్నీ తిని సొలసి.. ఫీవర్ తెచ్చుకున్నారు. ఫ్లైట్‌లో సరాసరి ఇంటికి తిరిగొచ్చేసి, సెల్ఫీ తీసుకుని దానికి థర్మామీటర్ స్టిక్కర్‌ని ఎటాచ్ చేసి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘పెళ్లి ఫంక్షన్లో సరదాలు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది’ అని ఫొటో కింద క్యాప్షన్ కూడా రాశారు. దీపికను అలా నిస్సత్తువగా చూసి అభిమానులంతా బెంగపెట్టేసుకున్నారు. స్టార్స్‌ని మేకప్‌లో మాత్రమే చూడ్డానికి అభిమానులు, అభిమానులకు మేకప్‌లో మాత్రమే కనిపించడానికి స్టార్స్ అలవాటు పడి ఉంటారు. అందుకు భిన్నంగా దీపిక తన నీరసపు వదనాన్ని షేర్ చేశారు. ఇమేజ్‌ని పక్కన పెట్టి ఇలా కనిపించడం మామూలు సంగతా?! -
ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!
‘ అయ్యయ్యో! ఎవరైనా హెరాయిన్ పోగొట్టుకున్నారా? మరేం పర్లేదు. మా దగ్గరే భద్రంగా ఉంది! అది మీకు కావాలంటే మమ్మల్ని ఆశ్రయించవచ్చు! లేనిపక్షంలో ఇంకెప్పటికీ అది మీకు దొరకదు. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం. మా దగ్గరికి వస్తే ఫుడ్డు, అకామిడేషన్ అన్నీ ఉచితం! త్వరపడండి’ అంటూ రాజస్తాన్ పోలీసులు చేసిన ఫన్నీ ట్వీట్ నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. రాజస్తాన్‌లోని ఓ గోడౌన్లో భారీగా హెరాయిన్ ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే వీరి రాకను గమనించిన స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సంచుల్లో నింపి ఉన్న హెరాయిన్ ఫొటోలను షేర్ చేసిన పోలీసులు పై విధంగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో.. ‘మీరు అసోం పోలీసులను కాపీ కొట్టారు సార్’ అంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో.. ‘దొంగలను పట్టుకోకుండా ఏంటిది. మీరు ముంబై పోలీసులను మించిపోయారుగా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో అసోం పోలీసులు కూడా ఈ తరహాలోనే స్మగ్లర్లను ఉద్దేశించి.. ‘ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కేజీల) గంజాయి పోయిందా? అయితే బాధపడకండి.. అది గత రాత్రి ట్రక్కుతో సహా మాకే దొరికింది. మీదైతే మాత్రం ధుబ్రి పోలీసులకు టచ్‌లో ఉండండి. వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Oops! Did anyone lost their #Smack? If yes, we have them! If you want them back contact us ASAP! Or else it'll be lost forever. We promise free stay & food at our expense! So hurry!@narcoticsbureau pic.twitter.com/GeeLvnxic0 — Rajasthan Police (@PoliceRajasthan) July 17, 2019 -
డ్రీమ్‌గర్ల్!
‘హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చేయడం తప్ప హీరోయిన్ కాలేవు’లాంటి వెటకారాలను ఆమె సీరియస్‌గా తీసుకుందో లేదోగాని బాలీవుడ్లో పుష్కరకాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లను రుచి చూసింది నుష్రత్ భరుచా. ‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘ప్యార్ కా పంచ్‌నామా–2’ ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు భరుచాకు మంచి గుర్తింపు తెచ్చాయి. త్వరలో ‘డ్రీమ్‌గర్ల్’గా అలరించనున్న నుష్రత్ అంతరంగ తరంగాలు... కిట్టీ పార్టీతో... సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను సినిమాల్లోకి రావడం పేరెంట్స్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా చుట్టాలు పక్కాలలో ‘ప్రొఫెషన్’ అంటే ‘మెడిసిన్’, ‘ఇంజనీరింగ్’ తప్ప మరేదీ కాదు. వీటిలోనే జాబ్ సెక్యూరిటీ ఉంటుందనేది వారి నమ్మకం. యాక్టింగ్ అనేది ‘రియల్ ప్రొఫెషన్’ కాదు అని ఖరాఖండిగా చెప్పేవాళ్లు. ఇప్పటికీ ‘‘నేను సినిమాల్లో నటిస్తున్నాను’’ అని చెబితే జాలిగా చూసేవాళ్లు లేకపోలేదు. ఒకసారి టీవీ సీరియల్ ‘కిట్టీ పార్టీ’ ఆడిషన్‌కు వెళ్లాను. ఏదో వెళ్లానుగానీ...సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. ‘మీరు సెలెక్ట్ అయ్యారు’ అంటూ వచ్చిన కాల్ నన్ను సంతోషంలో ముంచెత్తింది. అదృష్టమేమిటంటే కొద్దినెలల్లోనే బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వచ్చింది. ‘కల్ కిస్నే దేఖా’ ‘జై సంతోషి మా’ (2006) సినిమాల్లో నటించాను. ఈ సినిమాలతో పెద్ద గుర్తింపు లభించలేదు. ‘డార్క్ లవ్ సెక్స్ ధోఖా’ సినిమాలో పరువుహత్య బాధితురాలిగా నటించాను. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. టీవిలో నటిస్తున్నప్పుడు ‘నటన’ అంటే ఆషామాషీ కాదని బాగా కష్టపడాలనే విషయం అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అయినా సరే... ‘ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి’ అని ఎప్పుడూ మడి కట్టుకొని కూర్చోలేదు. ఒక పాత్రలో దమ్ము ఉంటే అది నెగెటివ్ క్యారెక్టర్ అయినా చేశాను. ‘ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తారు?’ అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చిందా? రాలేదా? అనే దానికంటే నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలనా లేదా? అనేది ఆలోచిస్తాను. ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ‘‘ఈ పాత్రను నేను చేయలేను. ఇలాంటి అమ్మాయిలు నిజజీవితంలో ఉంటారని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘ఇదేమీ నిజజీవిత కథ కాదు... కామెడీ సినిమా చేస్తున్నాను. కామెడీ సినిమాల్లో క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి... అంతేగాని అమ్మాయిలు ఇలా ఉంటారని చూపడం నా ఉద్దేశం కాదు’’ అని చెప్పాడు డైరెక్టర్. అలా ఆయన మాటలతో కన్విన్స్ అయి ఆ సినిమాలో నటించాను. విధిరాత! గతంలో వీళ్లు వాళ్లు అనేవారు...‘‘నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. నువ్వు ఫ్రెండ్ రోల్స్ మాత్రమే చేస్తుండాలి’’ బయటివాళ్లే కాదు. కుటుంబసభ్యులు కూడా ‘‘నీ కళ్లు చేప కళ్లు కాదు కాబట్టి నువ్వు హీరోయిన్ కాలేవు’’ అనేవాళ్లు. నేను మాత్రం సీరియస్‌గా తీసుకోకుండా తేలిగ్గా నవ్వేదాన్ని. కానీ విధిరాతను ఎవరు మార్చగలరు! -
నా పంచ్ పవర్ చూపిస్తా
చేతికి గ్లౌజులు తొడుక్కుని తన పంచ్ పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నారు సంజన. ఈ పంచ్‌లు ఎవరి మీద పడతాయో వేచి చూడాలి. అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాక్సర్’. వివేక్ కణ్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంజన హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ బాక్సర్స్‌గా కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు సంజన. ‘‘ఇందులో నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర నాది. ఇంతకు ముందు సినిమాల కోసం నేర్చుకున్న గుర్రపు స్వారీ, నా ఫిజిక్ ఈ సినిమాకి అవకాశం వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో నా పాత్రను చూసి కచ్చితంగా షాక్ అవుతారు. సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాను’’ అన్నారు సంజన. ఈ సినిమా కాకుండా రెండు కన్నడ చిత్రాలు, ఓ తమిళ వెబ్ సిరీస్‌తో సంజన బిజీగా ఉన్నారు. -
ముంబై మెరుపులు
-
రెండు తాళం చెవులు
త్రీహిల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి ఫోన్‌కాల్ అందుకున్న వెంటనే సిబ్బందితో అక్కడకు వెళ్లాడు క్రైమ్ ఎస్సై కాళిదాస్.గత రాత్రి హాస్పిటల్లో చేరిన రాజారావు మరణించాడు. సూర్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.వాళ్లిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నాడు క్రైమ్ ఎస్సై కాళిదాస్.వెంటనే డీలక్స్ హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్ సిబ్బంది ద్వారా వివరాలను సేకరించాడు. రాజారావు, సూర్యంల గురించి సమాచారం తెలుసుకున్నాడు. ముందురోజు రాత్రి హోటల్లో వెట్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా ప్రముఖుల కొడుకులని, రాజారావు వీరభద్రం కొడుకని, రోహిత్ పుల్లారావు కొడుకని, వీరభద్రం, పుల్లారావు రాజకీయ ప్రత్యర్థులని తెలుసుకున్నాడు కాళిదాస్. కిందటి సంవత్సరం పుల్లారావు, వీరభద్రం వ్యాపార గొడవలతో ఒకరినొకరు రివాల్వర్స్తో కాల్చుకుని మరణించారు. ఆ కేసు ఇంకా పూర్తి కాకుండానే ఈ సంఘటన జరిగింది. డీలక్స్ హోటల్ రూమ్ నంబర్–111లోకి తన సిబ్బందితో సహా ప్రవేశించాడు ఎస్సై కాళిదాస్.ఏఎస్సై శంకరం ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించాడు.గదిలోని టేబుల్ మీద గాజు గ్లాసులు ఉన్నాయి. పెద్ద సోఫాకు రెండు వైపులా పూలకుండీలు ఉన్నాయి. కుడివైపు పూలకుండీలో ఉన్న మట్టి కొంతతడిగా ఉంది. ఆ మట్టిని కొంత సేకరించి, ల్యాబ్‌కు పంపాడు శంకరం. ఆ గదిలో మూలన పడి ఉన్న హెరాయిన్, గంజాయిని కూడా సేకరించాడు.గది ముందు నిలుచున్న రూమ్‌బాయ్‌ని పిలిచాడు ఎస్సై కాళిదాస్. ‘‘నీ పేరు’’‘‘అప్పారావు సార్’’‘‘నిన్న రాత్రి ఈ రూమ్‌లో ఎవరెవరు ఉన్నారో చెప్పగలవా?’’ ప్రశ్నించాడు కాళిదాస్.‘‘ఈ కుడి పక్కనున్న పూలకుండీ పక్కనే డాలీ మేడమ్, ఆమె పక్కన రాజారావు గారు, సూర్యంగారు, అక్బర్గారు, రోహిత్‌గారు కూర్చున్నారు’’ చెప్పాడు అప్పారావు.‘‘వాళ్లందరూ నీకు బాగా పరిచయమా?’’ ప్రశ్నించాడు కాళిదాస్.‘‘వాళ్లంతా ప్రతివారం రాత్రివేళ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటుంటారు. వాళ్లకు కావలసినవి నేనే తెచ్చేవాణ్ణి. అందువల్ల వాళ్లందరితోనూ బాగా పరిచయం అయిందండీ’’ బదులిచ్చాడు అప్పారావు.‘‘వెరీగుడ్ అప్పారావు. వాళ్ల అడ్రస్‌లు చెప్పగలవా?’’ అడిగాడు కాళిదాస్.అప్పారావు చెప్పిన అడ్రస్‌లు రాసుకుని, వాళ్ల నుంచి రక్త నమూనాలు సేకరించాడు కాళిదాస్.రెండు గంటల తర్వాత–‘‘రాజారావు మరణం సహజమైనది కాదు. ప్రీప్లాన్డ్ మర్డర్.’’ అన్నాడు కాళిదాస్.‘‘మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు శంకరం.ఆ పార్టీలో పాల్గొన్న వారి రక్తంలో ఎంతో కొంత విస్కీ, హెరాయిన్ ఉన్నట్లు రక్తపరీక్షల్లో తేలింది. డాలీ రక్తంలో మాత్రం విస్కీ లేదని, ఆమె తాగలేదని తేలింది. ఆమె గ్లాసులోని విస్కీని తెలివిగా పక్కనే ఉన్నపూలకుండీలో పోసేసింది. రాజారావు తాగిన విస్కీలో హెరాయిన్ మోతాదుకు మించి ఉంది. రాజారావు చేత డాలీ ఎక్కువగా తాగించిందన్న మాట శంకరం... ఇదీ కథ’’ అన్నాడు కాళిదాస్. మంచం మీద అచేతనంగా పడి ఉంది డాలీ.ఆమె వద్దకు వెళ్లి తట్టి చూశాడు కాళిదాస్. చల్లగా తగిలింది. ఆమె మరణించిందని గ్రహించాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కుడిచేతి గోళ్లకు రక్తంమరకలు ఉండటాన్ని గమనించాడు. మరణానికి ముందు ఆమె ఎవరితోనో పోరాడినట్టుగా గ్రహించాడు. ఆమె మెడపై గాయం ఉంది. ఆమె మెడలోని గొలుసును బలవంతంగా లాగినట్టు మెడపై ఎర్రని గీతఉంది. డాలీ శరీరం నీలం రంగులోకి మారింది. వెంటనే ఆమె శరీరాన్ని పోస్ట్‌మార్టంకు పంపాడు.ఆ తర్వాత కాళిదాస్ అక్కడి నుంచి రాజారావు ఇంటికెళ్లి గదిలో ఉన్న కబోర్డు తెరిచాడు. లోపల ఒక కర్రపెట్టెఉంది. ఆ పెట్టెపై ‘626’ అని రాసి ఉంది. ఆ పెట్టె తెరవాలనుకున్నాడు. ఆ పెట్టె తాలూకా తాళంచెవి కోసం గదంతా గాలించాడు. పావుగంట తర్వాత మంచం కింద తాళంచెవి కనిపించింది. ‘శంకరం! ఈ పెట్టెకు రెండు తాళంచెవులు ఉన్నాయి. ఈ తాళంచెవి డూప్లికేట్. రెండో తాళంచెవి మాయమైంది. ఈ రెండు హత్యలకు, ఈ పెట్టెకు లింక్ ఉంది. కనుక్కుంటాను. పెట్టెలో ఉన్నది ఈ తాళంచెవితోతెరిచి తెలుసుకుంటాను. ముందు సూర్యం దగ్గరకెళదాం. అతడికి స్పృహ వచ్చాక మనకు అన్నీ తెలుస్తాయి’’ అన్నాడు కాళిదాస్. ‘‘మనం అనుకున్న ప్రకారం కథ ఫలించిందా?’’ అడిగింది ప్రియ.‘‘పురిట్లోనే సంధికొట్టినట్టుగా ఆగిపోయింది ప్రియా!’’ నిరాశగా బదులిచ్చాడతడు.‘‘డాలీ వద్దనున్న తాళంచెవిని నువ్వు తెచ్చావుగా’’ అంది ప్రియ.‘‘ఏం లాభంలేదు. కర్రపెట్టె రాజారావు ఇంట్లో ఉంది. బహుశ రెండో తాళంచెవి సూర్యం దగ్గర ఉండాలి’’ అన్నాడతడు.‘‘రాజారావు, సూర్యం తండ్రులు శత్రువులు కదా! మరి వాళ్ల కొడుకులు స్నేహితులెలా అయ్యారు.. అదే నాకు అర్థం కావడంలేదు’’ అంది ప్రియ.‘‘మైడియర్ ప్రియా! రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. ముందు నువ్వువెంటనే హాస్పిటల్కెళ్లి సూర్యాన్ని పరలోకానికి పంపు’’ అని ఆమెకు ప్లాన్ వివరించాడతడు. ఇద్దరూ గదిలోంచి బయటకు వెళ్లారు. ఒక డాక్టర్, నర్సు సూర్యం ఉన్న గదిలోకి ప్రవేశించారు. డాక్టర్ కోటు జేబులోంచి సిరెంజ్ తీశాడు. అందులో ఉన్న మందువైపు చూసి సూర్యం మంచం వద్దకొచ్చాడు. సూర్యం మీద దుప్పటి కప్పి ఉంది. సూర్యానికి ఇంజెక్షన్ చేయబోయాడు.అంతలోనే డాక్టర్ మొహమ్మీద బలమైన పిడికిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు డాక్టర్ నేల మీదకు ఒరిగిపోయాడు. ఒక్కసారి ఆ గదిలో వెలుతురు మాయమైంది. దుప్పటి తొలగించి మంచం మీద నుంచి నేల మీదకు గెంతాడు అతడు.‘‘శభాష్ శంకరం’’ కంగుమంది ఎస్సై కాళిదాస్ గొంతు.‘‘రోహిత్! లే.. నీ డ్రామాకు తెరపడింది.’’ అంటూ గద్దించాడు. రోహిత్ నిరుత్తరుడయ్యాడు.‘‘రాజారావును నువ్వే హత్య చేశావు. తర్వాత డాలీని హత్య చేశావు. ఆమె మెడలోని చెయిన్‌కు ఉన్న తాళంచెవిని బలవంతంగా తీసుకున్నావు. నీ చేతి మీద కనిపిస్తున్న గాయాల గుర్తులు డాలీ నిన్ను గోళ్లతో రక్కినవే! ఈ ఆధారాలు చాలా! ఇంకేమైనా కావాలా? నువ్వు వెదుకుతున్న పెట్టె నా అధీనంలో ఉంది. అందులో రాజారావు తండ్రి వీరభద్రం, సూర్యం తండ్రి పుల్లారావుల నల్లడబ్బు తాలూకా వివరాలు రాసి ఉన్న పత్రాలు ఉన్నాయి. రెండు తాళంచెవులు వీరభద్రం, పుల్లారావులవి. ఒక తాళంచెవి ఇప్పుడు నీవద్ద, మరొకటి నావద్ద ఉన్నాయి. ఆ పత్రాల కోసమే నువ్వు ఈ హత్యలు చేశావు. పద పోలీస్ స్టేషన్‌కి... సెల్ సిద్ధంగా ఉంది’’ అంటూ రోహిత్‌ను అదుపులోకి తీసుకుని జీపెక్కించాడు ఎస్సై కాళిదాస్. - రాణీ మోహన్రావ్ -
రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
న్యూఢిల్లీ : భారీ మొత్తంలో హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపిల్లను సరఫరా చేసే డబ్బాల్లో ఈ హెరాయిన్‌ను దాచి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. -
నైజీరియన్ల అరెస్ట్..భారీగా గంజాయి స్వాధీనం
గురుగావ్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.3 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు యావో, ఓక్లీ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం వీరు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకుని వీరిని అదుపులోకి తీసుకుంది. పోలీసు రిమాండ్‌కు తరలించిన తర్వాత వీరిద్దరినీ విచారించారు. దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ దేశాల నుంచి అక్రమంగా హెరాయిన్‌ను తెప్పించి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఇంకా దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు వారి పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లు కూడా సమర్పించడంలో విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. -
స్మగ్లర్ అరెస్ట్.. రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ అంతర్జాతీయంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ విదేశీయుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలా.. ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాలపై గత కొన్ని రోజులుగా దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఆకస్మిక తనఖీలు చేపట్టిన ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతర్జాతీయంగా హెరాయిన్‌ను విక్రయిస్తున్న ఓ నైజీరియా గ్యాంగ్ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 4 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
టార్చర్ అనుభవించా!
డకోటా జాన్సన్. ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ఫిల్మ్ సిరీస్ పేరు చెప్పగానే ఈ స్టార్ పేరే ముందు వినిపిస్తుంది. హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాల్లో మెయిన్ లీడ్‌గా నటించిన డకోటా జాన్సన్, ఇప్పుడు హాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా జానర్లో ‘ఫిఫ్టీ షేడ్స్’ ఒక బ్లాక్‌బస్టర్ అటెంప్ట్. తాజాగా ఈ సినిమాలకు పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటూ జాన్సన్ తన బాధలు చెప్పుకుంది. ‘అబద్ధం చెప్పట్లేదు. ఈ సినిమా ఒక రకంగా నన్ను చావగొట్టింది.’ అందామె. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో రొమాన్స్‌కు పెద్దపీట వేసిన ఈ అడల్ట్ డ్రామాలో ఒక్కో సీన్లో జాన్సన్ పాత్ర ఒక్కో రకమైన ఎమోషన్‌తో నడుస్తుంది. ఇవన్నీ ఆమెను మెంటల్‌గా విపరీతంగా డిస్టర్బ్ చేశాయట.ఇదే విషయాన్ని చెప్పుకొని పై మాటలు అంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ సిరీస్ పూర్తయ్యాక అందులో నుంచి బయటపడ్డానికి థెరపీకి వెళ్లాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ థెరపీ పూర్తయ్యాక అంతా సెట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ‘నాకు నచ్చిన పాత్రలు చేద్దామంటే అవకాశాలు రావట్లేదు. అందుకే నేనే ఆ అవకాశాలను సృష్టించుకోబోతున్నా..’ అంటూ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలుపెడుతున్నట్లు చెప్పుకుంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ పాపం ఎంతపేరు తెచ్చిందో, అన్నే కష్టాలు కూడా తెచ్చిపెట్టింది ఈ హాట్ భామకు!! -
హీరోయిన్గా బిగ్‌బాస్ జూలీ
నటుడు కమలహాసన్ వ్యాఖ్యతగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన నటి జూలీ. జూలీ అసలు పేరు జూలియానా. ఈ జాణ అంతకుముందే దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి, విప్లవంగా మొదలై ఉవెత్తున ఎగసి విజయకేతనం ఎగురవేసిన జల్లికట్టు పోరాటంలో వీర తమిళచ్చి(వీర తమిళనారీ)గా పేరు తెచ్చికుంది. ఆ తరువాత ఈ పేరు జూలీని ఏకంగా వెండితెర కథానాయకిని చేసేశాయి. జూలీ కథానాయకిగా నటింìచనున్న చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కే7 ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఇందులో జూలీ యుమ్ 4 పేరుమ్, తప్పాట్టం చిత్రం ఫేమ్ పబ్లిక్స్టార్ దురై సుధాకర్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. కాగా ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానున్న నటి జూలీ మాట్లాడుతూ కథ వినగానే చాలా నచ్చేసిందని చెప్పింది. తొలి చిత్రంతోనే కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. అంతే కాదు ఇది తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. మొత్తం మీద బిగ్‌బాస్ గేమ్ షో నటి ఓవియకు ఎలాగైతే టర్నింగ్ అయ్యిందో అలాగే జూలీనీ హీరోయిన్ను చేసేసిందన్నమాట. -
మార్పుకు ముందడుగు వేసింది
1997... బెవర్లీ హిల్స్‌లోని ఓ హోటల్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌తో మీటింగ్ ఉందంటే ఆష్లీ జడ్ ఆయన గదికి వెళ్లింది. ఆష్లీ వచ్చిన టైమ్‌కి హార్వీ స్నానానికి సిద్ధ్ధమవుతున్నాడు. ఆష్లీ తన గదిలోకి రాగానే, ‘వచ్చి బాడీ మసాజ్ చేయమ’ని అడిగాడు హార్వీ. లేదంటే తాను స్నానం చేస్తూంటే చూస్తూ ఉండమని అన్నాడు. ఆష్‌లీకి కోపం వచ్చింది. అతణ్ని తప్పించుకొని హోటల్ నుంచి వెళ్లిపోయింది. అదే రోజు ఆ విషయం తన తండ్రికి చెప్పింది. కొద్ది రోజులకు ఫ్రెండ్స్‌కు చెప్పింది. కొన్నాళ్లకు తెలిసినవాళ్లకు చెప్పింది. కానీ 20 ఏళ్ల తర్వాత.. (2017 నవంబర్ 5న) ఆష్లీ ప్రపంచానికి ఈ విషయం చెప్పింది. ఒక్కసారి బయటకొచ్చి చెప్పిన తర్వాత అదెంత పెద్ద ఉద్యమంగా మారిందో చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా తమపై కూడా ఇలాంటి దాడులు జరిగాయంటూ ఆడవాళ్లంతా గొంతు కలిపారు. మీటూ అన్న ఉద్యమం మొదలైంది. ‘ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చెప్పాలనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ఇది చెప్పక తప్పదు. ఇలాంటివి దాచొద్దు అనిపించింది. ముందుకు రావాలనిపించింది’ అంటోంది ఆష్లీ జడ్, మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ. హాలీవుడ్లో ఇప్పుడు అందరూ దీని గురించి స్పందిస్తున్నారు. మాట్లాడుతున్నారు. మార్పు వస్తూనే ఉంటుంది, రావాలి కూడా. ఆష్లీ జడ్ ఇప్పుడొక మార్పుకు మొదటి అడుగు వేసింది. -
మెహ్రీన్‌తో సరదాగా కాసేపు
-
నన్ను నేనే సరిదిద్దుకున్నా!
తమిళసినిమా: నన్ను నేనే సరిదిద్దుకున్నాను అంటోంది నటి ఇలియానా. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈ గోవా సుందరి ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగి పేరుతో పాటు, ఆస్తి అంతస్తులను కూడబెట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత నిందలు వేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. దక్షిణాదిలో చాలా ఇబ్బందులకు గురైనట్లు ఆరోపణలు గుప్పించిన ఇలియానా ఈ మధ్యనే బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ నటించిన చిత్రాల్లో బర్ఫి చిత్రం ఒక్కటే గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ భామ ఇటీవల తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను చిత్ర రంగప్రవేశం చేసి 10 ఏళ్లు దాటిందని, అయినా ఇప్పటికి 20 చిత్రాల్లోనే నటించానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ చిత్రాల్లో తనకు సంతృప్తిని ఇచ్చింది బర్ఫి లాంటి చాలా తక్కువ చిత్రాలేనని పేర్కొంది. అప్పట్లో కథేంటని అడక్కుండానే చిత్రాలు ఒప్పుకుని నటించేశానని, దాని గురించి ఇప్పుడు తలుచుకుంటే పిల్లతనం అనిపిస్తుందని అంది. అయితే ఇప్పుడు తనను తాను సరిదిద్దుకున్నానని, ఇకపై తనకు, తన పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్లో ఒకటి, రెండు చిత్రాలు చేతిలో ఉన్నా దక్షిణాదిలో మాత్రం ఇలియానాకు ఒకప్పుడు డిమాండ్ ఉన్న మాట నిజమే. ఇప్పుడు మాత్రం పట్టించుకునేవారే లేరన్నది తను గ్రహించాలంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
గుజరాత్ తీరంలో హెరాయిన పట్టివేత
-
అప్పుడే పుట్టిన బిడ్డకు హెరాయిన్..
పుట్టిన గంటల వ్యవధిలోనే బిడ్డకు హెరాయిన్ ఇచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిడ్డ తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో నొప్పులను తట్టుకునేందుకు తరచూ హెరాయిన్, డాక్టర్లు సూచించిన మందులను తీసుకునేది. దీంతో కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా హెరాయిన్‌కు అడిక్ట్ అయింది. హెరాయిన్ వినియోగించిన విషయం బిడ్డ ద్వారా ఆసుపత్రి సిబ్బందికి తెలియకూడదని దంపతులు క్రిస్టెన్సన్(26), కాల్బీ విల్డ్(29) భావించారు. అదను చూసి నర్సు, డాక్టర్లు లేని సమయంలో సబోక్సోన్ అనే ట్యాబ్లెట్లను మెత్తగా పొడి చేసి బిడ్డ నాలుకపై రాసినట్లు విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీంతో వారి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. -
పోలీసు ఇంట్లో భారీగా డ్రగ్స్
చండీగఢ్/జలంధర్: పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యాపారంలో చీకటి కోణం వెలుగు చూసింది. యువతను నిర్జీవులుగా చేస్తున్న డ్రగ్స్ దందాలో ఖాకీల ప్రమేయం బట్టబయలైంది. ఒక పోలీసు అధికారి ఇంట్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడడం సంచలనం రేపింది. కపుర్తలా క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఇంద్రజిత్‌ను ఫగ్వారా ప్రాంతంలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం(సిట్) సోమవారం అరెస్ట్ చేసింది. ఆయన ఇంటి నుంచి 3 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జలంధర్‌లో పంజాబ్ పోలీసు నివాస సముదాయంలోని ఇంద్రజిత్ ఉంటున్న ఇంట్లోనూ భారీగా అక్రమ నగదు, ఆయుధాలు వెలుగు చూశాయి. ఏకే -47 తుపాకీ, 9 ఎంఎం ఇటాలియన్ పిస్టల్, పాయింట్ 38 రివాల్వర్, 383 తుపాకీ తూటాలతో పాటు రూ. 16.50 లక్షలు, 3,550 బ్రిటీషు ఫౌండ్లను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. అమృతసర్‌లోని ఇంద్రజిత్ వ్యక్తిగత ఇంట్లోనూ సిట్ సోదాలు నిర్వహించింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు సిట్ చీఫ్ హరప్రీత్ సిద్ధూ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు సిట్ ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాల అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎన్నికల్లో ఆయన హామీయిచ్చారు. డ్రగ్స్ దందాను సంబంధాలున్న పోలీసులను వదలబోమని ఆయన హెచ్చరించారు. -
విమానంలో హెరాయిన్.. పాక్‌కు ఎదురుదెబ్బ
లండన్: తమ విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకుని అనవసర తనిఖీలు నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బతగిలింది. పాక్ విమానంలో తమకు మత్తుపదార్థాలు దొరికినట్లు బ్రిటన్ బోర్డర్ ఫోర్స్ బాంబు పేల్చింది. లండన్‌కు చెందిన జాతీయ నేర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించింది. దీంతో వారు విచారణ ప్రారంభించారు. పాకిస్థాన్ అంతర్జాతీయ విమానాయన సంస్థ(పీఐఏ)కు చెందిన విమానం ఒక దానిని సోమవారం లండన్‌కు వచ్చిన తర్వాత తెల్లవారు జామున 2.30గంటల ప్రాంతంలో ప్రయాణీకులను దించేసిన అనంతరం 14మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం విమానంలో తనిఖీలు నిర్వహించారు. రెండుగంటల తర్వాత విమానాన్ని వదిలిపెట్టారు. అయితే, ఈ విషయంపై పాక్ మండిపడింది. ఎలా తమ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటారని, లండన్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఫిర్యాదు కూడా చేస్తామంటూ బీరాలు పోయింది. అయితే, తాజాగా ఆ విమానంలో తాము చేసిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్ దొరికిందంటూ అధికారులు చెప్పారు. ఆ సందర్భంలో ఎలాంటి హడావుడి చేసినా అది పెద్ద మొత్తంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో తాము తొలుత పాక్ చెప్పలేదని ఆ తర్వాతే చెప్పామని అన్నారు. అయితే, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ హెరాయిన్ ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని, ఈ విషయాన్ని పాక్‌కు అధికారికంగా తెలియజేశామని చెప్పారు. -
కుక్క బోనులో పది కిలోల హెరాయిన్
న్యూయార్క్: కుక్క బోనులో పది కిలోల హెరాయిన్‌ను దొంగచాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. బ్రాంక్స్ ఏరియాకు చెందిన శామ్యూల్ సీబ్రూక్స్(35), కార్మెల్‌కు చెందిన బెటన్కోర్ట్ మొరేల్స్(27) మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ న్యూయార్క్‌లో పట్టుబడడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీబ్రూక్స్, బెటన్కోర్ట్ మొరేల్స్ ఇద్దరూ బ్రాంక్స్‌లోని ఓ హోటల్లో శుక్రవారం రాత్రి కలుసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు వాహనాల్లో న్యూయార్క్ కెన్నడీ ఎయిర్‌పోర్టులోని పార్సిల్ సర్వీస్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ప్యూర్టోరికో నుంచి బోనుతో సహా వచ్చిన లాబ్రడార్ జాతి కుక్క పార్సిల్‌ను వారు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మొదటగా బెటన్కోర్ట్ మొరేల్స్ లోపలికి వచ్చి కౌంటర్ వద్ద సంతకం చేసి, పార్సిల్‌ను తీసుకోబోయాడు. అయితే, వీరి కదలికలపై కన్నేసి ఉంచిన నిఘా వారు.. లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుక్క బోనును పరీక్షగా చూడగా అడుగున ప్రత్యేకంగా ఉన్న అరలో దాచిన పది పొట్లాల్లో ఉన్న పది కిలోల హెరాయిన్ బయటపడింది. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్న నేరం కింద వారిద్దరికీ సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. -
కేక్ మిక్సింగ్‌లో పాల్గొన్న నటి
-
హీరోయిన్.
-
12 మంది విమాన సిబ్బంది అరెస్ట్
లాహోర్: విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమరవాణా చేస్తూ పట్టుబడే వ్యక్తులను సధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్‌లైన్స్ సిబ్బందే అక్రమరవాణాకు పాల్పడితే..! అదే జరిగింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన 12 మంది సిబ్బంది హెరాయిన్ అక్రమరవాణా చేస్తూ ఆదివారం పట్టుబడ్డారు. లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్(ఎఎన్‌ఎఫ్).. విమానం టాయ్లెట్లో 6 కిలోల హెరాయిన్‌ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. తమ సిబ్బంది 12 మంది అరెస్టు అయిన విషయాన్ని పీఐఏ స్పోక్స్ పర్సన్ డానియల్ గిలానీ ధృవీకరించారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పీఐఏ సిబ్బంది ఇటీవల డ్రగ్స్, సిగరెట్లు, అక్రమ పాస్‌పోర్ట్‌లు, మొబైల్ ఫోన్లు తరలిస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారింది. అయితే.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో సిబ్బంది ప్రమేయం ఉడటం కలకలం సృష్టిస్తోంది. -
పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం
అమృత్ సర్: మాదక ద్రవ్యాలను నిరోధించడంలో భద్రతా సిబ్బంధి మరో కీలక ముందడుగు వేశారు. పంజాబ్, పాకిస్థాన్ సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) బలగాలకు, మాదక ద్రవ్య ముఠాకు మధ్య బుధవారం పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం వారి వద్ద నుంచి భద్రతా దళాలు 21 కిలోల హెరాయిన్, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారని ఆధికారులు వెల్లడించారు. -
మత్తు...చిత్తు
నేడు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం కడప: చాలా మంది మాదక ద్రవ్యాల మత్తులో జోగుతున్నారు. ఎక్కువగా ఆల్కాహాల్, గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఓపీయాడ్ ఇంజెక్షన్లు వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. వీటిని వినియోగిస్తూ తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో 100కి 30 మంది వీటి బారిన పడుతున్నారు. కడప రిమ్స్‌కు చికిత్స కోసం వచ్చే ప్రతి 100 మందిలో 10 మంది ఇలాంటి వారే ఉన్నారు. ఆడవారిలో ప్రతి 100 మందిలో ఐదుగురు మత్తుకు బానిసలవుతున్నారు. ఆదివారం ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం... జిల్లాలో... జిల్లాలో ఎక్కువగా రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో గంజాయి ప్రభావం ఎక్కువగాఉంది. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల నుంచి బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలను తినుబండారాలు, ఔషధాల రూపంలో గల్ఫ్ దేశాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. నేడు కడపలో ర్యాలీ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆదివారం నిర్వహించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్లోని సభా భవనంలో సదస్సు నిర్వహిస్తారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు, పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎన్జీఓ సంఘాల వారు, ప్రజలు పాల్గొంటారు. అనర్థాలు మాదక ద్రవ్యాల బారిన పడితే మెదడుపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీరాన్ని అదుపు తప్పేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మత్తులోనే ఏ పని చేయడానికైనా సిద్ధ పడుతూ ఉంటారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జాగ్రత్తలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను చైతన్యపరిచి వాటి వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి వివరిస్తూ రావాలి. ముఖ్యంగా యువత త్వరగా ఆకర్షితులవుతారు. తమ పిల్లల ప్రవర్తన, వారి స్నేహాల గురించి తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. వారు పెరిగే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. విజయవంతం చేయండి రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా లీగల్‌సెల్ అథారిటీ వారు ఆదివారం చేపట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. - రాఘవరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కడప. వైద్యం తప్పనిసరి మాదక ద్రవ్యాల బారిన పడిన వారు వైద్యసేవలు చేయించుకోవాలి. రిమ్స్‌లో మానసిక వైద్యం విభాగంలో వైద్యసేవలను అందిస్తాం. - డాక్టర్ వెంకటరాముడు, రిమ్స్ మానసిక వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కడప. నిరంతర కృషి జిల్లాలో గంజాయి, హెరాయిన్ల ప్రభావం ఎక్కువగా ఉందని మా దృష్టికి రావడంతో నివారించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. - ప్రేమ్ ప్రసాద్, ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్, కడప. నిఘా పెంచుతాం జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణపై నిఘా పెంచుతాం. వీటిని ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - పిహెచ్డి రామకృష్ణ, ఎస్పీ -
హెరాయిన్ స్వాధీనం: ముగ్గురు అరెస్ట్
ఐజాల్ : హెరాయిన్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మిజోరాం ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 152 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు మిజోరాం ఎక్సైజ్ అండ్ నార్కోటెక్స్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి బుధవారం ఐజాల్‌లో వెల్లడించారు. అనంతరం వారిని విచారించగా పొరుగున ఉన్న మయన్మార్ నుంచి ఈ హెరాయిన్ చంపాయి జిల్లాలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు వారు వెల్లడించారని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కింద పలు సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరిది ఐజాల్ కాగా... మరోకరిది భారత్ - మయన్మార్ సరిహద్దు గ్రామమని అధికార ప్రతినిధి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ. 6 లక్షలు ఉంటుందన్నారు. -
భారీగా హెరాయిన్ పట్టివేత
రాయచోటి: వైఎస్సార్ జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. జిల్లాలోని చుండుపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి సుమారు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దీని విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేను శైలజ
-
హన్సికకు రక్తపరీక్ష
చెన్నై: తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా' అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు సలహా ఇచ్చారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. I can cry the loudest when it comes 2 taking a blood test!Thank god for my mothers patiences!Squeezed the poor thing!#earlymorncrybaby lol — Hansika (@ihansika) November 30, 2015 -
రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృతసర్: భారత్ - పాక్ సరిహద్దుల్లో 12 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు బుధవారం అమృతసర్‌లో వెల్లడించారు. సరిహద్దుల్లోని చిన్న బిద్ చంద్ సెక్టర్లోని పంటపోలాల్లో పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఈ హెరాయిన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు రాత్రి పూట గస్తీ తిరుగుతున్న సమయంలో పాకిస్థానీయులు ఈ హెరాయిన్ వదలి వెళ్లారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కానీ అయితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 60 కోట్లు ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉద్దర్ దరీవాల సెక్టర్లో ఆరు కిలోల హెరాయిన్ పట్టికున్న సంగతి తెలిసిందే. 2015లో సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు 230 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో 1150 కోట్లు ఉంటుందన్నారు. -
రూ.110 కోట్ల మత్తుపదార్థాలు స్వాధీనం
అమృతసర్: భారత కస్టమ్స్ అధికారులు, బీఎస్ఎఫ్ ఉమ్మడిగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి రూ.110 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి కొందరు వ్యక్తులు దీనిని సరిహద్దు గుండా భారత్‌కు తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం పాక్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గత రాత్రి కొన్ని అనుమానిత కదలికలు కనిపించాయి. దీంతో తెల్లవారగానే గాలింపు చర్యలు చేపట్టిన సరిహద్దు రక్షణ దళానికి మొత్తం 22 కేజీల హెరాయిన్ కంటబడింది. దీనిని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు ఇంకా చోటు చేసుకోలేదు. -
ఎల్బీనగర్లో కేజీ హెరాయిన్ పట్టివేత
హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో సోమవారం సుమారు ఒక కేజీ హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హెరాయిన్‌ను నార్కొటిక్ సెంట్రల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హీరోయిన్ అదా శర్మ తండ్రి మృతి
హైదరాబాద్: ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న అదా శర్మ తండ్రి నిన్న రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఆమె తల్లి తండ్రులకు ఒక్కర్తే కుమార్తె. చిన్నతనం నుంచీ ఆమె తన తండ్రి కెప్టెన్ ఎస్.ఎల్ శర్మ కు బాగా క్లోజ్ గా ఉండేది. దాంతో ఆమె తన తండ్రిని ఊహించని విధంగా కోల్పోవడటంతో ఒక్కసారిగా ఆమె చాలా బాధపడింది. ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. -
ఆ హీరోయిన్ను విడుదల చేయండి
ప్రజ్వల హోమ్‌కు నాంపల్లి కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయి, ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న సినీ నటిని విడుదల చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి ఎర్రమంజిల్ కోర్టు ఆదేశంతో రెస్క్యూ హోమ్‌లో ఉంటున్న విష యం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆమె తల్లి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం న్యాయమూర్తి టి.రజని విచారించారు. సదరు నటి మేజర్ అని రెస్క్యూ హోమ్‌లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. పోలీసులు చెబుతున్నదానిలో వాస్తవం లేదని.. ఆమెను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. సదరు నటిని హోం నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. -
హెరాయిన్ పట్టివేత
అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువచేసే హెరాయిన్‌ను చెన్నై లో పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, చెన్నై పోలీసుల సంయుక్తంగా పూందమల్లిలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 కిలోల హెరాయిన్‌తో పాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోచాపకింద నీరు లా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తరచూ పోలీసుల తనిఖీల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కోట్ల విలువచేసే మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ ముఠాను చెన్నైలో పోలీసులు అరెస్టు చే శారు. ఇటీవల ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఓ నింధితుడి వద్ద జరిపిన విచారణ మేరకు చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు మాద్యద్రవ్యాలు తరలుతున్నట్టు తేలింది. దీంతో ఢిల్లీ, చెన్నైలోని మాదక ద్రవ్యాల నియంత్రన విభాగం పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల క్రితం రవి అనే వ్యక్తి వద్ద జరిపిన విచారణతో పూందమల్లిలో ఓ ఇంట్లోని వ్యక్తి అనుమానాస్పదంగా తరచూ కళాశాలల వద్ద కనిపించినట్టు తేలింది. అతడి పేరు పెరుమాల్. అతడికి రవి అనే వ్యక్తి ఇంటిని అద్దెకు ఇప్పించినట్టు గుర్తించారు. ఆపరేషన్ ఢిల్లీ, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి పూందమల్లి నరసింహ నగర్‌లోని ఆ ఇంటి పరిసరాల్లో తిష్టవేశారు. శనివారం అర్థరాత్రి ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు. అక్కడి సూట్ కేసుల్లో ఉన్న పార్సిళ్లను పరిశీలించి హెరాయిన్‌గా తేల్చారు. ఆ ముగ్గురిలో ఒక రు తిరునల్వేలికి చెందిన పెరుమాల్‌గా గుర్తించారు. మరో ఇద్దరు శ్రీలంకకు చెందిన రఫీక్(61), డెఫిక్(41)గా తేల్చారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నిర్ధారణ అయ్యింది. వీరి వద్ద నుంచి పట్టుబడ్డ 18 కిలోల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.వంద కోట్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి కొందరు వాటి విలువ రూ.యాభై కోట్లు ఉండొచ్చని పేర్కొంటున్నారు. విచారణ వేగవంతం ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రధానంగా రఫీక్, డెఫిక్ల వద్ద విచారణ వేగవంతమైంది. శ్రీలంకకు చెందిన వాళ్లు ఇది వరకు చెన్నైలో పట్టుబడడం, వారంతా ఐఎస్ఐ ఏజెంట్లుగా తేల్చారు. ఈ దృష్ట్యా, తాజాగా పట్టుబడ్డ వీరు ఐఎస్ఐ ఏజెంట్లా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. అలాగే, నగర శివారుల్లో ఇరవై కళాశాలల పరిసరాల్లో తరచూ పెరుమాల్ కనిపిస్తుండడంతో, వీరి వలలో పడ్డ విద్యార్థుల వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ఉరకలు తీస్తున్నారు. -
ఆ హీరోయిన్‌తో పోలీసులకు చిక్కిన వ్యక్తి ఎవరు?
ఇటీవల ఓ వర్ధమాన హీరోయిన్ (కావాలనే పేరు రాయడంలేదు) ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికింది. మూడు నెలల పాటు ఆమెను రెస్క్యూ హోమ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆమెను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాల కోసం ఇలా చేయవలసి వచ్చిందని ఆ హీరోయిన్ చెప్పింది. ఆమె పట్టుబడిన రోజు నుంచి ఆమె నటించిన సినిమాలలోని సన్నివేశాలతో ఆమెపై కథనాలు, పనిలో పనిగా అంతకు ముందు ఇటువంటి కేసులలో పట్టుబడిన నటీమణుల వివరాలు, వారు నటించిన చిత్రాలలోని కథనాలతో ఎలక్ట్రానిక్ మీడియా అదరగొట్టేస్తోంది. కుటుంబ అవసరాల కోసమో లేక కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంపాలవడం వల్లనో లేక విలాసాలకు అలవాటుపడి వాటిని మానుకోలేక పలువురు నటీమణులు వ్యభిచార రొంపిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఓ హీరోయిన్ తన తల్లికి అనారోగ్యం అయినందున ఇందుకు సిద్ధపడినట్లు తెలిపింది. మరో నటి తన తండ్రికి అనారోగ్యం అయినందున ఈ వృత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పింది. మరో నటి అవకాశాలు లేక, ఆర్థికంగా చితికిపోవడం వల్ల వ్యభిచారం చేస్తున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా మన చట్టాల ప్రకారం వ్యభిచారం చేయడం నేరమే. అంతమాత్రాన ఈ నేరానికి ఇంత విస్తృత స్థాయిలో ప్రచారం ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ఇటువంటి కేసులలో విస్తృత ప్రచారం ద్వారా హీరోయిన్లు, యువతులే బలవుతుంటారు.ఆ విటులను పట్టించుకునేవారు ఉండరు. వారు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. వారు అందరినీ 'మేనేజ్' చేసేస్తుంటారు. తమ పేరు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడుతుంటారు. వీరికి మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కూడా ఏదోవిధంగా తప్పించుకుంటుంటారు. ఇటీవల దొరికిన హీరోయిన్‌తోపాటు చిక్కిన వ్యక్తి ఎవరు? ఆ హీరోయిన్ ఆర్థికంగా చితికిపోయి చట్టప్రకారం తప్పే అయినా ఈ పనిలోకి దిగింది. హీరోయిన్ వద్దకు వెళ్లాడంటే ఓ స్థాయిలో డబ్బు ఇచ్చి ఉంటాడు. అంత డబ్బు ఇవ్వగలిగినవారు ఏ ఉన్నత అధికారి కొడుకో, ఏ వ్యాపారో లేక వ్యాపారి కొడుకో, ఏ రాజకీయ నాయకుడి కొడుకో అయి ఉంటాడు. అతని పేరు ఎందుకు బయటకు రాలేదు?. అతని ఫొటో ఎందుకు చూపించడంలేదు? అతను అందరినీ 'మేనేజ్' చేశారా? ఆ మధ్యవర్తి ఎవరు? ఇటువంటి విషయాలను ఆలోచించవలసి ఉంది. మన చట్టాలు సహజీవనాన్ని అంగీకరిస్తున్నాయి. సహజీవనానికి నిర్వచనం ఏమిటి? కొందరు రెండేళ్లు, మరికొందరు ఏడాది, ఇంకొందరు ఆరు నెలలు సహజీవనం చేస్తుంటారు. మరీ బొరు కొట్టిన కొందరు ఒక నెల రోజులే సహజీవనం చేసి, విడిపోతుంటారు. అటువంటి సహజీవనంతో పోల్చుకుంటే వీరు నేరస్తులు అవుతారా? ఇటువంటి అంశాలను ఆలోచించవలసి ఉంది. స్త్రీ, పురుష సంబంధాలు- సహజీవనానికి సంబంధించి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనించి, భారతీయ సంస్కృతి దెబ్బతినకుండా అవసరమైతే చట్టాలను మార్చడానికి అవకాశం ఉందేమో ఆలోచించవలసిన అవసరాన్ని ఇటువంటిసంఘటనలు గుర్తు చేస్తున్నాయి. - శిసూర్య -
బాండ్లపైనే భరోసా..
సెలబ్రిటీ స్టైల్.. ఫ్లాప్‌తో సినీ కెరియర్ను ప్రారంభించిన కత్రినా కైఫ్ .. నేడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్. హాటెస్ట్ సెలబ్రిటీ, సెక్సీయస్ట్ ఏషియన్. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన టాప్ 10 సంపన్న సెలబ్రిటీల లిస్టులో నిల్చిన ఏకైక నటి. మల్లీశ్వరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నటన, అఫైర్స్ గురించిన విమర్శలు ఎలా ఉన్నా.. ఆర్థిక విషయాల్లో కత్రినా కైఫ్ చాలా క్రమశిక్షణగానే ఉంటుంది. డబ్బును గౌరవిస్తుంది. అలాగే, తల్లి సూసాన్ చేపట్టే సామాజిక కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకుంటూ ఉంటుంది. ఆర్థిక అంశాల గురించి మరిన్ని వివరాలు కత్రినా మాటల్లోనే.. ‘మాది చాలా పెద్ద కుటుంబం. అలాగని పెద్దగా ఆస్తిపాస్తులూ లేవు. కాబట్టి డబ్బు విలువ నాకు బాగా తెలుసు. అలాగే కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా ఉండటం ఎంత ముఖ్యమో కూడా తెలుసు. కాబట్టే దానికి ప్రాధాన్యమిస్తాను. నేను అస్సలు ఎక్కువగా షాపింగ్ చేయడం గానీ భారీ ఖర్చులు గానీ చేయను. వ్యక్తిగతంగా నేను చాలా సింపుల్‌గా డ్రెస్ చేసుకోవడాన్ని ఇష్టపడతాను. నా దుస్తులు నేనే కొనుక్కుంటాను. ఖరీదైన డ్రెస్సులు కొనను. ఖరీదైన వాచీలు, ఆభరణాల జోలికి కూడా పోను. ఇలాంటివి అనవసర ఖర్చులని నా ఉద్దేశం. ట్రావెల్‌పై మాత్రమే కాస్త ఖర్చుపెడతాను. మరీ ఏదైనా బాగా నచ్చితే కొంటాను.. లేకపోతే షాపింగ్ తక్కువగానే ఉంటుంది. నా మటుకు నేను ఫిక్సిడ్ డిపాజిట్లు, బాండ్లు వంటి సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతాను. మహిళలు ఇన్వెస్ట్ చేయడానికి రియల్టీ కూడా మంచి సాధనమే. ప్రస్తుతానికైతే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ నేను పెద్దగా చేయలేదు కానీ చేయాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ వేడుకల్లాంటి పార్టీల్లో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు కానీ లండన్‌లో మరో ఇల్లు కొనుక్కోగలిగేంత భారీ అమౌంటుని ఎవరైనా ఆఫర్ చేస్తే.. ఆలోచిస్తా’. -
25 కిలోల హెరాయిన్ స్వాధీనం
అమృత్సర్: పంజాబ్‌లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పంజాబ్ స్పెషల్ నార్కోటిక్ సెల్ పోలీసులు అమృత్సర్ సమీపంలో ని కొహాలీ గ్రామంలో డ్రగ్స్ ముఠా స్థావరంపై దాడి చేశారు. 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా అతని సహాయకుడు పోలీసుల నుంచి తప్పించుకుని బైక్‌పై పారిపోయాడు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 25 కోట్ల రూపాయిలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీన్ని పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్టు తెలిపారు. నిందితులకు పాకిస్థాన్ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని చెప్పారు. -
50 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
-
అనంతపురంలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్
-
నాకు అంత సీన్ లేదు!
ప్రణీత అంటే ఐరన్ లెగ్!... ‘అత్తారింటికి దారేది’ ముందు వరకూ ఆమెకు అదే ఇమేజ్. ఆ సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్డమ్ వచ్చేసిందామెకు. కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం బాపు బొమ్మలాగానే ఉంటుంది. స్మయిలిష్‌గా... స్టయిలిష్‌గా కనబడే ప్రణీతతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారట..? ప్రణీత: అవును. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్సే. మాకు బెంగళూరులో ఆస్పత్రి ఉంది. ‘నువ్వు డాక్టర్ అవాలి’ అంటూ చిన్నప్పట్నుంచీ చెబుతూ పెంచారు నన్ను. నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా చాలా ఒత్తిడిగా అనిపించేది. మార్కులైతే వందకు వంద రావాలనేవారు. అందుకని ఎప్పుడూ పుస్తకాలతో బిజీగా ఉండేదాన్ని. మరి.. హీరోయిన్ అవుతానంటే ఏమన్నారు? ప్రణీత: చాలామంది పేరంట్స్‌లానే కుదరదంటే కుదరదన్నారు. నేను ఏమాత్రం ట్రై చేయకుండానే నాకు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. ఒకవేళ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా ‘పోకిరి’ కన్నడ రీమేక్ ‘పొర్కి’ ద్వారా హీరోయిన్ అయ్యాను. అందమైన అమ్మాయిలకు ప్రేమలేఖలు రావడం సర్వసాధారణం. మరి మీరెన్ని అందుకున్నారు? ప్రణీత: ఒక్కటి కూడా అందుకోలేదు. పోనీ.. మీరెవరికైనా రాశారా? ప్రణీత: పుస్తకాల్లో పాఠాలు రాసుకోవడం తప్ప ప్రేమలేఖలు రాసేంత సీన్ నాకు లేదు. అసలు ఆ యాంగిల్లో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయినీ చూడలేదు. మీలా సన్నగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రణీత: నూనె లేకుండా చేసిన వంటకాలు తినాలి. హోటల్‌కెళ్లినప్పుడు, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసి, ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయాలని చెబుతుంటాను. అప్పుడు ‘కొంచెం కూడా నూనె లేకుండా ఎలా వండమంటారు?’ అని కుక్స్ అడిగితే, ఎలాగోలా వండండి. నాకు మాత్రం ఆయిల్ ఫ్రీ ఫుడ్డే కావాలని చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే ఆహారం విషయంలో హద్దులు పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగానూ ఉండగలుగుతాం. అలాగే వ్యాయామాలు చేయాలి. సినిమాల్లో పాత్రకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. విడిగా మీ అభిరుచి ఏంటి? ప్రణీత: సినిమా తారలు సమ్మర్లో స్వెటర్ వేసుకుని బయటికెళ్లినా, ‘ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుందేమో’ అనుకుని అది ఫాలో అవుతారు చాలామంది. అందుకే, నేను దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత స్టయిలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. డాక్టర్ అవకుండా యాక్టర్ అయ్యామని ఎప్పుడైనా ఫీలయ్యారా? ప్రణీత: అస్సలు లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పశ్చాత్తాపపడను. ఎన్నో రకాల జీవితాలను తెరపై జీవించే అవకాశం ఒక్క కళాకారులకే ఉంటుంది. ఒక్కో పాత్ర మాకు ఒక్కో పాఠం. ఆ పాత్ర తాలూకు అనుభవాలు ఒక్కోసారి మా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే షూటింగ్లో భాగంగా మేం విదేశాలకూ వెళుతుంటాం. అక్కడి వేష, భాషలు సంప్రదాయాలు తెలుస్తుంటాయి. మన దేశంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు తెలుస్తాయి. వాటిలో ఆచరించదగ్గ మంచి విషయాలుంటాయి. మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ప్రణీత: ఒక్క పౌరాణిక పాత్రైనా చేయాలని ఉంది. ఆ పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఆ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్స్‌కి థ్రిల్ అయిపోతుంటాను. అరుంధతి, మగధీర చిత్రాలను ఎగ్జయిట్‌మెంట్‌తో చూశాను. సేవా కార్యక్రమల సంగతేంటి? ప్రణీత: కచ్చితంగా చేస్తాను. దానికోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టాను. ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి నాకు కుదిరినంతవరకూ సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది. -
ఢిల్లీలో రూ. వంద కోట్ల హెరాయిన్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ 47 కిలోలు, కొకైన్ 2 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ 100 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్ నుంచి డ్రగ్స్ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు బటాలా జిల్లా నుంచి వీటిని అక్రమ రవాణా చేసుకున్నట్టు భావిస్తున్నారు. శ్రీలంకతో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. -
పాక్ స్మగ్లర్ల కాల్చివేత, 120 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ఒకటి కాదు.. రెండు కాదు.. 24 కిలోల హెరాయిన్. దాని విలువ రూ. 120 కోట్లు. ఇంత హెరాయిన్‌ను పాకిస్థానీ స్మగ్లర్లు భారతదేశంలోకి తరలిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వారిని కాల్చిచంపారు. ముల్లాపూర్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ దళాలపై వారు కాల్పులు జరపడంతో జవాన్లు తిప్పికొట్టగా ముగ్గురు స్మగ్లర్లు చనిపోయారు. తెల్లవారిన తర్వాత మృతదేహాల వద్ద గాలించగా, వారివద్ద రూ. 120 కోట్ల విలువైన 24 కేజీల హెరాయన్ దొరికింది. దీంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు కూడా స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని ఆయుధాలు, మరింత మొత్తంలో డ్రగ్స్ దొరికే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
హెరాయిన్ అక్రమ రవాణా అనుమానం
కైకలూరు/కైకలూరు టౌన్ : మత్తు పదార్థం అక్రమ రవాణా అనుమానంపై డెరైక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం మండలంలోని గోపవరం ఐస్ ప్యాకింగ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెన్నై, హైదారా బాదు బ్రాంచీలకు చెందిన 15 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 10 గంటల వర కు సిబ్బందిని విచారణ చేశారు. నాగిరెడ్డి నారాయణరావుకు చెందిన ప్యాకింగ్ సెంటర్‌ను కైకలూరుకు చెందిన జాన్‌బాబు కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఇక్కడ చేపల లోడుకు సిద్ధంగా ఉంచిన ఏపీ 35టీ 6934 లారీలో ఇసుకను అధికారులు ఆసాంతం పరిశీలించారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే చేపల లోడు లారీల్లో అడుగుభాగాన హెరాయిన్ రవాణా అవుతుందనే సమాచారంతో ఈ దాడి చేసి నట్లు తెలుస్తోంది. చివరకు అధికారులు మాట్లాడుతూ సోదాలు చేయడానికి ఇక్కడకు వచ్చామని... ఎటువంటి మత్తుపదార్ధాలు దొరకలేదని చెప్పారు. తీగ లాగితే డొంక కదిలింది డెరైక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం ముందుగా జిల్లాలోని నిడమానూరులో లారీడ్రైవర్ చదర్లమూడి సురేష్ బాబును ఈ విషయంపై అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు విజయవాడలో ఉంటున్న యలమంచిలి సీతారామప్రసాద్ (నాని)ని అదుపులోకి తీసుకున్నారు. నాని మండవల్లి మండలం కాకతీ యనగర్కు చెందిన వ్యక్తి. గతంలో ఇక్కడ చేపల వ్యాపారం చేసి నష్ట్రాలు రావడంతో విజయవాడలో ఉంటున్నాడు. అతనికి చెందిన లారీ గోపవరంలోని జాన్‌బాబు ఐస్ప్యాకింగ్ సెంటర్‌కు బుధవారం రాత్రి వచ్చింది. దానిని అనుసరించి అధికారులు వచ్చారు. జాన్‌బాబు మరికొందరిని విచారించారు. సాధార ణంగా చేపల లోడులో ఊకపొట్టును ఉపయోగిస్తారు. అలాంటిది ఈ లారీలో సగ భాగం ఇసుక ఉంది. ఇందులో మత్తుపదార్థం దాచి ఉంచారనే అనుమా నంతో ఇసుకను జల్లెడపట్టారు. ముందస్తు సమాచారం తెలియడంతో సరుకును మాయం చేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు అనుమాని తులుగా భావించి సురేష్, నాని, లారీ డ్రైవర్ బాలరాజును విచారణ నిమిత్తం డీఆర్ఐ అధికారులు తీసుకువెళ్లారు.ల ారీని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.