8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్‌ | 8 Pakistan nationals held with drugs worth Rs 150 crore off Gujarat coast | Sakshi
Sakshi News home page

8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్‌

Published Fri, Apr 16 2021 5:51 AM | Last Updated on Fri, Apr 16 2021 5:51 AM

8 Pakistan nationals held with drugs worth Rs 150 crore off Gujarat coast - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జఖావు తీరంలో ఒక ఫిషింగ్‌ బోట్‌లో 8 మంది పాకిస్తానీలను, 30 కేజీల హెరాయిన్‌ను భారత తీర రక్షణ దళం పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన బోటు నిషేధిత డ్రగ్స్‌తో భారత సముద్ర జలాల్లోకి వచ్చిందన్న సమాచారంతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ), గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ బోటు నుంచి రూ. 150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని  ఐసీజీ ప్రకటించింది. గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక దళానికి వారిని అప్పగించినట్లు తెలిపింది. హెరాయిన్‌ను గుజరాత్‌ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో తరలించాలన్నది వారి పన్నాగమని పేర్కొంది. ఏడాదిలో స్మగ్లర్ల నుంచి రూ. 5,200 కోట్ల విలువైన 1.6 టన్నుల డ్రగ్స్‌ను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement