Pakistani Fishing Boat Intercepted In Indian Water Carrying Weapons - Sakshi
Sakshi News home page

భారత్‌ జలాల్లోకి పాక్‌ ఫిషింగ్‌ బోట్‌..అప్రమత్తమైన అధికారులు

Published Mon, Dec 26 2022 7:54 PM | Last Updated on Mon, Dec 26 2022 9:05 PM

Pakistani Fishing Boat Intercepted In Indian Water Carrying Weapons - Sakshi

భారత్‌ జలాల్లోకి ప్రవేశించిన పాక్‌ ఫిషింగ్‌ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్‌ ఫిషింగ్ బోట్‌ అల్‌ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్‌ కోస్ట్‌ గార్డ్‌ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్‌ కోస్ట్‌ గార్డ్‌ ట్విట్టర్‌లో తెలిపింది.

ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది.

(చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్‌లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement