fishing boat
-
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు
భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. (చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం) -
మూవీని మించిన బ్రతుకు పోరాటం.. నడి సంద్రాన ప్రాణాల కోసం ఆరాటం
మనిషి జీవితంలో కొన్ని ఘటనలు జీవించి ఉన్నంత కాలం గుర్తుండిపోతాయి. ప్రకృతి విపత్తు, మానవ తప్పిందం కారణంగానో జీవితంలో ఊహించిన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి ఘటనల వల్ల చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పటో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్ అనే వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుడటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. అయితే, ఆరోజు అతడికి అదృష్టం కలిసివచ్చింది. పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్ సముద్రంపై తేలడం చూశాడు. దీంతో వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫీజర్ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది. అప్పటికైతే ఫ్రీజర్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నా తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. ఇలా దాదాపు 11 రోజులపాటు ఫ్రీజర్‌లోనే తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. సరిగ్గా అదే సమయంలో అతడిలాగే సముద్రంలోకి బోటులో కొందరు వ్యక్తులు చేపల వేటకు వచ్చారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడుతున్న ఫ్రీజర్‌ను చూసి అటుగా బోటును అటుగా తిప్పారు. వారి ఊహించిన రీతిలో రోడ్రిగో కనిపించడంతో అతడిని తమ బోటులోకి ఎక్కించుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని సురినామ్ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో 11 రోజుల జీవితంలో విధితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. 🇧🇷 Un pescador brasileño pasó 11 días en el mar sin comida ni agua, pero sobrevivió flotando dentro de un congelador. Romualdo Macedo Rodrigues, de 44 años, partió del norte de Brasil en un bote de madera a fines de julio. ⬇️⬇️ pic.twitter.com/rw8MSsCV5s — Tribuna Digital7 (@TribunaLibreES) September 4, 2022 -
గుజరాత్ సముద్ర తీరంలో పాక్ బోటు పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలోని భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవతోపాటు అందులోని 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు భారత తీరరక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ సమయంలో పాక్‌కు చెందిన యాసీన్ అనే పడవ భారత ప్రాదేశిక జలాల్లోకి 11 కిలోమీటర్ల దూరం చొచ్చుకురావడాన్ని ఐసీజీ పసిగట్టింది. చదవండి: సెన్సార్ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో? వెంటనే పడవలోని సిబ్బందిని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోగా, పాక్ జలాల్లోకి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. వెంటనే అప్రమత్తమై ఆ పడవను అడ్డగించి, అదుపులోకి తీసుకున్నట్లు ఐసీజీ వెల్లడించింది. పాక్‌లోని కేతిబందర్‌లో రిజిస్టరై ఉన్న ఆ పడవలోని 2 వేల కిలోల చేపలు, 600 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశామని తెలిపింది. ఆ పడవను పోర్బందర్లో నిలిపి ఉంచి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. -
ఇరాన్ అక్రమ ఆయుధ రవాణాకు అమెరికా చెక్
దుబాయ్: ఇరాన్ నుంచి యెమెన్‌కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలష్నికోవ్ తరహా రైఫిళ్లు, మెషీన్ గన్స్, రాకెట్ గ్రనేడ్ లాంచర్లతోపాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ ఓకేన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు. -
8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జఖావు తీరంలో ఒక ఫిషింగ్ బోట్లో 8 మంది పాకిస్తానీలను, 30 కేజీల హెరాయిన్‌ను భారత తీర రక్షణ దళం పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన బోటు నిషేధిత డ్రగ్స్‌తో భారత సముద్ర జలాల్లోకి వచ్చిందన్న సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ బోటు నుంచి రూ. 150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ ప్రకటించింది. గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళానికి వారిని అప్పగించినట్లు తెలిపింది. హెరాయిన్‌ను గుజరాత్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో తరలించాలన్నది వారి పన్నాగమని పేర్కొంది. ఏడాదిలో స్మగ్లర్ల నుంచి రూ. 5,200 కోట్ల విలువైన 1.6 టన్నుల డ్రగ్స్‌ను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. -
ఈత కొట్టి, చేపలు పట్టిన రాహుల్.. వైరల్
కొల్లాం: కేరళలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అతి పెద్ద సాహసమే చేశారు. కొల్లాం సముద్రంలో వారితో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా సముద్రంలోకి దూకి కాసేపు ఈత కొట్టారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం తెల్లవారుజామున వాడి బీచ్ నుంచి మత్స్యకా రులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. మీ పని అంటే గౌరవం పడవ తిరిగి ఒడ్డుకు వచ్చాక థంగస్సెరీ బీచ్ దగ్గర మత్స్యకారులనుద్దేశించి రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మీరు చేసే పనిని నేను ఎంతో గౌర విస్తాను. ఆరాధిస్తాను. మేము లొట్టలేసుకుంటూ చేపలు తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్లోకి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇవాళే అర్థమైంది’’ అని రాహుల్ అన్నారు. సముద్రంలో సాహసం వల వేశాక మత్స్యకారులతో కలసి రాహుల్ కూడా సముద్రంలో దిగారు. హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. దాదాపు 10 నిమిషాలు ఈత కొట్టినట్టుగా ఆయనతో పడవలో ప్రయాణించిన కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఎవరితో చెప్పకుండా హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు. హమ్ దో.. హమారే దో! గుజరాత్లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు విసిరారు. ‘హమ్ దో.. హమారే దో(మేమిద్దరం.. మాకిద్దరు)’ అనే హ్యాష్ ట్యాగ్‌తో బుధవారం ఒక వ్యంగ్య వ్యాఖ్యను ట్వీట్ చేశారు. ‘వాస్తవాలు ఎంత అందంగా బయటపడుతున్నాయో చూడండి. స్టేడియం పేరు నరేంద్ర మోదీ స్టేడియం. ఒక ఎండ్ పేరు అదానీ ఎండ్, మరో ఎండ్ పేరు రిలయన్స్ ఎండ్. పరిపాలన బాధ్యతల్లో జే షా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా, స్టేడియంలోని రెండు ఎండ్లను అదానీ, రిలయన్స్ ఎండ్స్గా నిర్ణయించడాన్ని రాహుల్ ఇలా ఎద్దేవా చేశారు. కాగా, ఈ పేరు మార్పు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. కేవలం స్టేడియం పేరును మాత్రమే మార్చామని, మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు సర్దార్ పటేల్ పేరుపైననే కొనసాగుతుందని వివరణ ఇచ్చింది. ప్రధాని దార్శనికతకు గౌరవం.. గుజరాత్లో నిర్మించిన స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేయడాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమర్ధించారు. ఇది క్రీడారంగంలో భారత్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ దార్శనికతను గౌరవించే వినమ్ర ప్రయత్నమని అభివర్ణించారు. స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు తొలగించి, ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ నాయకులు స్పందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ ఏ నాడూ గౌరవించలేదని ఆరోపించారు. అంతకుముందు, పటేల్ పేరును తొలగించి స్టేడియానికి మోదీ పేరు పెట్టడం సర్దార్ పటేల్‌నే కాదు.. భారతీయులని అవమా నించడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. -
మంటల్లో చేపల బోటు, తప్పిన ప్రమాదం
-
మంటల్లో బోటు, తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఔటర్ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, బోటులో మంటల్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. కొందరు మత్స్యకారులు శనివారం ఉదయం ఐదు గంటలకు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బోటులో మటలు చెలరేగగానే వారు పోర్టు ట్రస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంటల నుంచి తమను తాము కాపాడుకునేందుకు నీటిలో దూకారు. అంతలోనే స్థానిక యువకులు అక్కడకు చేరుకుని వారిని రక్షించారు. పోర్టు సిబ్బంది ప్రమాదం బారినపడ్డ బోటు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మత్స్యకారులు వాపోయారు. బోటు ఇంజన్ ద్వారా మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలిపారు. -
రూ 175 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ తీరంలో ఫిషింగ్ బోట్లో రూ 175 కోట్ల విలువైన హెరాయిన్ చేరవేస్తూ ఐదుగురు పాకిస్తానీలు పట్టుబడ్డారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఏటీఎస్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు పాకిస్తాన్ డ్రగ్ స్మగ్లర్లు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో ఈ సంయుక్త ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌లో భాగంగా అయిదుగురు పాకిస్తాన్ జాతీయులు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోటు నుంచి 35 ప్యాకెట్ల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దీర్ఘకాలంగా డ్రగ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన పాకిస్తానీలను కరాచీ వాసులైన అనీస్, ఇస్మాయిల్ మహ్మద్ కచ్చి, అష్రాఫ్ ఉస్మాన్, కరీం అబ్ధుల్లా, అబుబకర్ ఆష్రఫ్ సుమ్రాలుగా గుర్తించారు. -
సముద్రంలో పడవ బోల్తా.. 26 మంది మృతి
హోండురస్ : సముద్రంలో పీతల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడిన ఘటనలో 26 మృతి చెందారు. ఈ ఘటన కరీబియన్ తీరంలోని హోండురస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 47 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సముద్ర పీతల వేటపై అక్కడి ప్రభుత్వం సీజనల్ బ్యాన్ ఎత్తివేయడంతో జాలర్లు వేటకు బయలుదేరారు. 70 టన్నుల బరువుగల పెద్ద పడవలో వారు పీతల వేటకు తీరజలాల్లో ప్రవేశించారు. అయితే ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. పడవ కెప్టెన్ ప్రమాదపు సిగ్నల్ పంపినప్పటికీ.. కొద్ది సేపటికే అతను చనిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై భద్రతా దళాల అధికార ప్రతినిధి జోస్ మెజా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అక్కడికి దగ్గర్లోని ప్యూర్టో లెంపిరా ప్రాంతానికి చేర్చామని తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డవారిని అక్కడికే తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగేందుకు ముందే అదే ప్రదేశంలో మరో బోటు మునిగిపోయిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవరు చనిపోలేదని.. పడవలోని 40 సురక్షితంగా తీరానికి చేర్చామని వెల్లడించారు. -
హమ్మయ్యా.. వాళ్లు సేఫ్!
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ దమ్ములపేటకు చెందిన ఫిషింగ్ బోటు ఆచూకీ లభ్యమైంది. అందులో ఉన్న మత్స్యకారులందరూ సురక్షితంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్న సమీపంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు బోటులోని మత్స్యకారులు తెలిపారు. బోటులో ఆయిల్ అయిపోవడంతో ఈ గందరళగోళం ఏర్పడిందని మత్స్యకారులు తెలిపారు. ఆయిల్ అయిపోయిన విషయాన్ని బోటు యజమాని దృష్టికి తీసుకెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. దమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న సంగతి తెల్సిందే. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. అయితే మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
సముద్రంలో మత్స్యకారుల పడవలో మంటలు
-
బోటు బోల్తా : ఐదుగురి గల్లంతు
సియోల్ : దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటులో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతు కాగా... మరో ఐదుగురిని రక్షించినట్లు దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ వెల్లడించారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదం షినన్ కౌంటీలోని గాజీయో ద్వీపంలో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో చేపల వేట చేస్తున్న చైనా బోటుకు చెందిన సిబ్బంది ఈ ఐదుగురిని కాపాడారని పేర్కొన్నారు. బోటు ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని... ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.