
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ తీరంలో ఫిషింగ్ బోట్‌లో రూ 175 కోట్ల విలువైన హెరాయిన్ చేరవేస్తూ ఐదుగురు పాకిస్తానీలు పట్టుబడ్డారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఏటీఎస్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు పాకిస్తాన్ డ్రగ్ స్మగ్లర్లు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో ఈ సంయుక్త ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌లో భాగంగా అయిదుగురు పాకిస్తాన్ జాతీయులు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోటు నుంచి 35 ప్యాకెట్ల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దీర్ఘకాలంగా డ్రగ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన పాకిస్తానీలను కరాచీ వాసులైన అనీస్, ఇస్మాయిల్ మహ్మద్ కచ్చి, అష్రాఫ్ ఉస్మాన్, కరీం అబ్ధుల్లా, అబుబకర్ ఆష్రఫ్ సుమ్రాలుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment