
ముంబై : గుజరాత్ తీరంలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తాన్‌కు నౌకను భారత తీరప్రాంత గస్తీ దళం సీజ్ చేసింది. కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 100 కిలోల హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఈ ఫిషింగ్ నౌక పట్టుబడింది. ఈ నౌక నుంచి 194 నార్కోటిక్ పదార్ధాలున్న ప్యాకెట్లను భారత కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
పాకిస్తానీ నౌక అల్ మదీనాను సీజ్ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. అల్ మదీనా పేరుతో పాక్ నౌకను కరాచీలో రిజిస్టర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం పట్టుబడిన సిబ్బందితో సహా నౌకను జకువ హార్బర్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment