పాక్ పడవ పట్టివేత | Coast Guard intercepts Pak boat, seizes Rs 600 crore worth of heroin | Sakshi
Sakshi News home page

పాక్ పడవ పట్టివేత

Published Wed, Apr 22 2015 12:42 AM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM

పాక్ పడవ పట్టివేత - Sakshi

పాక్ పడవ పట్టివేత

రూ.600 కోట్ల మాదకద్రవ్యాల స్వాధీనం  8 మంది అరెస్టు
 
పోరుబందర్: గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఓ అనుమానాస్పద పడవను భారత నేవీ, తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.600 కోట్ల విలువైన 232 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న 8 మంది పాకిస్తాన్ సిబ్బందిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో.. నేవీ, కోస్ట్ గార్డ్‌లు సంయుక్తంగా సోమవారం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఐసీజీ డీఐజీ ఎస్‌ఈ గుప్తా మంగళవారం తెలిపారు. నేవీతో పాటు ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలు పాక్ సిబ్బందిని విచారించనున్నట్లు చెప్పారు.

విచారణ అనంతరం పడవను మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఇండియన్ కోస్ట్‌డార్డ్‌కు చెందిన నౌక సంగ్రామ్ పాక్ పడవను అడ్డుకోగా.. నేవీ నౌక కొండూల్ ఈ ఆపరేషన్‌కు పూర్తి సహకారం అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా మంగళవారం సంగ్రామ్ నౌకలో మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టారు. పడవ నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలతో పాటు శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ వ్యవస్థలను ప్రదర్శించారు. నాలుగు నెలల క్రితం అరేబియా సముద్రంలో పాక్ పడవ ఒకదానిని కోస్ట్‌గార్డ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా.. దాన్ని సిబ్బందిగా భావిస్తున్నవారే పేల్చివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement