ఇరాన్లో పాక్ జాతీయుడి ఉరితీత
Published Sat, Jan 9 2016 3:36 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్షను అమలు చేసింది. మత్తు మందులను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపిస్తూ పాక్ జాతీయుడు ఇబ్రాతుల్లాను గురువారం ఉరి తీసింది. స్థానికి మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది.
అటు ఈ వార్తలను అతని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.
అయితే ఇరాన్ అధికారులు అన్యాయంగా ఇబ్రాతుల్లాను ఈ కేసులో ఇరికించారని వాపోతున్నారు. ఇంకా మృతదేహం తమకు అప్పగించలేదన్నారు.కాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన ఇబ్రాతుల్లాను మూడు నెలల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతనిపై నేరం రుజువు కావడంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement