execute
-
ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా ఇచ్చింది. అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షిణ కొరియా 2017 నుంచి 2022 మధ్యలో తమ మాతృభూమిని వదిలో వచ్చేసిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది. నర్సు చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి .. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్‌లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించి ఏదైనా ఆన్లైన్లో షేర్‌చేసినా, అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ని చూస్తూ.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చెప్పినట్లు పేర్కొంది. మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టారాజ్యంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ..అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ సమర్పించింది. (చదవండి: మిస్టరీగా కొత్త వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో ముగ్గురు మృతి!) -
విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన
ఉత్తర కొరియాలో అద్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ నిరంకుశ పాలన గురించి తెలియంది కాదు. ఆయన పాలనలో ప్రజలు తనకు నచ్చినప్పుడూ నవ్వాలి, ఏడవాలి అన్నట్లుంటుంది. ప్రతిదీ తన అదుపు ఆజ్క్షలో ఉండాలనే మనస్తత్వంతో... ప్రజలపై పలురకాల అర్థం కానీ ఆంక్షలు పెట్లి ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇప్పుడూ అదీ కాస్తా మరోస్థాయికి చేరిందనేలా ఒక దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది. పసివాళ్లని జాలి కూడా లేకుండా ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు ఉరిశిక్ష విధించి మరోసారి ప్రపంచానికి తన కర్కశత్వ పాలనను చూపించాడు. అక్టోబర్ ప్రాంతంలో ఆ ఇద్దరు విద్యార్థులు చైనా సరిహద్దుగా ఉన్న ఉత్తరకొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. అక్కడ వారు దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారని సమాచారం. దీంతో ఉత్తరకొరియా అధికారులు ఆ మైనర్లను ప్రజల ముందే మరణశిక్ష విధించి.. కాల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా సాంస్కృతిక సాధనాలను నియంత్రించే సైద్ధాంతిక చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు ఉత్తర కొరియాలో డ్రామాలు, సంగీతం పట్ల పెరుగుతున్న ప్రజాదరణను లక్ష్యంగా చేసుకుని విదేశీ ప్రభావం ఉండకూదని అణిచివేతలో భాగంగా నిషేధించింది. వాస్తవానికి ఉత్తరకొరియాలోకి దక్షిణ కొరియా సినిమాలను అక్రమంగా రవాణా అవ్వటమే గాక ప్రజలు ఎవరికంట పడకుండా అతి రహస్యంగా వీక్షిస్తుండటం గమనార్హం. (చదవండి: ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్) -
ఏడుగురికి ఐసిస్ మరణదండన
బాగ్దాద్: యుద్ధ రంగం నుంచి పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మరణదండన విధించింది. తమ కీలక స్థావరం నుంచి మోసూల్ నగరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించినందుకు వీరికి మరణశిక్ష అమలుచేసినట్టు స్థానిక వెబ్ సైట్ 'అరా న్యూస్' వెల్లడించింది. 'ఈ ఏడుగురు సిరియా సరిహద్దులో ఆదివారం పట్టుబడ్డారు. అధినాయకత్వం అనుమతి లేకుండా తమ పదవులను వదిలిపెట్టారు. మొసూల్ నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. జాతిద్రోహానికి పాల్పడినందుకు వీరిని కాల్చిచంపార'ని మీడియా కార్యకర్త అబ్దుల్లా ఆల్-మల్లా వెల్లంచినట్టు 'అరా న్యూస్' తెలిపింది. మోసుల్ నగరాన్ని దక్కించుకునేందుకు అమెరికా సైనం సహకారంలో ఇరాక్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో ఐసిస్ తీవ్రంగా పోరాడుతోంది. మోసుల్ నగరాన్ని 2014లో ఐసిస్ స్వాధీనం చేసుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది. -
పాకిస్థాన్ వాసిని ఉరితీశారు
రియాద్: తమ దేశంలో హత్యకు పాల్పడిన ఓ పాకిస్థానీయుడిని సౌదీ అరేబియా ఉరి తీసింది. ఆదివారం ఉదయం పాక్ పౌరుడికి మరణ శిక్షను అమలుచేసినట్లు రియాద్ అధికారులు చెప్పారు. ఈ తాజా ఉరితో ఈ ఏడాది సౌదీలో అమలు చేసిన మొత్తం ఉరి శిక్షల సంఖ్య 79కి చేరింది. జెడ్డా అనే నగరంలో పాక్ చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళపై దోపిడికి పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుకున్నందుకు దారుణంగా పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అంతకుముందే ఆ వ్యక్తిపై పలు దోపిడీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ శిక్షను ఈ రోజు ఉదయం జెడ్డాలో అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది అమలుచేసిన మొత్తం ఉరిశిక్షల్లో 47 ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలతో అమలు చేసినవే ఉన్నాయి. కాగా, గత ఏడాదిలో సౌదీలో 153మందిని ఉరి తీశారు. -
ఇరాన్లో పాక్ జాతీయుడి ఉరితీత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్షను అమలు చేసింది. మత్తు మందులను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపిస్తూ పాక్ జాతీయుడు ఇబ్రాతుల్లాను గురువారం ఉరి తీసింది. స్థానికి మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. అటు ఈ వార్తలను అతని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. అయితే ఇరాన్ అధికారులు అన్యాయంగా ఇబ్రాతుల్లాను ఈ కేసులో ఇరికించారని వాపోతున్నారు. ఇంకా మృతదేహం తమకు అప్పగించలేదన్నారు.కాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఇబ్రాతుల్లాను మూడు నెలల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతనిపై నేరం రుజువు కావడంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
మరణశిక్షకు ముందు క్షమాపణలు
వాషింగ్టన్: విచారణలో ఉన్నంత సేపు తనకు క్షమాపణ భిక్ష పెట్టాలని కోరిన హంతకుడు మరణ శిక్ష అమలుగడువు సమీపిస్తుండగా మాత్రం మిన్నకుండిపోయాడు. పైగా తన వల్ల నష్టపోయిన కుటుంబానికి క్షమాపణలు తన చివరి మాటలుగా చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తిని దోపిడి చేసి అనంతరం హత్య చేసిన హంతకుడికి టెక్సాస్‌లో మరణ శిక్ష విధించారు. శిక్ష అమలుచేసే సమయానికి అతడి నుంచి ఎలాంటి పిటిషన్ రాకపోవడంతో శిక్షను అమలు చేశామని జైలు అధికారులు చెప్పారు. టెక్సాస్‌లో ఈ ఏడాదిలో ఇది 11వ మరణ శిక్ష. జువాన్ గార్సియా(35) అనే వ్యక్తి 1998లో ఓ వ్యక్తిపై దాడికి దిగి అతడి వద్ద నుంచి ఎనిమిది డాలర్లను లాగేసుకున్నాడు. అనంతరం అతడిపై కాల్పులు జరపడంతో బాధితుడు చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు గార్సియాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే, కేసు విచారణ ప్రారంభంలో పలుమార్లు తనకు క్షమా భిక్ష పెట్టాల్సిందిగా పిటిషన్లు పెట్టుకున్న గార్సియా ఉరి తీసే సమయంలో మాత్రం ఎలాంటి కోరిక కోరుకోకపోవడం విశేషం. పైగా తన నేరాన్ని అంగీకరించి, తాను హత్య చేసిన వ్యక్తి భార్యకు, కుమారుడికి తన తరుపున క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని చిన్నదేం కాదని, దాదాపు వారి జీవితానికి పెద్ద ముగింపుపలికే ప్రయత్నమేనని అన్నాడు. అనంతరం అతడికి లీథల్ ఇంజెక్షన్(ప్రాణంతీసే విషం)తో మరణ శిక్ష విధించారు. టెక్సాస్‌లో ప్రస్తుతం లీథల్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడిందట. -
'వీల్ చైర్లో ఉన్న నేరస్తుడిని ఎలా ఉరి తీయాలి'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఓ ఉరిశిక్షను అమలు చేయకుండా వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన సమయంలో ఉరి తీసే కార్యక్రమాన్ని నిలిపివేయడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఓ హత్య కేసు విషయంలో అబ్దుల్ బాసిత్ (43) అనే వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు గతంలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఉరిశిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష ప్రకారం అతడిని పంజాబ్‌లోని ఫైసలాబాద్ జైలులో మంగళవారం ఉదయమే ఉరితీయాలి. కానీ, అతడి విషయంలో గత కొంతకాలంగా హక్కుల సంఘంవారు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ నేరస్థుడు ఒక వికలాంగుడు. ప్రస్తుతం అతడు చక్రాల కుర్చీ మీద ఉండే జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. స్థానిక చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని ఉరితీసేముందు అతడు ఉరికంభం వద్ద నిల్చుని ఉన్నప్పుడే తలారీ అతడి మెడకు ఉరితాడు బిగించాలి. కానీ బాసిత్ వికలాంగుడు కావడం వల్ల నిల్చునే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే జైలు అధికారులు పంజాబ్ హోంశాఖను అభిప్రాయం కోరినా ఉరిశిక్ష అమలు తేదీ వరకు కూడా వారు ఓ నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి తలలు పట్టుకున్నారు. 2009లో బాసిత్ ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం టీబీ కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతంతోనే అతడు వీల్ చైర్లో ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. -
వారిని ఎందుకు వదిలేశారు..
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబుపేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను ఖరారు చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేసిన ఒవైసీ.. మెమన్ మరణశిక్షపై విమర్శలు గుప్పించారు. యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. బుధవారం అతనికి మరణశిక్షను ఖరారుచేసింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దోషులకు శిక్ష పడాల్సిందే.. మరి బాబ్రీ మసీదును కూల్చేసిన విధ్వంసకుల మాటేమిటని ప్రశ్నించారు. వారికి శిక్షలు ఎందుకు విధించరని ప్రశ్నించారు. ఒకవైపు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు శిక్షలు తగ్గిస్తూ, మరోవైపు మెమన్‌కు శిక్ష ఖరారు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. అయితే అందరూ సంయమనం పాటించాలని.. చట్టాలను, కోర్టులను గౌరవించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ మద్దతు లేనందువల్లే యాకూబ్‌కు ఉరిశిక్షను విధించారనేదే ఇప్పటికీ తన అభిప్రాయమన్నారు. యాకూబ్ పోలీసుల ముందు లొంగిపోయి, కీలకమైన సమాచారం అందించాడన్నారు. అయినా అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు యాకూబ్‌కు న్యాయం చేయలేదని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాం జెఠ్మలానీ ,శతృఘ్నసిన్హా తదితరులు కూడా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్నారని ఒవైసీ గుర్తు చేశారు. -
మహిళను ఉరితీసిన యూఏఈ
రియాద్: ఉగ్రవాద చర్యలకు పాల్పడిందనే కారణంతో గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ దేశానికి చెందిన ఓ మహిళను ఉరితీసింది. 2014 డిసెంబర్లో అమెరికాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హతమార్చిన నేపథ్యంలో ఆమెకు సోమవారం ఉదయం ఉరిశిక్షను అమలు పరిచింది. అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి(31) అనే మహిళ గత ఏడాది అబుదాబిలోని ఓ షాపింగ్ మాల్ టాయిలెట్లో ఇద్దరి కవలల తల్లి అయిన అమెరికన్ టీచర్ ఇబోల్యా ర్యాన్‌ను కత్తితో పొడవడమే కాకుండా అక్కడే మరో అమెరికన్ ఈజిప్టు వైద్యుడిపై బాంబుదాడికి పాల్పడింది. అంతేకాదు ఆమెపై ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాపింపజేసిన ఆరోపణలున్నాయి. ఈ నేరాలకు సంబంధించి ఆమెకు గత ఏడాది యూఏఈ కోర్టు ఉరిశిక్ష విధించగా సోమవారం అమలుచేసింది. అయితే, ఎలా ఉరితీశారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా నిరసించే దేశాల్లో యూఏఈ ఎప్పుడూ ముందే ఉంటుంది. -
ప్రాథమిక పాఠశాల టీచర్ కు మరణశిక్ష
బీజింగ్: విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన ప్రాథమిక పాఠశాల మాజీ టీచర్ కు చైనాలో మరణశిక్ష విధించారు. నిందితుడు లీ జిషున్ కు గురువారం గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో మరణశిక్ష అమలు చేసినట్టు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 4 నుంచి 11 ఏళ్ల వయసున్న 26 మంది చిన్నారులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు టియాన్ షుయ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ధారించింది. 2011-2012 మధ్యకాలంలో అతడీ అకృత్యాలకు పాల్పడినట్టు తేల్చింది. చిన్నపిల్లల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తరగతి గదులు, హాస్టళ్లలో అత్యాచారాలకు ఒడిగట్టాడని కోర్టు తెలిపింది. ఇలాంటి దురాగతాలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయనే భావనతో నిందితుడికి మరణశిక్ష విధించినట్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. మరోకేసులో ఐదుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విధించిన మరణశిక్షను కోర్టు రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఇటీవల కాలంలో లైంగిక వేధింపులు కేసులు పెరగడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 2012-2014 మధ్యకాలంలో చైనాలో 7,145 రేప్ కేసులను కోర్టులు విచారించాయి.