పాకిస్థాన్ వాసిని ఉరితీశారు | Saudi executes Pakistani convicted of murder | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ వాసిని ఉరితీశారు

Published Sun, Mar 27 2016 4:40 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM

పాకిస్థాన్ వాసిని ఉరితీశారు - Sakshi

పాకిస్థాన్ వాసిని ఉరితీశారు

రియాద్: తమ దేశంలో హత్యకు పాల్పడిన ఓ పాకిస్థానీయుడిని సౌదీ అరేబియా ఉరి తీసింది. ఆదివారం ఉదయం పాక్ పౌరుడికి మరణ శిక్షను అమలుచేసినట్లు రియాద్ అధికారులు చెప్పారు. ఈ తాజా ఉరితో ఈ ఏడాది సౌదీలో అమలు చేసిన మొత్తం ఉరి శిక్షల సంఖ్య 79కి చేరింది. జెడ్డా అనే నగరంలో పాక్ చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళపై దోపిడికి పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుకున్నందుకు దారుణంగా పొడిచి చంపేశాడు.

దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అంతకుముందే ఆ వ్యక్తిపై పలు దోపిడీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ శిక్షను ఈ రోజు ఉదయం జెడ్డాలో అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది అమలుచేసిన మొత్తం ఉరిశిక్షల్లో 47 ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలతో అమలు చేసినవే ఉన్నాయి. కాగా, గత ఏడాదిలో సౌదీలో 153మందిని ఉరి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement