bangladeshi woman
-
మోదీజీ.. మార్పించరూ
రద్దయిన పాతనోట్లు ఇప్పటికీ కోట్ల కొద్ది పట్టుబడుతున్నాయి. అయితే అదంతా బ్లాక్‌మనీ... బడాబాబుల డబ్బు. కానీ ఈ బంగ్లాదేశీ వనితది దీనగాథ. వేధింపులు భరించలేక పెళ్లయిన మూడేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఓ దుస్తుల తయారీ పరిశ్రమలో నెలకు రూ. 9 వేల జీతానికి పనిచేసేది. భారత్‌లో తనకు తెలిసిన వారున్నారని, అక్కడైతే నెలకు రూ.15,000 వరకు సంపాదించొచ్చని.. కలిసి పనిచేసే వ్యక్తి ఆమెకు ఆశ చూపాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అందుకు అంగీకరించిన ఆమె అతని వెంట వచ్చేసింది. ముంబై శివార్లలోని వాషికి తీసుకొచ్చి ఓ నేపాలీ మహిళకు రూ.50 వేలకు ఆమెను అమ్మేశాడా ప్రబుద్ధుడు. బెంగళూరుకు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. స్వదేశానికి పంపుతామని చెప్పి తర్వాత పుణేకు తరలించారు. అక్కడి బుధవార్పేట్లోని ఓ వ్యభిచార గృహం నుంచి 2015 డిసెంబర్లో పోలీసులు ఆమెను రక్షించారు. బంగ్లాదేశ్ నుంచి అనుమతి రావడానికి ఇన్నాళ్లూ వేచిచూసింది. ఆమె తమ పౌరురాలేనని ధ్రువీకరించుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే తన దగ్గర రూ.10 వేల పాతనోట్లు ఉన్నాయని, వీటిని మార్చుకోవడానికి సహకరించాలని కోరుతూ చేతిరాతతో రాసిన లేఖ ఫొటోను ఆమె ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. విటులు టిప్‌గా ఇచ్చిన డబ్బును కూడబెట్టుకున్నానని, నోట్ల రద్దు సమయంలో ఆ డబ్బు వ్యభిచార గృహ నిర్వాహకుల వద్ద ఉండిపోయిందని వివరించింది. ఈ అభాగ్యురాలి వేదన నెటిజన్లు పలువురిని కదిలించింది. -
పాకిస్థాన్ వాసిని ఉరితీశారు
రియాద్: తమ దేశంలో హత్యకు పాల్పడిన ఓ పాకిస్థానీయుడిని సౌదీ అరేబియా ఉరి తీసింది. ఆదివారం ఉదయం పాక్ పౌరుడికి మరణ శిక్షను అమలుచేసినట్లు రియాద్ అధికారులు చెప్పారు. ఈ తాజా ఉరితో ఈ ఏడాది సౌదీలో అమలు చేసిన మొత్తం ఉరి శిక్షల సంఖ్య 79కి చేరింది. జెడ్డా అనే నగరంలో పాక్ చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళపై దోపిడికి పాల్పడటమే కాకుండా ఆమె అడ్డుకున్నందుకు దారుణంగా పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాడు. అంతకుముందే ఆ వ్యక్తిపై పలు దోపిడీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ శిక్షను ఈ రోజు ఉదయం జెడ్డాలో అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది అమలుచేసిన మొత్తం ఉరిశిక్షల్లో 47 ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలతో అమలు చేసినవే ఉన్నాయి. కాగా, గత ఏడాదిలో సౌదీలో 153మందిని ఉరి తీశారు. -
వేశ్యవాటికపై దాడి, బంగ్లాదేశ్ యువతికి విముక్తి
భూపసంద్ర మెయిన్ రోడ్డు, వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యవాటికపై బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు నిర్వహిం చి వ్యభిచార కూపంలో మగ్గుతున్న బంగ్లాదేశ్ యువతికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వేశ్యవాటిక నిర్వాహకుడైన మండ్య జిల్లా కిక్కేరి తాలూకా కళ్లేనహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఇతర ప్రాంతాలనుంచి విటులను ఆకర్షించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. యువతిని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించి నిందితుడిపై సంజయ్‌నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. -
వేధించినవాడిని ఇంటికి పిలిచి.. యాసిడ్ దాడి
చాలాకాలంగా తనను వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీ మీద యాసిడ్ పోసినందుకు బంగ్లాదేశ్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఖదీముల్ ఇస్లాం (28) అనే చిరు వ్యాపారి ఈ యాసిడ్ డాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బలియాడంగీ ఉపాజిలా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఖదీమ్ తనను చాలాకాలంగా వేధిస్తున్నాడని, తాను వద్దంటున్నా వినకుండా లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ వెంటపడుతున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అరెస్టయిన మహిళ తెలిపింది. అతడు చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా వేధింపులకు పాల్పడటంతో తాను భరించలేకపోయానని, గత రాత్రి తన గదికి పిలిచానని తెలిపింది. అయితే తాను ఒప్పుకొన్నట్లు భావించిన అతడు వెంటనే రావడంతో గది తలుపులు మూసి అతడిపై యాసిడ్ పోసినట్లు వివరించింది. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే వచ్చి, అతడిని ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగాలు కూడా బాగా కాలిపోయినట్లు పోలీసులు చెప్పారు.