ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికుల కేకలు! | Saudi flight Catches Fire In Pakistan Peshawar Airport | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికుల కేకలు!

Published Thu, Jul 11 2024 4:41 PM | Last Updated on Thu, Jul 11 2024 4:49 PM

Saudi flight Catches Fire In Pakistan Peshawar Airport

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో తృటిలో ఘోర విమానం తప్పింది. సౌదీకి చెందిన ఎయిర్‌లైన్స్‌లోని పెషావర్‌లో ల్యాండ్‌ అవుతున్న సమయంలో మంటలు వ్యాపించడం అధికారులు గుర్తించారు. వెంటనే సహాయక బృందాలు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది.  ఇక, విమానం పెషావర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు వచ్చాయి.

ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక సిబ్బందికి చేరవేశారు. అనంతరం, విమానాన్ని వెంటనే ఎయిరో‌పోర్ట్‌లో నిలిపివేశారు. హుటాహుటిన ప్రయాణికులతోపాటు సిబ్బందిని విమానం నుంచి దింపివేశారు. తర్వాత విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.

 

 

ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విమానంలో గేర్‌ నుంచి మంటలు రావడానికి గల కారణాలను టెక్నికల్‌ టీమ్‌ అన్వేషిస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement