పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.
పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో కనీసం 44 మంది మరణించారని, వీరిలో 12 మంది యాత్రికులు ఇరాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు.
పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దులోని ఆజాద్ పట్టాన్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22మంది మరిణించారు. ప్రమాదంపై అత్యవసర సేవల ప్రతినిధి ఫరూక్ అహ్మద్ మాట్లాడుతూ..15 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా ఇప్పటి వరకు 22 మంది మరణించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
మరో దుర్ఘటనలో బలూచిస్తాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై పాకిస్థాన్ పౌరులు ఇరాన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరమైన రహదారిలో పోలీసుల నుంచి తప్పించుకుని ఇరాన్‌లోకి ప్రవేశించే క్రమంలో డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసు అధికారి అస్లాం బంగూల్జాయ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment