ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌ను హెచ్చరించింది. ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణలోకి తీసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ అధకార ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు.
‘సామూహిక విధ్యంసక ఆయుధ సంస్థల విస్తరణలు ఎక్కడ జరిగినా వాటికి వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తాం. చర్యలు తీసుకోవటం కొనసాగిస్తాం. ముఖ్యంగా ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. చైనా.. పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణీ కార్యక్రమానికి పరికరాలు, వస్తువులను సరాఫరా చేయటం మేము గమనించాం ’ అని వేదాంత్ పటేల్ అన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య 8 వాణిజ్య ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఒప్పందాలు కుదుర్చుకోవటంలో చర్చలు కొనసాగుతున్నా పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్‌పై అమెరికా హెచ్చరికలు తీవ్ర చర్చనీయాశం అయింది.
Comments
Please login to add a commentAdd a comment