trade deal
-
పాక్‌కు అమెరికా సాలిడ్ వార్నింగ్
ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌ను హెచ్చరించింది. ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణలోకి తీసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ అధకార ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు.‘సామూహిక విధ్యంసక ఆయుధ సంస్థల విస్తరణలు ఎక్కడ జరిగినా వాటికి వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తాం. చర్యలు తీసుకోవటం కొనసాగిస్తాం. ముఖ్యంగా ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. చైనా.. పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణీ కార్యక్రమానికి పరికరాలు, వస్తువులను సరాఫరా చేయటం మేము గమనించాం ’ అని వేదాంత్ పటేల్ అన్నారు.ఇరాన్ అధ్యక్షుడు పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య 8 వాణిజ్య ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఒప్పందాలు కుదుర్చుకోవటంలో చర్చలు కొనసాగుతున్నా పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్‌పై అమెరికా హెచ్చరికలు తీవ్ర చర్చనీయాశం అయింది. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ/ లండన్: ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్లో రిషి సునాక్‌తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇదీ చదవండి: Rishi Sunak: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత -
ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కి యూకేతో ఉన్న వాణిజ్య ఒప్పందాల విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ ఎగుమతుల సదస్సులో వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ...ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై బ్రిటన్‌తో భారత్ చర్చలు బాగానే సాగిస్తోంది. ఐతే ఇటీవల బ్రిటన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా న్యూఢిల్లీ కాస్త వేచి ఉండక తప్పదని అన్నారు. ఆ తదనందరం మాత్రమే యూకేకి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించగలమని చెప్పారు. అదీగాక వచ్చే వారంలోనే బ్రిటన్‌లో ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ఆ తర్వాత లిజ్ వారసురాలిగా కొత్త ప్రధానిని పాలక కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకోవడం కూడా జరుగుతోందని తెలిపారు. అంతేగాదు యూకే నాయకులు కూడా భారత్‌తో వాణిజ్య వ్యాపారాలు అత్యంత ముఖ్యమని గుర్తించినట్లు చెప్పారు. యూకేలో ఎవరూ నాయకులుగా వచ్చిన భారత్‌తో వాణిజ్యం సాగించేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాలకు ఈ ట్రేడ్ డీల్ విజయం చేకూరడం తోపాటు సంతృప్తి చెందాలి అప్పుడే ఈ ఒప్పందం ఖరారవుతుందని లేదంటే ఎలాంటి ఒప్పందం ఉండదని తేల్చి చెప్పారు. అలాగే బ్రిటన్, కెనడా, యూరప్‌ల వంటి దేశాలతో కనీసం ఒకటి లేదా రెండు స్యేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు 2027 నాటికి వస్తువుల సేవల కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు లక్ష్యం ఉందని, దీన్ని2030 కల్లా సాధించగలమని చెప్పారు. ఈ మేరకు పరస్పర వస్తువుల ప్రమాణాల గుర్తింపు ఒప్పందం(ఎంఆర్ఏ) విషయం గురించి ప్రస్తావిస్తూ... భారత్‌కి ఏ కారణం చేతన ఎక్కువ ఎంఆర్ఏలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. బహుశా అధిక నాణ్యత వస్తువుల సేవలను అందించగల భారత్ సామర్థ్యంపై విశ్వాసం రావడానికి మరికొంత సమయం కావాలేమో అని వ్యగ్యంగా అన్నారు. అలాగే భారత్‌కి సరఫరా చేసే నాణ్యత నియంత్రణ ఆర్డర్లను కూడా పెంచాలని నొక్కి చెప్పారు. మీరు ఎంఆర్ఏలను ఇచ్చినట్లుగానే భారత్ కూడా మీకు ఇస్తుందని తేల్చి చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసిఓ)పై కూడా భారత పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయమై దేశాలను పునరాలోచించమని చెబుతున్నా, ఏ విషయంలో క్యూసీఓని కోరుకుంటున్నాయో కూడా చెప్పండి అని పియూష్ గోయల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
మోదీకి ఇష్టమైన కిచిడిని వండిన ఆస్ట్రేలియా ప్రధాని
Scott Morrison Celebrate India-Australia Trade Deal: భారత్ ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌తో జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మోదీకి ఇష్టమైన కిచిడిని వండి సెలబ్రెట్ చేసుకున్నారు. ఆయన వంటకాలకు సంబంధించిన ఫోటోలను మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.."భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాను ఇలా సెలబ్రెట్ చేసుకున్నాని చెప్పారు. ఈ రాత్రికి భారతీయ వంటకాలను తయారు చేస్తున్నాని చెప్పారు. తాను వండటానికి ఎంచుకున్న కూరలన్నీ గుజరాత్‌కి చెందినవే. అంతేకాదు అందులో నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడి కూడా ఉంది" అని చెప్పారు. అదీగాక మోదీ ఎన్నోసార్లు ఇంటర్యూల్లో తనకు కిచిడి అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు కూడా. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం అయిన కిచిడి వండటం అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. ఏప్రిల్ 2న భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి. అంతేగాక ఈ ఒప్పందంలో 95 % భారతీయ ఉత్పత్తులకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఎగుమతులను బిలియన్ డాలర్ల మేర పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అదీగాక ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్లు, బొమ్మలు, పాదరక్షలు, తోలు వస్తువులతో సహా కీలకమైన ఆస్ట్రేలియన్ మార్కెట్లలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం భారత్‌ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చగలదు. View this post on Instagram A post shared by Scott Morrison (@scottmorrisonmp) (చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం) -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
ఈ మాటలు మంచివే!
ఈసారి అమెరికాలో అక్కడి రిటైల్ షాపుల్లో మన ఊరి మామిడి పండ్లు, ద్రాక్షలు, దానిమ్మలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అలాగే మరికొద్ది రోజుల్లో మన వీధి చివరి సూపర్ బజార్లోనే అమెరికన్ ఛెర్రీలు, పంది మాంసం ఉత్పత్తులు దొరికితే అబ్బురపడకండి. అక్షరాలా అది అంతా భారత – అమెరికాల మధ్య కుదిరిన తాజా వాణిజ్య అంగీకార ఫలితమే! వాణిజ్యంలో కొన్నేళ్ళుగా భారత్ పట్ల అపనమ్మకంతో నడిచిన అమెరికా, ఎట్టకేలకు కొన్ని నియమాలను సడలించడానికి మంగళవారం అంగీకరించడంతో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. నాలుగేళ్ళ తరువాత జరిగిన ఇరుదేశాల ‘వాణిజ్య విధాన వేదిక’ (టీపీఎఫ్) తొలి పునఃసమావేశం ఈ కీలక ఘట్టానికి వేదిక అయింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) క్యాథరిన్ తాయ్ జరిపిన రెండు రోజుల ఢిల్లీ పర్యటన భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పాత అనుమానాలకు తెర దించి, కొత్త తలుపులు తీసింది. వచ్చే ఏడాది మధ్యనాటి కల్లా పరస్పర వాణిజ్య సంబంధాల్లోని చిక్కుముడులను తొలగించుకోవడమే లక్ష్యమని టీపీఎఫ్ వేదికపై ఇరుదేశాలూ అంగీకరించడం శుభసూచకం. దీనితో, కీలకమైన వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మేధాసంపత్తి హక్కులు సహా వివిధ అంశాల్లో ప్రయాణం సాఫీ కానుంది. ఈ 5 ప్రధాన అంశాలపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులు తరచూ సమావేశమై, అందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో మరోసారి జరిగే టీపీఎఫ్ మధ్యంతర సమావేశానికి నిర్దిష్ట వాణిజ్య ఫలితాలను ఖరారు చేయనున్నాయి. ఇప్పుడు భారతదేశపు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది 10 వేల కోట్ల డాలర్ల మార్కును దాటుతుందని అంచనా. చైనాను వెనక్కినెట్టి, అమెరికా ఆ స్థానానికి వచ్చిన పరిస్థితుల్లో టీపీఎఫ్ పునరావిష్కృతం కావడం విశేషం. భారత్‌తో ఏదో తాత్కాలికంగా ఓ మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని తాము భావించట్లేదని అమెరికా ముందే స్పష్టం చేసింది. దాంతో, టీపీఎఫ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు అతి పెద్ద ఎగుమతుల విపణి కూడా అమెరికాయే. గడచిన 2020–21లో మన దేశం నుంచి 5.2 వేల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు ఆ దేశానికి వెళ్ళాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా, భారత్‌కు ‘ప్రాధాన్యాల సాధారణీకరణ వ్యవస్థ’ (జీఎస్పీ)ని ఉపసంహరించుకుంది. వర్ధమాన దేశాలకు అమెరికా ఇచ్చే ప్రత్యేక వాణిజ్య హోదా అది. ఆ జీఎస్పీ వల్ల వివిధ ఉత్పత్తుల విషయంలో ట్యారిఫ్ తగ్గింపు దక్కుతుంది. ఆ హోదా ఉండడంతో 2018లో అమెరికా నుంచి భారత్ అత్యధికంగా లబ్ధి పొందింది. 2019లో ట్రంప్ సర్కారు ఎత్తేసిన ఆ హోదాను మళ్ళీ అందించాలంటూ ప్రపంచ పెద్దన్నను భారత్ తాజాగా అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను పరిశీలిస్తామని అగ్రరాజ్యం పేర్కొనడం తాజా భేటీలోని మరో శుభ సూచన. అలాగే, రెండు దేశాలలోని ఐటీ ఉద్యోగులు తమ తప్పనిసరి సోషల్ సెక్యూరిటీ చందాలను స్వదేశానికి తరలించుకొనేందుకు వీలిచ్చే ఒప్పందం ఇప్పటికి పదేళ్ళ పైగా పెండింగ్‌లో ఉంది. ఆ ఒప్పందం సాధ్యమైతే, భారతీయ ఐటీ ఉద్యోగులు వందల కోట్ల డాలర్ల పదవీ విరమణ నిధులు స్వదేశానికి వచ్చే వీలుంటుంది. దానిపైనా ఇప్పుడు మళ్ళీ చర్చలు మొదలు కానున్నాయి. పటిష్ఠమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు, మెరుగైన ఆర్థిక సంబంధాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, రెండు దేశాల్లోని శ్రామిక జనానికి మేలవుతుందనీ భారత, అమెరికాలు గుర్తించాయి. అందుకే, డిజిటల్ వాణిజ్యం, వ్యవసాయం, మెరుగైన నియంత్రణ విధానాలు, ప్రమాణాల లాంటి ప్రధాన అంశాల్లో సహకారం అందించుకొనేందుకు కృషి చేయనున్నాయి. అలాగే, రెండు దేశాల మధ్య నిర్దిష్టమైన విపణి అందుబాటు సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరస్పరం పరిష్కరించుకోవడం వల్ల ఇటు భారతీయ రైతులకూ, అటు అమెరికన్ రైతులకూ, అలాగే వ్యాపార సంస్థలకూ స్పష్టమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆ సంగతి కూడా తాజా భేటీలో రెండు దేశాల మంత్రులూ అంగీకరించారు. వచ్చే వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్యదేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ తాజా భేటీ కొత్త ఆశలు రేపింది. రెండు దేశాల మధ్య అపరిష్కృత డబ్ల్యూటీఓ వివాదాలకూ పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు. అలాగే, సైబర్ ప్రపంచం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, 6జీ, అత్యాధునిక టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలలో చైనా సంస్థలతో కొంత అసౌకర్యం అనిపిస్తుండడంతో... వాటిపై పరస్పర భావవినిమయం చేసుకోవాలని భారత్ – అమెరికా భావిస్తున్నాయి. వర్తమాన పరిస్థితుల్లో ఇవన్నీ కీలకమైన అంశాలే. అందుకే, భవిష్యత్ ఫలితాల మాటెలా ఉన్నా, అసలంటూ సమస్యను గుర్తించి, పరిష్కారానికి నడుం బిగించడం వరకు అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాల భేటీ విజయం సాధించింది. నాలుగేళ్ళుగా పాదుకున్న ప్రతిష్టంభనను తొలగించింది. ట్యారిఫ్‌లపై అటు ట్రంప్ చర్యలు, ఇటు భారత పాలకుల ప్రతిచర్యలతో అప్పట్లో బిగుసుకున్న వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలు బైడెన్ కాలంలో తేలికపడితే మంచిదే! కరోనా అనంతర వేళ కీలక సరఫరాల కోసం చైనాపై అతిగా ఆధారపడక, భారత్‌ను కీలక భాగస్వామిని చేసుకోవాలన్న అగ్రరాజ్యపు ఆలోచన మనకు ఇప్పుడు కలిసొచ్చేదే! అమెరికా సర్కారు నుంచి పలువురి వరుస పర్యటనల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మనమే! -
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు రూ.1,005 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్టెల్ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ స్పెక్ట్రమ్‌కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ వల్ల జియో నెట్వర్క్ యూజర్లకు ఇండోర్ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది. -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
కోవాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయనున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ అరబిందో ఫార్మా.. యూఎస్‌కు చెందిన కోవాక్స్‌తో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కోవిడ్–19 చికిత్సకై కోవాక్స్ తయారు చేసిన తొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత వ్యాక్సిన్ యూబీ–612 అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాలను అరబిందో చేపడుతుంది. భారత్‌తోపాటు యునిసెఫ్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. యునైటెడ్ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్ ప్రస్తుతం యూబీ–612 వ్యాక్సిన్ క్యాండిడేట్ తొలి దశ ఔషధ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాక్సిన్ తయారీ, విక్రయానికి నాన్ ఎక్స్‌క్లూజివ్ హక్కులు సైతం దక్కించుకున్నామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. ఫినిష్డ్ డోసేజెస్ను హైదరాబాద్‌లోని అరబిందోకు చెందిన ప్లాంట్లతో తయారు చేస్తారు. ప్రస్తుతం కంపెనీకి 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దీనిని 2021 జూన్ నాటికి సుమారు 48 కోట్ల డోసుల స్థాయికి చేర్చనున్నారు. వ్యాక్సిన్ల నిర్వహణ, పెట్టుబడుల విషయంలో పేరొందిన కంపెనీల్లో ఒకటైన అరబిందో.. యూబీ–612ను ముందుకు తీసుకెళ్లేందుకు తమకు ఆదర్శ భాగస్వామి అని కోవాక్స్ కో–ఫౌండర్ మేయ్ మేయ్ హు చెప్పారు. -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
ఆయుధాల అమ్మకానికే ఆ డీల్..
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో నిలిచిన యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ విమర్శలు గుప్పించారు. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు బదులు వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్‌ను భాగస్వామ్యం చేయాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. బోయింగ్, లాక్‌హీడ్, రేతియన్ వంటి దిగ్గజ కంపెనీలకు లాభాల పంట పండిచేందుకు 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించే బదులు పర్యావరణ పరిరక్షణలో భారత్‌ను భాగస్వామిగా చేయడంపై దృష్టి సారిస్తే బావుండేదని శాండర్స్ హితవు పలికారు. వాతావరణ కాలుష్య నియంత్రణ, సంప్రదాయేతర ఇంధన వనరుల సృష్టి, ఉపాధి కల్పనలపై సమిష్టిగా మనం పని చేస్తూ మన ప్లానెట్ను కాపాడుకునేందుకు కృషి సాగించే వారమని శాండర్స్ ట్వీట్ చేశారు. 78 ఏళ్ల శాండర్స్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనను ఢీకొనే గట్టి పోటీదారుగా ముందుకొస్తున్నారు. కాగా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం రక్షణ ఒప్పందంపై వారు కీలక ప్రకటన చేశారు. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ కసరత్తు సాగిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా మిగులుతుందని వ్యాఖ్యానించారు. చదవండి : ట్రంప్ నోట పాకిస్తాన్.. జస్ట్ నాలుగుసార్లే! -
భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది
వాషింగ్టన్: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను వచ్చే వారం భారత్ సందర్శిస్తున్నాను. అక్కడ వాణిజ్యం గురించి చర్చలు జరుపుతాను. వ్యాపారపరంగా అనేకానేక సంవత్సరాలుగా భారత్ మనను దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో అది కూడా ఒకటి. వీటన్నింటిపై కాస్త మాట్లాడాలి‘ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా సుమారు 3%గా ఉంటుంది. అమెరికాకు ప్రయోజనకరమైతేనే డీల్.. భారత పర్యటన సందర్భంగా భారీ డీల్ కుదరవచ్చన్న అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు ట్రంప్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత్‌తో ఏదైనా భారీ డీల్ కుదుర్చుకోవచ్చని, అప్పటిదాకా చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగవచ్చని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటేనే ఏ ఒప్పందమైనా కుదుర్చుకుంటామన్నారు. ఆతిథ్యంపై భారీ అంచనాలు.. భారత్‌లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంకు వెళ్లే దారిలో దాదాపు కోటి మంది దాకా స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ నాకు చెప్పారు. అయితే, దీంతో ఓ చిన్న సమస్య రావొచ్చు. ఇప్పుడు సమావేశమైన ఈ ప్రాంగణం సుమారు 60వేల మందితో కిక్కిరిసిపోయింది. వేల మంది లోపలికి రాలేక బైటే ఉండిపోయారు. అయినప్పటికీ.. భారత్‌లో కోటి మంది ప్రజల స్వాగతం చూశాక.. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే వారు కంటికి ఆనకపోవచ్చు‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
కృత్రిమ గడువులు నిర్ణయించాలని అనుకోవడం లేదు
న్యూఢిల్లీ: వాణిజ్యం విషయంలో అమెరికాతో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ లైట్ తీసుకుంది. కృత్రిమ గడువులను భారత్ ఏర్పాటు చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు బ్యాలన్స్ ఆఫ్ ట్రేడ్‌కు సంబంధించి చేసినవని, ఈ విషయంలో అమెరికా ఆందోళలను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవనీష్‌కుమార్ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు సమీకరణ దేశంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, భారీ సంఖ్యలో పౌర విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అమెరికా భారత్‌కు వస్తు సేవల పరంగా అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉందని వివరించారు. ‘‘వాణిజ్య ఒప్పందానికి తొందరపడదలుచుకోలేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల ప్రభావం పౌరులు, దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దీర్ఘకాలం పాటు ఉంటుంది’’ అని రవనీష్ కుమార్ వివరించారు. -
సంక్లిష్ట అంశాలలో భారత్ తొందరపడదు..
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సంక్లిష్ట అంశాలపై చర్చ జరిగే సందర్భంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కుదుర్చుకునే అంశంలో భారత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రథినిధులు తెలిపారు. పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన ఉత్కంఠ కలిగిస్తుంది. ట్రంప్ పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశముందని ప్రభత్వ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా కొనసాగాలంటే అగ్రనేతల పర్యటనలు ఎంతో కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ప్రపంచంలో అత్యంత పెద్దదిగా భావిస్తున్న గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్ ఆవిష్కరించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. -
ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చోటుచేసుకునే అవకాశం లేదు. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై ట్రంప్ విస్పష్ట సంకేతాలు పంపారు. భారత్‌తో భారీ డీల్‌ను తాను దాచుకుంటానని, నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లోగా ఈ ఒప్పందం ఖరారవుతుందనే విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో తాము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, అయితే ఈ మెగా డీల్‌కు మరికొంత కాలం వేచిచూస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌తో భారీ ఒప్పందం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడే అవకాశం లేనట్టే. మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం చర్చల్లో కీలక పాత్ర పోషించిన అమెరికా ట్రేడ్ ప్రతినిధి రాబర్ట్ లిజర్ ట్రంప్‌తో పాటు భారత పర్యటనకు వచ్చే బృందంలో లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పర్యటనలో ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని కూడా వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : ట్రంప్ టూర్ : మురికివాడలు ఖాళీ -
ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్.. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు. వివాదాల పరిష్కారంపై దృష్టి.. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
భారత డైరీ మార్కెట్లోకి అమెరికా ఎంట్రీ..
న్యూఢిల్లీ/వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా మన పౌల్ర్టీ, డైరీ మార్కెట్లలో అమెరికన్ కంపెనీలకు పాక్షిక వాణిజ్యానికి అనుమతించేందుకు మోదీ సర్కార్ సంసిద్ధమైంది. ప్రపచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ సంప్రదాయంగా పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై నియంత్రణలు విధిస్తోంది. డైరీ పరిశ్రమపై 8 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి పొందుతుండటంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా డైరీ రంగంలో దిగుమతులను దశాబ్ధాలుగా నియంత్రిస్తోంది. అయితే భారత్-అమెరికా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పరిమితులను పాక్షికంగా సడలించేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సన్నద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. కాగా స్టెంట్లు వంటి వైద్య పరికరాల ధరలపై ప్రధాని మోదీ నియంత్రణలు విధించడం, ఈకామర్స్ నియంత్రణలు, న్యూ డేటా లోకలైజేషన్ వంటి పరిమితుల నేపథ్యంలో 2019లో ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు ప్రత్యేక వాణిజ్య హోదాను తొలగించిన క్రమంలో అమెరికాతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో దిగుమతి సుంకాల తగ్గింపు, రాయితీలు ప్రకటిస్తే కొన్ని ఉత్పత్తులపై భారత్‌కు ఈ హోదాను పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు. అమెరికా నుంచి చికెన్ లెగ్స్ దిగుమతులకు అనుమతితో పాటు భారత్ తాజాగా 5 శాతం టారిఫ్, కోటాలతో డైరీ మార్కెట్లోకీ అమెరికాను అనుమతించేందుకు సిద్ధమైంది. డైరీ మార్కెట్లోకి అమెరికాను ఆహ్వానిస్తే గ్రామీణ రంగంలో రైతులతో పాటు పాడిపరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : వెల్కమ్ ట్రంప్..గోడచాటు పేదలు -
‘భారత్ అభివృద్ధి చెందిన దేశమే’
న్యూయార్క్ : భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించరాదని, భారత ఆర్థిక వ్యవస్థను డెవలప్డ్ ఎకానమీగా నిర్ధారించినట్టు అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ (యూఎస్టీఆర్) కార్యాలయం స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా అందించే ప్రయోజనాలకు భారత్‌కు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటివరకూ అమెరికా జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) పథకం కింద అందే ప్రయోజనాలకు కోత పడింది. ఈ స్కీమ్ కింద భారత ఎగుమతిదారులు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా అమెరికాకు ఎగుమతులు చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ప్రయోజనాలు రద్దయితే భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురవనున్నాయి. దేశ తలసరి ఆదాయం, ప్రపంచ వాణిజ్యంలో దేశ వాటా ఆధారంగా ఆ దేశ ఎకానమీని మదింపు చేస్తారు. ఇక ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తారు. భారత్ ఈ పరిమితిని ఎప్పుడో అధిగమించింది. 2017 నాటికే భారత్ ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతుల్లో 2.1 శాతం, దిగుమతుల్లో 2.6 శాతం సమకూరుస్తోంది. దీంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల సరసన జీ 20లో భారత్ కొనసాగుతుండటంతో భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగానే పరిగణించాలని యూఎస్టీఆర్ స్పష్టం చేసింది. భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు రానుంది. మరోవైపు ఇతర దేశాలు అందించే జీఎస్పీ వంటి అభివృద్ధి రాయితీలు, సాయం తమకు అవసరం లేదని, భారత్ స్వతంత్రంగానే వాణిజ్యంలో దీటుగా ఎదుగుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇక జీఎస్పీ ప్రయోజనాలకు గండిపడితే భారత్ ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతుందని, మార్కెట్ వాటా తగ్గుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : యూఎస్ కాంగ్రెస్ బరిలో మంగ అనంతత్ములా -
42,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్
సెన్సెక్స్ తొలిసారిగా 42,000 పాయింట్లపైకి ఎగబాకింది. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 42,059 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. పెరుగుతున్న బ్యాంక్‌ల మొండి బకాయిల భారం, ఆర్థిక గణాంకాలపై ఆందోళనతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు అర శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. 247 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... అమెరికా– చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పం దం బుధవారం కుదిరింది. దీంతో గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమ్మకాలు జోరుగా జరగడంతో రెండు సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. చివర్లో నష్టాలు రికవరీ అయి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 60 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ► నెస్లే ఇండియా 3 శాతం లాభంతో రూ.15,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ క్యూ3లో ఆర్థిక ఫలితాలు బాగా ఉండగలవనే అంచనాలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.15,399ను తాకింది. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డాబర్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇప్కా ల్యాబ్స్, జేకే సిమెంట్స్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మణప్పురం ఫైనాన్స్, ఫీనిక్స్ మిల్స్, పాలీక్యాబ్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది సెన్సెక్స్ లాభం 9 శాతం ! ఈ ఏడాది సెన్సెక్స్ 9 శాతం మేర లాభపడగలదని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 44,500 పాయింట్లకు ఎగబాకుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం అంతంతమాత్రంగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయని తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థ కాదని, అగ్రస్థాయి 50 కంపెనీలకు సంబంధించిందని ఈ సంస్థ ఇండియా హెడ్ అభిరామ్ ఈలేశ్వరపు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్‌కు రిస్క్ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సూచీల ఇంట్రాడే శిఖర స్థాయిలు సెన్సెక్స్ 42,059 నిఫ్టీ 12,389 36 సెషన్లలో 1,000 పాయింట్లు సెన్సెక్స్ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.ఈ కాలంలో టాటా స్టీల్ 18 శాతం, ఇన్ఫోసిస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, భారతీ ఎయిర్టెల్ 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బాటా ఇండియా, పీటీసీ ఇండియా, డీసీబీ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ట్రైడెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, బెర్జర్ పెయింట్స్, ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు 10–100 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ 36 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, బడ్జెట్లో మరిన్ని తాయిలాలు ఇవ్వనున్నదన్న అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులంటున్నారు. -
స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల పండగ..
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలతో పాటు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల తోడ్పాటుతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు వెల్లడించడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, హెచ్‌యూఎల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇక టీసీఎస్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 41,859 పాయింట్ల వద్ద ముగియగా, 72 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,329 పాయింట్ల వద్ద క్లోజయింది. -
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 40,000–40,600
అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్ మార్కెట్లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్ చాలావరకూ డిస్కౌంట్ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్ 29తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 41,163 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత వారాంతంలో చిన్నపాటి కరెక్షన్కు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 435 పాయింట్ల లాభంతో 40,794 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ తొలి మూడు వారాల్లోనూ గట్టిగా నిరోధించిన 40,000–40,600 పాయింట్ల శ్రేణి రానున్న రోజుల్లో మద్దతును అందించే అవకాశం వుంటుంది. ఈ వారంలో సెన్సెక్స్‌కు తొలుత 40,600 పాయింట్ల సమీపంలో మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 40,390 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 40,000 పాయింట్ల స్థాయికి దిగజారవచ్చు. ఈ వారం సెన్సెక్స్ రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వేగంగా 40,990 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన మరోదఫా 41,160 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 41,450–41,500 పాయింట్ల శ్రేణిని అందుకునే ఛాన్సుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 12,005 కొత్త రికార్డును నెలకొల్పడంలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ చిట్టచివరకు గతవారం ఈ ఫీట్ సాధించింది. 12,158 పాయింట్ల వద్ద రికార్డుగరిష్టస్థాయిని నమోదుచేసి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 142 పాయింట్ల లాభంతో 12,056 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీ 12,005 పాయింట్ల సమీపంలో తొలి మద్దతును పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 11,920 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 12,800 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది. ఈ వారం రెండో మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకుంటే 12,100 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే తిరిగి 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన క్రమేపీ 12,250 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే అవకాశాలుంటాయి. -
కొత్త శిఖరాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. వాహన షేర్లకు ‘స్క్రాప్ పాలసీ’ లాభాలు ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం తీసుకు రానున్నదన్న వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు 1–3 శాతం రేంజ్లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎంఫసిస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్ సమావేశం జరగనున్నదన్న వార్తలు దీనికి కారణం. ► ఎస్బీఐకు చెందిన క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్ ఇదే. ► ఎల్ అండ్ టీ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు! రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్ రూ.8 పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇదే. -
భారత్ – అమెరికా రక్షణ వాణిజ్యం
వాషింగ్టన్: భారత్–అమెరికాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం రోజురోజుకూ పుంజుకుంటోంది. వచ్చే వారంలో భారత్ –అమెరికాల డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) తొమ్మిదో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ముగిసేనాటికి రెండు దేశాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 బిలియన్ డాలర్ల (రూ. లక్షా ఇరవై ఏడువేల కోట్లు)కు చేరుకుంటుందని పెంటగాన్ వర్గాలు అంచనావేశాయి. ఇరుదేశాల మిలిటరీ టు మిలిటరీ సంబంధాలను బలపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టైన్మెంట్ ఎలెన్ ఎం లార్డ్ తెలిపారు. 2008లో ఇరు దేశాల మధ్య సున్నాగా ఉన్న వాణిజ్యం ఈ సంవత్సరం ముగిసేనాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గొప్పవిషయమని తెలిపారు. గత ఆగస్టులో అమెరికా భారత్‌కు ట్రేడ్ అథారిటీ టైర్ 1 స్థాయిని ఇచ్చిందని, నాటో కూటమి దేశాలకు కాకుండా మరో దేశానికి ఈ గుర్తింపు ఇవ్వడం ఇదే ప్రథమమని తెలిపారు. వచ్చేవారం ఎలెన్ భారత్ చేరుకొని భారత డిఫెన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ అపూర్వ చంద్రతో భేటీ కానున్నారు.