న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కి యూకేతో ఉన్న వాణిజ్య ఒప్పందాల విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ ఎగుమతుల సదస్సులో వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ...ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై బ్రిటన్‌తో భారత్ చర్చలు బాగానే సాగిస్తోంది. ఐతే ఇటీవల బ్రిటన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా న్యూఢిల్లీ కాస్త వేచి ఉండక తప్పదని అన్నారు.
ఆ తదనందరం మాత్రమే యూకేకి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించగలమని చెప్పారు. అదీగాక వచ్చే వారంలోనే బ్రిటన్‌లో ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ఆ తర్వాత లిజ్ వారసురాలిగా కొత్త ప్రధానిని పాలక కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకోవడం కూడా జరుగుతోందని తెలిపారు. అంతేగాదు యూకే నాయకులు కూడా భారత్‌తో వాణిజ్య వ్యాపారాలు అత్యంత ముఖ్యమని గుర్తించినట్లు చెప్పారు. యూకేలో ఎవరూ నాయకులుగా వచ్చిన భారత్‌తో వాణిజ్యం సాగించేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాలకు ఈ ట్రేడ్ డీల్ విజయం చేకూరడం తోపాటు సంతృప్తి చెందాలి అప్పుడే ఈ ఒప్పందం ఖరారవుతుందని లేదంటే ఎలాంటి ఒప్పందం ఉండదని తేల్చి చెప్పారు.
అలాగే బ్రిటన్, కెనడా, యూరప్‌ల వంటి దేశాలతో కనీసం ఒకటి లేదా రెండు స్యేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు 2027 నాటికి వస్తువుల సేవల కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు లక్ష్యం ఉందని, దీన్ని2030 కల్లా సాధించగలమని చెప్పారు. ఈ మేరకు పరస్పర వస్తువుల ప్రమాణాల గుర్తింపు ఒప్పందం(ఎంఆర్‌ఏ) విషయం గురించి ప్రస్తావిస్తూ... భారత్‌కి ఏ కారణం చేతన ఎక్కువ ఎంఆర్‌ఏలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. బహుశా అధిక నాణ్యత వస్తువుల సేవలను అందించగల భారత్ సామర్థ్యంపై విశ్వాసం రావడానికి మరికొంత సమయం కావాలేమో అని వ్యగ్యంగా అన్నారు.
అలాగే భారత్‌కి సరఫరా చేసే నాణ్యత నియంత్రణ ఆర్డర్‌లను కూడా పెంచాలని నొక్కి చెప్పారు. మీరు ఎంఆర్‌ఏలను ఇచ్చినట్లుగానే భారత్ కూడా మీకు ఇస్తుందని తేల్చి చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసిఓ)పై కూడా భారత పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయమై దేశాలను పునరాలోచించమని చెబుతున్నా, ఏ విషయంలో క్యూసీఓని కోరుకుంటున్నాయో కూడా చెప్పండి అని పియూష్ గోయల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
(చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!)
Comments
Please login to add a commentAdd a comment