Scott Morrison Celebrate India-Australia Trade Deal: భారత్ ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌తో జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మోదీకి ఇష్టమైన కిచిడిని వండి సెలబ్రెట్ చేసుకున్నారు. ఆయన వంటకాలకు సంబంధించిన ఫోటోలను మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.."భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాను ఇలా సెలబ్రెట్ చేసుకున్నాని చెప్పారు. ఈ రాత్రికి భారతీయ వంటకాలను తయారు చేస్తున్నాని చెప్పారు. తాను వండటానికి ఎంచుకున్న కూరలన్నీ గుజరాత్‌కి చెందినవే.
అంతేకాదు అందులో నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడి కూడా ఉంది" అని చెప్పారు. అదీగాక మోదీ ఎన్నోసార్లు ఇంటర్యూల్లో తనకు కిచిడి అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు కూడా. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం అయిన కిచిడి వండటం అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. ఏప్రిల్ 2న భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి.
అంతేగాక ఈ ఒప్పందంలో 95 % భారతీయ ఉత్పత్తులకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఎగుమతులను బిలియన్ డాలర్ల మేర పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అదీగాక ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్‌లు, బొమ్మలు, పాదరక్షలు, తోలు వస్తువులతో సహా కీలకమైన ఆస్ట్రేలియన్ మార్కెట్‌లలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం భారత్‌ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చగలదు.
(చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment