Scott Morrison
-
ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్ పార్టీ
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పరిపాలనకు తెరపడింది. ఇప్పటివరకు 50శాతం ఓట్లను లెక్కించగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు ఆస్ట్రేలియా మీడియా ఇదివరకే వెల్లడించింది. లేబర్ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్ తదుపరి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తన ఓటమిని అంగీకరించారు. గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తుల్ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ సంకీర్ణ కూటమి కంటే లేబర్ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది. -
ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ.. స్కాట్ మోరిసన్ ప్రభుత్వాన్ని ఓడించింది. ఈ మేరకు శనివారం స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించారు. ఫలితంగా ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా నాయకత్వం నుంచి కూడా మోరిసన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మోరిసన్ మాట్లాడుతూ..." నాయకుడిగా నేను గెలుపోటములకు పూర్తిగా బాధ్యత వహిస్తాను. లిబరల్ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం. ఈ గొప్ప దేశానికి తనను నాయకుడిగా చేసేందుకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. కొత్త నాయకత్వంలో మన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఆస్ట్రేలియా 31వ ప్రదానిగా ఆంథోని లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అల్బనీస్ 1996 నుండి ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2013లో ఆస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆయన 2007 నుంచి 2013 మధ్య క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2022 ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అణుగుణంగా బలమైన సామాజిక భద్రతను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయన్ని కూడా అందిస్తానని లేబర్ పార్టీ వాగ్దానం చేసింది. 2050 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను మరింత ప్రతిష్టాత్మకంగా 43 శాతం మేర తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని కోరుకుంటున్నట్లు కూడా పార్టీ పేర్కొంది. ఆంథోనీ అల్బనీస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జపాన్‌లో పర్యటించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆంథోనికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. Congratulations @AlboMP for the victory of the Australian Labor Party, and your election as the Prime Minister! I look forward to working towards further strengthening our Comprehensive Strategic Partnership, and for shared priorities in the Indo-Pacific region. — Narendra Modi (@narendramodi) May 21, 2022 (చదవండి: పాకిస్తాన్ మాజీ మంత్రి కిడ్నాప్...) -
ఆస్ట్రేలియాలో ‘కిమ్’ హల్చల్.. అవాక్కైన ప్రధాని
Australia PM's Event Kim Jong Un Lookalike Person: ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వేషధారణలో ఒక వ్యక్తి సందడి చేశాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఈ నెల 21 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. ఆ ప్రచార ర్యాలిలో ప్రధాని మోరిసన్ తనతో కొద్ది స్థానాల తేడాతో ఉన్న స్థానిక సభ్యురాలు గ్లాడిస్ లియు అధీనంలో ఉన్న చిషోల్మ్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. అదీగాక ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పార్టీ సెంటర్ రైట్ లిబరల్ నేషనల్ కోయలిషన్ ప్రస్తుతం ఓపెనియన్ పోలింగ్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కంటే వెనుకబడి ఉంది. ఐతే కిమ్ వేషధారణలో ఉన్న వ్యక్తి మాత్రం ఎన్నికల ప్రచార క్యాంప్ నుంచి మోరిసన్ నిష్క్రమించిన కొద్దిసేపటికే ఎంటరై తనని ఉత్తర కొరియా అధ్యక్షుడ కిమ్‌జోంగ్ ఉన్ లాగా కనిపించే హువార్డ్ ఎక్స్ అనే నటుడుగా పేర్కొన్నాడు. అంతేగాదు మోరిసన్ లిబరల్ నేషనల్ కూటమికి ఓటు వేస్తే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేసినట్లు అవుతుందంటూ అర్థంపర్థం లేని విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తిని అక్కడ ఉన్న మీడియా బృందం రాజకీయ పార్టీ లేదా ఉద్యమంలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారా అని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రధాన మంత్రికి సంబంధించిన మీడియా బృందం అతన్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రతిస్పందనగా సుప్రీం లీడర్ ఏం చేయాలో మీరు చెప్పరు అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. ఐతే ఆస్ట్రేలియన్ సెనేట్ అభ్యర్థి, చైనీస్ ప్రభుత్వ విమర్శకుడు డ్రూ పావ్లౌ మాట్లాడుతూ.. కిమ్ వేషధారి హోవార్డ్ ఎక్స్ చిషోల్మ్ పర్యటన గురించి తాను గతంలోనే చర్చించానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం కిమ్ వేషధారణలో వచ్చిన ఆ విచిత్రమైన వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. An actor dressed as Kim Jong Un has crashed a Scott Morrison event in Chisholm, Melbourne. #AusVotes2022 pic.twitter.com/EQ9VX0C94g — Ben Westcott (@Ben_Westcott) May 13, 2022 (చదవండి: తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లే సెల్ఫీ పాయింట్లుగా...) -
మోదీకి ఇష్టమైన కిచిడిని వండిన ఆస్ట్రేలియా ప్రధాని
Scott Morrison Celebrate India-Australia Trade Deal: భారత్ ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌తో జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మోదీకి ఇష్టమైన కిచిడిని వండి సెలబ్రెట్ చేసుకున్నారు. ఆయన వంటకాలకు సంబంధించిన ఫోటోలను మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.."భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాను ఇలా సెలబ్రెట్ చేసుకున్నాని చెప్పారు. ఈ రాత్రికి భారతీయ వంటకాలను తయారు చేస్తున్నాని చెప్పారు. తాను వండటానికి ఎంచుకున్న కూరలన్నీ గుజరాత్‌కి చెందినవే. అంతేకాదు అందులో నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడి కూడా ఉంది" అని చెప్పారు. అదీగాక మోదీ ఎన్నోసార్లు ఇంటర్యూల్లో తనకు కిచిడి అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు కూడా. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం అయిన కిచిడి వండటం అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. ఏప్రిల్ 2న భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి. అంతేగాక ఈ ఒప్పందంలో 95 % భారతీయ ఉత్పత్తులకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఎగుమతులను బిలియన్ డాలర్ల మేర పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అదీగాక ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్లు, బొమ్మలు, పాదరక్షలు, తోలు వస్తువులతో సహా కీలకమైన ఆస్ట్రేలియన్ మార్కెట్లలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం భారత్‌ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చగలదు. View this post on Instagram A post shared by Scott Morrison (@scottmorrisonmp) (చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం) -
తగ్గేదేలే.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రష్యాను సస్పెండ్ చేయడంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేయగా.. క్రెమ్లిన్ మాత్రం సీరియస్ కామెంట్స్ చేసింది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా.. యుద్ధం వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలో ప్రవేశించడానికి వేళ్లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆంక్షలు విధించిందిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ ఇస్తూ రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ రెండు దేశాల ప్రధానులతో పాటుగానే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందని 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. కాగా, తర్వలోనే ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తలు, నిపుణులు, మిలిటరీని కూడా బ్లాక్ లిస్టులో చేరుస్తామని రష్యా హెచ్చరించింది. -
పుతిన్ పక్కన కూర్చోవడం.. నా వల్ల కాదు!
ఉక్రెయిన్‌పై యుద్ధం.. చాలా దేశాలతో రష్యా సంబంధాలను దూరం చేస్తోంది. తాజాగా.. యుద్ధ నేరస్తుడనే ట్యాగ్ పుతిన్‌కు తగిలించి జీ20 సమావేశాల నుంచి రష్యాను పక్కనపెట్టాలంటూ అమెరికా డిమాండ్ లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆస్ట్రేలియా సైతం పుతిన్ వ్యతిరేక గొంతుకే వినిపిస్తోంది. జీ20 సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం పంపడం, ఇతర దేశాల నేతలతో కలిసి కూర్చోనివ్వడంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘రష్యా తన పొరుగున ఉన్న ఉక్రెయిన్ను ఆక్రమిస్తోంది. ఇది క్రూరమైన చర్య. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చేష్టలే ఇదంతా’’ అంటూ గురువారం మెల్బోర్న్లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు మోరిసన్. అలాంటి దురాక్రమణకు కారణమైన పుతిన్ పక్కన కూర్చోవడం అంటే.. నా దృష్టిలో అది చాలా దూరం వెళ్లినట్లే అవుతుంది అంటూ పుతిన్ రాకను నేరుగానే వ్యతిరేకించారాయన. ఇదిలా ఉండగా.. అక్టోబర్ చివరి వారంలో(లేదంటే నవంబర్ మొదటి వారం) ఇండోనేషియా బాలిలో జరగబోయే జీ20 సదస్సుకు ఇప్పటికే పుతిన్‌కు ఆహ్వానం అందింది. ఆయన హాజరు కానున్నరారనే విషయాన్ని ఇండోనేషియాలోని రష్యా దౌత్యవేత్త ధృవీకరించారు కూడా. మరోవైపు రష్యాను జీ20 నుంచి బహిష్కరించాలన్న అమెరికా డిమాండ్‌ను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. కీలక సభ్యత్వం ఉన్న రష్యాను అంత సులువుగా ఎవరూ బహిష్కరించలేరని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో నేరుగా చర్చిస్తానని అంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. మరోవైపు.. ఉక్రెయిన్ యుద్ధం నేటితో నెలరోజులు పూర్తి చేసుకుంది. ఆంక్షల్లో భాగంగా.. రష్యాపై మొత్తం 476 ఆంక్షల్ని విధించింది ఆస్ట్రేలియా. అంతేకాదు.. జులై 17, 2014 ఎంహెచ్ 17 మలేషియా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం వెనక రష్యా పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లు మరోసారి న్యాయపరమైన చర్యలకు దిగనున్నాయి. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ గగనతలం నుంచి వెళ్తున్న ఆ విమానంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణను ప్రస్తావిస్తూ.. అమాయకుల ప్రాణాలను బలి తీసుకునే తత్వం పుతిన్‌ది అని ఆనాడే స్పష్టమైంది అంటూ ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అనతోలి రాజీనామా -
వందల ఏళ్ల నాటి కళాఖండాలను అప్పగించిన ఆస్ట్రేలియా
On behalf of Indians, I thank you: భారత్ ఆస్ట్రేలియా మధ్య వర్చువల్ శిఖరాగ్ర వర్చువల్ సమావేశం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇరు దేశాల ప్రధానులు ఈ సమావేశంలో భేటి అయ్యారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ 'నమస్కార్'తో అభినందించారు. ఈ సమావేశంలో ఆయన ఆస్ర్టేలియాలోని ప్రధాన నగరాలైన క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్లో సంభవించిన వరదల కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణా నష్టాలపై మోదీ సానూభూతి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలించిన 29 భారతీయ కళాఖండాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఆస్ట్రేలియా అధినేతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పైగా మీరు పంపిన పురాతన వస్తువులలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలకు సంబంధించిన వందల ఏళ్ల నాటి కళాఖండాలు, ఫోటోలు ఉన్నాయని చెప్పారు. భారతీయులందరి తరపున తాను ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. గత వర్చువల్ సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యనికి ఒక రూపాన్ని ఇవ్వగలిగాం. ఈ రోజు దాన్ని నిజం చేస్తూ ఇరుదేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నందుకు తాను సంతోషిస్తున్నాను అని చెప్పారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్మాణాత్మక వ్యవస్థను సిద్ధం చేస్తుందన్నారు. PM Modi inspects the 29 antiquities which have been repatriated to India by Australia. The antiquities range in 6 broad categories as per themes – Shiva and his disciples, Worshipping Shakti, Lord Vishnu and his forms, Jain tradition, portraits & decorative objects (Source: PMO) pic.twitter.com/vtYY1Pcs6T — ANI (@ANI) March 21, 2022 గత కొన్ని ఏళ్లుగా ఇరుదేశాల సంబంధాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయని చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అన్ని రంగాలలో ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకారం ఉందన్నారు. ఈ మేరకు సమావేశంలో ఆస్ట్రేలియ ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గుర్తించి ప్రస్తావిస్తూ... ప్రాంతీయ సహకార ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పారు. మా ప్రాంతంలో వస్తున్న వేగంవంతమైన మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడిన ఎదుర్కొంటున్నాం. మా క్వాడ్ నాయకులు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి గురించి చర్చించే అవకాశం ఇచ్చారనే నేను భావిస్తున్నాను. ఇండో-పసిఫిక్‌లోని మా స్వంత ప్రాంతానికి ఎదురైన భయంకరమైన సంఘటనే ఈ దురాక్రమణ. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎదువుతున్న సంక్షోభం, పరిణామాలు తదితర సమస్యల పై చర్చించడమానికి మాకు అవకాశం వచ్చింది." అని మోరిసన్ చెప్పారు. ఈ మేరకు ఈ వర్చువల్ సమావేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. My remarks at the India-Australia virtual summit with PM @ScottMorrisonMP https://t.co/TLBmappqgI — Narendra Modi (@narendramodi) March 21, 2022 (చదవండి: యుద్దంపై నాటోతో బైడెన్ కీలక భేటీ.. పోలాండ్ టూర్‌కు షెడ్యూల్ ఫిక్స్) -
వార్న్‌కు ఘన నివాళి
మెల్బోర్న్: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ స్పిన్ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్ నిలిచిపోతాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్ సదరన్ స్టాండ్‌కు షేన్ వార్న్ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వార్న్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్ కౌంటీ ‘హాంప్‌షైర్’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్‌లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు వార్న్‌కు నివాళులు అర్పించారు. -
చేతులెత్తేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఆస్ట్రేలియా పనితీరును ప్రపంచమంతా శ్లాఘించి ఎన్నో రోజులు కాలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి సంక్షోభంలో విధివిధానాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, ఇది పూర్తిగా ప్రజల బాధ్యతే అన్న చందంగా ప్రవర్తిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరిగింది. ఆరోగ్య ఖర్చు ప్రజల మీద పడింది. ఇంకా ముఖ్యంగా, ఒమిక్రాన్ వేవ్ ముంచెత్తుతున్న కీలక సమయంలో ఆధారపడదగ్గ రాజకీయ నాయకత్వం లేకుండా పోయింది. దీంతో విశ్వసనీయమైన వైద్యనిపుణుల వైపు చూడటం తప్ప ప్రజలకు మార్గం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా... నిన్నమొన్నటి వరకూ కోవిడ్ నిర్వహణ, నియం త్రణలో ప్రపంచ దేశాలు ఈర‡్ష్యపడే స్థాయి ఈ దేశానిది. ప్రజారోగ్య వ్యవస్థల నిర్వహణ, అతితక్కువ కేసులు, ఎలాంటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న ఆసుపత్రులు, సజావుగా సాగిపోతున్న ఆర్థిక వ్యవస్థ! మరిప్పుడో? గందరగోళం. కోవిడ్–19ను ఎలా ఎదుర్కోరాదో చెప్పేందుకు ఈ దేశాన్ని ఉదాహరణగా చూపేంత! ఏ దేశమైనా కోవిడ్ వంటి వ్యాధులను సమర్థంగా ఎదుర్కో వాలంటే టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్ (టీటీఐక్యూ) అనే నాలుగు సూత్రాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లాక్డౌన్ తరువాతి కాలంలో ఈ పద్ధతులన్నీ పాటించేం దుకు ప్రభుత్వం ఓ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తుందని అందరూ భావించారు. ప్రజారోగ్య నిపుణుల మాటలకు ప్రభుత్వం చెవొగ్గుతుందని ఆశించాము. కోవిడ్ నియంత్రణలో టీకాలు అతి ముఖ్యమైన భాగమే. అలాగని మొత్తం భారం వాటిపైనే వేయడం సరికాదని ముందు నుంచి కూడా అందరూ చెబుతూనే వచ్చారు. డెల్టా రూపాంతరితం పోయి ఒమిక్రాన్ వచ్చే సమయానికి మా అనుమానాలన్నీ నిజమ య్యాయి. టీకాలేసుకున్న వారితోపాటు వేసుకోని వారిపైనా ఇది దాడులు చేయడం మొదలుపెట్టింది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా లేనివారికీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ, పిల్లలకూ సోకింది. రెండు డోసుల టీకాతో తాత్కాలిక నిరోధకత మాత్రమే లభిస్తుందనీ, బూస్టర్ రూపంలో తీసుకునే మూడో డోసుతోనూ కొన్ని నెలలపాటు మాత్రమే రక్షణ అనీ మాలాంటి వారికి తెలుసు. స్వల్ప లక్షణాలున్న వారికీ లాంగ్ కోవిడ్‌తో చిక్కులు తప్పవు. టీకా తీసుకున్నా, తీసుకోక పోయినా! న్యూ సౌత్ వేల్స్ ప్రధాన వైద్యాధికారి కెర్రీ ఛాంట్, ప్రీమియర్ డొమినిక్ పెరోటెట్ ఇన్‌ఛార్జ్‌లుగా కోవిడ్ దాని మానాన అదే పోతుందన్నట్టుగా ఓ కొత్త పాలసీని అమల్లో పెట్టారు. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ కోవిడ్ మహమ్మారి చరిత్రలో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఒమిక్రాన్ కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కలిగిస్తుందనీ, ఇది ఎన్నాళ్లో వేచి చూస్తున్న బహుమతి లాంటిదనీ, అంతా త్వరలోనే సర్దుకుంటుందనీ ఓ తప్పుడు కథనాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించారు. దీనికంటే అవమానకరమైన విషయం ఇంకోటి ఏమిటంటే...‘‘ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరికీ అది సోకుతుంది’’ అని ప్రకటించడం. ఇంకోలా చెప్పాలంటే, వ్యాప్తిని అడ్డుకుని ఏం ప్రయోజనం అని ప్రభుత్వమే చెబుతోందన్నమాట. గతంలోనూ ప్రీమియర్ డొమినిక్ పెరోటెట్, ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌తో కలిసి చేయకూడని తప్పిదం చేశారు. ఆరోగ్య నిపుణులు మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా మాస్కులు ధరిం చడం వంటి అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేశారు. ఇదిలా ఉంటే న్యూసౌత్ వేల్స్లో మాత్రం ప్రజలు ఎవరికి వారు టెస్టులు చేయించుకోవాలి, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ వంటివన్నీ సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ చర్యలన్నీ ‘వ్యక్తిగత బాధ్యత’ అని కూడా తేల్చేశారు. సెలవులతో పరిస్థితి తారుమారు డిసెంబరు ఆఖరులో వచ్చిన సెలవులతో పరిస్థితి తలకిందులైంది. ముందస్తు హెచ్చరికల్లాంటివేవీ లేకుం డానే పరీక్ష కేంద్రాలు మూత పడ్డాయి. దీంతో ఉన్న వాటిల్లో కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. పరీక్షల కోసం కొంతమంది కార్లలోనే రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. అలాగే ఫలితాల కోసం ఐదారు రోజులు వేచి చూశారు. ఈ వ్యవహారం పండుగ వాతావరణాన్ని ఎలాగూ దెబ్బతీసేసింది; అదే సమయంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా వారం గడవకముందే తొలగించిన కోవిడ్ నిబంధనలన్నీ మళ్లీ అమ ల్లోకి వచ్చేశాయి. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటింది. కోవిడ్ నిర్ధారణ కోసం రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించు కోవాలని ప్రజలందరికీ చెప్పారు. కానీ యూకేలో మాదిరిగా పరీక్షల ఖర్చును భరించేందుకు మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా ప్రధాని మోరిసన్ లాంటి వారు విలేకరుల ప్రశ్నలకు ‘‘యాంటీజెన్ పరీక్షలు కొందరు చేయించుకోగలరు. కొంతమంది చేయించుకోలేరు’’ అని బదులిచ్చారు. అక్కడితో ఈ తేలికపాటి వ్యాఖ్యల పరంపర ఆగి పోలేదు. ‘మహమ్మారి విషయంలో అన్నీ ఉచితంగా అందించే పరిస్థితిలో లేము’ అని కూడా అన్నారు. కానీ ఇందుకోసమే కదా... ఆసుపత్రులు, ప్రజారోగ్య వ్యవస్థ, ఫార్మాస్యూటికల్ బెనిఫిట్స్ పథకం వంటివి ఉన్నవి? ప్రాథమిక ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు, చౌకగా వైద్య సేవలు అందించేందుకే ఈ ఏర్పాట్లన్నీ! వ్యాధి నియంత్రణకు ఖర్చులు భరించడమనేది అడ్డంకి కాకూడని సమయం ఏదైనా ఉంటే అది ఇప్పుడే! వ్యాపారాలు దెబ్బతిన్నాయి... కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలు వ్యాపారాలను దెబ్బతీశాయనడంలో సందేహం లేదు. ఈ నష్టం... రెస్టారెంట్లు, లాడ్జీల వంటివి మూతపడిన దాని కంటే ఎక్కువే ఉంది. సూపర్‌మార్కెట్ వ్యవస్థలోని అన్ని స్థాయిల వారూ జబ్బు పడుతూండటంతో మార్కెట్లలో సరుకులు నిండు కుంటున్నాయి. గత ఏడాది ప్రజలు టాయిలెట్ పేపర్ కోసం పోటీ పడితే ఈసారి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల వంతు వచ్చింది. పైగా ఈ కిట్ల కోసం భారీ మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి. చాలామంది ఈ కిట్లతోనే వ్యాధి నిర్ధారణ చేసుకున్నారు. పీసీఆర్ పరీక్షలు చేయించు కోలేదు. ఫలితంగా వీరందరూ అధికారిక లెక్కల్లోకి చేరలేదు. అరవై ఐదేళ్ల పైబడిన వయసున్న వారు, కోవిడ్ సోకినవాళ్లు అత్యవసర పరిస్థితుల్లో ‘000’ నంబరుకు ఫోన్ చేయవద్దనీ, సొంత ఏర్పాట్లేవో చేసుకోవాలనీ ప్రభుత్వం చెబుతోంది. పరిమితమైన ఆదాయం ఉన్న వారు తమ దారి తామే వెతుక్కోవాలని చెప్పిందన్న మాట. ఆస్ట్రేలియా వాసులందరికీ కనీస స్థాయి ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత మెడీకేర్పై ఉంది. నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు కూడా ఈ బాధ్యతల్లో ఉన్నాయి. ప్రభుత్వం పీసీఆర్ పరీక్షలను పరిమితం చేయాలని భావిస్తే పరీక్ష కేంద్రాల్లో పరిస్థితికి అనుగుణంగా పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ రెండింటినీ అందు బాటులో ఉంచాల్సింది. తద్వారా కేసుల సంఖ్యను పరిమితం చేసే అవకాశమూ చిక్కేది. వ్యాపారం కూడా మెరుగ్గానే ఉండేది! ప్రభు త్వమే కోవిడ్ సన్నాహక సామగ్రిని కొనుగోలు చేసి, పాజిటివ్‌గా తేలిన వారికి పంపిణీ చేసి ఉంటే వారి పరిస్థితిని ఇళ్ల నుంచే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేందుకు ఉపయోగపడేది. జాతీయ వ్యూహం, విధానం ఏదీ? ముందస్తు హెచ్చరికలు ఎన్ని ఉన్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం జాతీయ స్థాయిలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించడంలో విఫలమైందనే చెప్పాలి. గత ఏడాది చివరలో జాతీయ కేబినెట్ ‘క్లోజ్ కాంటాక్ట్’ నిర్వచనాన్ని మార్చేం దుకు అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా వారితో కనీసం నాలుగు గంటల సమయం గడిపిన వారిని ఈ కోవలోకి చేర్చారు. అయితే దీనికి ఓ శాస్త్రీయ ప్రాతిపదిక అంటూ ఏదీ లేదు. ఒక వ్యక్తికి వ్యాధి సోకేందుకు 15 నిమిషాలు చాలనేందుకు ఇప్పటికే బోలెడన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వం కేసుల సంఖ్యను కాకుండా... ఆసుపత్రులు, ఐసీయూల్లో చేరుతున్న వారిని పరిగణలోకి (తీవ్రత అంచనాకు?) తీసుకోవాలని చెబుతూండగా ఇటీవలి కాలంలో అవి కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు సాధారణ చికిత్స కల్పించాల్సిన వారినీ ఇళ్లల్లోనే సొంత వైద్యం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రకమైన వైఖరితో మహమ్మారి కొమ్ములు వంచలేము. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించేందుకూ ఇది సరిపోదు. మూక నిరోధకతతో మహమ్మారి ఎండెమిక్ స్థితికి చేరుకుంటుందనుకుంటే పొరబాటే. ఇంకో కొత్త రూపాంతరితంతో మరోసారి విజృంభించవచ్చు. ప్రభుత్వాలు తగిన నాయకత్వ లక్షణాలతో వ్యవహరించనప్పుడు, అంతా మీరే చూసుకోండి అంటున్నప్పుడు... ప్రజలు విశ్వసనీయ వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో చూడాలి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం ఒక్కటే తరుణోపాయం! – డాక్టర్ కెరిన్ ఫెల్ప్స్ ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు -
విధి వికృత ఆట
సిడ్నీ: విద్యా సంవత్సరం ముగింపు రోజు.. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో స్కూలు ప్రాంగణమంతా సందడిగా ఉంది. అంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ఘటన వారందరినీ షాక్‌కు గురి చేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఎక్కి ఆడుకుంటున్న బౌన్సీ క్యాజిల్ (కోట ఆకారంలో ఉండే గాలి నింపిన దళసరి బెలూన్‌తో చేసిన నిర్మాణం)ను అకస్మాత్తుగా వీచిన బలమైన సుడిగాలి పైకి లాక్కెళ్లిపోయింది. దీంతో, అందులో ఆడుకుంటున్న 9 మంది చిన్నారులు కిందపడిపోయారు. సుమారు 33 అడుగుల ఎత్తు నుంచి వారు పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడవగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 10, 11 ఏళ్ల ఆరో గ్రేడ్ చదువుకుంటున్న బాలబాలికలని సమాచారం. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం డేవన్పోర్ట్లోని ఓ స్కూల్లో గురువారం ఉదయం ‘ఫన్డే’ ఉత్సవాల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళనతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని, తమ చిన్నారుల క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. -
కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే!
వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. అనంతరం అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రత్యేక బహుమతులు అందించారు. ఆమెతోపాటు అస్ట్రేలియా, జపాన్ ప్రధానులకు సైతం ప్రత్యేక బహుమతులు అందజేశారు. చదవండి: భారత్ మాకు కీలక భాగస్వామి ప్రధాని మోదీ గులాబీ మీనాకారీ చెస్ సెట్‌ను కమలా హ్యారిస్‌కు బహుకరించారు. ఈ ప్రత్యేక చదరంగం సెట్లోని ప్రతి భాగం అద్భుతంగా హస్తకళా నైపుణ్యంతో తయారు చేశారు. దీనిలోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను తెలియజేస్తాయి. గులాబీ మీనాకారి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకి సంబంధించినది. అంతేగాక వారణాసి నియోజకవర్గం నుంచే మోదీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు! దీనితోపాటు కమలా హ్యారీస్ తాత పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన పాత చెక్క జ్ఞాపికను ప్రధాని ఆమెకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చారు. పీవీ గోపాలన్ గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వాధికారి. ఆయన వివిధ పదవులను నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమల హ్యరిస్‌కు మోదీ ఇచ్చారు. అదే విధంగా అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు వెండి గులాబీ మీనకారీ షిప్‌ను బహుమతిగా ప్రధాని మోడీ అందజేశారు. ఇది ప్రత్యేకంగా చేతితో తయారు చేసింది. ఈ ఓడ కాశీ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. భారత్, జపాన్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో బౌద్ధమతం కీలక పాత్ర పోషించింది. గతంలో జపాన్‌లో పర్యటించినప్పుడు, మోదీ అక్కడ ఉన్న పలు బౌద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు. కాగా కోవిడ్–19 తరువాత ప్రధాని విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. ప్రధాని పర్యటన రేపటితో(శుక్రవారం) ముగియనుంది. 25న (శనివారం) ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సెప్టెంబర్ 26 (ఆదివారం ) భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు. -
ఆ క్రికెట్ సిరీస్ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ..
లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం ఏకంగా రెండు దేశాల ప్రధానులే చర్చలకు దిగారు. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు వేదికైన ఆస్ట్రేలియాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో పర్యాటక జట్టుకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్‌ని కోరారు. తమ దేశ క్రికెటర్లు కుటుంబాలతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించే వీలు కల్పించాలని, అందుకు తగిన సడలింపులు ఇవ్వాలని బ్రిటన్ ప్రధాని అభ్యర్ధించారు. ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఉన్న అడ్డంకులు తొలగించడానికి బ్రిటన్ ప్రధానే ప్రత్యేక చొరవ తీసుకొని ఆతిధ్య దేశ ప్రధానితో చర్చించడం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి -
వెనక్కు తగ్గిన ఆస్ట్రేలియా.. వారి ప్రయాణానికి ఓకే
మెల్బోర్న్: భారత్ నుంచి తమ దేశ పౌరుల రాకపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ నెల 15 వరకూ నిషేదం అమల్లో ఉండగా, ఆ రోజు (శని వారం) నుంచే భారత్ నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్ట్రే లియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ప్రకటించారు. భారత్ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే కమర్షియల్ విమానాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఆ దేశమే స్వయంగా విమానాలను పంపి పౌరులను తీసుకొని వెళ్లనున్నట్లు చెప్పింది. మే 15 నుంచి 31 మధ్య మూడు విమానాలు భారత్‌కు చేరుకొని తిరిగి వెళతాయని అధికారులు అన్నారు. ఆయా విమానాలు డార్విన్‌కు చేరుకుంటాయని తెలి పారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవడానికే నిబంధనలు పెట్టామని, అ యితే నిబంధనలు కొనసాగించాల్సిన అవ స రం కనిపించనందువల్ల ఆంక్షలు ఎత్తేస్తున్న ట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యానించారు. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) -
'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు. కరోనా విజృంభణతో భారత్ అల్లాడిపోతుంటే.. ఐపీఎల్ రద్దుతో అక్కడే ఉండిపోయిన ఆసీస్ ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు.'మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ విరుచుకుపడ్డాడు. మరోవైపు కరోనాతో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ''కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. కరోనా బారీన పడిన ప్రతీ భారతీయుడు క్షేమంగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది.దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా పనిచేసిన మైకెల్ స్లేటర్ కరోనా విజృంభణ దృశ్యా సొంత దేశానికి పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆసీస్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలి రద్దు కావడంతో లీగ్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లు కూడా డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోవడంతో శ్రీలంక మీదుగా మాల్దీవ్స్ చేరుకొని అక్కడినుంచి ఆస్ట్రేలియా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2021: ఆసీస్ క్రికెటర్లకు షాక్ Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street! — Michael Slater (@mj_slats) May 5, 2021 I challenge you to a debate anytime PM. — Michael Slater (@mj_slats) May 5, 2021 Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx — Michael Slater (@mj_slats) May 5, 2021 -
ఐపీఎల్ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం
కాన్బెర్రా: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం వేయాలని కోరిన ఆ దేశానికి చెందిన క్రిస్ లిన్ విజ్ఞప్తికి చుక్కెదురైంది. ఈ విషయంలో తాము ఎటువంటి సాయం చేయలేమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెగేసి చెప్పారు. ఐపీఎల్లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్‌గా ప్రయాణించారని, ఇదేమే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు. ఆసీస్ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడిన మోరిసన్.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ‘ వారు(ఆసీస్ క్రికెటర్లు) ప్రైవేట్‌గా భారత్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్‌కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారుకున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే.... వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా’ అని తెలిపారు. ఇక్కడ చదవండి: మాకు చార్టర్ విమానం వేయండి: సీఏకు లిన్ విజ్ఞప్తి ఇంత ఖర్చుతో ఐపీఎల్ అవసరమా?: రాజస్థాన్ ఆటగాడు -
రాసలీలలు: ఇద్దరు మంత్రులపై వేటు
సిడ్నీ: పార్లమెంట్ భవనం ఆవరణలో సిబ్బంది రాసలీలలు చేయడం ఆస్ట్రేలియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు పడింది. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి తీవ్ర చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి లిండా రేనాల్డ్స్, అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని స్కాట్ మారిసన్ ఈ మేరకు శనివారం వేటు వేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని తన మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట రక్షణ శాఖ మంత్రి కార్యాలయంలో ఆ శాఖకు చెందిన ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. పార్లమెంట్లో పని చేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మాజీ ఉద్యోగి హిగ్గిన్స్ బయటపెట్టడంతో కొన్ని రోజులుగా ఆస్రే్టలియాలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటార్నీ జనరల్ పోర్టర్ 16 ఏళ్ల కిందట తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలు చేసిన ఆమె ఇటీవల మృతిచెందింది. ఆయనపై కూడా ప్రజలు, ప్రతిపకక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటార్ని జనరల్ పదవి నుంచి పోర్టల్‌ను తొలగించారు. ఈ విధంగా పార్లమెంట్లో రాసలీలల ఘటనలు సంచలనంగా మారాయి. చదవండి: ఒక వధువు, ఐదుగురు పెళ్లి కుమారులు! -
తొలిసారి భేటీ కానున్న మోదీ-బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తొలిసారి.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అయితే వర్చువల్‌గా. త్వరలో ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో ఆ ఇద్దరు నేతల భేటీ దాదాపు ఖరారైంది. క్వాడ్‌లోని సభ్యదేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా త్వరలో భేటీ కానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం ప్రకటించారు. చైనా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు అగ్ర నేతలు ఈ భేటీలో ఏం చర్చించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల చైనాతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కయ్యానికి దిగడం, పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలకు తీవ్రస్థాయిలో విభేదాలు రావడం తెలిసిందే. ఇటీవల సరిహద్దు అంశంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జరగబోయే క్వాడ్ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం ఈ నాలుగు దేశాల అధ్యక్షులు నిర్మాణాత్మకంగా కలిసి పని చేస్తారు అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యాక్షురాలితో కొన్ని వారాల క్రితమే చర్చించానన్నారు మోరిసన్. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ ఆయనకు గత నెల 8న ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరు దేశాధ్యక్షులు తొలిసారిగా త్వరలో జరగబోయే క్వాడ్ సమావేశంలోనే కలవనున్నారు. ఇరు దేశాధినేతల మధ్య వర్చువల్ భేటీ జరగడం మాత్రం ఇదే తొలిసారి. క్వాడ్ మీటింగ్‌కు సంబంధించి భారత ప్రధానమంత్రి కార్యాలయం ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికి సదస్సుకు మోదీ, బైడెన్ హాజరు అవుతారని ఆసీస్ పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, రక్షణ కోసం నాలుగు దేశాలు పనిచేయనున్నట్లు స్కాట్ తెలిపారు. చదవండి: చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధం: బైడెన్ -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్‌ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
పార్లమెంట్ హౌజ్‌లోనే అత్యాచారం
కాన్బెరా: ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం ఏకంగా పార్లమెంట్ హౌజ్‌లో, స్వయంగా ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఒక ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం నాటి రక్షణ పరిశ్రమల మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో సహోద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యానని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్ సోమవారం ఆరోపించారు. 2019లో ఈ ఘటన జరిగిందని, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తినప్పటికీ తనకు బాస్ అయిన మంత్రి లిండా రేనాల్డ్స్ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ న్యాయం పొందేందుకు తగిన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే పోలీస్ కంప్లయింట్‌పై ముందుకు వెళ్లలేదని వివరించారు. లిండా రేనాల్డ్స్కు హిగిన్స్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ అత్యాచారంపై అధికారికంగా పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ఆమెకు క్షమాపణలు తెలిపారు. హిగిన్స్ ఆరోపణలపై నాటి రక్షణ మంత్రి రేనాల్డ్స్ ఆమెనే తప్పుపట్టడం సరికాదని, ఈ విషయంలో హిగిన్స్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోరిసన్ వ్యాఖ్యానించారు. పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోరిసన్ మంత్రివర్గంలో ప్రస్తుతం లిండా రేనాల్డ్స్ రక్షణ మంత్రిగా ఉన్నారు. పార్లమెంట్ హౌజ్ పని సంస్కృతిలో తీసుకురావాల్సిన మార్పులపై, ఉద్యోగినుల భద్రతపై సూచనలు చేసేందుకు ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తరువాత కూడా రేనాల్డ్స్‌ను మంత్రిగా కొనసాగించడంపై విపక్షాలు మోరిసన్‌పై విమర్శలు గుప్పించాయి. -
పార్లమెంటులో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం!
కాన్బెర్రా: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమకు తామే సాటి అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. అయితే, వారిపట్ల వివక్ష, లైంగిక వేధింపులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇక పౌరుల హక్కులను కాపాడేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి తనపై సహోద్యోగి అత్యాచారం చేశాడని ఆరోపించించారు. 2019లో జరిగిన ఈ లైంగిక వేధింపుల ఘటనను ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తనపై లైంగిక దాడి జరిగిన సమయంలో స్థానిక మీడియా, పోలీసులను సంప్రదించినప్పటికీ లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. పై అధికారుకు చెప్పినా వారు సరిగా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరూ తన గోడు పట్టించుకోలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన తాను భవిష్యత్‌పై భయంతో మిన్నకుండి పోవాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న ఆస్టేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ బాధిత మహిళకు క్షమాపణలు కోరారు. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాలలో మహిళలు ఎలాంటి వివక్ష ఎదుర్కోకూడదని అన్నారు. దాంతోపాటు ఆస్ట్రేలియాలో పనిప్రదేశాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా స్టేఫానీ ఫాస్టర్ అనే అధికారిని నియమించారు. చదవండి: యూకేకు ప్రయాణం మరింత కఠినం -
ఆస్ట్రేలియాకు గూగుల్ బెదిరింపులు
వెల్లింగ్టన్: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల గూగుల్ డైరెక్టర్ మెల్ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్ గనక చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. -
చైనా సిగ్గుపడాలి: ఆసీస్ ప్రధాని
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చైనాపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నందుకు సిగ్గుపడాలని, తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లో తమ ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌బెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 2005 నుంచి 2016 మధ్య అఫ్ఘన్ సైనికుల దుష్ప్రవర్తనపై సుదీర్ఘ దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆసీస్ సైనికుల వ్యవహారశైలిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.(చదవండి: అనవసరంగా మమ్మల్ని లాగొద్దు: ఆస్ట్రేలియా) ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ సోమవారం ట్విటర్లో షేర్ చేసిన ఫొటో డ్రాగన్- కంగారూ దేశాల మధ్య చిచ్చు పెట్టింది. ఓ సైనికుడు చిన్నారి గొంతుపై కత్తి పెట్టిన ఫొటోను షేర్ చేసిన ఆయన.. ‘‘అఫ్గన్ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హతమార్చిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి చర్యలను మనం తీవ్రంగా ఖండించాలి. వారిని ఇందుకు జవాబుదారులు చేయాలి’’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై విలేకరుల సమావేశంలో స్పందించిన ఆసీస్ ప్రధాని మోరిసన్.. ‘‘ ఇలాంటి నిరాధార కథనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ పోస్టు కారణంగా చైనా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ చర్య.. ప్రపంచ దేశాల దృష్టిలో చైనా మరింత దిగజార్చింది. గత కొన్నిరోజులుగా ఆసీస్- చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల పట్ల డ్రాగన్ దేశ స్పందన ఎలా ఉందో ప్రపంచం గమనిస్తోంది’’ అని మండిపడ్డారు. నకిలీ ఫొటోలతో తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై వ్యాఖ్యలు, చైనీస్ కంపెనీ వావే టెక్నాలజీస్‌పై ఆసీస్ నిషేధం నేపథ్యంలో చైనా- ఆస్ట్రేలియాల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.(చదవండి: అప్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికుల దాష్టీకాలు) చదవండి: చైనా దూకుడు.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు! Shocked by murder of Afghan civilians & prisoners by Australian soldiers. We strongly condemn such acts, &call for holding them accountable. pic.twitter.com/GYOaucoL5D — Lijian Zhao 赵立坚 (@zlj517) November 30, 2020 -
చైనా తీరు సరికాదు: ఆసీస్ ప్రధాని
సిడ్నీ: ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం చూపేలా చైనా వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. సినో- అమెరికా ప్రచ్చన్న యుద్ధంలోకి అనవసరంగా తమను లాగుతున్నారంటూ డ్రాగన్ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభావిత దేశం(పెంపుడుకుక్క)గా ఆస్ట్రేలియాను చిత్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలంటూ హితవుపలికారు. ఇరు దేశాలతోనూ సత్పంబంధాలు కోరుకుంటున్నామని, పరస్పర సహకారంతో ముందుసాగితే అందరికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై వ్యాఖ్యలు, చైనీస్ కంపెనీ వావే టెక్నాలజీస్‌పై ఆసీస్ నిషేధం నేపథ్యంలో చైనా- ఆస్ట్రేలియాల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. (చదవండి: మా రూల్స్.. మా ఇష్టం: చైనాకు ఆసీస్ వార్నింగ్!) వావే నమ్మదగిన సంస్థ కాదని, ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక ఆ సంస్థ వద్ద ఉంటే సదరు దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలోనే ఆసీస్, నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుందని చైనా ఆరోపించింది. అంతేగా దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో అమెరికాతో కలిసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆరోపణులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో 14 రకాల వేర్వేరు అంశాల్లో ఆస్ట్రేలియా వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చైనా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనాను శత్రువుగా భావిస్తే, శత్రువుగానే ఉంటుందంటూ పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. ఈ విషయంపై స్పందించిన స్కాట్ మోరిసన్ చైనా ఒత్తిళ్లకు తలొగ్గమంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా అమెరికా- చైనాలతో ఆసీస్ బంధం గురించి లండన్ ఫోరంకు ఇచ్చిన సోమవారం నాటి ఆన్లైన్ స్పీచ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇరు దేశాలతోనూ తాము సత్పంబంధాలే కోరుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికను స్వాగతించిన మోరిసన్, అమెరికా లేదా చైనా ఏదో ఒకవైపే ఉండేలా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక శక్తులు తమ స్వప్రయోజనాలతో పాటు వాటి మిత్రదేశాల ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని, అదే సమయంలో స్వతంత్రంగా వ్యవహరించగలిగే వీలు కలిగించాలని కోరారు. కాగా ట్రంప్ హాయంలో అమెరికా- చైనాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక బైడెన్ రాకతో పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు
న్యూఢిల్లీ–మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య గురువారం ఆన్లైన్ సదస్సు జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ)పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు. ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ► ఇండో పసిఫిక్ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్డ్ విజన్ ఫర్ మ్యారీ టైమ్ కోపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్‌ను ఆవిష్కరించాయి. సంక్షోభాల నుంచి అవకాశాలు ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపించిన తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి బయటపడడానికి సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దానికనుగుణంగా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన సంస్కరణలు తీసుకువచ్చే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ► అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది. సమోసా కిచిడీ దౌత్యం స్కాట్ మారిసన్ గుజరాతీ కిచిడి వండి వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో ఆన్లైన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈసారి ఇరువురి సమావేశం జరిగినప్పుడు తానే స్వయంగా కిచిడి వండి తినిపిస్తానన్నారు. భారతీయ సమోసా, మాంగో చెట్నీలు స్వయంగా తయారు చేసిన మారిసన్ వాటి రుచిని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తానే స్వయంగా భారత్‌కు వచ్చి మోదీని కలుసుకొని సమోసా తినిపించాలని అనుకున్నానని మారిసన్ చెప్పారు. మోదీ ఆలింగనాన్ని కూడా మిస్ అయ్యానన్నారు. ఈ సారి కలిసినప్పుడు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని గుజరాతీ కిచిడీని స్వయంగా వండి తినిపిస్తానని చెప్పారు. దీనికి మోదీ బదులిస్తూ ‘మీరు సమోసాలు షేర్ చేయగానే దేశమంతా దాని గురించే మాట్లాడారు. ఇంక అందరూ గుజరాతీ కిచిడీ గురించే మాట్లాడుకుంటారు. గుజరాతీయులు చాలా ఆనందపడతారు. ఈ కిచిడీని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు’అని మోదీ బదులిచ్చారు. -
భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు తెలిపింది. అదే విధంగా ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల సమూహం)లో భారత్ సభ్యత్వాన్ని బలపరుస్తున్నట్లు వెల్లడించింది. వివిధ అంశాలపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గురువారం వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగం, మైనింగ్ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఏడు ఒప్పందాలపై సంతకం చేసిన ఇరు దేశాధినేతలు.. ఇండో- పసిఫిక్ జలాల్లో పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్ స్నేహబృందంలో ఆస్ట్రేలియా కూడా ఉందని.. కీలక అంశాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.(భారత్‌కు ఫ్రాన్స్ భారీ రుణ సాయం!) ఇక ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్.. ‘‘ మనం మహాసముద్రాన్ని పంచుకుంటున్నాం. అదే విధంగా బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంది. ఆరోగ్యం, భద్రత రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. ‘‘యూఎన్ఎస్సీలో భారత శాశ్వత అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నామని ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తోంది. పౌర అణు ఒప్పందాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా నిలబడతాయి. అదే విధంగా ఎన్ఎస్జీలో కూడా భారత సభ్యత్వం కల్పించే అంశంలో ఆస్ట్రేలియా పూర్తి మద్దతు తెలియజేస్తోంది ’’ అని ఇరు దేశాలు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అదే విధంగా భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సిందిగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఆస్ట్రేలియా స్వాగతించింది. కాగా యూఎన్ఎస్సీలో భారత శాశ్వత సభ్యత్వానికి పలు దేశాలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. (తెలుగు ఐఏఎస్ రవి కోటకు కీలక పదవి) -
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్య, రక్షణ రంగంలో ఇరుదేశాల సహకారం పెంపొందించడంపై సంప్రదింపులు జరిపారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్‌లో పర్యటించాలని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ను మోదీ ఆహ్వానించారు. ఆస్ర్టేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయని మోదీ అన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో మున్ముందుకు సాగడంతో పాటు ప్రపంచ వృద్ధికి దోహదపడతాయని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సమిష్టి వ్యూహం, పరస్పర సహకారంతోనే ఈ విపత్తు నుంచి బయటపడగలమని అన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఓ విదేశీ నేతతో వర్చువల్ భేటీ కావడం ఇదే తొలిసారి. చదవండి : ఒకే దేశం.. ఒకే మార్కెట్ -
మోదీతో వీటిని పంచుకోవాలనుకున్నా: మోరిస్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో జూన్ 4న వీడియో భేటీలో పాల్గొననున్న సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ ఆదివారం సమోసాల ఫొటోలను కొన్నింటిని ట్వీట్‌చేశారు. వీటిని మోదీతో కలిసి ఆస్వాదించాలని ఉందని వ్యాఖ్యానించారు. వాటికి 'స్కమోసా'లని కొత్త పేరు పెట్టారు. ‘ఆదివారం మామిడికాయ చట్నీతో స్కమోసాలు. భారత ప్రధానితో వీటిని పంచుకోవాలనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తూ అది వీడియో లింక్ భేటీ’ అని మోరిసన్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా మోదీ ‘హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానం.. భారతీయ సమోసాల ద్వారా అనుబంధం’ అని ట్వీట్ చేశారు. Connected by the Indian Ocean, united by the Indian Samosa! Looks delicious, PM @ScottMorrisonMP! Once we achieve a decisive victory against COVID-19, we will enjoy the Samosas together. Looking forward to our video meet on the 4th. https://t.co/vbRLbVQuL1 — Narendra Modi (@narendramodi) May 31, 2020 -
కరోనా: చైనాపై మండిపడ్డ ఆస్ట్రేలియా!
సిడ్నీ: చైనా ఆహార మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన సదరు మార్కెట్లు ప్రపంచానికి సమస్యగా పరిణమించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఆనవాళ్లు తొలిసారిగా చైనాలో బయటపడిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. (ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల వర్షం) ఈ నేపథ్యంలో చైనీయుల ఆహారపుటలవాట్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మార్కెట్లలో ఇబ్బడిముబ్బడిగా కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు ఇతర జంతువుల మాంసం అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతుండటం వల్లే ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (కరోనా: డబ్ల్యూహెచ్ఓ తీరుపై ట్రంప్ విమర్శలు) ‘‘తడి మార్కెట్ల(అపరిశుభ్ర మాంసం మార్కెట్లు) కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో మనందరికీ తెలుసు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్ఓ, ఐరాస చర్యలు తీసుకోవాలి. ఈ వైరస్ చైనా మార్కెట్లో ఉద్భవించి ప్రపంచం మొత్తం విస్తరించింది. దీని కారణంగా ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచానికి ఇది సవాలు విసిరింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు మార్కెట్లపై చర్యలు తీసుకోనట్లయితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది’’ అని మారిసన్ హెచ్చరించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 51 వేల మంది మరణించగా.. పది లక్షల మంది దీని బారిన పడ్డారు.(చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ) -
ఆగని కార్చిచ్చు.. ఎటుచూసిన కళేబరాలే
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ కార్చిచ్చు లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా, 24మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన సందర్శకులు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించగా, న్యూసౌత్ వేల్స్లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చు ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ విపత్తు కారణంగానే స్కాట్ మోరిసన్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి 13 నుంచి 4 రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించాల్సి ఉంది. మరోవైపు ఆసీస్ మంటల ధాటికి పొరుగున న్యూజిలాండ్ దేశంలోని ఆకాశం ఎర్రగా మారిందంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ప్రఖ్యాత గాలపోగస్ దీవుల్లోని ప్రాణులు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చుకి మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వేలాది కోలస్, కంగారూలు మంటల వేడికి చనిపోగా.. మిగిలిన ఉన్న వాటి సంరక్షణ ఎలా చేయాలో తెలీక పర్యావరణవేత్తలు, జీవశాస్త్రజ్ఞులు మదనపడుతున్నారు. ఆదివారం కొద్దిసేపు వర్షం పడటంతో మంటలు కాస్త చల్లారాయి. ఇప్పటికిప్పుడు పరిస్థితి చక్కబడే అవకాశం కనిపించకపోవడంతో.. స్థానిక ప్రజల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దావానలాన్ని చల్లార్చే పనిలో పడింది. చదవండి: ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా -
ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. -
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
-
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు దేశ ప్రజల నుంచి వింత అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకొని మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్ ఫైటర్స్, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్ మోరిసన్ గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు. కాగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఒక మహిళా ఫైర్ ఫైటర్‌ను అభినందిస్తూ ఆమెతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రధానితో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. అంతలో అక్కడ ఉన్న మరో వ్యక్తితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అతను కూడా నిరాకరించి ప్రధానికి క్షమాపణ చెప్పి దూరంగా వెళ్లిపోయాడు. కాగా ఆ వ్యక్తి ఇతరుల ఇళ్లను కాపాడే ప్రయత్నంలో తన ఇళ్లును పోగొట్టుకున్నాడని ఒక అధికారి వెల్లడించారు. 'కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడుతుంటే మీరు మాత్రం సిడ్నీ హార్బర్ దగ్గర్లోని కిర్రిబిల్లి హౌస్‌లో కూర్చొని కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాదిస్తారా' అంటూ ఒక వ్యక్తి ప్రధానిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' నువ్వు ఒక మూర్ఖుడివి.. నిన్ను మళ్లీ మేం ప్రధానిగా చూడబోమంటూ' మరొక వ్యక్తి ప్రధాని మోరిసన్ మీద విరుచుకుపడ్డాడు. అయితే వీటిపై ప్రధాని స్పందిస్తూ.. ' ఈరోజు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నా కళ్లారా చూశాను. నన్ను తిట్టినందుకు నేనేం బాధపడడంలేదు.ఎందుకంటే ఇందులో మానవ తప్పిదం ఏం లేదు. కేవలం ప్రకృతి వైపరిత్యాల వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు మా ప్రజలు పడుతున్న బాధను దగ్గరుండి గమనించాను. మా ప్రభుత్వం తరపున వారికి కావలిసివి అన్ని ఏర్పాటు చేస్తామని' పేర్కొన్నారు. గతేడాది మేలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి స్కాట్ మోరిసన్ ప్రధాని పదవిని చేపట్టాడు. అయితే కార్చిచ్చు అంటుకొని దేశంలోని ఐదు రాష్ట్రాలకు వ్యాపించిన సమయంలో మోరిసన్ తన కుటుంబంతో కలిపి హాలిడే టూర్ పేరుతో హవాయి నగరాన్ని సందర్శించారు. అయితే ప్రధాని తీరుపై అక్కడి ప్రజలు, విపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశారు. దీనిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు మోరిసన్ తెలిపారు.జనవరి 13 నుంచి 16 వరకు ప్రధాని స్కాట్ మోరిసన్ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. -
ఆసీస్ క్రికెటర్లకు ప్రధాని స్వీట్ షాక్!
కాన్బెర్రా : ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారం ఎత్తారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లసిత్ మలింగ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్ వేదికగా మొదలుకానున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కంగారూ(ప్రైమ్ మినిస్టర్ XI)- లంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాన్‌బెర్రాలోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకు వచ్చారు. మ్యాచ్ 16వ ఓవర్లో తమ క్రికెటర్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకువచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ ఆటగాళ్లు స్వీట్ షాక్‌కు గురయ్యారు. ఇక ప్రధాని రాకను చూసి కొంతమంది చిరునవ్వులు చిందించగా.. మరికొంత మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కాగా తెలుపు రంగు షర్టు, నల్లరంగు ప్యాంటు ధరించిన స్కాట్ మారిసన్.. ఆసీస్ క్రికెట్ జట్టు క్యాప్‌ను ధరించి మైదానంలోకి రావడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో... ‘ఆసీస్ క్రికెట్లకు వాటర్ బాయ్‌గా సేవలు అందించి ప్రధాని స్కాట్ మారిసన్.. ఈ ప్రపంచంలో ఏ పనిని కూడా తక్కువగా చూడకూడదని నిరూపించారు. మీరు గ్రేట్ సార్. హాట్సాఫ్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన శ్రీలంక యువజట్టు.. ప్రపంచ నంబర్ వన్ జట్టును వైట్‌వాష్ చేసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక అదే జోష్‌లో పూర్తిస్థాయి జట్టుతో ఆస్ట్రేలియాకు చేరుకున్న మలింగ సేన కంగారూలను సైతం ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు... ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి 20 నాటికి జట్టుతో చేరే అవకాశం ఉందని కోచ్ జస్టిన్ లింగర్ పేర్కొన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తి సిద్ధంగా ఉన్నామని.. పర్యాటక జట్టుపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. -
మోదీ ఎంత మంచివారో!
ఒసాకా : ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. జీ 20 సదస్సులో భాగంగా మోదీతో సెల్ఫీ తీసుకున్న ఆయన.. ‘మోదీ ఎంత మంచివారో(బాగున్నారో)!!’ అంటూ ఆ ఫొటోను ట్వీటర్లో షేర్ చేశారు. ఇందుకు స్పందనగా.. ‘మేట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునే చర్చకై ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రధానుల సెల్ఫీపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 27 నుంచి 29 వరకు జపాన్‌లోని ఒసాకాలో జీ20 దేశాల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక ఈరోజు ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అదే విధంగా చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం ముదిరిన నేపథ్యంలో చర్చలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf — Scott Morrison (@ScottMorrisonMP) June 28, 2019