రాసలీలలు: ఇద్దరు మంత్రులపై వేటు | Scott Morrison Decision: Two Australia Ministers Demoted | Sakshi
Sakshi News home page

రాసలీలలు: ఇద్దరు మంత్రులపై వేటు

Published Mon, Mar 29 2021 5:16 PM | Last Updated on Mon, Mar 29 2021 5:29 PM

Scott Morrison Decision: Two Australia Ministers Demoted - Sakshi

సిడ్నీ: పార్లమెంట్‌ భవనం ఆవరణలో సిబ్బంది రాసలీలలు చేయడం ఆస్ట్రేలియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు పడింది. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి తీవ్ర చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి లిండా రేనాల్డ్స్‌, అటార్నీ జనరల్‌ క్రిస్టియన్‌ పోర్టల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఈ మేరకు శనివారం వేటు వేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని తన మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట రక్షణ శాఖ మంత్రి కార్యాలయంలో ఆ శాఖకు చెందిన ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. పార్లమెంట్‌లో పని చేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మాజీ ఉద్యోగి హిగ్గిన్స్‌ బయటపెట్టడంతో కొన్ని రోజులుగా ఆస్రే‍్టలియాలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

అటార్నీ జనరల్‌ పోర్టర్‌ 16 ఏళ్ల కిందట తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలు చేసిన ఆమె ఇటీవల మృతిచెందింది. ఆయనపై కూడా ప్రజలు, ప్రతిపకక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటార్ని జనరల్‌ పదవి నుంచి పోర్టల్‌ను తొలగించారు. ఈ విధంగా పార్లమెంట్‌లో రాసలీలల ఘటనలు సంచలనంగా మారాయి.

చదవండి: ఒక వధువు, ఐదుగురు పెళ్లి కుమారులు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement