సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్య, రక్షణ రంగంలో ఇరుదేశాల సహకారం పెంపొందించడంపై సంప్రదింపులు జరిపారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్‌లో పర్యటించాలని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ను మోదీ ఆహ్వానించారు.
ఆస్ర్టేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయని మోదీ అన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో మున్ముందుకు సాగడంతో పాటు ప్రపంచ వృద్ధికి దోహదపడతాయని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సమిష్టి వ్యూహం, పరస్పర సహకారంతోనే ఈ విపత్తు నుంచి బయటపడగలమని అన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఓ విదేశీ నేతతో వర్చువల్ భేటీ కావడం ఇదే తొలిసారి. చదవండి : ఒకే దేశం.. ఒకే మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment