లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం ఏకంగా రెండు దేశాల ప్రధానులే చర్చలకు దిగారు. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు వేదికైన ఆస్ట్రేలియాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో పర్యాటక జట్టుకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్‌ని కోరారు.
తమ దేశ క్రికెటర్లు కుటుంబాలతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించే వీలు కల్పించాలని, అందుకు తగిన సడలింపులు ఇవ్వాలని బ్రిటన్ ప్రధాని అభ్యర్ధించారు. ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఉన్న అడ్డంకులు తొలగించడానికి బ్రిటన్ ప్రధానే ప్రత్యేక చొరవ తీసుకొని ఆతిధ్య దేశ ప్రధానితో చర్చించడం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
చదవండి: పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Comments
Please login to add a commentAdd a comment