cooks
-
మోదీకి ఇష్టమైన కిచిడిని వండిన ఆస్ట్రేలియా ప్రధాని
Scott Morrison Celebrate India-Australia Trade Deal: భారత్ ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌తో జరిగిన కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మోదీకి ఇష్టమైన కిచిడిని వండి సెలబ్రెట్ చేసుకున్నారు. ఆయన వంటకాలకు సంబంధించిన ఫోటోలను మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మారిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.."భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాను ఇలా సెలబ్రెట్ చేసుకున్నాని చెప్పారు. ఈ రాత్రికి భారతీయ వంటకాలను తయారు చేస్తున్నాని చెప్పారు. తాను వండటానికి ఎంచుకున్న కూరలన్నీ గుజరాత్‌కి చెందినవే. అంతేకాదు అందులో నా ప్రియమైన స్నేహితుడు నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడి కూడా ఉంది" అని చెప్పారు. అదీగాక మోదీ ఎన్నోసార్లు ఇంటర్యూల్లో తనకు కిచిడి అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు కూడా. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం అయిన కిచిడి వండటం అంటే ఇష్టమని పలుమార్లు చెప్పారు. ఏప్రిల్ 2న భారత్ ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి. అంతేగాక ఈ ఒప్పందంలో 95 % భారతీయ ఉత్పత్తులకు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఎగుమతులను బిలియన్ డాలర్ల మేర పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అదీగాక ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్లు, బొమ్మలు, పాదరక్షలు, తోలు వస్తువులతో సహా కీలకమైన ఆస్ట్రేలియన్ మార్కెట్లలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం భారత్‌ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చగలదు. View this post on Instagram A post shared by Scott Morrison (@scottmorrisonmp) (చదవండి: తగ్గేదేలే.. పుతిన్ సంచలన నిర్ణయం) -
శ్రీవారి ఆలయంలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే నేతి డబ్బాలను మాయం చేసిన ఘటనలో ఇద్దరు వంట స్వాములను సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకొక్కటి 15 కేజీల బరువైన మూడు నేతి డబ్బాలు చోరీకి గురైనట్టు తెలుసుకున్న అధికారులు ఈనెల 5న ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచార్యులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మూడు నేతి డబ్బాలు అక్కడ దర్శనమిచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు వంట స్వాములను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. -
యామీ ‘యమ్మీ’ పాస్తా!
ఓ చల్లని సాయంత్రం...బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్ ఇల్లు. సందడిగా ఉంది. వీనుల విందైన సంగీతం, సరదాలు, ఆటపాటలతో ఆమె ఇల్లు కళకళలాడుతోంది. యామీ గౌతమ్ దగ్గరుండి మరీ అతిథులకు ఫుడ్ వడ్డిస్తున్నారు. దీనికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. యామీ గౌతమ్‌కు పాస్తాలంటే పిచ్చి. స్నేహితుల కోసం అప్పుడప్పుడూ పాస్తాలు చేస్తానని ఏదో మాటల సందర్భంలో చిత్ర యూనిట్‌కు యామీ చెప్పారు. పాస్తాలంటే ఇష్టమని చిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ చెప్పడంతో వీళ్లను తన ఇంటికి డిన్నర్‌కు పిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఓ వారం ముందు నుంచే సరుకులు తెచ్చుకుని ప్లానింగ్‌తో ఈ విందు ఏర్పాటు చేశారు యామీ. దీని గురించి ఆమె మాట్లాడుతూ -‘‘అదృష్టం కొద్దీ పాస్తాలు బాగా వచ్చాయి. పాస్తాలు చేయడం కన్నా వాటిని అలకరించడానికే ఎక్కువ టైమ్ పట్టింది. అయితే, అందరికీ నచ్చడంతో కష్టాన్ని మర్చిపోయా. యూనిట్‌తో ఇలా సమయం గడపడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని చెప్పారు. -
హెల్దీ & టేస్టీ
రోజుకోరకం రుచిని ఇష్టపడే ఫుడ్ లవర్స్కోసం పూటకో రెసిపీని అందిస్తున్నారు నగరంలోని చెఫ్స్. రుచితోపాటు ఆరోగ్యాన్ని జోడించిన డిషెస్ వండి వడ్డిస్తున్నారు. తెలుగువారు ఇష్టపడే సీఫుడ్, మటన్లతో వెరైటీ ప్రయోగాలు చేస్తున్నారు బంజారాహిల్స్‌లోని ‘టేక్అవే’ చెఫ్ నర్సింహులు. ఆ హెల్దీ డిషెస్ మీకోసం... ఆవకాయ చేపలకూర ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారుండరు. అయితే పచ్చడికి బదులు కాస్త వెరైటీని కోరుకునేవారి కోసమే ఈ ఆవకాయ చేపకూర. పేస్టు చేసి వారం రోజులు నిల్వ ఉంచిన ఆ మిశ్రమం ఊరి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఆ పేస్ట్‌ను చేపలకూరతో కలిపి మారినేట్ చేస్తే... కాస్త పుల్లగా, కొంచెం కారంగా, మరికాస్త తీయగా... మొత్తానికి డిఫరెంట్ టేస్ట్‌తో నోరూరిస్తుంది. నార్త్ ఇండియన్స్ సైతం ఇష్టపడటం దీని స్పెషాలిటీ! అల్లం-రొయ్యల వేపుడు పరిగడుపున అల్లం తింటే పైత్యం వదులుతుందంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో అంత ఇష్టంగా అల్లం తినేవాళ్లెవరు. అందుకే... అల్లం, మిరియాలపొడి, బాదాం పేస్టు వంటి పోషకాలు కలిగిన ప్రోడక్ట్స్‌ను రొయ్యలకు కలిపి, ఎలాంటి ఫుడ్ కలర్స్ ఉపయోగించకుండా చేసే ఒక మంచి స్టార్టర్ అల్లం-రొయ్యల వేపుడు. ఇది నాన్స్లో, ఈవెనింగ్ స్నాక్స్తోపాటు పప్పు చారు అన్నంలో మంచింగ్‌కి మంచి కాంబినేషన్. పొనగంటి మాంసపు వేపుడు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దొరికే పొనగంటి కూరలో ఎన్నో పోషకాలున్నాయి. ఈ పొనగంటి ఆకులను మాంసంతో కలిసి చేసే ఈ స్టీమ్డ్ మటన్ఫ్రై టేస్ట్‌లో డిఫరెంట్. ఎలాంటి బటర్, చీజ్, అజినమోటోలు, కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం రెండు చెంచాల ఆయిల్‌తో చేసే ఈ డిష్ పిల్లలకూ మంచిది.