యామీ ‘యమ్మీ’ పాస్తా! | Yami Gautam cooks up a special surprise for her team! | Sakshi
Sakshi News home page

యామీ ‘యమ్మీ’ పాస్తా!

Published Tue, May 19 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

యామీ ‘యమ్మీ’ పాస్తా!

యామీ ‘యమ్మీ’ పాస్తా!

 ఓ చల్లని సాయంత్రం...బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్ ఇల్లు. సందడిగా ఉంది. వీనుల విందైన సంగీతం, సరదాలు, ఆటపాటలతో ఆమె ఇల్లు కళకళలాడుతోంది. యామీ గౌతమ్ దగ్గరుండి మరీ అతిథులకు ఫుడ్ వడ్డిస్తున్నారు. దీనికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. యామీ గౌతమ్‌కు పాస్తాలంటే పిచ్చి. స్నేహితుల కోసం అప్పుడప్పుడూ పాస్తాలు చేస్తానని ఏదో మాటల సందర్భంలో చిత్ర యూనిట్‌కు యామీ చెప్పారు.

పాస్తాలంటే ఇష్టమని చిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ చెప్పడంతో వీళ్లను తన ఇంటికి డిన్నర్‌కు పిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఓ వారం ముందు నుంచే సరుకులు తెచ్చుకుని ప్లానింగ్‌తో ఈ విందు ఏర్పాటు చేశారు యామీ. దీని గురించి ఆమె మాట్లాడుతూ -‘‘అదృష్టం కొద్దీ పాస్తాలు బాగా వచ్చాయి. పాస్తాలు చేయడం కన్నా వాటిని అలకరించడానికే ఎక్కువ టైమ్ పట్టింది. అయితే, అందరికీ నచ్చడంతో కష్టాన్ని మర్చిపోయా. యూనిట్‌తో ఇలా సమయం గడపడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement