Yami Gautam
-
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?
హీరోయిన్ యామీ గౌతమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. కొన్నిరోజుల ముందు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పింది. అలానే పిల్లాడికి వేదవిద్ అని పేరు కూడా పెట్టినట్లు ఇన్ స్టా పోస్ట్‌తో వెల్లడించింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్)2010లో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో యామీ గౌతమ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఏడాదే 'నువ్విలా' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ తదితర తెలుగు సినిమాల్లో చేసింది. కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. గత ఏడేళ్ల నుంచి అక్కడే మూవీస్ చేస్తోంది.2019లో రిలీజైన 'ఉరి' చేస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడింది. అలా రెండేళ్ల పాటు రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ 2021లో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా 'ఆర్టికల్ 370' చిత్రంతో హిట్ కొట్టిన యామీ.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ) View this post on Instagram A post shared by Aditya Dhar (@adityadharfilms) -
ఓటీటీకి వంద కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కొత్త ఏడాదిలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్టికల్ 370 ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. -
'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్. అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు. Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions. Watching him being honoured on the biggest… — Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024 -
అప్పుడు రాముడు.. ఇప్పుడు ప్రధానిగా.. అందరి కళ్లు అతనిపైనే!
బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'ఆర్టికల్ 370'. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు అంశమే తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో యామి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో శ్రీరాముని పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్ గోవిల్. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో ఆయన కనిపించారు. చాలా మంది అభిమానులు ట్రైలర్లో ప్రధాని మోడీగా కనిపించిన అరుణ్ గోవిల్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో కనిపించిన కిరణ్ కర్మాకర్‌ని నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న థియేటర్లలో విడుదల కానుంది. #ArunGovil as Modi Ji in Upcoming movie #Article370 #YamiGautam पहचान गए तो एक लाइक तो बनता है pic.twitter.com/A4mfbLCF6r — 📍 (@ghatnachakr) February 8, 2024 Symbolism galore. Arun Govil who played Lord Ram playing PM Modi. Trailer looks quite amazing. Looks like a high octane action drama. If things work out can be a great hit. Yami is too good an actress. #Article370 https://t.co/n9pUvpyXYn — Ujjawal Pratap Singh (@pratap_pablo) February 8, 2024 -
డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
నువ్విలా చిత్రం ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ యామీ గౌతమ్. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ సినిమాల్లో కనిపించింది. గతేడాది బాలీవుడ్ చిత్రాలతో అలరించిన భామ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంలో నటిస్తోంది. అయితే యూరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా అభిమానులకు యామీ గౌతమ్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తన భర్తతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవాళ జరిగిన ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆమె భర్త ఆదిత్య ధార్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. యామీ ప్రస్తుతం నటించిన ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్లలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఆమె ఆమె భర్త ఆదిత్య ధర్ నిర్మించారు. కాగా.. 2019లో 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' సెట్స్‌లో కలిసిన ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ తర్వాత జూన్ 4, 2021న పెళ్లి చేసుకున్నారు. Yami Gautam, Aditya Dhar expecting their first child#pregnancy#Article370Teaser#entertainment#EntertainmentNews#YamiGautam #AdityaDhar pic.twitter.com/CzpmIRn4F0 — NIYA NIVRITI (@NiyaNivriti) February 8, 2024 -
ఆ కోరిక ఉన్నవారు సినిమాల్లో ఎక్కువగా నిలవలేరు: యామి గౌతమ్
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి యామీగౌతమ్. ముఖ్యంగా తమిళంలో గౌరవం, నటుడు జయ్‌కు జంటగా తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్ తదితర చిత్రాల్లో నటించిన ఈ ఉత్తరాది బ్యూటీ వాణిజ్య ప్రకటనల ద్వారా చాలా పాపులర్ అయ్యింది. అయితే ఇటీవల ఈ అమ్మడు దక్షిణాది చిత్రాల్లో కనిపించి చాలాకాలం అయ్యింది. ఇటీవల ఒక భేటీలో యామీగౌతమ్ పేర్కొంటూ చిత్రాలను మార్కెంటింగ్ చేయడంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే చాలా మంది నటీనటులు, సాంకేతిక వర్గం తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిందీలోనూ మార్కెటింగ్ సంస్కృతి పెరిగిపోతోందని చెప్పింది. సినిమాల్లో కొందరు ఒక్క చిత్రంతోనే పాపులర్ అవుతారని, మరికొందరు చాలా కాలం శ్రమించి సక్సెస్ అవుతారని చెప్పింది. మరి కొందరు పబ్లిసిటీ ద్వారా సక్సెస్ కావాలని ఉబలాట పడతారని పేర్కొన్నారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం సినిమాల్లో నిలవలేరని అభిప్రాయపడింది. కేవలం పబ్లిసిటీతోనే అన్నీ రావని అన్నారు. అయినా వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలనే ఆసక్తి కంటే పబ్లిసిటీ ద్వారా పాపులర్ అవ్వాలనే భావన ఇటీవల అధికం అవుతోందని పేర్కొంది. తాను మాత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంటానని చెప్పింది. ప్రతిభను నమ్మి శ్రమిస్తే విజయం తనంతట తానే వరిస్తుందని పేర్కొంది. ఇంతకీ ఈ అమ్మడు సడన్‌గా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనే చర్చ చర్చ ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్‌లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్‌లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ భామ.. ఎన్ని కోట్లంటే?
విక్కీ డోనర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లాంటి చిత్రాల్లో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ కారును కొనుగోలు చేసింది భామ. ఈ విషయాన్ని కార్లను విక్రయించే డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యామీ గౌతమ్ కొనుగోలు చేసిన వాటిలో ఖరీదైన లగ్జరీ కారుగా నిలవనుంది. (ఇది చదవండి: దళపతి విజయ్‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) యామీ గౌతమ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు విలువ దాదాపు 1.24 కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ గ్యారేజీలో ఇది మూడో లగ్జరీ కారుగా నిలవనుంది. ఆమెకు ఇప్పటికే ఆడి ఏ4, ఆడి క్యూ7 మోడల్ కార్లు ఉన్నాయి. అయితే మూడింటిలో తాజాగా కొన్న కారు అత్యంత ఖరీదైనదిగా సమాచారం. (ఇది చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) -
ఫోటో అని చెప్పి.. ఏకంగా వీడియోనే తీశాడు: ప్రముఖ హీరోయిన్
సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఫోటోల కోసం క్యూ కడతారు. సెల్‌ఫోన్ తీసి టపీమని సెల్ఫీలు తీయడం చూస్తుంటాం. పోనీలే ఫ్యాన్స్ కదా వారు కూడా ఓపిగ్గా నిలబడి ఫోటోలు దిగుతారు. ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్లిన ఓ నటి అభిమాని అడ్డగ్గానే సెల్ఫీ దిగేందుకు ఒప్పుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మన హీరో ఆమెకు తెలియకుండా ఏకంగా వీడియోనే తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్ ఆ వీడియోపై స్పందించింది. అనిరుద్ధ రాయ్ చౌదరి చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న నటి యామీ గౌతమ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒక అభిమాని తనను ఫోటో కోసం అభ్యర్థించాడని.. కానీ అతను వీడియో చిత్రీకరించడం గుర్తుచేసుకుంది. ఆ తర్వాత వీడియో ఆన్లైన్లో షేర్ చేశాడని నటి వెల్లడించింది. యామీ గౌతమ్ ఇటీవల అలియా భట్ గోప్యతా ఉల్లంఘన సంఘటనపై కూడా స్పందించింది. అయితే ఇటీవల ఆలియా భట్ ఇంట్లో ఉండగా కొందరు ఆమె ఫోటోలను తీశారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. యామీ గౌతమ్ మాట్లాడుతూ..'నేను చాలా ఓపెన్‌గా ఉంటా. వ్యక్తులను స్వాగతించడం ఇష్టం. యామీ తెలిపింది. మా ఊరు ఒక చిన్న పట్టణం కావడంతో ప్రజలు నాతో మాట్లాడాలని కోరుకుంటారు. నాకు కూడా అది చాలా హ్యాపీ. కానీ ఓ అబ్బాయి నాతో ఫోటో దిగేందుకు వచ్చాడు. కానీ అతను వీడియో తీశాడు. ఇది చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన లక్షలు వ్యూస్ సాధించాడు. ఆ సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీడియో చూసి చాలామంది మా ఇంటికి వచ్చారు. దీంతో నేను ఒక్కసారిగా షాకయ్యా. ఇలాంటి వాటితో యువతకు మనం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాం. దీంతో వారిని వెంటనే వారించాను. వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ చాలా ముఖ్యం.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం సన్నీ కౌశల్‌తో కలిసి 'చోర్ నికల్ కే భాగా'లో కనిపించనుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఆమె తదుపరి అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో ఓ మై గాడ్ 2, ప్రతీక్ గాంధీతో ధూమ్ ధామ్‌లో కూడా నటిస్తున్నారు. -
పెళ్లి అనేది హీరోయిన్స్ కెరీర్‌కి అడ్డంకి? యామీ గౌతమ్ ఏం చెప్పిందంటే..
‘గౌరవం’ మూవీతో టాలీవుడ్లో గుర్తింపు పొందిన బ్యూటీ యామీ గౌతమ్. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంతకాలంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో తెలుగు, పంజాబీ చిత్రాల్లో అవకాశాలు అందుకున్ను ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో గతేడాది రచయిత, డైరెక్టర్ ఆదిత్య ధర్ని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె అదే జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగుస్తుందని అంటారు, మరి నటిగా బిజీగా ఉన్నపుడే మీరు పెళ్లి చేసుకున్నారని, పెళ్లి అనంతరం సినీ కెరీర్ ఎలా ఉందనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి యామీ గౌతమ్ స్పందిస్తూ.. పెళ్లి అనంతరం కెరీర్ ముగిసిందనుకుంటే అది పోరపాటే అని సమాధానం ఇచ్చింది. ‘పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టే అనుకోవడం పోరపాటు. హీరోయిన్ల కెరీర్‌కి పెళ్లి అనేది అడ్డు కాదని గ్రహించాలి. ఇప్పటికే ఈ విషయాన్నీ చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు. పెళ్లి తర్వాత కూడా స్టార్ నటిగా రాణిస్తున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతి మహిళ తన లైఫ్‌లో ఎన్నో చేయాలని అనుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత ఒక మహిళగా బాధ్యత పెరుగుతుంది. వారికి తగినవాడు, వారి ఆలోచనలను గౌరవించే భర్త దొరికితే రెండింతలు ఉత్సాహంతో ముందుకు సాగవచ్చు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కెరీర్ణి చూసుకోవచ్చు. నా భర్త కూడా పరిశ్రమకు చెందిన వాడే కావడంతో ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను సినిమాలు చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ నడిరోడ్డుపై సెలబ్రిటీ జంటపై వేధింపులు, పోలీసులపై నటి అసహనం -
కావాలని టార్గెట్ చేస్తున్నారు, నా గుండె ముక్కలయ్యింది
అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దస్వీ. ఏప్రిల్ 7న ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా)లో రిలీజైందీ మూవీ. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ వెబ్సైట్ యామీ నటన గురించి తన రివ్యూలో ప్రస్తావించింది. ఇన్నాళ్లుగా చేసిన సాధారణ ప్రియురాలి పాత్రలకు ఈ సినిమాతో యామీ చెక్ పెట్టిందని, ఇందులో ఆమె నటన పర్వాలేదని రాసుకొచ్చింది. అంటే ఇంతకాలంగా యామీకి అసలు నటించడమే రాలేదన్నట్లుగా పేర్కొంది. ఈ రివ్యూ చదివిన యామీ తన మనసు ముక్కలైందంటూ సోషల్ మీడియాలో వాపోయింది. తనను అగౌరవపర్చారంటూ బాధపడింది. 'విమర్శలను స్వీకరిస్తాను. అందులో తప్పొప్పులను సరి చేసుకుంటాను. కానీ కావాలని టార్గెట్ చేస్తూ నన్ను దిగజార్చాలని చూస్తున్నారు. అలాంటప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎ థర్స్డే, బాలా, ఉరి సినిమాల్లో నా పర్ఫామెన్స్‌ను కూడా విమర్శిస్తున్నారు. సొంతంగా ఎదిగిన నాలాంటి యాక్టర్స్‌కు మళ్లీ మళ్లీ నిరూపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. నిజంగా నా గుండె ముక్కలయ్యింది. ఒకప్పుడు మీ సైట్‌ను ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇప్పుడదిక అవసరం లేదనిపిస్తోంది. దయచేసి మీరు నా సినిమాల గురించి, నా పర్ఫామెన్స్ గురించి రివ్యూ ఇవ్వకండి' అని ఫైర్ అయింది యామీ గౌతమ్. Before I say anything else, I’d like to say that I usually take constructive criticism in my stride. But when a certain platform keeps trying to pull you down consistently, I felt it necessary to speak up about it. https://t.co/GGczNekBhP pic.twitter.com/wdBYXyv47V — Yami Gautam Dhar (@yamigautam) April 7, 2022 It takes years of hard work for anyone & especially a self-made actor like me to keep proving our mettle again & again with every opportunity. This is what it comes down to from certain reputed portals! — Yami Gautam Dhar (@yamigautam) April 7, 2022 It's heartbreaking since I did look up to @FilmCompanion once upon a time, like many of us, but I don't seek that since long now! I would request you not to 'review' my performance henceforth ! I'll find grace in that & it'll be less painful. — Yami Gautam Dhar (@yamigautam) April 7, 2022 చదవండి: మందుగ్లాసు పట్టుకున్న వర్మకు ముద్దు పెట్టిన హీరోయిన్ దస్వీ చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే ? -
ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ
టైటిల్: దస్వీ నటీనటులు: అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ కథ: రామ్ బాజ్‌పాయ్ నిర్మాత: దినేష్ విజన్ దర్శకత్వం: తుషర్ జలోటా సంగీతం: సచిన్-జిగర్ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా విడుదల తేది: ఏప్రిల్ 7, 2022 చదువు ప్రాముఖ్యత గురించి చెప్పిన చిత్రాలు రావడం చాలా అరుదు. 'ఈ ప్రంపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్ మండెలా చెప్పిన కొటేషన్‌తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం 'దస్వీ'. నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ ఇది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. అధికారమనే రుచి మరిగితే భార్యాభర్తల నడుమ కూడా ఎలాంటి శత్రుత్వం, పోటీ వస్తుందో కామెడీ తరహాలో చూపించారు దర్శకుడు తుషర్ జలోటా. సొంత ఇంట్లోనే పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఇదివరకూ చాలానే సినిమాలు వచ్చాయి. కానీ దస్వీ మాత్రం అటు పాలిటిక్స్, ఇటు చదువు విలువను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ, సెటైరికల్ జనర్‌లో రూపొందించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్. జియో సినిమా వేదికగా ఏప్రిల్ 7న విడుదలైన ఈ 'దస్వీ' చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 'దస్వీ' అంటే పదో తరగతి. జాట్ తెగకు చెందిన గంగారామ్ చౌదరి (అభిషేక్ బచ్చన్) హరిత ప్రదేశ్ (కల్పిత రాష్ట్రం)కు ముఖ్యమంత్రి. గంగారామ్ చౌదరి నిరాక్షరాస్యుడు, అవినీతి పరుడైన రాజకీయవేత్త. అనేక కుంభకోణాలు చేసిన ముఖ్యమంత్రిగా పేరుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ స్కామ్‌లో గంగారామ్ చౌదరిని దోషిగా తేల్చి జైలు శిక్ష విధిస్తారు. దీంతో తన భార్య భీమ్లా దేవి (నిమ్రత్ కౌర్)ని సీఎంగా ప్రకటిస్తాడు గంగారామ్ చౌదరి. జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరి మొదటగా వీఐపీ సౌకర్యాలు పొందుతాడు. కానీ తర్వాత ఆ జైలుకు స్ట్రిక్ట్ సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్ (యామీ గౌతమ్) ఎంటర్ అవుతుంది. దీంతో గంగారామ్ చౌదరి ఆటలు సాగవు. మిగతా ఖైదీల్లానే గంగారామ్ కూడా ఉండాలని హెచ్చరిస్తుంది జ్యోతి దేశ్వాల్. ఇది తట్టుకోలేక జైలులో పని తప్పించుకునేందుకు పదో తరగతి చదవాలని నిశ్చయించుకుంటాడు గంగారామ్ చౌదరి. అదే విషయం సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్కు చెబుతాడు. తను 10వ తరగతి తప్పించుకునేందుకే అని గ్రహించిన జ్యోతి దేశ్వాల్ అందులో ఫెయిల్ అయితే మళ్లీ సీఎం పదవికి పోటీ చేయొద్దని షరతు విధిస్తుంది. కండిషన్‌కు ఒప్పుకున్న గంగారామ్ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు. మరీ గంగారామ్ పదో తరగతి పూర్తి చేశాడా ? అతనికి ఎవరు సహాయపడ్డారు ? అతను పదో తరగతి పూర్తి చేయకుండా ఎవరూ అడ్డుకున్నారు ? చివరికి గంగారామ్ చౌదరి తెలుసుకున్నదేంటీ ? పదో తరగతి తర్వాత గంగారామ్ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు ? అనేదే 'దస్వీ' కథ. విశ్లేషణ: చదువు నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే అయినా రాజకీయాలకు, చదువుకు ముడిపెట్టి సెటైరికల్ డ్రామాగా 'దస్వీ'ని తెరకెక్కించారు డైరెక్టర్ తుషర్ జలోటా. 2007లో వచ్చిన 'షోబిజ్' సినిమాలో నటించిన తర్వాత తుషర్ జలోటా డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వివిధ ఛాలెంజ్ (గ్రీన్ ఛాలెంజ్, ఫిట్ ఛాలెంజ్)లను రాజకీయనాయకులు ఎలా తీసుకుంటారో వ్యంగంగా చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. అసలుకే చదువురాని, మోస్ట్ కరప్ట్డ్ సీఎంగా పేరొందిన హరిత ప్రదేశ్ ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరికి టీచర్ పోస్టుల భర్తీ స్కామ్‌లో ఊహించని విధంగా కోర్టు తీర్పు వెలువడుతుంది. అయితే కథ దృష్ట్యా స్కామ్ ఎలా జరిగిందో అదేమి వివరించకుండా నేరుగా జైలు శిక్ష విధిస్తున్నట్లు సినిమాలో చూపించారు. ఇక జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరికి అక్కడ ఎదురయ్యే కష్టాలు అంతా ప్రభావంగా చూపించకపోయిన కామెడీ యాంగిల్లో చూపించారు. రాజకీయనాయకులు జైలులో ఉండి తమ పనులు తమ బంధువులతో ఎలా చేయగలరో ఈ సినిమాలో చూపించారు. అయితే జైలుకు కొత్త సూపరింటెండెంట్‌గా జ్యోతి దేశ్వాల్ రావడం, ఆమె రూల్స్ తట్టుకోలేక పదో తరగతి చదవాలని గంగారామ్ నిశ్చయించుకోవడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో గంగారామ్ చౌదరి పదో తరగతి చదువుకునే తీరు చాలా నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. పదో తరగతిలోని ఒక్కో సబ్టెక్ట్ను జైలులో ఉన్న ఒక్కో ఖైదీ గంగారామ్‌కు నేర్పించడం చాలా సరదాగా ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకు చాలా ప్లస్‌గా కూడా నిలిచాయి. ఇక చరిత్ర చదివేటప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ లాలా లజపతిరాయ్, మహాత్మ గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులతో కలిసి గంగారామ్ చౌదరి ట్రావెల్ చేసినట్లు చూపించడం, వారి మధ్య సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. వారు తమ ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాల్సివచ్చిందో చెప్పడం బాగా ఆకట్టుకున్నాయి. గంగారామ్ చౌదరి.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ నేర్చుకునే విధానం ఎంతో అలరిస్తుంది. అలాగే మరోవైపు గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవి ముఖ్యమంత్రిగా రాణిస్తూ తన భర్తనే తొక్కేయ్యాలని చూసే సీన్లను కామెడీగా బాగా చూపించారు. గంగారామ్ చౌదరికి మళ్లీ సీఎం పదవి దక్కకుండా చేసే భీమ్లా దేవి ప్రయత్నాలు సైతం బాగున్నాయి. పొలిటిషియన్స్ తమను తాము ఎలా ప్రమోట్ చేసుకుంటారో సెటైరికల్‌గా చాలా బాగా చూపించారు డైరెక్టర్ తుషర్ జలోటా. ఎవరెలా చేశారంటే ? హరిత ప్రదేశ్ అవినీతి, నిరాక్షరాస్యుడైన ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరిగా అభిషేక్ బచ్చన్ అద్భుతంగా నటించాడు. తన యాస, డైలాగ్ డెలీవరీ, నిరాక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్, హావాభావాలు ఎంతో మెచ్చుకునేలా ఉన్నాయి. గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవిగా నిమ్రత్ కౌర్ తన నటనతో మెస్మరైజ్ చేసిందనే చెప్పవచ్చు. తన సెటైరికల్ ఎక్స్ప్రెషన్స్, హౌజ్ వైఫ్ నుంచి సీఎంగా మారిన తన ట్రాన్స్‌ఫార్మెషన్ తీరు చాలా బాగా ఆకట్టుకుంది. తన హ్యూమరస్ డైలాగ్‌లతో మంచి ఫన్ జెనరేట్ చేసింది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్నసెలబ్రిటీగా తన నటనతో చాలా వరకు అలరించిందనే చెప్పవచ్చు. ఇక జైలు సూపరింటెండెంట్ జ్యోతి దేశ్వాల్గా యామీ గౌతమ్ తనదైన నటనతో మెప్పించింది. పైఅధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న పొలిటిషియన్ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్‌లో మాత్రం అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయి. ఈ మూవీకి సచిన్, జిగర్‌లు అందించిన నేపథ్యం సంగీతం చాలా ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగిన బీజీఎంతో వావ్ అనిపించారు. ఓవరాల్‌గా 'దస్వీ' చిత్రం చదువు ప్రాముఖ్యతను తెలియజేసే పూర్తి వినోదభరితపు పొలిటికల్ సెటైరికల్ డ్రామా. -
అదర్ సైడ్.. నేను సైతం...
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్. ‘ఇప్పుడు నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్‌తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే. దిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ కార్యాలయంలో యామీ గౌతమ్ అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది మజిలీస్. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది.. యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం. ‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్ వినేటప్పుడు... ‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్’ సినిమాలో క్రైమ్ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. -
మహిళల కోసం ఢిల్లీ కమిషన్ మెట్లెక్కిన హీరోయిన్లు
Yami Gautam Neha Dhupia Visit Delhi Commission For Women: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. బీటౌన్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్స్డే' మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులతోపాటు విమిర్శకులను సైతం మెప్పించింది యామీ గౌతమ్. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా అత్యాచార వేధింపులకు గురైన మహిళల భద్రత కోసం, వారికి పునరావాసం కల్పించేందుకు మజ్లీస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. చదవండి: సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్‌లో ఇలా ఈ క్రమంలోనే యామీ గౌతమ్ ఢిల్లీ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలోని తనతోపాటు నటించిన హీరోయిన్ నేహా ధూపియా కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌ను సందర్శించారు. కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్తోపాటు ఇతర అధికారులతో చర్చించారు. ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా కోసం వారు చేపట్టిన వివిధ కార్యాక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మహిళలపై హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఉన్న 181 హెల్ప్‌లైన్ నంబర్, దాని పనితీరు గురించి వివరంగా తెలుసుకున్నారు. చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు పెట్రోల్ వ్యాన్లు పంపిస్తారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాలో చూపించినట్లు మహిళల భద్రత కోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని యామీ తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, ఇతర అధికారులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం ఈ బృందం చూపిన చొరవపట్ల అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు యామీ గౌతమ్. కాగా యామీ గౌతమ్, నేహా ధూపియా నటించిన 'ఏ థర్స్డే' చిత్రం ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్టీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్‌లో ఇలా
Yami Gautam Joins Hands With NGOs To Help Rape Survivors: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. అయితే ఆశించినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోయింది. అందుకే మళ్లీ బాలీవుడ్లోనే తనను తాను నిరూపించుకుంటోంది. అయితే తాజాగా ఈ భామ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపింది. అలాంటి వారికి పునరావాసం కల్పించడానికి మజ్లిస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేయనుంది. 'లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది. మహిళల భద్రత సమస్యలపై పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి, వారికి మెరుగైన వనరులను సేకరించడంలో సహాయపడేందుకు నేను మరింత సహకారం అందించాలనుకుంటున్నాను.' అని యామీ పేర్కొంది. ఇదిలా ఉంటే యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం 'ఏ థర్స్డే'. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో యామీ అత్యాచార బాధితురాలి పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే లైంగిక వేధింపులకు గురైన బాధితుల పునరావాసం కోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత మౌలిక సదుపాయాల గురించి మనందరం ఆలోచింపజేసింది. ఇప్పుడు నిజ జీవితంలో లైంగిక వేధింపుల బాధితుల కోసం తనవంతు సహకారం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. -
అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
విక్కీ డౌనార్, సనమ్ రే, బద్లా పూర్, కాబిల్, ఉరి, గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బీటౌన్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్. ఇటీవల తన వ్యక్తిగత విషయం గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొన్న చర్మ సమస్యపై పోస్ట్ పెట్టింది. యామీ తన యుక్త వయసు నుంచి 'కెరాటోసిస్ పిలారిస్' అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది. ఇటీవల ఎలాంటి ఎడిట్ చేయని తన ఫొటోలను పోస్ట్ చేసి ఎమోషనల్‌గా క్యాప్షన్ రాసుకొచ్చింది యామీ గౌతమ్. 'నేను చాలా ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఏర్పరుచుకున్నా భయం, అభద్రతా భావాలను వీడాలని చివరిగా ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నా లోపాలను (చర్మ సమస్య) హృదయపూర్వకంగా అంగీకరించే ధైర్యం నాకు వచ్చింది. ఈ నిజాన్ని మీతో పంచుకునే ధైర్యం వచ్చింది. ఎరుపు రంగులో ఉండే నా హెయిర్‌కు రంగు వేయడం, కంటి కింద చారలను స్మూత్నింగ్ చేయాలని నాకు అనిపించట్లేదు. అయినా నేను అందంగానే ఉన్నా.' అని షేర్ చేసింది యామీ. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత దానికి వచ్చిన స్పందన గురించి ఇలా చెప్పుకొచ్చింది యామీ గౌతమ్. ఈ పోస్ట్‌లో 'పోస్ట్ రాయడం కష్టం కాదు. అది విముక్తి కలిగిస్తుంది. నా పరిస్థితి గురించి తెలుసుకున్నప్పటి నుంచి నేను పోస్ట్ పెట్టే వరకు నా ప్రయాణం సవాలుగా మారింది. ప్రజలు నన్ను షూట్లో చూసినప్పుడు ఎయిర్ బ్రష్ ఎలా చేయాలి, కనపడకుండా ఎలా దాచాలి అని మాట్లాడతారు. అది నన్ను చాలా ప్రభావితం చేసేది. ఆ నిజాన్ని అంగీకరించడానికి, నా విశ్వసాన్ని పెంపొందిచుకోవడానికి సంవత్సరాలు పట్టింది. ఈ పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను.' అని యామీ గౌతమ్ తెలిపింది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
కరోనా సెగ:అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్
సాక్షి,ముంబై: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, లాక్డౌన్ ముగిసిన అనంతరం షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న బాలీవుడ్ మూవీ ‘ఓ మైగాడ్-2’ కు కరోనా షాక్ తగిలింది. యూనిట్లో ఏకంగా ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేశారు. వచ్చే రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్ అశ్విన్ వర్దే ప్రకటించాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు. వీరిద్దరికి కోవిడ్-19 నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్లోపాల్గొనాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం సభ్యులలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అతడిని హోం క్వారంటైన్‌కి తరలించారు. అయితే ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో తిరిగిషూట్ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో టీమ్ సభ్యులందరూ కోలుకునే వరకు రెండు వారాల పాటు షూట్‌ను నిలిపివేశారు. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. దీనికి సీక్వల్గా పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్-2’ గా రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. సుదీర్ఘ విరామం తరువాత కొత్త మార్గదర్శకాలతో ఇటీవల బాలీవుడ్ షూటింగ్ పనులు పుంజుకున్న సంగతి తెలిసిందే. -
అన్ని భయాలను జయించా.. తన అరుదైన వ్యాధి గురించి నటి వెల్లడి
పుట్టిన ప్రతి ఒక్కరికీ ఎదో ఒక వ్యాధి లేక లోపం ఉండడం సాధారణం. కానీ వాటిని పబ్లిక్‌గా చెప్పడానికి భయపడుతుంటారు. దానికి సెలబ్రీటీలు అతీతులేం కాదు. తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తనకున్న అరుదైన వ్యాధి గురించి బయటికి చెప్పింది. ‘కెరటోసిస్ పిలారిస్’ అనే అరుదైన చర్మ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా యామీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఎడిట్ చేయని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ, దాన్ని దాచడానికి ఎంతో ప్రయత్నించా. కానీ అందరూ అనుకునేంతా భయంకరమైన వ్యాధి ఏం కాదు. చాలా సార్లు నీ వ్యాధి గురించి చెప్పడానికి ఎందుకు ఇబ్బందిపడుతున్నావని నన్ను నేనే అడిగేదాన్ని. అందుకే ఇప్పుడు ధైర్యంగా అందరికి చెబుతున్నా’ అని ఈ బ్యూటీ వ్యాధి గురించి తెలిపింది. ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స కనుక్కొలేకపోయారని నటి చెప్పింది. ఈ విషయాన్ని అందరికి చెప్పిన తర్వాత నా భయాలు, అభద్రతలను జయించినట్లుగా భావిస్తున్నానని యామీ పేర్కొంది. చివరికి తనలోని లోపాలను ప్రేమించే మార్గాన్ని కనుగొన్నట్లు ఈ భామ తెలిపింది. ‘కెరటోసిస్ పిలారిస్’ అనే చర్మ వ్యాధి వల్ల ఒంటిపై కురుపుల వంటి బొడిపెలు ఏర్పడుతుంటాయి. చదవండి: ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రేమలో పడ్డా : హీరోయిన్ View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ప్రమాదంలో రకుల్, సుమకు కౌంటరిచ్చిన బుడ్డోడు
♦ హ్యాపీ బర్త్‌డే అమేజింగ్ పప్పా: యామీ గౌతమ్ ♦ మంచు లక్ష్మీ మోటివేషనల్ కోట్ ♦ అందంతో మతి పోగొడుతున్న లావణ్య త్రిపాఠి ♦ నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ వాన పాట పాడుకుంటోన్న అనసూయ ♦ కొత్త హెయిర్ స్టైల్లో రాశీ ఖన్నా ♦ ప్రమాదంలో రకుల్, సాయం కోసం కేకలు ♦ ప్రకృతి అందాలను ఆస్వాదించిన ప్రగ్యా జైస్వాల్ ♦ తన పుస్తకం తనే చదువుతోన్న కరీనా కపూర్ ♦ పెళ్లెందుకు చేసుకోవాలన్న సుమ ప్రశ్నకు ఫన్నీ ఆన్సరిచ్చిన బుడ్డోడు View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by SADHNA (@sadhnasingh1) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రేమలో పడ్డా : హీరోయిన్
తన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ యామీ గౌతమ్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఉరి’ సినిమాతో ‘ఉత్తమ దర్శకుడి’గా జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య ధార్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. వీరిద్ద మధ్య ఉన్న లవ్ అఫైర్ గురించి మీడియాలో కథనాలు వచ్చిన స్పందిచకుండా, సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చారు. అప్పట్లో ఈ జంట పెళ్లి హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ, పెళ్లి గురించి మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా యామీ గౌతమ్ తన లవ్ స్టోరీని మీడియాతో పంచుకుంది. ‘ఉరి’సినిమా ప్రమోషన్స్ సమయంలోనే తాము ప్రేమలో పడిపోయినట్లు చెప్పింది. ఆదిత్య, నేను కలిసి ‘ఉరి’సినిమా చేశాం. ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సినిమా ప్రమోషన్ సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆదిత్యతో పరిచయం ఏర్పడకముందే అతనంటే నాకు గౌరవం ఉండేది. ఇతరుల పట్ల ఆయన మర్యాదగా వ్యవహరిస్తాడు. దర్శకుడిగా ఒత్తిడిలో ఉన్నాకూడా.. ఎదుటివారితో గౌరవంగా మాట్లాడుతాడు. ఆదిత్య చాలా మంచి వాడని అందరు చెబుతుంటే విన్నా.. అతనితో పరిచయం ఏర్పడ్డాక అది నిజమేనని భావించా. పని చేసే చోట అతని మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు. మా మధ్య పరస్పర గౌరవం ఉంది. ప్రేమపై ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో మంచి గుణం, అర్థం చేసుకునే హృదయం ఉండమే అసలైన ప్రేమ’అని యామీ గౌతమ్ తన లవ్‌స్టోరీ చెప్పుకొచ్చింది. అలాగే తమ ప్రేమ గురించి ఇండస్ట్రీలోని కొంతమంది స్నేహితులకు ముందే తెలుసని, కానీ వారు ఎక్కడా తమ గురించి చెప్పకుండా, ప్రైవసీ ఇచ్చారని చెప్పింది. ఇక గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘హంగులు, ఆర్భాటాలలో పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ఇష్టం లేదు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చాలా మంది స్నేహితులకు, సన్నిహితులకు పెళ్లి సమాచారం ఇవ్వలేకపోయాం. కానీ వారు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు తోడుగా నిలిచారు’అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. ఇక యామీ గౌతమ్ విషయానికొస్తే.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'విక్కీ డోనర్'తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో నటించింది. వీటితో పాటు తమిళ, పంజాబీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. దర్శకుడు ఆదిత్య ధార్ విషయానికి వస్తే.. కాబుల్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత హాల్ ఏ దిల్, వన్ టూ త్రీ, డాడీ కూల్, ఆక్రోష్, తేజ్ చిత్రాలకు లిరిక్ రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దర్శకుడిగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన ది ఇమ్మోరల్ ఆశ్వత్థామ చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
పెళ్లైన కొద్ది రోజులకే హీరోయిన్‌కు ఈడీ షాక్!
సాక్షి, ముంబై: హీరోయిన్ యామీ గౌతంకు మరోసారి ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల చిత్రనిర్మాత ఆదిత్య ధార్‌ను వివాహమాడిన యామీకి మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. యామీకి ఈడీ నోటీసులివ్వడం ఇది రెండోసారి. విక్కీ డోనర్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యామీ గౌతం హృతిక్ రోషన్‌తో కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు బిగ్ బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఒక థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్ భారీ చిత్రాలపై ఈడీ దృష్టిపెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. కాగా తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కరోనా కాలంలో ఆదిత్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
నా చెప్పులు తీసుకురండి: కంగనా రనౌత్
నూతన వధువు యామీ గౌతమ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను వరుసగా షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. ఈ ఫొటోల్లో సాంప్రదాయ దుస్తుల్లో హీరోయిన్ ధగధగ మెరిసిపోతోందంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. వారు మాత్రమే కాదు, ఈ ఫొటోలను చూసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం యామీ సూపర్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరలవుతున్న యామీ గౌతమ్ పెళ్లి ఫోటోలు ఆయుష్మాన్ ఖురానా కూడా యామీ ఎంతో సింపుల్‌గా రెడీ అయిందంటూ కామెంట్లు చేశాడు. ఇది చూసిన కంగనా.. ఒక విషయాన్ని సింపుల్ అని నిర్ధారించడం ఎంత కష్టమో తెలుసా? అంటూ ఆయుష్మాన్‌కు గట్టిగానే క్లాస్ పీకింది. ఇక యామీని అచ్చం రాధేమాలా ఉందన్న విక్రాంత్ మాస్సేకు సైతం స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. 'ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది? నా చెప్పులు తీసుకురండి, దీని సంగతి చూస్తా' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదిలా వుంటే యామీ గౌతమ్, 'ఉరి' డైరెక్టర్ ఆదిత్యను శుక్రవారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) చదవండి: డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్ -
దివి ఎదపై టాటూ, సాగరకన్యగా మారిన కియారా
► చీరలో మెరిసిపోతున్న అంజలి ► పేద పిల్లలకు ఆహార పొట్లాలు పంచిన సన్నీలియోన్ ► బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేసిన దక్ష నగార్కర్ ► సముద్రంలో చేపపిల్లలా ఈత కొడుతున్న కియారా అద్వానీ ► ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన కౌశల్ మండా ► క్వారంటైన్లో మొక్కలతో ప్రేమలో పడిపోయానంటున్న శ్రియా ► స్టంట్స్ నేర్పించిన వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన సమంత ► దివి ఎదపై టాటూ ► ఇవి జీవితకాలపు జ్ఞాపకాలు అంటోన్న యామీ గౌతమ్ View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by 🦋 Kristen Ravali 🦋 (@kristenravali.official) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by SADHNA ✨ (@sadhnasingh1) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్
హీరోయిన్ యామీ గౌతమ్ పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. కాగా పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా 'ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ' సినిమా తీస్తున్నాడు. ఇదిలా వుంటే హీరోయిన్ ప్రణీత కూడా ఈ మధ్యే పెళ్లి చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక యామీ గౌతమ్ విషయానికొస్తే.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'విక్కీ డోనర్'తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్ సరసన 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో నటించింది. ప్రస్తుతం ఆమె 'భూత్ పోలీస్'తో పాటు 'దస్వి', 'ఎ థర్స్డే' చిత్రాల్లో నటిస్తోంది. With the blessings of our family, we have tied the knot in an intimate wedding ceremony today. As we embark on the journey of love and friendship, we seek all your blessings and good wishes. Love, Yami and Aditya pic.twitter.com/W8TOpAJxja — Yami Gautam (@yamigautam) June 4, 2021 చదవండి: హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్ -
రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట!
అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘దస్వీ’. తుషార్ జొలాతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభం అయింది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో టెన్త్ ఫెయిల్ అయిన గంగా రౌమ్ చౌదరి అనే రౌడీగా అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు. అక్షరం ముక్క రాకపోయినా ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు కనే పాత్ర అతనిదని బాలీవుడ్ టాక్. యామీ గౌతమ్ కథానాయిక. ఆమె పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఢిల్లీలోని ఆగ్రాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) చదవండి : బాయ్ ఫ్రెండ్‌తో శృతిహాసన్ మ్యూజిక్ వీడియో దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు -
సరదాలు.. నవ్వులు
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ క్రిపలానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సైఫ్, అర్జున్‌లకు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండజ్, యామీ గౌతమ్ నటించనున్నారు. ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ‘‘ఇదో వినోదాత్మక చిత్రం. దీనికి మరింత సరదాను ఈ ఇద్దరు హీరోయిన్లు తీసుకువస్తారని అనుకుంటున్నాం. సైఫ్–జాక్వెలిన్, అర్జున్–యామీ జంటలు అందించే వినోదం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
నోరూరించే యామీ గౌతమ్ వంటకాలివే..
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. కాగా తాజాగా యామీ గౌతమ్‌కు ఆహారం అంటే ఎంతో ఇష్టమొ, ఆమె వండిన బేకరీ పదర్థాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసింది. ప్రపంచ బేకింగ్ డే సందర్భంగా యామీ తానే స్వయంగా వండిన కొన్ని ఆహార వంటకాలను పోస్ట్ చేసింది. తాను బేకరి వంటకాలను అద్భుతంగా చేయగలనని తెలిపింది. మరోవైపు బేకరి పదార్థాలను తయారు చేసే నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అయితే నోరూరించే ‘పహాజి రజ్మా’ తనకు ఇష్టమైన వంటకమని అందుకు స్వయంగా వండినట్లు యామీ పేర్కొంది. కాగా తన తల్లికి ఇష్టమైన ‘పహారీ దామ్’ వంటకాన్ని సైతం వండినట్లు పేర్కొంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరు ఇంట్లో ఉండి వంటకాలను నేర్చుకోవచ్చని నెటిజన్లకు, అభిమానులకు సూచించింది. కరోనా నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఇంట్లో ఉండడండి(స్టే హోమ్), జాగ్రత్తగా ఉండడండి(స్టే సేఫ్) అని ప్రజలను కోరింది. యామీ గౌతమ్ 2019లో బాలా చిత్రంలో నటించింది. ప్రస్తుతం గిన్నీ వెడ్స్ సన్నీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
చిన్న బ్రేక్
‘‘వ్యక్తిగత, వృత్తి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ చిట్‌చాట్ సెషన్స్‌తో తమ ఫాలోయర్స్, ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం అనేది కొంచెం ఒత్తిడితో కూడుకున్న పనే అని కొందరు స్టార్స్ అంటున్నారు. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇటీవల పలువురు తారలు ‘డిజిటల్ డిటాక్స్’ (సోషల్ మీడియాకు దూరంగా ఉండటం) సూత్రం ఫాలో అవుతున్నారు. కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నాం. ‘డిజిటల్ డిటాక్స్’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమానికి బ్రేక్ ఇచ్చిన స్టార్స్, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ యాక్టివ్‌గా ఉంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ కలుద్దామని చెప్పి డిజిటల్‌కి దూరమైపోయారు త్రిష. ‘‘నా మైండ్‌కు కాస్త ఉపశమనం కావాలి. ఇది డిజిటల్ చికిత్స అనుకోవచ్చు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీటర్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు త్రిష. ఇటీవలే ‘టిక్‌టాక్’లో కూడా త్రిష ఎంట్రీ ఇచ్చారు. మరో హీరోయిన్ యామీ గౌతమ్ ‘‘నా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకోవాలనుకోవడం లేదు’’ అని డిజిటల్ డిటాక్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మరో బ్యూటీ పరిణీతీ చోప్రా ‘‘నా కోసం నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి. అందుకే కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఈ క్వారంటైన్ టైమ్‌ని నా కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటాను’’ అన్నారు శ్రియా పిల్గోన్కర్. రానా నటించిన ‘హాథీ మేరీ సాథీ’ (తెలుగులో ‘అరణ్య’) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారియర్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘మానసిక ప్రశాంతత కోసమే నా ఇన్‌స్టా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశాను. లైక్‌లు, షేర్లు వంటివి నాలో ఒత్తిడిని పెంచాయనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు నేను తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చాను. భవిష్యత్‌లో కూడా కావాలనుకుంటే కొన్ని రోజులు నా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేస్తాను’’ అన్నారు ప్రియాప్రకాశ్ వారియర్. డీయాక్టివేట్ ట్వీటర్లో నెగటివిటీ పెరిగిపోయిందని తన అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు సోనాక్షీ సిన్హా. నెగటివిటీ, అసభ్యపదజాలంతో కూడిన కామెంట్స్ ఎక్కువైపోయాయని, అందుకే ట్వీటర్ నుంచి వైదొలుగుతున్నానని అన్నారు బాలీవుడ్ నటుడు సాకిబ్ సలీమ్. ‘బద్రీనాథ్‌కి దుల్హనీయా, ధడక్’ చిత్రాలను తెరకెకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు శశాంక్ కేతన్ తన ట్వీటర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ‘‘సోషల్ మీడియా వల్ల రియల్ వరల్డ్ ఫేక్ వరల్డ్లాగా, ఫేక్ వరల్డ్ రియల్ వరల్డ్‌గా కనిపిస్తోంది’’ అంటున్నారు కృతీసనన్. -
అందులో తప్పేంటట: హీరోయిన్
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరింట్లోనూ తిష్టవేసింది యామీ గౌతమ్. మొదట సీరియల్ నటిగా తర్వాత మోడల్‌గా, అనంతరం హీరోయిన్గా కెరీర్లో దూసుకుపోతున్న యామీ తాజాగా అస్సాం పర్యటనకు వెళ్లింది. ఆదివారం ‘గ్రేట్ గువహటి మారథాన్- 2020’ను ప్రారంభించేందుకు అస్సాంలోని స్థానిక విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో అనేకమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు అత్యంత దగ్గరగా సమీపించాడు. యామీ అనుమతి తీసుకోకుండానే ఆమెకు అస్సాం సంప్రదాయ గమోసాను తొడగాలని చూశాడు. దీంతో వెంటనే ఆమె అతన్ని చేతిని దూరంగా నెట్టేసింది. అందులో తప్పేముంది ఆమె వెంట ఉన్నవాళ్లు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఈ ఘటనపై యామీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ‘అస్సామీల సంప్రదాయాన్ని నువ్వు ఘోరంగా అవమానించావు’ అంటూ ఆమెపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. దీనిపై స్పందించిన యామినీ.. ఆత్మరక్షణ కోసమే అలా చేశానని పేర్కొంది. ఒక మహిళగా ఎవరైనా తనకు సన్నిహితంగా రావాలని చూస్తే అసౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తానే కాదు, ఏ మహిళ ఇలా చేసినా అది తప్పు కానే కాదని పేర్కొంది. అంతేతప్ప కావాలని పనిగట్టుకుని మరీ ఎవరి మనోభావాలను కించపర్చాలనుకోలేదని ట్విటర్ వేదికగా సమాధానమిచ్చింది. (మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది: జర్నలిస్ట్ ఫోన్) ఫొటో షేర్ చేసిన యామీ మరో ట్వీట్లో ‘నేను అస్సాంకు రావడం ఇది మూడోసారి. అస్సామీలన్నా, వారి సంప్రదాయాలన్నా నాకు ఎంతో ఇష్టం. ఓ ముఖ్యమైన కార్యక్రమం కోసం నేనీ అందమైన రాష్ట్రానికి విచ్చేశాను. కానీ ఓ కట్టుకథ అల్లి నాపై ద్వేషం పెంచాలని చూస్తున్నారు’ అని మండిపడింది. అనంతరం అస్సామీల సంప్రదాయ గమోసా, జపి(కండువా, టోపీ) ధరించిన ఫొటోలను షేర్ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె విమర్శలపాలవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఆమె స్థానికత గురించి, ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లో నటించడాన్ని పలువురు తప్పుపట్టగా వాటికి ధీటైన సమాధానాలిచ్చిన సంగతి తెలిసిందే. (ట్రోల్ చేసిన వ్యక్తికి హీరోయిన్ యామి గౌతం కౌంటర్) -
ఫెయిర్ అండ్ యమి
ఇంట్లో టీవీ పెడితే యమి గౌతమ్ కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేని రోజు ఉంటుందా? యమి ఆ క్రీమ్ పూసుకుని మెరిసే సౌందర్యవతి. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్‌గా మాత్రమే కాదు నటిగా కూడా ఆమె బాలీవుడ్లో పై వరుసలో ఉంది. ఈ అందమైన జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. ప్రశ్నలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ యమి విజేతగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఉదయం నాలుగ్గంటలకు యమి గౌతమ్ ఫోన్ మోగింది. చేసింది ఒక ప్రముఖ పత్రిక నుంచి జర్నలిస్ట్. ‘ఏంటి?’ అని అడిగింది యమి. ‘మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది.. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని అడిగాడు జర్నలిస్ట్. అప్పటికి ట్రోలింగ్ అంటే ఏమిటో యమికి తెలియదు. ‘ట్రోలింగ్ అంటే?’ అని అడిగింది. ‘మిమ్మల్ని తిట్టి పోస్తున్నారు’ అన్నాడతను. ‘ఎందుకు?’ అని అడిగింది నెర్వస్‌గా. ఇంతలో ఫోన్ కట్ అయ్యింది. అభయ్ డియోల్ బాలీవుడ్లో పేరున్న నటుడు. తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘సినిమా తారలు అనవసరంగా కలరిజమ్ను ప్రచారం చేస్తున్నారు. తెల్లరంగే గొప్పది అనే ఈ ప్రచారం ఆ రంగు లేని వారందరినీ అవమానించే స్థాయిలో ఉంది. షారుక్‌ఖాన్, ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహమ్... వీళ్లంతా తెల్లగా చేసే క్రీములంటూ ఫెయిర్‌నెస్ క్రీములను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వరుసలో యమి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఫెయిర్‌నెస్ క్రీముల్లో ఫెయిర్ అండ్ లవ్లీ అగ్రస్థానంలో ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ యమి. దాంతో సోషల్ మీడియాలో యమి మీద విమర్శలు వెల్లువెత్తాయి. భిన్నమైన రంగులు ఉన్నవారిని న్యూనత పరిచే ఇటువంటి యాడ్స్‌లో నటించేవారికి కనీస ఆలోచన లేదని చాలామంది రాశారు. ఇలా జరుగుతుందని యమి ఊహించలేదు. దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఆ రోజంతా వెక్కివెక్కి ఏడుస్తూ కూచుంది. అసలు ఇందుకేనా ఈ రంగంలోకొచ్చింది? ∙∙ యమికి పుస్తకం తప్ప అద్దం తెలియదు. పుస్తకమే తన అద్దం అన్నట్టుగా ఎప్పుడూ అందులోనే తల దూర్చి ఉండేది చిన్నప్పుడు. వాళ్లది హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్. తండ్రి ముకేష్ గౌతమ్ చిన్నస్థాయి పంజాబీ సినిమాల దర్శకుడు. ఆయన పంజాబీ. తల్లి అంజలి గౌతమ్ హిమాచల్ కొండజాతి మూలాలున్న స్త్రీ. యమి గౌతమ్ బాల్యం బిలాస్పూర్లో గడిచినా హైస్కూల్, కాలేజ్ చండీగఢ్‌లోనే సాగాయి. చిన్నప్పటి నుంచి చదువు మీదే ఆమె ధ్యాస. ఐ.ఏ.ఎస్ చేయాలనేది కల. స్కూలు సొంతదే అయినా ఆ స్కూల్లో ఆమె చాలా బిడియంగా తిరుగుతూ ఉండేది. నలుగురి ఎదుటకు రావడానికి చాలా సంకోచించేది. వాళ్ల తాతను ఇంప్రెస్ చేయడానికి ఒకసారి టీచర్లు యానివర్సరీ డేలో ఏదో కవిత చదివించాలని ప్రయత్నిస్తే యమి స్కూల్ వదిలి ఇంటికి పారిపోయింది. ఇలాంటి అమ్మాయిలకు చదువే కరెక్ట్ అని అనుకున్నారు అందరూ. కాని విధి వేరేగా ఆమె ప్రయాణాన్ని నిశ్చయించింది. అలా స్కూల్ వదిలి బిడియంతో పారిపోయిన అమ్మాయి ఇవాళ వందలాది మంది చూస్తూ ఉండగా కెమెరా ముందు డైలాగ్ చెప్పగలుగుతోంది. ఇది వింత కాకపోతే మరేమిటి? ∙∙ యమి లా డిగ్రీలో చేరింది. ఫైనలియర్లో ఉంది. ఆ రోజు ముంబైలో ఉండే బంధువులు చుట్టపు చూపుగా వాళ్లింటికి వచ్చారు. అందులో ఒకామె టీవీ రంగంలో పని చేసింది. ఆమె యమిని చూసిన మరుక్షణం నుంచి నువ్వు టీవీలో పనిచెయ్ టీవీలో పనిచెయ్ అని వెంటబడింది. ‘అమ్మా... ఏమిటి ఈ నస’ అని కిచెన్‌లోకి వచ్చి విసుక్కుంది యమి, తల్లితో. కాని ఆ వచ్చినామె వద్దన్నా యమి ఫొటో తీసుకుని ముంబై వెళ్లింది. ఆ తర్వాత తనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లన్నింటిలో చూపించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ వారు యమి ఫొటోను చూసి ‘వెంటనే రమ్మనమనండి’ అని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వెళ్లాలా వద్దా. ‘ఏమో.. ట్రై చేయరాదూ’ అని తల్లిదండ్రులు అన్నారు. అలా తన 20వ ఏట యమి ముంబైలో అడుగుపెట్టింది. వెంటనే రెండు సీరియల్స్‌లో పాత్రలు దొరికాయి. ‘కలర్స్’ టీవీలో ప్రసారమైన ‘యే ప్యార్ నా హోగా కమ్’ సీరియల్‌తో యమి స్టార్ అయిపోయింది. ఆ వెంటనే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఆమెను తన మోడల్‌గా ఎంపిక చేసుకుంది. కన్నడ రంగం నుంచి తొలిగా ‘ఉల్లాస ఉత్సాహ’ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇది మన తెలుగు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’కు రీమేక్. హీరో కన్నడ స్టార్ గణేష్. అయితే ఆమెకు బాలీవుడ్లో పేరు రావాలి. అక్కడ హిట్ కావాలి. ‘వికీ డోనర్’ ఆ అవకాశం ఇచ్చింది. దర్శకుడు సూజిత్ సర్కార్ హీరో జాన్ అబ్రహమ్ను వొప్పించి అతడు నిర్మాతగా ఒక చిన్న సిన్మాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టాడు. కథాంశం కొత్తది. ప్రత్యుత్పత్తి కేంద్రాలకు ‘వీర్యాన్ని డొనేట్ చేస్తూ’ జీవించే కుర్రాడికథ అది. ఆ పాత్రకు కొత్తవాడైన ఆయుష్మాన్ ఖురానాను తీసుకున్నాడు. అతడి ప్రియురాలిగా యమి గౌతమ్‌ను తీసుకున్నాడు సూజిత్. ‘వికీ డోనర్’ పెద్ద హిట్. ఆ వెంటనే తెలుగులో అల్లుశిరీష్‌తో ‘గౌరవం’, తరుణ్‌తో ‘యుద్ధం’ సినిమాలు చేసింది యమి. అవి సరిగ్గా ఆడలేదు. అజయ్ దేవగణ్‌తో చేసిన ‘యాక్షన్ జాక్సన్’ కూడా సత్ఫలితం ఇవ్వలేదు. కాని వరుణ్ ధావన్‌తో చేసిన ‘బద్లాపూర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. ‘కాబిల్’ కూడా ప్రేక్షకులు హిట్ చేశారు. ఇటీవల ఆమె వికీ కౌశల్‌తో చేసిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘బాలా’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉరిలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, బాలాలో అమాయకమైన స్మాల్‌టౌన్ గర్ల్‌గా యమి తన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఎదిగిన నటి. స్టార్ పెర్ఫార్మర్. పెద్ద బేనర్లు, ఆమె చేస్తే బాగుండు అనుకునే స్క్రిప్ట్‌లు ఆమెకోసం వెయిట్ చేస్తున్నాయి. ∙∙ ‘తెల్లరంగు గొప్పది, నల్లరంగు తక్కువది అనే భావన తప్పు. తెల్లరంగు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్లనే అందరూ అభిమానిస్తారు అని ప్రచారం చేయడం కూడా తప్పు. గతంలో ఆ ధోరణిలో యాడ్స్ వచ్చేవేమో. ఇప్పుడు మన సౌందర్యాన్ని మనం మరింత పెంచుకోవడం ఎలా అనే పాయింట్‌తో యాడ్స్ వస్తున్నాయి. అలాంటి యాడ్స్‌లో చేయడం తప్పు కాదు. నేను అలాంటి యాడ్స్‌నే చేస్తున్నానని గట్టిగా చెప్పగలను. అయినా నేను ఒక స్వతంత్రురాలిని. వేరొకరి ఆలోచనలు, భావధారను బట్టి నేను నా నిర్ణయాలను మార్చుకోను. ఏది సరైనదైతే అదే నేను చేస్తాను’ అని తన మీద వచ్చిన విమర్శలకు జవాబు ఇచ్చింది యమి ఆ తర్వాత. ∙∙ యమికి తన చెల్లెలు సురీలీ గౌతమ్‌తో, తమ్ముడు ఓజస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తనకు షూటింగ్ లేకపోతే వారితోనే సమయాన్ని గడుపుతుంది. ఆమెకు పోల్ డాన్స్ తెలుసు. ప్రొఫెషనల్‌గా ఆ డాన్స్‌ను నేర్చుకుంది. మనం అనుకునే రంగం వేరు కావచ్చు, ప్రవేశించే రంగం వేరు కావచ్చు... కాని ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గెలుపు అసాధ్యం కాదు అంటుంది యమి. ఆమె తమ బాహ్యసౌందర్యంతో పాటు మానసిక సౌందర్యాన్ని కూడా మెరుగు పెట్టుకుంటున్నదని ఆమె ఎదుగుదల, ఆలోచనలు, వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. ఆమెను భవిష్యత్తులో మరింత అందంగా మనం చూడబోతున్నాం. – సాక్షి ఫ్యామిలీ -
బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా: నటి
పెళ్లనగానే అమ్మాయి తరపు బంధువులు.. ముందుగా అబ్బాయికి ఏమైనా ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చూస్తారు. అయితే ముందూవెనకా ఎంతున్నా తలపై కాసిని వెంట్రుకలు లేకపోతే మాత్రం పెళ్లి కుదరదు అని తేల్చి చెప్పేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. బట్టతల కనిపించకుండా ఉండటం కోసం అబ్బాయిలు పడే పాట్లు చెప్పనలవి కాదు. ఇటీవల ఈ నేపథ్యంపై వచ్చిన సినిమా ‘బాలా’. ఇందులో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా నటించిన యామీ గౌతమ్‌కు తాజాగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులుగా ‘ఎందుకు చేసుకోకూడదు’ అని యామినీ తిరిగి ప్రశ్నించింది. బట్టతల అనేది పెళ్లికి అడ్డు కాదని జవాబిచ్చింది. నిజానికి బట్టతల ఉన్నావారు చాలా శాంతస్వరూపులని అభివర్ణించింది. అయితే, అసలు బట్టతల వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొంది. బాలా సినిమా విజయం పట్ల యామినీ సంతోషం వ్యక్తం చేసింది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే సినిమాతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్‌టాక్ స్టార్‌గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానంది. నవంబర్ 7న విడుదలైన ‘బాలా’ ఐదు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగిస్తోంది. -
మీరేం బాధపడకండి: హీరోయిన్ కౌంటర్
తనను ట్రోల్ చేసిన వ్యక్తికి హీరోయిన్ యామి గౌతం కౌంటర్ ఇచ్చారు. తన స్థానికతను ప్రశ్నించిన అతడికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.... హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమె స్థానికతను ప్రస్తావిస్తూ రియాలిటీ షో బిగ్‌బాస్ హౌజ్‌లో యామి తాను చండీగఢ్ అమ్మాయిని అన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్రోల్ చేశాడు. ‘హిమాచల్ ప్రభుత్వమేమో యామిని తమ రాయబారిగా పెట్టుకుంది. కానీ ఆమె మాత్రం నేను చండీగఢ్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పుకొంటుంది. ఇదేం విచిత్రం అంటూ ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ విషయంపై స్పందించిన యామి... ‘ నా జన్మభూమి దేవనగరి హిమాచల్. పెరిగిందేమో చండీగఢ్. అదే విధంగా నా కర్మభూమి(పనిచేసే చోటు) ముంబై. నేను మానసికంగా బలవంతురాలిని. ఇలాంటి మాటలు నా మీద ప్రభావం చూపలేవు. మీరేం బాధపడకండి. అలాగే ఒత్తిడికి లోనవ్వకండి. సరేనా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా విక్కీ డోనర్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కట్టిన యామి.. ప్రస్తుతం అతడితో కలిసి నటించిన బాలా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. బట్టతల ఉన్న వ్యక్తి కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 8న రిలీజ్ కానుంది. मेरी जन्म-भूमि हिमाचल ..करम-भूमि मुम्बईं ...परवरिष चनडीगड़ की है | शब्दों से ज़्यादा मज़बूत सोच और कार्य पर विश्वास रखती हूँ । तुहाँ निश्चिंत रेहा, मैं आयादि :) https://t.co/xx5eLU3FAJ — Yami Gautam (@yamigautam) November 4, 2019 -
మళ్లీ వస్తున్న దీపావళి!
సినీతారలు బాగా ఇష్టపడే పండుగ దీపావళి. ఇంటింటా దీపాలు వెలిగించి, ఆకాశంలోని తారకలతో పోటీపడతారు. ఇతర సెలబ్రిటీస్‌ని పిలిచి పార్టీలు చేసుకుంటారు. స్వస్థలాలకు చేరుకుని, బాణసంచా కాల్చుతూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. యామీ గౌతమ్‌కి కూడా అలా ఇంటికి వెళ్లి, అందరితో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకోవడం చాలా ఇష్టమట. అయితే కుటుంబం చండీగఢ్‌లో ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా యామీ తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపడానికి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి అనుబంధాల రుచులు తిని వద్దామనుకున్నారు. కాని పండుగ జరుపుకోలేకపోయారు! దగ్గర బంధువులు దీపావళి రోజునే గతించడంతో, ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది. ‘ఈ సంవత్సరం దీపావళికి మా ఇంట్లో స్వీట్స్ లేవు, దీపాలు లేవు, టపాసులు లేవు. ఏమీ లేవు’ అన్నారు యామీ. ఆయుష్మాన్ ఖురానా, భూమీ పెడ్నేకర్‌లతో తెర మీద కనిపించబోతున్న యామీ.. ‘బాల’ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆ దీపావళి వెలుగులు లేకపోయినా, ఈ చిత్రం విజయం సాధించి, యామీ ముఖంలో వెన్నెల కాంతులు కురిస్తే, యామీ దీపావళి జరుపుకున్నట్లేగా. ‘బాల’ ఈనెల 7న విడుదల అవుతోంది. -
థియేటర్లో నినాదాలు చేసిన కేంద్ర మంత్రి
బెంగళూరు : మెరుపు దాడుల నేపథ్యంలో బాలీవుడ్లో ‘ఉడి : ది సర్జికల్ స్ట్రయిక్స్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్కి కౌశల్, యామీ గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఆదివారం మాజీ ఆర్మీ ఉద్యోగులతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం ‘పవర్ ప్యాక్డ్ మూవీ. యామీ గౌతమ్, విక్కీ కౌషల్, పరేష్ రావల్, మోహిత్ రైనా తమ అద్భుత నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు’ అంటూ నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. దాంతో పాటు సినిమాలో విక్కీ కౌశల్ చెప్పిన క్యాచీ డైలాగ్.. ‘హౌ ఈజ్ ద జోష్’ అంటూ థియేటర్లో నినదాలు చేసిన వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ‘నిర్మలాజీ.. హీరో కన్నా మీరే చాలా పవర్‌ఫుల్‌గా ఈ డైలాగ్ చెప్పారు’ అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. సెప్టెంబరు 18, 2016 లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. -
ఒక ఉడి కథ
ఏ దేశంలో ఉండేదైనా మనుషులే. వాళ్లకుండేదీ కుటుంబాలే. తప్పు చేసిన ‘రోగ్ నేషన్స్’కి శిక్ష వేయాలి కానీ.. ఆ దేశంలో ప్రజలకు నష్టం కలక్కూడదు. యుద్ధంలో అదెలా సాధ్యం?! బాంబులు వేస్తే మంచివారు, చెడ్డవారూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు కదా! అందుకే... సర్జికల్ స్ట్రయిక్స్. అందుకే.. ఈ రిపబ్లిడ్ డే రోజు ‘ఉడి’ చిత్రంపై స్పెషల్ ఫోకస్. సెప్టెంబరు 18, 2016. లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో ఉన్న 12 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారి దాడిలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఆ వాస్తవ కథాంశమే ‘ఉడి: ది సర్జికల్ స్ట్రయిక్.’ విహాన్ సింగ్ షెర్గిల్ (వికీ కౌశల్) భారత ఆర్మీ మేజర్. ఎన్నో యుద్ధాలలో విజయాలు సాధిస్తూ, మాతృదేశానికి సేవ చేస్తుంటాడు. అయితే తన తల్లిని విస్మరిస్తున్నాననే బాధ అతడి హృదయాన్ని దహిస్తూ ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో ఉన్న తల్లి.. చెల్లి దగ్గర ఉంటుంది. ఈ సమయంలో తల్లి దగ్గరకు వెళ్లకపోతే, తనను పూర్తిగా మరచిపోతుంది అనుకుంటాడు. విధుల నుంచి తప్పుకుని, తల్లి దగ్గరకు వెళ్లిపోతానని చెబుతాడు. ‘దేశానికి సేవ చేసే అదృష్టం అందరికీ లభించదు. శక్తి ఉన్నంతవరకు దేశం కోసం పాటుపడాలి’ అని పై అధికారి అనడంతో మనసు మార్చుకుని, తన తల్లి ఉండే ప్రాంతానికి బదిలీ చేయించుకుంటాడు. రాజధానిలో ఆర్మీ బేస్‌లో చేరి, తల్లికి సేవ చేస్తుంటాడు. చెల్లి భర్త మేజర్ కరణ్ కశ్యప్ (మోహిత్ రైనా) కూడా సైనికదళంలోనే పని చేస్తుంటాడు. వారికి ఒక పాప. ఆ పాపలో తండ్రి, మేనమామల దేశభక్తి ప్రవహిస్తుంటుంది. తను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానంటుంది. తల్లి (స్వరూప్ సంపత్)ని చూసుకోవడానికి జాస్మిన్ అల్మైదా (యామీ గౌతమ్) అనే ఒక నర్సుని పెడతాడు విహాన్. ఆమే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజున అకస్మాత్తుగా తల్లి కనిపించదు. అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. ఆ కోపంలో నర్సుని విధుల నుంచి తొలగిస్తారు. ఆమె వెళ్లిపోతుంది. ఇంతలో తల్లిని కారులో తీసుకువస్తారు అపరిచితులు. (వెళ్లిపోయిన ఆ నర్సు తరవాత ‘రా’ ఏజెంట్ అని విహాన్‌కి తెలుస్తుంది). ఈ క్రమంలో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉడిలో చేసిన దాడిలో వీర మరణం పొందుతాడు విహాన్ చెల్లి భర్త కరణ్. టెర్రిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు విహాన్. అదే సమయంలో పాకిస్తాన్ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది భారత ప్రభుత్వం. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గోవింద్ భరద్వాజ్ (పరేశ్ రావల్) సర్జికల్ స్ట్రయిక్‌కి ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ బెటాలియన్‌కి నాయకత్వం వహించి, ఉడి ఆర్మీ బేస్ క్యాంపులో పథకం ప్రకారం దాడులు జరపడానికి విహాన్సింగ్ సన్నద్ధుడవుతాడు. మరోవైపు.. చేతికి చిక్కిన పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు ‘రా’ ఏజెంట్ పల్లవి శర్మ, విహాన్ సింగ్. మొత్తానికి తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్‌కి ముహూర్తం నిర్ణయం అవుతుంది. కేవలం గంటలో ఈ ఆపరేషన్ పూర్తి కావాలి. అయితే పాకిస్తాన్ స్థావరాలలో ఎవరెవరు ఉన్నారో తెలిస్తేనే కాని, వీరి దాడి త్వరగా పూర్తి చేయలేరు. ఏం చేయాలా అని ఆలోస్తుంటారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు తయారుచేస్తున్న గరుడ డ్రోన్ (గరుడ పక్షి బొమ్మ లోపల డ్రోన్ కెమెరా ఉంచుతారు)ను చూస్తాడు భారత ఆఫీసర్. దాని సహాయంతో టెర్రరిస్టుల స్థావరాలను గమనిస్తూ, సమాచారం అందించుకుంటూ టెర్రరిస్టులను మట్టుపెట్టాలనుకుంటారు. పథకం ప్రకారం అన్నీ సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ స్థావరాలకు చేరుకుని, పని పూర్తి చేసుకుని తెల్లారేలోగా వెనక్కు వచ్చేయాలని ప్రధాని ఆదేశం. అడుగడుగునా గరుడ డ్రోన్ సమాచారం అందిస్తూనే ఉంటుంది. పథకం ప్రకారం దాడి జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా గరుడ డ్రోన్ అకస్మాత్తుగా కింద పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా కొద్దిగా కూడా కదలదు. ఇంతలో పాకిస్తానీ టెర్రరిస్టులకు చెందిన ఒక చిన్న కుర్రవాడు అక్కడకు వచ్చి, గరుడను చూసి బొమ్మ అనుకుని, చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తుంటాడు. ఆ పిల్లవాడు గరుడను ఏం చేస్తాడా అని భారత అధికారులు ఆందోళనగా చూస్తుంటారు. రిమోట్ ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గాలిలోకి ఎగురుతుంది. నిమిషాలలో సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం అవుతుంది. ఈ దాడిలో ఆ గరుడను పట్టుకున్న కుర్రవాడు ఎదురుపడతాడు భారత సైనికులకు. ఆ బాలుడి పట్ల దయచూపి విడిచిపెడతాడు విహాన్సింగ్. తెలతెలవారుతున్నా వీరజవానులు ఇంకా వెనుకకు రాకపోవడంతో ప్రధానిలో ఆందోళన బయలుదేరుతుంది. ఇంతలోనే ‘ఆపరేషన్ సక్సెస్, మనవారంతా వెనక్కు వస్తున్నారు’ అనే సమాచారం అందుతుంది. సెర్బియాలో ‘వాస్తవాధీన’ సన్నివేశాలు పాకిస్తాన్‌పై భారతదేశం సర్జికల్ స్ట్రయిక్ జరిగిన సంవత్సరానికి.. సెప్టెంబరు 2017లో తాను ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు ఆదిత్యధర్. ఆ పదకొండు రోజులు (సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 29 వరకు) ఏం జరిగిందనే అంశం ఆధారంగా కథను రూపొందించుకున్నారు. మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో నటించడం కోసం విక్కీ కౌశల్ ఐదు మాసాల పాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. బరువు పెరిగారు. రోజుకి ఐదు గంటల పాటు శ్రమపడ్డారు. ముంబైలోని ‘కఫ్ పరేడ్’లో గన్ ట్రయినింగ్ కూడా తీసుకున్నారు. ముంబై నవీ నగర్లోనే నటులందరికీ శిక్షణ ఇచ్చారు. ఆయుధాలు ఉపయోగించడం నేర్పారు. ‘వాస్తవ అధీన రేఖ’ సన్నివేశాలను సెర్బియాలో చిత్రీకరించారు. యామీ గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో యుద్ధం, యాక్షన్, స్ట్రాటెజీ అన్నీ ఉన్నాయి. నరేంద్రమోడి, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ పాత్రలను కూడా చూపారు దర్శకులు. సర్జికల్‌స్ట్రయిక్ అంటే?! ఇదొక సైనిక దాడి. లక్ష్యాన్ని మాత్రమే ఛేదించి.. ప్రజలకు, చుట్టుపక్క ప్రదేశాలకు, వాహనాలకు, భవంతులకు ఏ మాత్రం హాని, విధ్వంసం జరగకుండా చేసేదే సర్జికల్ స్ట్రయిక్. 1976లో ఉగాండాలోని ఎంటెబ్బే మీద ఆ ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. 1981లో ఇజ్రాయిల్.. ఇరాక్ అణు రియాక్టర్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. అఫ్గానిస్తాన్‌లోని అల్‌కాయిదా స్థావరాల మీద అమెరికా చాలాసార్లు సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఇక మన దేశం 2016 సెప్టెంబరు 18న ‘ఉడి’ ప్రాంతంలో పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. – డా. పురాణపండ వైజయంతి -
సంక్రాంతికి సర్జికల్ స్ట్రయిక్స్
2016 సెప్టెంబర్ 18 తెల్లవారుజామున యూరీ పట్టణంలో బేస్ క్యాంప్ నిర్వహిస్తున్న భారతీయ సైనికులపై ఉగ్రవాదులు ఓ మెరపుదాడి చేశారు. దీంతో 19మంది జవాన్లు మరణించారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌పై (పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ప్రాంతంలో) సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనల ఆధారంగా హిందీలో ‘యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్స్’ అనే సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్, పరేశ్ రావెల్, యామీ గౌతమ్ ముఖ్య తారలుగా నటించారు. ఆదిత్యా థార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏడాది జనవరి 11న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజీ, మన్మర్జియాన్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న విక్కీ కౌశల్ ఇందులో మెయిన్‌లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా చాలా ఉద్వేగభరింతగా ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
నటి యామి గౌతమ్ పోల్ డాన్స్
-
వైరలవుతున్న నటి పోల్ డాన్స్ వీడియో
యామి గౌతమ్ సోషల్ మీడియాకు కామెంట్ల ప్రవాహం పెరిగిపోయిందంట. అభిమానులైతే యామిని పొగడ్తలతో ముంచేతుత్తున్నారంట. ఇంతకూ ఈ భామ చేసిన అంత గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా. మరేం లేదు.. ఈ కాబిల్ భామ జిమ్‌లో కష్టపడుతుండగా తీసిన వీడియోనొకదాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. యామికున్న ఫిట్నెస్ పిచ్చి అభిమానులందరికి తెలిసిందే. ఫిట్నెస్ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పోల్ డాన్స్‌ను నేర్చుకుంటుంది. యామి ఈ ఏడాది మార్చి నుంచి పోల్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. కాకపోతే మధ్యలో కాస్తా బిజీ షెడ్యూల్ వల్ల కొంత కాలం పోల్ డాన్స్ ప్రాక్టీస్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రెండో దశ పోల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారెవ్వరు యామి పోల్ డాన్స్ చేయడం ఇదే మొదటిసారి అంటే నమ్మలేరు. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్, అనుభవమున్న వారికి ధీటుగా ఈ భామ పోల్ డాన్స్‌లో విజృభించింది. ఈ వీడియో చూసిన అభిమానులు యామిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేనా గతంలో యామి చేసిన ఎలియన్ డాన్స్ వీడియో కంటే అధికంగా ఇప్పుడు ఈ పోల్ డాన్స్ వీడియో వైరలవుతుంది. యామి పోల్ డాన్స్‌ను ఫిట్నెస్ ఆప్షన్‌గా ఎంచుకోవాడానికి గల కారణాల గురించి చెబుతూ ‘డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జిమ్‌తో పాటు పోల్ డాన్స్‌ను కూడా నా ఎక్సర్సైజ్లో చేర్చుకున్నాను. దీని వల్ల బయట నుంచే కాక లోపలి నుంచి కూడా బలంగా తయారవుతాను. మా అమ్మ ఎప్పడు ఒక మాట చెబుతూ ఉంటుంది. అందంగా ఉండటం అంటే కడుపు మాడ్చుకోవడం, అరాకొరగా తినడం కాదు. అందం అంటే ఆరోగ్యంగా ఉండటం. కాబట్టి ఎప్పుడు నీ భోజనాన్ని మాత్రం వదులుకోకు అని చెబుతుంటుంది’ అన్నారు. -
కల్పనలా కనిపించాలనుంది
ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖులందర్నీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు బయోపిక్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకుంటారు? అని బాలీవుడ్ భామ, ‘గౌరవం’ ఫేమ్ యామీ గౌతమ్‌ని అడిగితే –‘‘నాకు ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాలా కనిపించాలనుంది. ఒకవేళ తన బయోపిక్ రూపొందిస్తే అందులో యాక్ట్ చేయాలనే ఆసక్తి ఉంది. అలాగే హీరోయిన్ మధుబాల బయోపిక్‌లోనూ యాక్ట్ చేయాలనే కల ఉంది. వీళ్లిద్దరే ఎందుకూ? అని అడిగితే సరైన సమాధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ల ఫీల్డ్‌లో వాళ్లు చూపించిన ఇంపాక్ట్ చాలా గొప్పది. వెరీ ఇన్స్పిరేషనల్’’ అని సమాధానమిచ్చారు యామీ. -
ఏలియన్ డ్యాన్స్.. పీక్స్‌కి చేరింది!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండయితే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వాటిని అనుసరించేస్తున్నారు. ఈ మధ్య ఏలియన్ డ్యాన్స్ పేరిట ఓ వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఓ మ్యూజిక్ యాప్ సాయంతో సెలబ్రిటీలు ఆ వీడియోకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి యామీగౌతమ్ ఏలియన్‌తో డ్యాన్స్ చేశారు. ఓవైపు ఏలియన్ డ్యాన్స్ , మరోవైపు తన బృందంతో కలిసి యామీ లయబద్ధంగా ఆ వీడియోకు స్టెప్పులేశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 7.7 లక్షల మంది వీడియో వీక్షించగా, మరో లక్షమంది నెటిజన్లు లైక్ చేశారు. ఇక ఈ మధ్యే ఈ గ్రహంతర వాసి డాన్సులకు క్రికెటర్ రోహిత్ శర్మ, కమెడియన్ మలైకా దువా, నటి దివ్యాంక త్రిపాఠిలు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. వీరి వీడియోలకు విశేష స్పందన రావడంతో యామీ కూడా ట్రై చేశారు. ఫిట్నెస్ను చూపిస్తూ ఇటీవల ఆమె చేసిన విన్యాసాల వీడియో, ఫొటోల కంటే కూడా మ్యూజికల్ యాప్‌తో ఏలియన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 67 లక్షల మంది ఫాలోయర్లున్నారు. -
ఆ హీరోయిన్ వల్లే నా కొంప మునిగింది
న్యూఢిల్లీ: బాలీవుడు నటుడు పులకిత్ సామ్రాట్ భార్య శ్వేత రోహిర తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. హీరోయిన్ యామీ గౌతమ్ వల్లే తమ బంధం చెడిందని ఆరోపించింది. పులకిత్, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మొదట్లో తమ కాపురం సవ్యంగా సాగిందని, యామీ గౌతమ్‌తో తన భర్తకు అనుబంధం ఏర్పడ్డాక తమ ఇద్దరి మధ్య కలతలు వచ్చాయని రోహిర ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పులకిత్తో తాను విడిపోవడానికి యామీ గౌతమ్ కారణమని ఆరోపించింది. కాగా తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని పులకిత్ కూడా ఇటీవల చెప్పాడు. తమ వివాహ బంధం తెగిపోయిందని ప్రకటించాడు. సానుభూతి పొందేందుకు తన ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొందని, వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి రచ్చ చేస్తోందని విమర్శించాడు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించనని, తన వివాహ బంధం ముగిసినట్టేనని పులకిత్ పేర్కొన్నాడు. -
భార్యతో కలిసుండలేనన్న హీరో
ముంబై: తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ స్పష్టం చేశాడు. తమ వివాహ బంధం తెగిపోయిందని ప్రకటించాడు. శ్వేతకు అతడు దూరం కావడానికి హీరోయిన్ యామి గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే తన భార్యకు గర్భస్రావం అయినప్పటి నుంచే శ్వేతకు అతడు దూరమవుతూ వచ్చాడని తాజాగా వెల్లైంది. ఈ ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. ‘ఈ వార్త చదివి షాక్‌కు గురైయ్యాను. ఇది మా వ్యక్తిగత విషయం. మా ఇద్దరికీ అది చాలా బాధ కలిగించింది. మాతృత్వం ఎవరికైనా వరమే. కానీ తప్పాంతా నాదే అయినట్టు బురద చల్లుతున్నారు. ఎవరేం మాట్లాడినా ఇన్నాళ్లు సహించాను. నిజమేంటే బయట పెట్టేస్తా. శ్వేతకు గర్భస్రావం జరిగి నాలుగేళ్లైంది. అప్పటికీ యామి గౌతమ్ ఎవరో నాకు తెలియదు. సానుభూతి పొందేందుకు నా ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొంది. వ్యక్తిగత విషయాలను బహిరంపరచి రచ్చ చేస్తోంది. ఆమె ఈవిధంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించను. శ్వేతతో నా వివాహ బంధం ముగిసినట్టే’నని పులకిత్ సామ్రాట్ పేర్కొన్నాడు. -
హీరో భార్యకు విడాకులు ఇమ్మన్న హీరోయిన్!
ముంబై: బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్, తన భార్య శ్వేత రొహిర మధ్య విభేదాలకు హీరోయిన్ యామి గౌతమ్ కారణమన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. యామి ప్రేమలో పడే భార్యకు అతడు దూరమయ్యాడని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. విడాకులు తీసుకోమని పులకిత్ కు సలహా యిచ్చింది కూడా ఆమేనని అంటున్నారు. మన బంధం ముందుకు సాగాలంటే విడాకులు తీసుకోవాల్సిందేనని అతడికి యామి గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీని గురించి పులకిత్ నోరు విప్పడం లేదు. తన సినిమా విడుదల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, న్యాయ వ్యవహారాలు చూసుకునేందుకు తనకిప్పుడు సమయం లేదని పేర్కొన్నాడు. తనకు, శ్వేతకు మధ్య విభేదాలు తలెత్తడం దురదృష్టమన్నాడు. గతేడాది అక్టోబర్ నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. కాగా, పులకిత్, యామి గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా 'జునూనియత్' సినిమా ఇటీవల విడుదలైంది. -
'ఆ చాన్స్‌తో చాలా ఎక్సైటింగ్‌గా ఉంది'
న్యూఢిల్లీ: ఫెయిర్ లవ్లీ యాడ్‌లో మెరిసి.. ఆ తర్వాత 'విక్కీ డోనర్' సినిమాతో తెరపై కనువిందు చేసింది యామీ గౌతమీ. తెలుగులో 'కొరియర్ బాయ్ కల్యాణ్'లో కనిపించిన ఈ అమ్మడికి ఇప్పటివరకు చిన్నాచితకా అవకాశాలే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన హృత్తిక్ రోషన్‌తో కలిసి నటించే భారీ చాన్స్ రావడంతో ఈ అమ్మడు ఎగిరి గంతేస్తోంది. 'కాబిల్' సినిమాలో హృత్తిక్తో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని యామీ గౌతమి చెప్తోంది. 'ఇది నిజంగా గొప్ప అవకాశం. ఆయనతో కలిసి నటిస్తుండటం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. అదే సమయంలో కొంచెం ఆందోళన కూడా ఉంది. ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. ఎప్పుడూ నాలో స్ఫూర్తినింపే నటుడు ఆయన. ఆయనతో కలిసి నటించడం నిజంగా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని యామీ మీడియాతో తెలిపింది. ఇప్పటివరకు 'టోటల్ సిపాయ', 'బద్లాపూర్' వంటి సినిమాలతో మెప్పించిన యామీ త్వరలోనే 'సానమ్ రే' సినిమాతో ప్రేక్షకులను పలుకరించనుంది. -
యామీకి గుడ్‌బై చెప్పిన ప్రియుడు
నటి యామీగౌతమ్ పేరు మరోసారి ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ మిక్కీడోనర్ చిత్రం ఫేమ్ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో గౌరవం చిత్రం ద్వారా పరిచయమైంది.ఆ తరవాత ఇక్కడ ఈ అమ్మడి నట ఫీచర్ అంత బ్రైట్‌గా లేదన్న విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక సంచలన వార్తలతో మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న యామీగౌతమ్ హిందీ నటుడు బుల్‌కిట్ సామ్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. సనమ్‌రే చిత్రంలో నటిస్తున్న సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందట. దీంతో అప్పటికే పెళ్లి అయిన బుల్‌కిట్ సామ్రాట్ తన భార్య సువేదా రోహిరాకు దూరం అయ్యారు. గత నవంబర్లోనే వారిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా తన ప్రియురాలు యామీకి బుల్‌కిట్ బై బై చెప్పేశారట. యామీతో తిరగడంతో ఇండస్ట్రీలో చెడ్డ పేరు రావడంతో తన ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని భావించిన బుల్‌కిట్ సామ్రాట్ యామీగౌతమ్ను వదిలి తన తల్లిదండ్రుల చెంతకు వెళ్లినట్లు సమాచారం.అయితే ఈ వ్యవహారం గురించి బుల్‌కిట్ భార్య స్పందిస్తూ తన భర్తకు నటి యామీగౌతమ్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారనీ దాని గురించి తనకు ఎలాంటి చింతా లేదని తాజాగా వారి జీవతంలో ఏమి జరిగిందన్నది తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం. ఇంతకీ ఈ వ్యవహారంపై యామీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
కొత్త ప్రేమికుడితో యామీ
యామీగౌతమ్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నటిగా సంచలనం సృష్టిస్తోంది. ఏదో విధంగా హీరోయిన్గా ఎదగాలన్నదే తన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తోందని సినీ వర్గాలంటున్నాయి. తమిళంలో గౌరవం చిత్రం ద్వారా నాయకిగా ఎంట్రీ ఇచ్చిన యామీగౌతమ్ మొదట్లో తాను గ్లామర్‌కు దూరంలాంటి స్టేట్మెంట్లతో తెగ ప్రచారం చేసుకుంది. అదే ఈ అమ్మడికి శాపం అయ్యింది. ఇక్కడ అవకాశాలు అడుగంటడంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్‌నే నమ్ముకుంది. అక్కడ అవకాశాలను రాబట్టుకోవడానికి యామీ పడరాని పాట్లు పడుతోందట. ఒక పక్క వాణిజ్య ప్రకటనలతో గడిపేస్తూ, తాను అందాలారబోతకు రెడీ అంటూ ప్రత్యేకంగా ఫొటో సెషన్ చేయించుకున్న గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. అయితే ఆ ఫొటోలు కాస్త దుమారానికే పరిమితం అయ్యాయి గానీ అమ్మడికి అవకాశాలను తెచ్చిపెట్టలేదు. ఇప్పటికే పలు వదంతుల పైనపడగా తాజాగా కొత్త లవర్‌తో చెట్టాపట్టాల్ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం దుమ్మురేపుతోంది. యువ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో యామీగౌతమ్ పార్టీలు, పబ్‌లు అంటూ యమ జోరుగా షికార్లు చేస్తోందట. దీని గురించి మీడియా గగ్గోలు పెడుతున్నా డోంట్ కేర్ అంటూ ఎలాంటి ప్రచారంతో నైనా అవకాశాలు రాబట్టుకుని నటిగా ఎదగాలనే తన గోల్‌ను రీచ్ అవ్వాలని చూస్తోందట. ఇంతకీ తన తాజా లవర్ పుల్కిత్ సామ్రాట్ ఎవరో తెలుసా? నటుడు సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త. గత ఏడాదే సల్మాన్‌ఖాన్ తన చెల్లెలు శ్వేతా రోహిరా పెళ్లిని ఘనంగా చేశారు. అయితే ఇప్పుడు పుల్కిత్ సామ్రాట్ శ్వేతా రోహిరాల మధ్య మనస్పర్థలు దూరాన్ని పెంచాయట. అందుకు నటి యామీ గౌతమ్ కూడా ఒక కారణం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
నవంబర్ 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు యామీ గౌతమ్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఈ సంవత్సరం వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం ఆరంభించిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. పోటీపరీక్షలలో విజేతలై జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. వీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల న్యాయసంబంధమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో జాగ్రత్త విహ ంచాలి. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాని, ఉన్న ఉద్యోగాన్ని శ్రద్ధగా చేసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్:1, 2,5,6,7,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్, రోజ్, ఆరెంజ్, గ్రే; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్ర, శనివారాలు సూచనలు: రోజూ రాత్రిపూట కనీసం ఒక అరగంటపాటు వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, సూర్యాష్టకం పఠించడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
యామీ బ్యూటీ
యమీ గౌతమ్... ‘విక్కీ డోనర్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల ప్రశంసలు కొట్టేసింది. ‘గౌరవం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలుకరించింది. ఇటీవలే ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’తో కలసివచ్చి సందడి చేసింది. నిజానికి నటి కంటే ముందు యమీ ఒక మంచి మోడల్. తన స్టయిల్‌తో, లుక్స్‌తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ అందం వెనుక ఉన్న సీక్రెట్స్ చెప్పమంటే ఇలా చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన మేకప్ మెళకువల్ని, తను అనుసరించే సౌందర్య చిట్కాలనీ ఈ విధంగా వివరించింది... నాకు ఇంతవరకూ చాలామంది బ్యూటీ టిప్స్ చెప్పారు. కానీ మా అన్నయ్య చెప్పిన రెండు టిప్స్ అన్నింటి లోకీ బెస్ట్. అవేంటంటే... మంచినీళ్లు బాగా తాగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఈ రెండూ మనలోని కళను రెట్టింపు చేస్తాయట. వయసును త్వరగా మీద పడనివ్వవట. ఇది ముమ్మాటికీ నిజమని సౌందర్య నిపుణులు కూడా చెప్పారు. అందుకే ఆ టిప్స్‌ని నేను తప్పక ఫాలో అవుతాను. అందంగా ఉండాలి కదా అని అతిగా మేకప్ వేసుకోవడం చేస్తుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఒక్కసారి మన ముఖం మేకప్‌కి అలవాటు పడిపోయిందంటే... సహజత్వం పూర్తిగా పోతుంది. దాన్ని తిరిగి తీసుకురావడం మనవల్ల కాదు. కాబట్టి అవసరమైనప్పుడే మేకప్ వేసుకోవాలి. అవసరం లేనప్పుడు దాని జోలికి కూడా పోకూడదు.ఠి కాస్ట్లీ మేకప్ సామగ్రి వాడితే అందం రెట్టింపవుతుందనే భ్రమ కొందరిలో ఉంటుంది. అది ఏమాత్రం నిజం కాదు. చవకరకం వాడితే చర్మం, జుత్తు పాడవుతాయని ఖరీదైనవి వాడతాం తప్ప, వాటి వల్ల లేని అందం రాదు. కొందరు నూలు చీర కట్టినా అందంగా ఉంటారు. దానికి కారణం... కట్టిన విధానం. ఆర్టిఫీషియెల్ జ్యూయెలరీ వేసుకున్నా రిచ్‌గా కనిపిస్తారు. దానికి కారణం... వాళ్ల సెలెక్షన్. మనకి ఏం నప్పు తాయి, ఏవి ఎలా ధరిస్తే మన అందం ఇనుమడిస్తుంది అన్నది తెలుసుకుంటే మనకి తిరుగే ఉండదు. అన్ని వేళల్లోనూ ఒకే తరహా మేకప్ తగదు. కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మన మేకప్ ఉండాలి. వేసవి కాలంలో దుస్తులతో పాటు లిప్‌స్టిక్, మష్కారా వంటివి కూడా లేత రంగులే ఎంచుకోవాలి. లేదంటే చెమట కారణంగా మేకప్ పాడయ్యి వికారంగా కనిపిస్తాం. చలికాలంలో ముదురు రంగులు వేసు కున్నా ఫర్వాలేదు. ఇక వర్షాకాలంలో, ముఖ్యంగా వానలో తడిసే అవకాశం ఉన్నప్పుడు వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి. ఠి బిజీగా ఉండేవాళ్లు రాత్రి ఇంటికి వచ్చి, బట్టలు మార్చుకుని పడుకుండి పోతుంటారు. అది కరెక్ట్ కాదు. పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత మంచి కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కూడా, మేకప్ సామగ్రిలో కెమికల్స్ ఉంటాయి. రాత్రంతా అలా ఉంచేసుకుంటే అవి చర్మాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మేకప్ తీసేసే పడుకోవాలి. వీలైనంత వరకూ అందానికి మెరు గులు దిద్దుకోవడానికి ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వాడటమే మంచిది. బొప్పాయి, టొమాటో, అరటిపండు, పసుపు, తేనె, పెరుగు... ఇవన్నీ చర్మ కాంతిని, కళను పెంచేవే. ఎంత బిజీగా ఉన్నా నేను రోజూ ఇరవై నిమిషాల పాటు జాగింగ్, రోజు విడిచి రోజు తొంభై నిమిషాల పాటు యోగా చేస్తాను. నేనే కాదు... ప్రతి ఒక్కరూ రోజూ వాకింగో, జాగింగో, యోగానో... ఏది వీలైతే అది చేయాలి. ఎందుకంటే ఒక్కసారి శరీరాకృతి పాడయ్యిందంటే, దాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం అంత తేలిక కాదు. నేను ఉదయాన్నే పరగడుపున తాజా దానిమ్మరసం తాగుతాను. తర్వాత ఓ శాండ్విచ్, ఎగ్ వైట్, బనానా షేక్, కొన్ని బాదం పప్పులు తీసుకుంటాను. మధ్యాహ్నం చపాతీ, చికెన్, వెజిటబుల్ కర్రీ, పండ్లు... రాత్రికి బ్రౌన్ బ్రెడ్, గ్రిల్డ్ ఫిష్, పెరుగు, కీరా సలాడ్ తింటాను. తప్పనిసరి అయితే తప్ప ఈ క్రమాన్ని తప్పను. అందరూ ఇలా క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లను ఫాలో అయితే ఆరోగ్యమూ బాగుంటుంది. అందమూ పెరుగుతుంది. ఠి శరీరం అందంగా ఉండేందుకు ఎలా ప్రయత్నాలు చేస్తామో, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కూడా అంతే ప్రయత్నించాలి. ఎందుకంటే మనసు బాగుంటే ముఖమూ బాగుం టుంది. కాబట్టి క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయటం మంచిది. వాటి వల్ల ఒకలాంటి ప్రశాంతత ఏర్పడుతుంది. అది ముఖంలో కాంతిలా ప్రతిఫలిస్తుంది. -
అందాలారబోతకు యామీ గౌతం సై
ఎవరు అవునన్నా కాదన్నా హీరోయిన్ల కేరీర్‌కు గ్లామర్‌కు విడదీయరాని బంధం ఉంటుందన్నది నిజం. నేను గ్లామర్‌కు దూరం, చుంబనాలకు ఒప్పుకోను, ఈత దుస్తులకు ససేమిరా అంగీకరించను అన్నవాళ్లంతా ఆ తరువాత అలాంటి వాటికి మేము సైతం అన్నవాళ్లే. నటి యామీ గౌతందీ ఇదే వరుస. గౌరవం చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత మళ్లీ తమిళ తెరపై కనిపించలేదు. కారణం నేను గ్లామరస్ పాత్రలు చెయ్యను. కురుచ దుస్తులు అస్సలు ధరించను. అందాలారబోతకు దూరం లాంటి స్టేట్మెంట్లతో మడి కట్టుకుని కూర్చోవడమే అనే టాక్ ప్రచారంలో ఉంది. ఇలానే నటి రెజీనా కూడా ఇంతకు ముందు గ్లామర్‌కు దూరం అని ప్రచారం చేసుకుంది. ఆ తరువాత జ్ఞానోదయం అయినట్లుంది. అందాలారబోతకు రెడీ అనేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలీవుడ్ ఆ అమ్మడిని పక్కన పెట్టేసింది. రెజీనాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఆమె గ్లామర్నిప్పుడు టాలీవుడ్ వాడుకుంటోంది. ఇక నటి యామీ గౌతమ్ కథ డిటోనే. అందాలారబోతకు ససేమిరా అనడంతో దక్షిణాది సినిమా ఈ భామను దూరం పెట్టేసింది. బాలీవుడ్‌లోనూ సనంరే అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. యామీ గౌతం కంటే వెనుక రంగంలోకి దిగిన నటి అలియాభట్ లిప్‌లాక్, ఈత దుస్తులు, అంటూ దుమ్మురేపుతూ దూసుకు పోతోంది. దీంతో ఇంకా గ్లామర్ విషయంలో మడి కట్టుకు కూర్చుంటే మొత్తానికే పక్కన పెట్టేసార్తని భావించిందో ఏమో ఇప్పుడు గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటున్నారు. కురుచ దుస్తులయినా పర్వాలేదు స్టైల్‌గా ఉండి తనకు అసౌకర్యం అనిపించకుండా ఉంటే వాటిని ధరించడానికి నేను సైతం సిద్ధం అంటూ ప్రకటింసేసిందని సమాచారం. చాలా కాలం ముందు నితిన్ యామీగౌతమ్ జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన ద్విభాషా చిత్రం తెలుగులో కొరియర్ బాయ్ పేరుతో ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళంలో జయ్‌తో యామీ జత కట్టిన ఈ చిత్రం తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుం పేరుతో విడుదల కావలసి ఉంది.ఇప్పటికి యామీ కి కొత్తగా అవకాశాలేమీ లేవు.అందాలారబోతకు సై అంటోంది కాబట్టి ఇకపై వస్తాయేమో చూడాలి. -
రొమాంటిక్ కొరియర్ బోయ్
ప్రేమకథలైనా, యాక్షన్ కథలైనా తన దైన శైలిలో డీల్ చేస్తూ తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. నిర్మాతగా కూడా ఆయనది ప్రత్యేకమైన శైలి. నితిన్‌తో ఆయన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు. నితిన్, యామీ గౌతమ్ జంటగా గురు ఫిలింస్ పతాకంపై మల్టీడెమైన్షన్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 23న జరగనుంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుని జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్య పోన్మార్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్. -
ప్రేమలో పడ్డ యామి గౌతమ్
ప్రేమ గుడ్డిదని విజ్ఞులు ఊరికే అనలేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే పెళ్లి అయిన పిల్లలున్న బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను శ్రీదేవి, అదే విధంగా ధర్మేంద్రను హేమమాలిని ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ల కథలు చాలా ఉన్నాయి. తాజాగా నటి యామి గౌతమ్ ఇదే బాట పట్టనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఉత్తరాది భామ గౌరవం చిత్రం ద్వారా దక్షిణాదిలోకి దిగుమతి అయ్యింది. అంతకుముందు మిక్కిడోనర్ చిత్రంతో బాలీవుడ్లో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో తమిళ్ సెల్వంను, తనియార్ అంజలుమ్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న యామిగౌతమ్ హిందీ సనందే అనే చిత్రంలో బుల్గిట్ సామ్రాట్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందట. ప్రస్తుతం వీరు చెట్టాపట్టాలేసుకుని తిరగేస్తున్నారట. -
అభిమానులున్నా అవకాశాల్లేవ్
అభిమానంలో చాలా రకాలున్నాయి. అలాంటి కట్టలు తెంచుకున్న అభిమానంతో నటులు అవస్థలు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఆఫ్‌కోర్సు అభిమానులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అధికంగానే ఉన్నా యి. ఇక అలాంటి వీరాభిమానంతో ఇటీవల తలనొప్పికి గురవుతున్న నటి యామి గౌతమ్. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన గౌరవం చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ ఉత్తరాది బ్యూటీ అవకాశాలు మాట ఎలా ఉన్నా అభిమానులు గోల మాత్రం అధికంగానే ఉందట. ప్రస్తుతం తమిళ్ సెల్వమ్, తనియార్ అంజలుమ్ చిత్రంలో నటిస్తున్న యామి హిందీలో నటిస్తున్నారు. అలాగే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ అభిమానులకు దగ్గరవుతున్న యామిగౌతమ్ పేరును తనను పిచ్చిగా ఆరాధించే అభిమాని ఒకరు పచ్చబొట్టుగా పొడిపించుకుని రోజు ఆమె షూటింగ్ జరిగే స్పాట్‌కు వెళ్లడం మొదలెట్టారట. అతని ప్రవర్తన చూసిన కొందరు ప్రశ్నించగా తాను యామిని ప్రేమిస్తున్నానన్నది ఆమెకు తెలియాలని రోజు ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళుతున్నానని బదులిచ్చారట. ఈ వీరాభిమాని వింత చేష్టలు మొత్తానికి యామి దృష్టికి చేరాయట. ఆశ్చర్యం, దిగ్భ్రాంతులతో కూడిన విస్మయానికి గురైన యామి ఇలాంటి చర్యలు బాధాకరం అంటూ అతనికి హిత వ్యాఖ్యలు చెప్పి పంపించే సిందట. ఇలాంటి అభిమానులు విపరీత చర్యలు ఈ భామకు కొత్తేమి కాదట. ఇంతకుముందొక అభిమాని తన అందమైన రూపాన్ని భారీ సైజ్ క్యాన్వాస్పై చిత్రీకరించి ఆమెను కలిసి యమ ఖుషి అయిన ఆ పెయింటింగ్‌ను బహుకరించారట. అయితే ఇలాంటి అభిమానులను కలిగిన తనకు అవకాశాలు మాత్రం ఎందుకు రావడం లేదని యామి తన సన్నిహితుల వద్ద వాపోతోందట.ఇంతకీ ఈ భామకు అవకాశాలు వస్తాయో లేదో వేచి చూద్దాం. -
యామీ ‘యమ్మీ’ పాస్తా!
ఓ చల్లని సాయంత్రం...బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్ ఇల్లు. సందడిగా ఉంది. వీనుల విందైన సంగీతం, సరదాలు, ఆటపాటలతో ఆమె ఇల్లు కళకళలాడుతోంది. యామీ గౌతమ్ దగ్గరుండి మరీ అతిథులకు ఫుడ్ వడ్డిస్తున్నారు. దీనికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. యామీ గౌతమ్‌కు పాస్తాలంటే పిచ్చి. స్నేహితుల కోసం అప్పుడప్పుడూ పాస్తాలు చేస్తానని ఏదో మాటల సందర్భంలో చిత్ర యూనిట్‌కు యామీ చెప్పారు. పాస్తాలంటే ఇష్టమని చిత్ర బృందంలో ప్రతి ఒక్కరూ చెప్పడంతో వీళ్లను తన ఇంటికి డిన్నర్‌కు పిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఓ వారం ముందు నుంచే సరుకులు తెచ్చుకుని ప్లానింగ్‌తో ఈ విందు ఏర్పాటు చేశారు యామీ. దీని గురించి ఆమె మాట్లాడుతూ -‘‘అదృష్టం కొద్దీ పాస్తాలు బాగా వచ్చాయి. పాస్తాలు చేయడం కన్నా వాటిని అలకరించడానికే ఎక్కువ టైమ్ పట్టింది. అయితే, అందరికీ నచ్చడంతో కష్టాన్ని మర్చిపోయా. యూనిట్‌తో ఇలా సమయం గడపడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని చెప్పారు. -
యమీకి అదే కావాలట!
గాసిప్ హీరోయిన్లు ఏదైనా తినాలంటేనే టెన్షన్ పడిపోతారు... ఎక్కడ బరువు పెరిగిపోతారో అని. యమీ గౌతమ్ కూడా అలానే ఆలోచిస్తుంది... ఒక్క బ్రెడ్ పకోడా విషయంలో తప్ప. ‘గౌరవం’తో తెలుగువారికి పరిచయమైన ఈ చండీఘడ్ చిన్నది... ప్రస్తుతం బాలీవుడ్లో బిజీబిజీగా ఉంది. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం పటియాలా వెళ్లింది. అంతే... వెళ్లినప్పట్నుంచీ బ్రెడ్ పకోడా తింటూనే ఉందట. తను తినడమే కాక టీమ్ అందరినీ కూడా తినమని బాగా బలవంతపెట్టిందట. వాళ్లు కూడా తిని ‘వావ్’ అనేసరికి హుషారొచ్చేసి ఇంకా ఇంకా తినేసిందట. ఆ తర్వాత జిమ్‌కి పరుగెత్తి గంటలకు గంటలు వర్కవుట్లు చేసిందట. అలా తినడమెందుకు, కష్టపడటమెందుకు అంటే... ‘పటియాలాలోని బ్రెడ్ పకోడా అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం, అది తినకుండా ఉండటం నా వల్ల కాదు’ అంటూ అంటోందట. ఈ పకోడా పిచ్చేంటో మరి! -
హాట్ కిస్!
ఎప్పుడొచ్చామన్నది కాదు... కిస్సు కిక్కెంచిందా లేదా అన్నదే పాయింటంటున్నారు బాలీవుడ్ తారలు. సీనియర్, జూనియర్ తేడా లేదు... బిగ్స్క్రీన్పై లిప్‌లాక్‌ల పంట పండించేస్తున్నారు. ఎంతగా అంటే... ఏటికేడు హాట్ కిస్ ఎవరిదని పోటీ పెట్టుకునేంతగా! పాపం ఇమ్రాన్ హష్మీపై ‘ముద్దుల హీరో’ అంటూ ముద్ర వేసేశారు గానీ... నిజానికి ఎవరు మాత్రం వెనక్కు తగ్గుతున్నారు చెప్పండి! ఇంతకీ చెప్పొచ్చేదేమంటే... కుర్ర హీరో వరుణ్‌ధావన్, యామీగౌతమ్లు తమ తాజా సినిమా ‘బాదల్పూర్’లో ఓ మాంచి స్టీమీ లిప్‌లాక్ సీన్‌ను అదరగొట్టేశారట. సినిమా భాషలో చెప్పాలంటే... అదే... కెమిస్ట్రీ... ఇద్దరి మధ్యా తెగ వర్కవుటయిందట. అంటే అన్నారంటారు గానీ.. స్క్రీన్మీదైతేనేం.. ముద్దు ముద్దు కాదా.. ఏంటీ.. అంటూ నిట్టూరుస్తున్నారు క్రిటిక్స్. -
అందమే ఆనందం
అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం అన్నారో మహాకవి. అందం పరమార్థాన్ని ఎంత అందంగా చెప్పారాయన. అలాంటి అందం కోసం పరితపిస్తోంది నేటి యువత. అందుకోసం పలు రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. నిజానికి అసలు అందం అంటే ఏమిటి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెబుతుంటారు. ఇక సినీ తారలయితే జీవితంలో సగ భాగం అందాలను మెరుగు పరచుకోవడనికే ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా కథానాయికలు వీరికి అందమే అర్ధబలం అనవచ్చు. అలాంటి సౌందర్య రాశి అయిన యామి గౌతమ్ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తన ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీ అందం గురించి ఏమి చెబుతారో చూద్దాం. మీ సౌందర్య రహస్యం? నిజం చెప్పాలంటే నా అందానికి ఎలాంటి రహస్యాలు లేవు. అందం అనేది మనసుకు సంబంధించింది. అసలు అందం అందరిలోనూ ఉం టుంది. మాలాంటివాళ్లు సినిమాలో, మోడలింగ్ రంగంలో పని చేస్తుంటాం కాబట్టి అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాం. నేను మంచి నీరు అధికంగా తాగుతాను. ఆకుకూరలు ఎక్కువగా తిం టాను. అందం కోసం రసాయనిక సాధనాలను ఉపయోగించను. సెంట్, బాడీస్ప్రే, సోప్ వంటివి ప్రకృతి సిద్ధమయినవే కోరుకుంటాను. మన అందాన్ని మనమే కాపాడుకోవాలి. నా అందాన్ని మెరుగులు దిద్దే విషయంలో అధిక బాధ్యతను మా అమ్మే తీసుకుంటుంది. ఇందుకు మన ప్రవర్తన కూడా దోహదపడుతుంది. ప్రశాంత స్వభావం సాధ్యమయినంత వరకు చిరునవ్వును దూరం చేసుకోకుండా ఉండడం పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉంటే ముఖం కళకళలాడుతుంది. ఇప్పుడొస్తున్న మేకప్ వస్తువులన్నీ రసాయనికాలతో కూడుకున్నవేగా? అందుకే చెబుతున్నా సాధ్యమయినంత వరకు జుట్టుకు, ముఖానికి ప్రకృతిలోని మూలికలతో తయారయిన సామగ్రినే ఉపయోగించుకోవాలి. మగువలకు అందంపై మోహానికి కారణం? అందం అనేది ఒక శక్తి అనవచ్చు. ఆ శక్తి మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరినీ ఆకర్షించే శక్తి అందానికుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆకర్షణ శక్తి చుట్టూ తిరుగుతోంది. అలా ప్రపంచాన్నే స్తంభింప చేసే శక్తి ఆకర్షణ కుంది. అతివలకు అందాల పోటీ అవసరమా? కచ్చితంగా అవసరమే. రకరకాల అందమయిన పువ్వులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మగువల అందాల పోటీలు కూడా. అందమయిన అతివలు సమాజంలోని చాలా విషయాలను సాధించవచ్చు. అలాంటి ఆత్మవిశ్వాసాన్నిచ్చేది అందమే. అందం అనేది మేను చాయలను బట్టి ఉంటుందా? నిజం చెప్పాలంటే అందానికి రంగుతో పని లేదు. అయితే అందం గురించి ఒక్కొక్కరి మనసులో ఒక్కో భావం ఉంటుంది. కొందరు మహిళలు రంగు మారాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా సహజ సిద్ధమయిన అందాన్ని సురక్షితంగా కాపాడుకుంటే చాలు. అలాంటి అందమే శాశ్వతం. అదే నిత్యసత్యం. మీరు ఒక ప్రముఖ ప్రకటనల సంస్థకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. నటిగా మరింత పాపులర్ అయితే ఆ ప్రకటనల సంస్థకు టాటా చెబుతారా? ఆ సంస్థ ఇదే ప్రశ్న వేసింది. అయితే నన్ను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన ఆ సంస్థ ద్వారానే తానీస్థాయికి ఎదిగాను. అందువల్ల ఎప్పటికీ ఆ సంస్థకు దూరం కాను. అందానికి మీరిచ్చే నిర్వచనం? ఇతరులు మనకు వశీకరణ అవుతున్నారంటే మనలో అందం ఉన్నట్లు అర్థం. అయితే అలాంటి వశీకరణ శక్తి మనలో నిరంతరం ఉండాలంటే మనలో సచ్చీలత, సంప్రదాయం, సేవా గుణం, ప్రేమ, అభిమానం వంటి లక్షణాలుం డాలి. సమాజంలో అసలయిన అందానికి నిర్వచనం ఇవే. ఆ విధంగా మానవతామూర్తి మదర్ థెరీస్సానే నిజమైన అందానికి ప్రతిరూపం. -
బికినీకి దూరం
టీ.నగర్: తనకు ఎంత డబ్బు ఇచ్చినా బికినీ దుస్తుల్లో నటించేది లేదని నటి యామిగౌతం ఖరాఖండిగా తెలిపారు. రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రంలో నటించారు యామి గౌతం. తమిళ్ సెల్వనమ్ తనియా అంజలుమ్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త మనిషిగా కాకుండా రోబోగా ఎంపిక చేసుకుంటే బాగుం టుందని తన స్నేహితులు తనను ఆటపట్టిస్తుంటారని అన్నారు. తనను గౌరవించే మనస్తత్వం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ప్రేమతో తనను ఆకర్షించాలని కూడా వివరించారు. తన మన స్తత్వం లాగానే అతని మనస్తత్వం ఉండాలని ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. తాను సహకరించే నటిని మాత్రమేనని అయితే తనకు అసౌకర్యం కల్పించే సన్నివేశాల్లో నటించబోనన్నారు. అంతేకాకుండా ఈత దుస్తుల్లో నటించబోనని స్పష్టం చేశారు. పెద్ద బ్యానర్, భారీ పారితోషికం అందచేసినప్పటికీ తన విధానం మార్చుకోనన్నారు. -
ఆశిస్తే అందేది కాదది
ఆశిస్తే అందేది కాదు విజ యం అంటున్నారు యువ నటి యామి గౌతమ్. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో హీరోయిన్గా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఈ బ్యూటీ తమిళం, తెలుగులో గౌర వం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తాజాగా మళ్లీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్ అనే పేరును తెలుగులో కొరియర్ భాయ్ కల్యాణ్ పేరును నిర్ణయించారు. ఈ చిత్రం పాట చిత్రీకరణ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా యామిగౌతమ్తో కొన్ని ముచ్చట్లు. గౌరవం చిత్రం ఆశించిన విజయం సాధించిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదన్నారు. అయితే మనకిచ్చిన పాత్రను న్యాయం చేసే ప్రయత్నం చేయాలన్నారు. తన తొలి చిత్రం విక్కిడోనర్ (హిందీ) మంచి చిత్రం అవుతుందని భావించాను గానీ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. అందుకే సక్సెస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదన్నారు. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలంటూ తేడాలు తనకు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న కమర్షియల్ చిత్రం యాక్షన్ జాక్సన్, తమిళం, తెలుగు భాషల్లో తమిళ సెల్వన్ తనియార్ అంజలుమ్గా విడుదల కానుందన్నా రు. తాను మోడలింగ్ నుంచి వచ్చానని చెప్పారు. తొలి రోజుల్లోనే ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్‌తో కలసి పని చేయడం అదృష్టమన్నారు. ఏఆర్ రెహ్మాన్ రూపొం దించిన రౌనక్ వీడియో ఆల్బమ్‌లో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు. -
యుద్ధం ఆడియో ఆవిష్కరణ
-
యుద్ధం సిద్ధం!
తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.కల్యాణ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని జిట్టా సురేంద్రరెడ్డికి అందించారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నామని నట్టికుమార్ చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని తరుణ్ నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందని, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
సినిమాలంటే భయం లేదు
సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నా తొందరపడడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘నా మనసు చెప్పింది చేయడమే నాకిష్టం. ఒక సినిమా భారీ హిట్ కాగానే తరువాతి వాటిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నాకు సినిమా కుటుంబం లేదు. ముంబై యువతినీ కాదు కాబట్టి రెండో అవకాశం రావడం కాస్త కష్టమే. అయితే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంతమాత్రాన నేను భయపడ్డట్టు కాదు’ అని యామీ వివరించింది. తాజా సినిమా టోటల్ సియప్పా తనకు మనసుకు నచ్చిన కథ అని తెలిపింది. ‘నాకు అవకాశాలు చాలా వచ్చాయి. వద్దనుకున్న సినిమాల గురించి మాట్లాడడం ఇష్టముండదు’ అని చెప్పింది. అయితే నీరజ్ పాండే నిర్మిస్తున్న టోటల్ సియప్పా ప్రాజెక్టుపై సంతకం చేయడానికి కూడా ఈమె చాలా సమయమే తీసుకుంది. ‘భిన్న నేపథ్యాలున్న కథ ఇది. హాస్యం, ఉద్వేగం, కోపం వంటి అంశాలూ ఉంటాయి. ఇందులో అవకాశం ఇచ్చిన నీరజ్ పాండేకు ఎంతో కృతజ్ఞురాలిని. సినిమా కథ గంభీరమైనదే అయినా ప్రేక్షకులు దీనిని పూర్తిగా ఆస్వాదించవచ్చు’ అని యామీ వివరించింది. టోటల్ సియప్పాకు నీరజ్ కథ కూడా అందించగా, ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. దీనిని వచ్చే నెల ఏడున విడుదల చేస్తున్నారు. పాకిస్థానీ నటుడు, గాయకుడు అలీ జఫర్, యామీ, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి కిరణ్ ఖేర్ తదితరులు ఇందులో కనిపిస్తారు. వికీ డోనర్ తీసిన జాన్అబ్రహం, షూజిత్ సర్కార్ తాజాగా రూపొందించే సినిమాలోనూ అవకాశం దక్కిందంటూ వచ్చిన వార్తలను యామీ గౌతమ్ తోసిపుచ్చింది. -
యుద్ధం ఎవరితో?
తరుణ్, యామి గౌతమ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ అనేది ఉపశీర్షిక. భారతి గణేష్ దర్శకుడు. నట్టికుమార్ నిర్మాత. స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. షూటింగ్ ముగించుకొని పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి నట్టికుమార్ చెబుతూ-‘‘శ్రీహరి పాత్ర ఈ చిత్రానికి హైలైట్. ‘ఢీ’లో ఆయన పోషించిన పాత్ర స్థాయిలో ఉంటుందీ పాత్ర. ఈ చిత్రాన్ని శ్రీహరిగారికి అంకితం ఇస్తున్నాం. ఇటీవలే బ్యాంకాక్, పటాయ్ తదితర ప్రాంతాల్లో తరుణ్, యామి గౌతమ్‌పై పాటలను చిత్రీకరించాం. కృష్ణారెడ్డి నృత్యరీతుల్ని సమకూర్చారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేస్తాం. జనవరి తొలివారంలో సినిమాను 600 థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: నట్టి క్రాంతి.