
యమీకి అదే కావాలట!
గాసిప్
హీరోయిన్లు ఏదైనా తినాలంటేనే టెన్షన్ పడిపోతారు... ఎక్కడ బరువు పెరిగిపోతారో అని. యమీ గౌతమ్ కూడా అలానే ఆలోచిస్తుంది... ఒక్క బ్రెడ్ పకోడా విషయంలో తప్ప. ‘గౌరవం’తో తెలుగువారికి పరిచయమైన ఈ చండీఘడ్ చిన్నది... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం పటియాలా వెళ్లింది. అంతే... వెళ్లినప్పట్నుంచీ బ్రెడ్ పకోడా తింటూనే ఉందట. తను తినడమే కాక టీమ్ అందరినీ కూడా తినమని బాగా బలవంతపెట్టిందట.
వాళ్లు కూడా తిని ‘వావ్’ అనేసరికి హుషారొచ్చేసి ఇంకా ఇంకా తినేసిందట. ఆ తర్వాత జిమ్‌కి పరుగెత్తి గంటలకు గంటలు వర్కవుట్లు చేసిందట. అలా తినడమెందుకు, కష్టపడటమెందుకు అంటే... ‘పటియాలాలోని బ్రెడ్ పకోడా అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం, అది తినకుండా ఉండటం నా వల్ల కాదు’ అంటూ అంటోందట. ఈ పకోడా పిచ్చేంటో మరి!