అందాలారబోతకు యామీ గౌతం సై | yami gautam ready for Glamour role | Sakshi
Sakshi News home page

అందాలారబోతకు యామీ గౌతం సై

Published Thu, Oct 1 2015 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

అందాలారబోతకు యామీ గౌతం సై

అందాలారబోతకు యామీ గౌతం సై

ఎవరు అవునన్నా కాదన్నా హీరోయిన్ల కేరీర్‌కు గ్లామర్‌కు విడదీయరాని బంధం ఉంటుందన్నది నిజం. నేను గ్లామర్‌కు దూరం, చుంబనాలకు ఒప్పుకోను, ఈత దుస్తులకు ససేమిరా అంగీకరించను అన్నవాళ్లంతా ఆ తరువాత అలాంటి వాటికి మేము సైతం అన్నవాళ్లే. నటి యామీ గౌతందీ ఇదే వరుస. గౌరవం చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత మళ్లీ తమిళ తెరపై కనిపించలేదు. కారణం నేను గ్లామరస్ పాత్రలు చెయ్యను. కురుచ దుస్తులు అస్సలు ధరించను. అందాలారబోతకు దూరం లాంటి స్టేట్‌మెంట్లతో మడి కట్టుకుని కూర్చోవడమే అనే టాక్ ప్రచారంలో ఉంది. ఇలానే నటి రెజీనా కూడా ఇంతకు ముందు గ్లామర్‌కు దూరం అని ప్రచారం చేసుకుంది.
 
  ఆ తరువాత జ్ఞానోదయం అయినట్లుంది. అందాలారబోతకు రెడీ అనేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలీవుడ్ ఆ అమ్మడిని పక్కన పెట్టేసింది. రెజీనాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఆమె గ్లామర్‌నిప్పుడు టాలీవుడ్ వాడుకుంటోంది. ఇక నటి యామీ గౌతమ్ కథ డిటోనే. అందాలారబోతకు ససేమిరా అనడంతో దక్షిణాది సినిమా ఈ భామను దూరం పెట్టేసింది. బాలీవుడ్‌లోనూ సనంరే అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. యామీ గౌతం కంటే వెనుక రంగంలోకి దిగిన నటి అలియాభట్ లిప్‌లాక్, ఈత దుస్తులు, అంటూ దుమ్మురేపుతూ దూసుకు పోతోంది. దీంతో ఇంకా గ్లామర్ విషయంలో మడి కట్టుకు కూర్చుంటే మొత్తానికే పక్కన పెట్టేసార్తని భావించిందో ఏమో ఇప్పుడు గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటున్నారు.
 
 కురుచ దుస్తులయినా పర్వాలేదు స్టైల్‌గా ఉండి తనకు అసౌకర్యం అనిపించకుండా ఉంటే వాటిని ధరించడానికి నేను సైతం సిద్ధం అంటూ ప్రకటింసేసిందని సమాచారం. చాలా కాలం ముందు నితిన్ యామీగౌతమ్ జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన ద్విభాషా చిత్రం తెలుగులో కొరియర్ బాయ్ పేరుతో ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళంలో జయ్‌తో యామీ జత కట్టిన ఈ చిత్రం తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుం పేరుతో విడుదల కావలసి ఉంది.ఇప్పటికి యామీ కి కొత్తగా అవకాశాలేమీ లేవు.అందాలారబోతకు సై అంటోంది కాబట్టి ఇకపై వస్తాయేమో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement