Glamour Role
-
గ్లామర్‌కు గుడ్‌బై
ఇంతకుముందు తన అందచందాలతో అలరించి యువతకు డ్రీమ్‌గర్ల్ ముద్ర వేసుకున్న నటి నమిత. ఆమె అభిమానులను మచ్చాస్ ఫ్లయింగ్ కిస్‌లతో ఖుషీ పరిచేవారు. 2004లో ఎంగల్ అన్నా చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నమిత. విజయ్‌కాంత్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో నమితకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి అలా ఏయ్, బంపర కన్నాలే, ఆణ, కోవై బ్రదర్స్, బిల్లా వంటి పలు చిత్రాల్లో నటించారు. అజిత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రంలో నమిత స్విమ్మింగ్ దుస్తుల అందాలారబోత యువతను గిలిగింతలు పెట్టించిందనే చెప్పాలి. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నమిత 2017లో వీరేందర్ చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. వీరికి కవల పిల్లలు పుట్టారు. కాగా ఈమె నటనకు దూరమైన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. నటిగా ఈమె రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారన్నది గమనార్హం. అలాంటిది ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ తన కవలపిల్లలకు రెండేళ్ల వయసు దాటిందన్నారు. దీంతో మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలా ఇప్పటికే ఒక చిత్రంలో ప్రతినాయకి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇకపై గ్లామరస్ పాత్రలు పోషించనని నమిత చెప్పారు. నమిత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులకు శుభవార్త అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
ఆ ఇమేజ్ను ఎంజాయ్ చేస్తున్నా: రష్మీ
సాక్షి, హైదరాబాద్: ‘నా మీద వేసిన గ్లామర్ డాల్ ముద్రను నేను కోరుకున్నా.. లేకున్నా, ఆ ఇమేజ్ను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పింది బుల్లితెర, వెండి తెర నటి రష్మీ గౌతమ్. పంజగుట్టలోని టీబీజెడ్ ది ఒరిజినల్ షోరూమ్‌లో శుక్రవారం ఆమె టెంపుల్ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ... ‘భారతీయతను ప్రతిబింబించే ఆభరణాలు నాకిష్టం. ఆభరణాలు ధరిస్తే అందం, ఆనందం మాత్రమే కాదు.. అవి రేపటి ఆదాయానికి పెట్టుబడి కూడా’ అని పేర్కొంది. షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశంలోని సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని టెంపుల్ జ్యువెలరీని రూపొందించామని చెప్పారు. కాగా, రష్మీ గౌతమ్ తాజా సినిమా ‘అంతకు మించి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అంతకుమించి సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ సినిమా నిర్మాత గౌరీకృష్ణప్రసాద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కండిషన్స్ అప్లై అంటున్న మడోనా
ఆదిలో నటి రేవతిలా కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తాననీ స్టేట్మెంట్స్ ఇచ్చిన చాలా మంది నటీమణులు ఆ తరువాత సిల్క్‌స్మిత రేంజ్లో అందాలారబోతకు తయారయ్యారు. కాగా ఈ తరం నాయికలు లక్ష్మీమీనన్, నిత్యామీనన్, కీర్తీసురేశ్, మడోనా సెబాస్టియన్ లాంటి వారు తమకంటూ కొన్ని హద్దులను విధించుకుని నటిస్తున్నారు. అయితే వారిలో నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే నాన్శివప్పుమనిదన్ చిత్రంలో విశాల్‌తో డెరైక్ట్‌గా లిప్ లాక్ సన్నివేశంలో నటించి నిబంధనలను సడలించుకున్నారు. ఇటీవల గ్లామర్‌కు తానూ సై అని గేటులెత్తేశారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న రెక్క చిత్రంలో అమ్మడి అందాలారబోతను చూడొచ్చంటున్నారు. అలాంటిది అదే విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ కుట్టి మడోనా సెబాస్టియన్ ఆరంభ దశలోనే షరతులు విధిస్తున్నార ట. అవి మరీ విడ్డూరంగా ఉన్నాయి. అవేమిటంటే... శారీరక గ్లామర్‌ను ప్రదర్శించే దుస్తులు ధరించను. హీరోలను కౌగిలించుకునే సన్నివేశాలలో నటించను. వారితో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించను. ఒకవేళ ఆ హీరో నాకు స్నేహితుడైతే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అంగీకరిస్తానేమో అంటున్న మడోనా సెబాస్టియన్ కోలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మడోనా సెబాస్టియన్ రెండోసారి విజయ్‌సేతుపతికి జంటగా కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనుంది. -
అందాలారబోతకు సై
ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. ప్రాధాన్యం అంటే అందాలారబోతలో రెచ్చిపోతా నంటోంది ముంబై బ్యూటీ తేజశ్రీ. ఉత్తరాది భామలు దక్షిణాదిలో దుమ్మురేపడం కొత్తేమీకాదు. కొందరు హీరోయిన్లగా వెలిగిపోతుంటే, మరి కొందరు ఐటమ్ సాంగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏమైనా ఉత్తరాది ముద్దుగుమ్మలకు దక్షిణాదిలో క్రేజే వేరు. అలాంటి వారి పట్టికలో నేనూ చేరాలని ఉర్రూతలూగుతోంది నటి తేజశ్రీ. ముంబైయికి చెందిన ఈ అమ్మడు ఇప్పడికే అట్టీ చిత్రంతో కోలీవుడ్‌లో కర్చీఫ్ వేయబోతోంది. ఆ చిత్రంలో మంకేపీ.ఆనంద్‌తో ఐటమ్ సాంగ్ ఆడేసింది. అందులోని గిల్లీ బంబరం సోల్రా మచ్చా అనే పాటలో తేజశ్రీ తనదైన అందాలతో చెడుగుడు ఆడేసిందట. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటుడు భరత్‌తో కలసి ఒక చిత్రం చేస్తోంది. కోలీవుడ్‌లో హీరోయిన్గా రాణించాలన్న కోటి ఆశలతో ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కి చెన్నైకి వచ్చిన ఈ జాణ కోరికలు, భావాలు ఏమిటో చూద్దాం. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నాకు తమిళంలో నయనతారలా మంచి కథా పాత్రలో నటించాలని ఆశ. ఇక శంకర్, గౌతమ్‌మీనన్, ఏఆర్.మురుగదాస్, సుశీంద్రన్, వెట్రిమారన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్, జయంరవిలతో రొమాన్స్ చేయాలని కలల కంటున్నాను. మంచి పాత్రలు అమరితే, వాటికి గ్లామర్ అవసరం అయితే అందుకు తగ్గట్టుగా రెచ్చిపోయి నటిస్తా. ఈ విషయంలో పెద్ద చిత్రాలు, చిన్న చిత్రాలు అన్న తారతమ్మం చూపను.అంటున్న నటి తేజశ్రీ తమిళ సినిమా ముందు ముందు ఏ స్థాయిలో కూర్చోబెడుతుందో వేచి చూడాల్సిందే. -
అందాలారబోతకు యామీ గౌతం సై
ఎవరు అవునన్నా కాదన్నా హీరోయిన్ల కేరీర్‌కు గ్లామర్‌కు విడదీయరాని బంధం ఉంటుందన్నది నిజం. నేను గ్లామర్‌కు దూరం, చుంబనాలకు ఒప్పుకోను, ఈత దుస్తులకు ససేమిరా అంగీకరించను అన్నవాళ్లంతా ఆ తరువాత అలాంటి వాటికి మేము సైతం అన్నవాళ్లే. నటి యామీ గౌతందీ ఇదే వరుస. గౌరవం చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత మళ్లీ తమిళ తెరపై కనిపించలేదు. కారణం నేను గ్లామరస్ పాత్రలు చెయ్యను. కురుచ దుస్తులు అస్సలు ధరించను. అందాలారబోతకు దూరం లాంటి స్టేట్మెంట్లతో మడి కట్టుకుని కూర్చోవడమే అనే టాక్ ప్రచారంలో ఉంది. ఇలానే నటి రెజీనా కూడా ఇంతకు ముందు గ్లామర్‌కు దూరం అని ప్రచారం చేసుకుంది. ఆ తరువాత జ్ఞానోదయం అయినట్లుంది. అందాలారబోతకు రెడీ అనేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలీవుడ్ ఆ అమ్మడిని పక్కన పెట్టేసింది. రెజీనాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఆమె గ్లామర్నిప్పుడు టాలీవుడ్ వాడుకుంటోంది. ఇక నటి యామీ గౌతమ్ కథ డిటోనే. అందాలారబోతకు ససేమిరా అనడంతో దక్షిణాది సినిమా ఈ భామను దూరం పెట్టేసింది. బాలీవుడ్‌లోనూ సనంరే అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. యామీ గౌతం కంటే వెనుక రంగంలోకి దిగిన నటి అలియాభట్ లిప్‌లాక్, ఈత దుస్తులు, అంటూ దుమ్మురేపుతూ దూసుకు పోతోంది. దీంతో ఇంకా గ్లామర్ విషయంలో మడి కట్టుకు కూర్చుంటే మొత్తానికే పక్కన పెట్టేసార్తని భావించిందో ఏమో ఇప్పుడు గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటున్నారు. కురుచ దుస్తులయినా పర్వాలేదు స్టైల్‌గా ఉండి తనకు అసౌకర్యం అనిపించకుండా ఉంటే వాటిని ధరించడానికి నేను సైతం సిద్ధం అంటూ ప్రకటింసేసిందని సమాచారం. చాలా కాలం ముందు నితిన్ యామీగౌతమ్ జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన ద్విభాషా చిత్రం తెలుగులో కొరియర్ బాయ్ పేరుతో ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళంలో జయ్‌తో యామీ జత కట్టిన ఈ చిత్రం తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుం పేరుతో విడుదల కావలసి ఉంది.ఇప్పటికి యామీ కి కొత్తగా అవకాశాలేమీ లేవు.అందాలారబోతకు సై అంటోంది కాబట్టి ఇకపై వస్తాయేమో చూడాలి. -
ఇక గ్లామర్‌తో రెచ్చిపోతా!
ఇక గ్లామర్‌తో విజృంభిస్తానంటోంది నటి పూనంబాజ్వా. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించినా ఎందుకనో సరైన స్థాయికి చేరుకోలేదిఉత్తరాదిభామ. తమిళంలో కచేరి, ఆరంభం, ద్రోహి, తెనావెట్టు, తంబికోట్టై చిత్రాల్లో కథానాయకిగా నటించింది. అయినా మంచి సక్సెస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. మధ్యలో ఐటమ్ గర్ల్‌గాను మెరుస్తూనే ఉంది. ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నారేంటి అని అడిగితే నటిస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న పూనంబాజ్వా ఇకపై ఇంకా గ్లామరస్‌గా నటిస్తానంటోంది. ముంబయిలో నివసిస్తున్న ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తోందట. అందుకు కారణం చెబుతూ హిందీ చిత్రాల్లో నటించాలంటే దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణించి ఉండాలని అంది. అప్పుడే బాలీవుడ్లో గౌరవం, మర్యాద లభిస్తుందని పేర్కొంది. అలా కా కుండా నటిస్తే చిన్న చిన్న పాత్రలే వస్తాయని ఈ భామ అంది. అందుకే తాను హిం దీ చిత్రాలు అవకాశాన్ని అంగీకరించడం లేదని వివరించింది. అయినా హిందీ చిత్రాల్లో నటిస్తేనే పరిపూర్ణ నటి అని ఏమీ లేదు. దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందితే చాలు అంటోంది ఈ అందాలభామ. -
ఐటమ్ సాంగ్ చేయాలని..
తినగ తినగా గారెలు చేదు అన్న సామెతను గుర్తు చేస్తూ హీరోయిన్ పాత్రల్ని పోషిస్తున్న నటి కాజల్ అగర్వాల్‌కు ఆ జీవితం బోరు కొట్టినట్టుందో లేక సమచరులు శ్రుతి హాసన్, తమన్నలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుందో తెలియదు కానీ ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక బలంగా ఉందట. హీరోయిన్లుగా నటిస్తూనే, మరో పక్క ఐటమ్ సాంగ్స్‌తో హల్ చల్ చేస్తూ అధిక పారితోషికం పొందాలన్న ఆశ ఈ భామకు పుట్టింది. మరో విషయం ఏమిటంటే కాజల్ తెలుగులో గ్లామర్ పాత్ర చేసినా, తమిళంలో మాత్రం మోతాదు మించలేదు. తమిళ ప్రేక్షకులు ఆమెను గ్లామర్‌గా చూడాలని కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని కాజల్ వ్యక్తం చేస్తున్నారు. నాయకీ పాత్రలతో పాటుగా ఐటమ్ గర్ల్‌గాను, అదే విధంగా ప్రతి నాయకీ పోలికలు ఉన్న పాత్రలను చేయడానికి తాను సిద్ధమని కాజల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ సరసన మారీ చిత్రంలో, విశాల్ సరసన సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. -
సీనియర్‌తో జోడీకి రెడీ
సీనియర్ హీరోతో నటించేందుకు రెడీ అని నటి రెజీనా గేట్లు తెరిచేసింది. యువ హీరోయిన్ స్వాతి, బిందు మాధవి, నందిత వంటి వారు సీనియర్ హీరోల పక్కన నటించేంది లేదంటూ, అవకాశాలు దూరం చేసుకుంటున్నారు. అలాంటిది తమిళంలో అలగియ అసుర, నిర్ణయం, కేడి బిల్లా, కిలాడి రంగ చిత్రాల్లో నటించిన రెజీనా ఆ తర్వాత తమిళంలో అవకాశాలు లేక పోవడంతో ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. తెలుగులో ఆమెకు అదృష్టం కలసి వచ్చింది. అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో, అక్కడే స్థిరంగా పాగా వేయాలని కోరుకుంటున్నది. అందులో భాగంగా, ప్రస్తుతం యువ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ , ఇకపై బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. అదే విధంగా మరో ఐదేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇక విషయం ఏమిటంటే, ఇంతకు ముందు గ్లామర్‌గా నటించడానికి నిరాకరించిన రెజీనా, ఇక అందాల అరబోతకు రెడీ అంటోంది. -
అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను
‘అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను’ అంటోంది నటి నిత్యామీనన్. ఈమె నటనా శైలినే కాదు వ్యక్తిత్వం ప్రత్యేకం. తనకంటూ కొన్ని హ ద్దులు విధించుకుని నటించే నటి. పాత్రల డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే అయినా షరతులు వర్తిస్తాయి అం టూ మెలికపెట్టే నిత్యామీనన్‌ను పొగరుబోతు అని కూడా అంటుంటారు. అయినా అలాంటి వాటిని లెక్కచేయకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటిని మాత్రమే చేసుకుంటూపోతోంది కేరళ కుట్టి. తమిళం, మలయా ళం, తెలుగు తదితర భాషల్లో నాయకిగా గుర్తింపు పొందిన నిత్యామీనన్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఓకే కన్మణి చిత్రం ఒక్కటే ఆమె చేతిలో ఉంది. ఈ చిత్రం కూడా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలోనూ నిత్యామీనన్ పలు కథలు వింటూ నటించడానికి నిరాకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏమిటని అడిగితే ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాలు గాని, వాటిలో నటించిన పాత్రలతో గానీ చాలా సంతృప్తిగా ఉన్నానంటోంది. ఒక చిత్రం పూర్తి చేసిన వెంటనే మరో చిత్ర అవకాశం రావాలని కోరుకోవడం లేదని అంటోంది. అదేవిధంగా అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం తనకు లేదని పేర్కొంది. పాత్ర నచ్చితే దానికి జీవం పోయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తానని నిత్యా అంటోంది. అందుకే ఈ 26 ఏళ్ల బ్యూటీ ఇప్పటి వరకు తమిళం, మలయాళం, తెలుగు తదితర 32 చిత్రాల్లోనే నటించింది. -
అందమే లేకపోతే మిస్ వరల్డ్ అయ్యేదానివా?
బాలీవుడ్ కథానాయికల్లో ప్రియాంక చోప్రా రూటే సెపరేటు. పదుగురిలో ఒకదాన్ని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడరామె. అందుకు ప్రియాంక కెరీరే ఉదాహరణ. హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రలవైపు పరుగులు పెడుతుంటే... ప్రియాంక మాత్రం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికే ఇష్టపడతారు. బర్ఫీ, మేరీ కామ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ముఖ్యంగా ‘మేరీ కామ్’ కోసమైతే... తనలోని సున్నితత్వాన్ని కోల్పోయారు ప్రియాంక. ప్రస్తుతం పూర్వపు అందం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారామె. బహుశా ఆ శ్రమ భరించలేకేనేమో... ట్విటర్లో ఓ వింత మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నేను వికృతంగా పుట్టి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. జీవితం సాఫీగా సాగిపోయేది. అందంగా పుట్టడం వల్లే ఈ సమస్యలన్నీ. ఈ అందమే లేకపోతే... అసలు గ్లామర్ ఫీల్డ్‌లోకే వచ్చేదాన్ని కాదు కదా. ఈ తిప్పలు ఉండేవి కావు కదా. కాసేపు స్కిన్‌పై శ్రద్ధ పెట్టాలి. ఇంకాసేపు జుత్తు గురించి ఆలోచించాలి. నిజంగా చిరాగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు ప్రియాంక. ఈ ట్వీట్‌పై బాలీవుడ్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆ అందమే లేకపోతే నువ్వు మిస్ వరల్డ్ అయ్యేదానివా, సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేసేదానివా, కోటానుకోట్లు సంపాదించేదానివా? అంటూ చాలామంది తమ వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రియాంక ట్వీట్‌పై కామెంట్లు విసిరారు. ఇంకొందరైతే.. తాను అందగత్తెనని ఈ ట్వీట్ ద్వారా ప్రియాంక చెప్పకనే చెప్పి, తన తెలివితేటలు ప్రదర్శించిందని కౌంటర్ ఇచ్చారు. మరి... ఈ కామెంట్లపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఆరబోస్తే తప్పులేదు
పాత్ర డిమాండ్ మేరకు అందాలారబోయడంలో తప్పు లేదంటోంది నటి ప్రియా ఆనంద్. ఈ అమ్మడు తరచూ చర్చలకు తావిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ మధ్య అరిమానంబి చిత్రంలో హీరోకు దీటుగా మందు కొట్టి నటించింది. అదేమంటే మగవాళ్లు మద్యం సేవించగాలేంది ఆడవాళ్లు తాగితే తప్పేంటి? అంటూ ప్రశ్నించి విమర్శలకు గురైంది. తాజాగా ఒరుఊరుల రెండు రాజా చిత్రంలో హద్దులు మీరి అందాలు ప్రదర్శించినట్లు విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి విమర్శలను ప్రియా ఆనంద్ తిప్పి కొట్టింది. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో తాను అందరూ విమర్శించేటంత గ్లామర్‌ను ప్రదర్శించలేదంటోంది. ఇంతకు ముందు చిత్రాల్లోనూ అలాంటి గ్లామరనే ప్రదర్శించానని పేర్కొంది. అయితే ఈ చిత్రంలో స్టిల్స్ చూసి మోతాదుకు మించిన అందాలు ఆరబోసినట్లు ప్రచారం జరుగుతోందని అంది. అయితే కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా నటించడంలో తప్పు లేదన్నది తన అభిప్రాయంగా చెప్పింది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. తాను తమిళనాడులో పుట్టినా దుబాయ్, ముంబయిలలో పెరిగినట్లు వివరించింది. తనకు పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు, తమిళనాట ఆచార వ్యవహారాలు తెలుసని పేర్కొంది. ఈ రెండింటిని తాను వదులుకోలేనని స్పష్టం చేసింది. హిందీ చిత్రాల్లో నటించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారని తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంవలనే హిందీలో నటించడం లేదని చెప్పుకొచ్చింది.