అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను | no Chances in movies says nithya menon | Sakshi
Sakshi News home page

అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను

Published Sun, Feb 1 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను

అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను

 ‘అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను’ అంటోంది నటి నిత్యామీనన్. ఈమె నటనా శైలినే కాదు వ్యక్తిత్వం ప్రత్యేకం. తనకంటూ కొన్ని హ ద్దులు విధించుకుని నటించే నటి. పాత్రల డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే అయినా షరతులు వర్తిస్తాయి అం టూ మెలికపెట్టే నిత్యామీనన్‌ను పొగరుబోతు అని కూడా అంటుంటారు. అయినా అలాంటి వాటిని లెక్కచేయకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటిని మాత్రమే చేసుకుంటూపోతోంది కేరళ కుట్టి. తమిళం, మలయా ళం, తెలుగు తదితర భాషల్లో నాయకిగా గుర్తింపు పొందిన నిత్యామీనన్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఓకే కన్మణి చిత్రం ఒక్కటే ఆమె చేతిలో ఉంది.
 
 ఈ చిత్రం కూడా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలోనూ నిత్యామీనన్ పలు కథలు వింటూ నటించడానికి నిరాకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏమిటని అడిగితే ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాలు గాని, వాటిలో నటించిన పాత్రలతో గానీ చాలా సంతృప్తిగా ఉన్నానంటోంది. ఒక చిత్రం పూర్తి చేసిన వెంటనే మరో చిత్ర అవకాశం రావాలని కోరుకోవడం లేదని అంటోంది. అదేవిధంగా అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం తనకు లేదని పేర్కొంది. పాత్ర నచ్చితే దానికి జీవం పోయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తానని నిత్యా అంటోంది. అందుకే ఈ 26 ఏళ్ల బ్యూటీ ఇప్పటి వరకు తమిళం, మలయాళం, తెలుగు తదితర 32 చిత్రాల్లోనే నటించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement