ఆలస్యం అవుతున్న మణి సినిమా | director mani ratnam next movie shooting postponed | Sakshi
Sakshi News home page

ఆలస్యం అవుతున్న మణి సినిమా

Published Sat, Oct 3 2015 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

ఆలస్యం అవుతున్న మణి సినిమా

ఆలస్యం అవుతున్న మణి సినిమా

వరుస ఫ్లాప్ల తరువాత 'ఓకే బంగారం' సినిమాతో మంచి విజయం సాధించిన మణిరత్నం, తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న మణిరత్నం తన నెక్ట్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాడు.

కార్తీ, దుల్కర్ సల్మాన్లు హీరోలుగా ఓ సినిమా చేస్తున్నట్టుగా మణిరత్నం ఇప్పటికే ప్రకటించాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తన గత సినిమాల మాదిరిగానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించాడు. అయితే బిజినెస్ పరంగా తెలుగు హీరోలు నటిస్తే ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుందని భావించిన యూనిట్. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. తెలుగు వర్షన్లో నటించే హీరోలు ఇంకా ఫైనల్ కాకపోవటంతో సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే తెలుగు నటీనటులనును ఎంపిక చేసి సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు వర్షన్లలోనూ నిత్యా మీనన్, కీర్తీ సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement